28, డిసెంబర్ 2011, బుధవారం

ఆవు నెయ్యి గురించిన చిన్న విశేషం

శ్రీ గురుభ్యోన్నమః

నమస్తే
ఆవు నెయ్యి గురించిన చిన్న విశేషాన్ని గురించిన వివరం..

గోమాత నామావళిలో హవ్య కవ్య ప్రదాయిని అన్న నామమున్నది. గోఘృతం లేదా ఆవు నెయ్యితోనే దేవతలకు హవిస్సులర్పిస్తాము అలానే పితృదేవతలకు కవ్యమూ.. ఇది అందరకూ తెలిసినదే, ఐతే నిత్యమూ యజ్ఞ యాగాదులు జరిగేచోట, ఆవు నెయ్యి ఇతర సమిధలతో కాలి ఆవిరి అయ్యిన చోట రేడియోధార్మిక పదార్థాల యొక్క విషపు గాలులయొక్క ప్రభావం నామమాత్రం లేదా అసలు ఉండదని రష్యన్ శాస్త్రజ్ఙ్యులు డా శిరోవిచ్ తమ పరిశోధనలో తెలిపి నిరూపించారు. మనవాళ్ళు చెప్తే నమ్మని మన వారు ఇతరులు చెప్పినా కొన్ని సార్లు సనాతన ధర్మ గొప్పదనాన్ని ఒప్పుకోలేరు. ఈ విషయం 1980వ దశకంలో జరిగిన అత్యంత ఘోర ప్రమాదమైన భోపాల్ గ్యాస్ విషవాయువులు, రేడియోధార్మికశక్తిల వలన ఆ ప్రాంత చుట్టూ ఐదారు మైళ్ళ వరకూ అత్యంత ఉపద్రవంతో కూడిన వ్యాధులు సోకాయి, ఎందరో చనిపోయారు, కొందరికి చర్మం కాలిపోయింది, ఇప్పటికీ ఆ ప్రాంతం వారిలో కొంతమందికి ఆ రసాయనాల వల్ల కలిగిన రోగాలను పోగొట్టుకోలేని స్థితిలో ఉన్నారు.

ఇంత అత్యంత దారుణ బాధాకరవిపత్కర పరిస్థితులలో ఈ ప్రమాదం సంభవించిన కర్మాగారానికి ఒక మైలులోపు ఉన్న రెండు కుటుంబాలకు మాత్రం ఎటువంటి హానీ జరగలేదు, ఎవరి ప్రాణాలకీ ముప్పు కలగలేదు, కనీసం ఎవరూ అనారోగ్యం పాలు కాలేదు. కారణం ఈ రెండు కుటుంబాలు......
for full article https://groups.google.com/group/gomata/browse_thread/thread/ae65a756272eb1ec?hl=en
This email and any attachments are confidential, and may be legally privileged and protected by copyright. If you are not the intended recipient dissemination or copying of this email is prohibited. If you have received this in error, please notify the sender by replying by email and then delete the email completely from your system. Any views or opinions are solely those of the sender. This communication is not intended to form a binding contract unless expressly indicated to the contrary and properly authorised. Any actions taken on the basis of this email are at the recipient's own risk.


This email is sent for and on behalf of Ivy Comptech Private Limited. Ivy Comptech Private Limited is a limited liability company.

This email and any attachments are confidential, and may be legally privileged and protected by copyright. If you are not the intended recipient dissemination or copying of this email is prohibited. If you have received this in error, please notify the sender by replying by email and then delete the email completely from your system.
Any views or opinions are solely those of the sender. This communication is not intended to form a binding contract on behalf of Ivy Comptech Private Limited unless expressly indicated to the contrary and properly authorised. Any actions taken on the basis of this email are at the recipient's own risk.

Registered office:
Ivy Comptech Private Limited, Cyber Spazio, Road No. 2, Banjara Hills, Hyderabad 500 033, Andhra Pradesh, India. Registered number: 37994. Registered in India. A list of members' names is available for inspection at the registered office.

21, డిసెంబర్ 2011, బుధవారం

'మతమే' మారాలి!

15-11-2011 anshrajyothy daily

'మతమే' మారాలి!
హైందవంలో లోపాలూ మార్పిడికి ప్రేరణ
నిమ్న వర్గాలపై వివక్ష.. అవమానాలు
దేవుణ్ని దర్శించుకోవడానికీ డబ్బులే!

తన చుట్టూ ఉన్న సమాజంలో అత్యధిక సంఖ్యాకులు, తన పూర్వీకులు, కుటుంబీకులు అనుసరించే మతాన్ని కాకుండా మరో మతంలోకి వెళ్లాలని ఒక వ్యక్తి నిర్ణయించుకున్నాడంటే... అందుకు కొత్త మతంలోని ఆకర్షణ, కొత్తదనాన్ని వెతకాలన్న అన్వేషణతో పాటు, తానున్న మార్గంపై అసంతృప్తి కూడా ఎంతో కొంత కారణమవుతుంది. మత మార్పిడులు పెద్ద ఎత్తున జరుగుతున్న ఈ తరుణంలో రెండో కోణాన్ని చర్చించకుండా ఉండడం అసంపూర్ణమే అవుతుంది. ఆ ప్రయత్నమే ఈ కథనం...

హిందూ మతంలోని కుల వ్యవస్థ, అంటరానితనం, అంతరాలకు వ్యతిరేకంగా, సమానత్వాన్ని వెతుక్కుంటూ దళితులు ప్రారంభించిన ప్రయాణం మతాంతరీకరణలో తొలి ఘట్టం. ఇది దేశంలో సంచలన కారకమే అయినా మతం మారినవారిని ఎవరూ తప్పుబట్టలేకపోయారు. అయితే ప్రస్తుతం ఆ వర్గాలే కాకుండా, అటువంటి ఇబ్బందులు లేని ఇతర కులాలవారు కూడా పెద్దఎత్తున మతం మారడానికి కారణాలు అన్వేషిస్తే ఆసక్తికర సమాధానాలు, దిద్దుకోవాల్సిన అంశాలు కనిపిస్తాయి.

"హిందూమతం చాలా సరళం (ఫ్లెక్సిబుల్). ఎవరైనా అనుసరించవచ్చు. మతంలోనే ఉండి అనుసరించకపోయినా అడిగేవారు లేరు. ఎలాంటి కట్టుబాట్లు, క్రమశిక్షణ లేవు. అందువల్లే పక్క చూపులు చూడడానికి అవకాశం ఎక్కువ'' అని చిల్కూరు బాలాజీ ఆలయ ప్రధానార్చకుడు సౌందర్‌రాజన్ విశ్లేషించారు. దిల్‌సుఖ్‌నగర్‌కు చెందినరామకృష్ణ.. "ప్రపంచంలోని ఏ ఇతర మత ప్రార్థన స్థలాల్లోనూ దర్శనాలకు, పూజలకు, సేవలకు టికెట్లు, రుసుములు లేవు. కానీ హిందూ మతంలో గుడికి వెళ్లాలంటే టికెట్, దర్శనం చేసుకోవాలంటే రుసుము. ఎక్కడ చూసినా వ్యాపారమే'' అని తప్పుబట్టారు.

"మిగతా మతాల్లో దేవుడి ముందు అందరూ సమానమే. కానీ, హిందూ మతంలో డబ్బు, పలుకుబడి, అధికారం ఉన్నవాడికి ఒక పూజ, లేనివాడికి మరో పూజ. గుళ్లలో వీఐపీలు వచ్చినప్పుడల్లా హారతులివ్వడం ఏమిటో ఇప్పటికీ అర్థం కాదు'' అని మహేశ్వరం ప్రాంత రైతు కిష్టారెడ్డి అన్నారు. హిందూమత గురువులు, పూజారుల తీరును సామాజిక విశ్లేషకుడు రామకృష్ణ తప్పుబట్టారు. "మనం చర్చికో, మసీదుకో వెళ్లినపుడు అక్కడి గురువులు ఆప్యాయంగా పలకరిస్తారు. హిందూమత గురువులు అలా ఉండరు'' అని అభిప్రాయపడ్డారు.

"మతం మారాలనుకున్నప్పుడు అసలు మన మతంలో ఏముందో, వేరే మతంలో ఏముందో తెలుసుకోవాలి కదా? మారేవాళ్లంతా ఏం అధ్యయనం చేసి నిర్ణయం తీసుకుంటున్నారు? అసలు ఆ శక్తిసామర్థ్యాలు వారికున్నాయా? ఈ మౌలిక ప్రశ్నలకు జవాబు వెతకాల్సి ఉంది'' అని దేవాలయ ఆస్తుల పరిరక్షణ ఉద్యమ కమిటీ కన్వీనర్ ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు. "మత మార్పిడి ఎప్పటినుంచో ఉంది. అప్పుడు రాని వివాదం ఇప్పుడే ఎందుకు తలెత్తుతోంది? జైన, బౌద్ధ మతాలు హిందూ దేవుళ్లను కించపరచలేదు. కానీ మతం మారిన హిందువుల జాతీయతనే దూరం చేయడానికి, ఈ దేశ మూలాల మీదనే క్రైస్తవ సంస్థలు గురిపెట్టాయి'' అని వేద భారతి సంస్థ సమన్వయకర్త గౌరీభట్ల సుబ్రహ్మణ్యశర్మ పేర్కొన్నారు.

ఆలయ ప్రవేశం తప్పనిసరి
"మతమార్పిడులు అడ్డగోలుగా జరక్కూడదంటే దళితులకు ఆలయ ప్రవేశం కల్పించాలి'' మహబూబ్‌నగర్ జిల్లాలో మతం మారి తిరిగి వచ్చిన పలువురి మాట ఇది. "హిందువుల్లో మిగతా కులాలవారు దళితులను దూరం పెట్టొద్దు. మాకూ ఆలయ ప్రవేశం కల్పించాలి'' అని అడ్డాకులకు చెందిన ఎం.దానేలు ఆవేదన వ్యక్తం చేశారు. "దళిత వాడల్లో హైందవ సంస్థలు ధార్మిక కార్యక్రమాలు నిర్వహించాలి. వీహెచ్‌పీ తరపున పాత పాలమూరు దళితవాడలో ఏటా సీతారామకల్యాణం, కుంకుమార్చనలు నిర్వహిస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటివి కొనసాగిస్తే మతమార్పిడులకు ఆస్కారం ఉండదు'' అని వీహెచ్‌పీ నాయకుడు లక్ష్మీనారాయణ సూచించారు.

చట్టాలు అమలు చేయాలి
"హిందూమతంలో రిజర్వేషన్లు అనుభవిస్తున్న కులాల వారెవరైనా క్రైస్తవం లేదా ఇస్లాం స్వీకరిస్తే వారు రిజర్వేషన్లు కోల్పోవాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రభుత్వాలు కఠినంగా అమలుచేయాలి. హిందూమతంలో కులవివక్షను పోగొట్టడానికే ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం అమల్లోకి వచ్చింది. క్రైస్తవం, ఇస్లాం మతాల్లో కులాలు లేనందున వాటిని స్వీకరించే ఎస్సీ, ఎస్టీలు రిజర్వేషన్లను వదులుకోవాలి. కొన్ని మతాల అభివృద్ధికి ప్రభుత్వాలు నిధులు విడుదల చేయడాన్ని తక్షణం ఆపాలి.

మత ప్రచార నిషేధానికి జారీచేసిన 746, 747 జీవోలను అమలు చేయాలి. కానీ ఇవేవీ జరగట్లేదు. పార్టీల ఓటుబ్యాంకు రాజకీయాలే దీనికి కారణం'' అంటారు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చల్లపల్లె నరసింహారెడ్డి. "హిందూ మతంలోని అట్టడుగువర్గాల పేదరికాన్ని, నిరక్షరాస్యతనూ అవకాశంగా తీసుకుని ప్రలోభపెట్టి మతం మార్చ డం అనైతికం. ఇలాంటి మతమార్పిడులకు పాల్పడటం నేరం. దీని పై ప్రభుత్వం చట్టాలను కఠినంగా అమలుచేయాలి'' అని ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు కత్తి నరసింహారెడ్డి అభిప్రాయపడ్డారు.

ప్రత్యేక చట్టాలతోనే మతమార్పిడులకు అడ్డుకట్ట పడుతుందని చిత్తూరుజిల్లా లోక్‌సత్తా అధ్యక్షుడు జయకుమార్ అభిప్రాయం. "వాళ్లకు ఈ దేశం అంటే గౌరవంకానీ, ఇష్టం కానీ ఉండదు. రాముణ్ని, కృష్ణుణ్ని తిడతారు. శంకరాచార్యులను గౌరవించరు. వివేకానందుడిని అసహ్యించుకుంటారు. హిందువుల మనోభావాలను, ఆచారాలను ఇం తగా వ్యతిరేకించేవాళ్లు మనకి శాంతినీ, సమానత్వాన్నీ, నాగరికత ను నేర్పిస్తామనడం ఏమిటి?'' విజయవాడ సిద్ధార్థ కాలేజీ విద్యార్థి చైతన్య ఆవేదన ఇది. "ఒక వ్యక్తి చనిపోతే చూడటానికి వెళ్లటం మానవత్వానికి సంబంధించిన విషయం.

కానీ నా మరదలు చనిపోతే దహన సంస్కారాలకు వెళ్లొద్దన్నారు. క్రైస్తవంలోకి మారితే ఇలాంటివి ఉంటాయనే అవగాహన కల్పించే హిందూమత పెద్దలెవరూ లేరు. అలాంటివారుంటే బాగుంటుంది'' అని నల్గొండ జిల్లా వాసి రాజు వాపోయారు. "జనాభాలో 50 శాతం ఉన్న యువత కు ఆసక్తికలిగించేలా హిందూమతంలో మార్పులు రావాలి. మౌలిక సూత్రాలను మార్చమని ఎవరూ అడగరు. కానీ కాలంతోపాటు కొన్ని ఆచార వ్యవహారాలు చేరుతాయి. వాటిని తొలగిస్తే- అసలు నగిషీలు బయటకొస్తాయి. వాటిపై అందరికీ ఆసక్తి ఉంటుంది. ఒక వ్యక్తికి తన మతం పూర్తిగా సంతృప్తి కలిగించిన రోజున మతమార్పిడి సమస్యలండవు'' అని సామాజిక శాస్త్రవేత్త వాసు అన్నారు.

వద్దన్న చోటనే వేద విద్య
అది 1930. మహారాష్ట్ర, నాసిక్‌లోని సుప్రసిద్ధ కాలారామ్ మందిరం బయట.. రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ నేతృత్వంలో వేలాది మంది దళితులు ఆలయప్రవేశం కోరుతూ సత్యాగ్రహానికి దిగారు. గుడి పూజారి రామ్‌దాస్ మహరాజ్ సహా, ధర్మకర్తలు, స్థానిక అగ్రవర్ణాలవారెవ్వరికీ దళితులు ఆలయంలోకి ప్రవేశించడం ఇష్టంలేక, వారిని అడ్డుకున్నారు. ఐదేళ్లపాటు సత్యాగ్రహం చేసినా దళితులు ఆ గుడిలోకి ప్రవేశించలేకపోయారు!! దాదాపు 75 సంవత్సరాల తర్వాత.. 2005లో.. ఆ గుడిలో ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు.

అందులో.. దళితులకు ప్రవేశాన్ని అడ్డుకున్న ఆనాటి సంఘటనకు.. ఆలయ పూజారి సుధీర్ మహరాజ్ క్షమాపణ చెప్పారు. 1930లో పూజారిగా ఉన్న రామదాస్ మహరాజ్ మనవడే సుధీర్ మహరాజ్.. "బాబా సాహెబ్‌ను ఆలయంలోకి రానివ్వకుండా మా తాతగారు చేసిన తప్పునకు నేను క్షమాపణ చెబుతున్నాను'' అని ఆయన ఆ కార్యక్రమంలో బహిరంగంగా ప్రకటించారు. దళితులను గుడిలోకి రానివ్వడమే కాదు, ఇప్పుడక్కడ వారికి వేదం కూడా నేర్పించే పనిలో ఉన్నారాయన.

మన లోపాలు దిద్దుకుంటేనే!
"ఒకప్పుడు హిందూ మతం చాలా పటిష్ఠమైనది. దానిలో ఉన్న కొన్ని బలహీనతలను ఎత్తిచూపి, వాటిని సంస్కరించే క్రమంలో బౌద్ధమతం అవతరించింది. బౌద్ధంలో ఒక మౌలికమైన క్రమశిక్షణ లేకపోవటం వల్ల తర్వాత ఆ మతం కూడా అంతరించిపోయింది. అనంతర కాలంలో హిందూ మతంలో కూడా అలాంటి పొరపాట్లే జరుగుతూ వచ్చాయి. ఒకప్పుడు హిందూ మతంలో క్రమశిక్షణ ఉండేది.

దాన్ని పాటించినంత కాలం మతానికి వచ్చిన సమస్యేమీ లేదు. ఎక్కడైతే క్రమశిక్షణ లోపిస్తుందో అక్కడ కొన్ని బలహీనతలు ఏర్పడతాయి. వాటిని ఉపయోగించుకొనేవారు కూడా అనేక మంది ఉంటారు. మత మార్పిడులు కూడా ఆ తరహాలోనివే. మౌలికంగా మనలో తప్పు పెట్టుకొని ఇతరులను నిందించి లాభం లేదు. ముందు మనలో ఉన్న లోపాలను సరిదిద్దుకుంటే సమస్యలు తీరిపోతాయి''
-ప్రొఫెసర్ సౌందర్‌రాజన్,
బాలాజీ ఆలయ ట్రస్టీ, చిలుకూరు.

ప్రతికూల ప్రచారం
"క్రైస్తవ మత సిద్ధాంతాలను, ఆచారవ్యవహారాలను ప్రచారం చేసుకోవటం వల్ల మనకు వచ్చిన సమస్యేమీ లేదు. అందరికీ తమ మతంలో ఉన్న గొప్పదనాన్ని తెలియజేసి.. వ్యక్తిత్వ సంస్కారం చేస్తే మనకు వచ్చిన ఇబ్బంది లేదు. మన దేశం నుంచి వెళ్లి హిందూ ధర్మ ప్రచార సంస్థలన్నీ చేస్తున్నది ఇదే. రామకృష్ణ మఠం బోధించే ధర్మాన్ని కొన్ని లక్షల మంది విదేశీయులు అనుసరిస్తారు. ఇస్కాన్‌కు కొన్ని లక్షల మంది విదేశీ ఫాలోయర్స్ ఉన్నారు. వీరు ఇతర మతాలవారిని హిందూ మతంలోకి చేరాలని ఎప్పుడూ అడగరు.

క్రీస్తు సరైన దేవుడు కాడని.. వారి మత గ్రంథాలు తప్పని చెప్పరు. కేవలం హిందూ మతంలో ఉన్న గొప్పదనాన్ని వివరిస్తారు. కానీ ఈ మధ్య కాలంలో క్రైస్తవ మత ప్రచారం పేరిట జరుగుతున్న వ్యవహారాలు ఇందుకు పూర్తి విరుద్ధం. హిందు దేవుళ్లను విరోధులుగా చూపించటం, హిందు ధర్మాన్ని, ఆచారాల్ని అనాగరికమైనవిగా ప్రచారం చేయటం.. సంప్రదాయాలను పాటించవద్దని ప్రోత్సహించడం ఇవేవీ సరైనవి కావు''
-స్వామి పరిపూర్ణానంద

అమెరికాలో హిందూయిజం
 
ఒకవైపు.. భారతదేశంలో క్రైస్తవంలోకి మారుతున్న వారి సంఖ్య క్రమేపీ పెరుగుతుంటే, అంతర్జాతీయంగా హిందూయిజం వైపు ఆకర్షితులవుతున్నవారి సంఖ్య పెరుగుతోంది. ప్ర త్యేకించి.. అమెరికన్లలో చాలామంది ఇప్పుడు 'పునర్జన్మ' సిద్ధాంతాన్ని, కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతున్నారు. 2009లో లీసా మిల్లర్ అనే రచయిత్రి అమెరికన్ పత్రిక న్యూస్‌వీక్‌లో 'వుయ్ ఆర్ ఆల్ హిందూస్ నౌ' అనే వ్యాసాన్ని రాశారు. అందులో ఆమె... 2008 నాటికి అమెరికాలో 76శాతం మంది క్రైస్తవులు ఉన్నారని, అది ఆ దేశ చరిత్రలోనే అతి తక్కువ శాతమని పేర్కొన్నారు.

"దేవుణ్ని చేరుకోవడానికి అనేక మార్గాలుంటాయని ఒక హిందువు విశ్వసిస్తాడు. అందులో జీసస్ ఒక మార్గం, ఖురాన్ మరొక మార్గం. యోగసాధన ఇంకొక మార్గం. ఏదీ ఒకదానికంటే ఎక్కువ కాదు. అన్నీ సమానమే. కానీ.. అత్యంత సంప్రదాయబద్ధమైన క్రైస్తవులు ఇంతవరకూ ఇలా ఆలోచించడం నేర్చుకోలేదు. వారు తమ మతమే సత్యమని, ఇతర మతాలన్నీ అసత్యాలనీ నేర్చుకుంటారు'' అని పేర్కొన్నారు. 2008 హ్యారిస్ పోల్ ప్రకారం 24 శాతం మంది అమెరికన్లు హిందూ పునర్జన్మ సిద్ధాంతం మీద తమకు నమ్మకం ఉందని స్పష్టం చేశారు.

మారాల్సింది ఎవరు?
 
రాష్ట్రంలో మత మార్పిడుల పర్వంపై 'ఆంధ్రజ్యోతి' గత ఆరు రోజులుగా ప్రచురించిన కథనాలకు రాష్ట్రవ్యాప్తంగా అనేకమంది స్పందించారు. ఇరు మతాలకు చెందినవారి నుంచి, సామాజిక విశ్లేషకుల నుంచి, కుల సంఘాల నేతల నుంచి వందలాది ఫోన్ కాల్స్, ఈ మెయిల్స్ మా కార్యాలయానికి వెల్లువెత్తాయి. ప్రశంసలు, పరిశీలనలు, అభ్యంతరాలు, ఆరోపణలను పక్కనబెడితే.. సమాజంలో చాపకింద నీరులా సాగిపోతున్న, అనర్థాలకు, అంతరార్థాలకు కారణమవుతున్న ఒక దృగ్విషయంలోని అన్ని కోణాలను ప్రజల ముందు పెట్టి చర్చనీయాంశం చేయడమే ఈ కథనాల లక్ష్యం.

'రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛ.. ప్రచారం' ముసుగులో, ప్రలోభాల ప్రయత్నాలతో జరుగుతున్న బలవంతపు మత మార్పిడులు వ్యక్తుల మనసులపై, కుటుంబ సంబంధాలపై, సామాజిక సమీకరణలపై, రాజకీయ పరిణామాలపై చూపుతున్న ప్రభావాన్ని ప్రజల దృష్టికి తేవడమే ఈ కథనాల ఉద్దేశం. 'మనిషి మతం మారినంత మాత్రాన ప్రయోజనం లేదు. అభిమతాలు మారనంత వరకు ఎన్ని మతాలు మారినా.. అవే కతలు, గాథలు తప్పవు.

హిందూ మతంలో వివక్షకు వ్యతిరేకంగా మతం మారిన దళితులు పేర్లతో సహా మారి కొత్త మతంలో మమేకమైపోతుంటే, అగ్ర వర్ణాల వారు.. పేరు తోకను అలాగే తగిలించుకుని ఉండడం, తరాలు మారినా కులాల గోలలు, లీలలు ఇంగువ కట్టిన గుడ్డలా అక్కడా కనిపిస్తుండడం గమనించాల్సిన విచిత్రం. 'నువ్వు దేవుని సేవ కోసమే పుట్టావు. దేవుని పుత్రికవు' అని వస్తున్న సందేశాలకు స్పందించి, చెప్పాపెట్టకుండా మతం మారుతున్న పిల్లలు, తమ ప్రత్యక్ష దైవాలైన తల్లిదండ్రులు ఇంట్లోనే ఉన్నారన్న సంగతిని మరచిపోతుండడం మరో విషాదం.

సమస్య ఉందనో, అవసరం తీరుతుందనో, ఆర్థికంగా ఆదుకుంటారనో, ఆరోగ్యం చేకూరుతుందనో.. చిన్నచిన్న కారణాలకు మతం మారే వారు.. అది ఏ మతంలోంచి ఏ మతంలోకైనా.. విలువల పట్ల, విశ్వాసాల పట్ల, జాతీయత పట్ల ఏం నిబద్ధత చూపించగలరన్నది.. మారే వారు, మార్చే వారు వేసుకోవాల్సిన ప్రశ్న! 'మార్పిడి' అవసరం లేకుండా, అవకాశమివ్వకుండా మతాలే మారాలి, మనుషులూ మారాలి, మనసులూ మారాలన్నదే ఆంధ్రజ్యోతి ఉద్దేశం, సందేశం!

20, డిసెంబర్ 2011, మంగళవారం

వైయ్యేసు మార్గం! క్రైస్తవానికి సర్కారీ ప్రోత్సాహం

andhra jyothy daily 14-11-2011

వైయ్యేసు మార్గం!
క్రైస్తవానికి సర్కారీ ప్రోత్సాహం
226 చర్చిల నిర్మాణానికి రూ.2.50 కోట్లు

ఎన్నికల ముందు ఒకే నెలలో నిధుల వర్షం
లబ్ధిదారుల ఎంపికలోనూ ప్రాధాన్యం
ఓట్లను సంఘటితం చేయడమే వ్యూహం
'అల్లుడు' అనిల్‌కుమార్ వెలుగు
జగన్‌పై 'మనోడు'గా ముద్ర
సీఎం కావాలంటూ ప్రార్థనలు
ప్రార్థనాలయాల్లో రాజకీయ రచ్చ
క్రైస్తవుల్లోనే విమర్శలు

'ఒక్క మత మార్పిడి వల్ల ఒకరు హిందూ మతం నుంచి వెళ్లిపోవడమే కాదు.. హిందూ మతానికి ఒకరు వ్యతిరేకిగా మారినట్లు లెక్క'
- స్వామి వివేకానంద

క్రైస్తవం తీసుకున్నంత మాత్రాన హైందవాన్ని శత్రువులుగా చూస్తుండక పోవచ్చు. కానీ... అసలు, పుట్టుకతో వచ్చిన మతాన్ని ఎందుకు వీడుతున్నారు? సొంత మతం ఎందుకు కానిదైంది? హైందవంలో లోపం ఎక్కడుంది? దీనిని గుర్తించేందుకు, దిద్దుకునేందుకు హిందూ మత పెద్దలు సిద్ధంగా ఉన్నారా?
- వరుస కథనాల్లో చివరి భాగం రేపటి సంచికలో!

(ఆన్‌లైన్ న్యూస్‌నెట్‌వర్క్) జలయజ్ఞం, ఆరోగ్యశ్రీ, పావలా వడ్డీ, ఉచిత విద్యుత్తు... ఇవన్నీ వైఎస్ ప్రకటించి, ప్రవేశ పెట్టిన కొన్ని పథకాలు. కానీ... ఆయన అమలు చేసిన పథకం మరొకటుంది! అది... 'క్రైస్తవ ఉద్ధరణ పథకం'. ఇది అధికారికంగా ప్రకటించకున్నప్పటికీ, ప్రభుత్వ నిధులతో అమలు చేసిన పథకం. క్రైస్తవులకు రాయితీతో కూడిన 'జెరూసలెం యాత్ర' పథకాన్ని వైఎస్ ప్రకటించారు. రెండేళ్లపాటు అమలు చేశారు. దీనిపై కొందరు హైకోర్టుకు వెళ్లడంతో... మతపరమైన యాత్రలకు ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వడం కుదరదంటూ న్యాయస్థానం స్టే ఇచ్చింది.

రాష్ట్రవ్యాప్తంగా చర్చిల నిర్మాణానికి వైఎస్ భారీ స్థాయిలో ప్రభుత్వ నిధులు కేటాయించారు. మతపరమైన మైనారిటీల ప్రార్థనాలయాలకు అంతకు ముందు కూడా ప్రభుత్వం నుంచి నిధులు అందేవి. కానీ... రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చర్చిలు, గురుద్వారాలు, బౌద్ధాలయాలు, పార్సీల ప్రార్థనా మందిరాలకు మరమ్మతులు, నిర్వహణకు మాత్రమే నిధులు కేటాయించే వారు. కానీ... వైఎస్ వచ్చాక పరిస్థితి మారిపోయింది. జిల్లాల వారీగా గ్రామాలను ఎంచుకుని, అక్కడ చర్చిల నిర్మాణానికి ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేసే పద్ధతి ఆయన హయాంలో జోరందుకుంది.

2008 సెప్టెంబర్ నెలలోనే... చిత్తూరు, కర్నూలు, పశ్చిమ గోదావరి, కృష్ణా, తూర్పు గోదావరి, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనంతపురం, కడప, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, ఖమ్మం, కరీంనగర్, నల్లగొండ, రంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్ జిల్లాల్లోని 226 చర్చిల నిర్మాణానికి, కొన్ని చర్చిల మరమ్మతులకు సుమారు రెండున్నర కోట్ల రూపాయలు విడుదల చేశారు. ఇదంతా 2009 ఎన్నికలకు కొన్ని నెలల ముందు చోటు చేసుకోవడం గమనార్హం. జీవోల ద్వారానే ఈ నిధులు విడుదల చేశారు.

మచ్చుకు కొన్ని జీవోలు పరిశీలిస్తే... జీవో ఎంఎస్ నెంబర్ 421 (2.9.2008) ద్వారా కర్నూలు జిల్లాలోని ఐరన్‌బండ, ఎనకండ్ల, పెద్దనేలటూరు (రెండు చర్చిలు), చిందుకూరు, విల్లబండ, నన్నూరు, డోన్, ఓర్వకల్లు, మిట్నాల, జిల్లెల్ల, యు.బొల్లవరం, ఉడుమాల్పురం, వెల్దుర్తి, మిడ్తూరు, కె.సింగవరం గ్రామాల్లో 18 చర్చిల నిర్మాణానికి రూ.18 లక్షలు విడుదల చేశారు.

అలాగే... జీవో నెంబర్ 422 ద్వారా పశ్చిమ గోదావరి జిల్లాలోని రాపాక, గురుగుమిల్లి, పంగిడిగూడెం, పెనుమర్రు, అంకోడేరు, అడమిల్లి గ్రామాల్లోని ఏడు చర్చిలకు రూ.7 లక్షలు మంజూరు చేశారు. అప్పటికే ఎన్నో ప్రార్థనా మందిరాలు ఉన్న పట్టణాల్లోనూ కొత్తగా చర్చిల నిర్మాణానికి ప్రభుత్వం నుంచి సహాయం చేశారు. క్రైస్తవుల ఓట్లను సంఘటితం చేయడంలో భాగంగానే ఇదంతా జరిగినట్లు అభిప్రాయాలున్నాయి.

అదే ఊపులో...
వైఎస్ క్రైస్తవానికి ఇచ్చిన ప్రోత్సాహం... మత మార్పిళ్లకూ ప్రోత్సాహాన్ని ఇచ్చిందనే అభిప్రాయం ఉంది. ఆయన అధికారంలో ఉన్న సమయంలో మత మార్పిళ్లు మరింత జోరందుకున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. వైఎస్ కుటుంబం నుంచి దీనికి ప్రత్యక్ష ప్రోత్సాహం లభించింది. వైఎస్‌రాక మునుపు రాష్ట్ర, జాతీయ స్థాయిలో కె.ఎ.పాల్ ప్రధాన మత ప్రభోదకుడిగా ఒక వెలుగు వెలిగారు. ఆ తర్వాత ఆయనను రకరకాల వివాదాలు చుట్టుముట్టాయి. పాల్ తెర వెనక్కి వెళ్లి... వైఎస్ అల్లుడు బ్రదర్ అనిల్ కుమార్ (ఆయన క్రైస్తవంలోకి మారిన బ్రాహ్మణుడు) హవా మొదలైంది.

ఆయన రాష్ట్రవ్యాప్తంగా అనేక చోట్ల భారీ స్థాయిలో సభలు నిర్వహించారు. ఈ సభల్లో స్థానిక కాంగ్రెస్ నేతలు, ప్రజా ప్రతినిధులు పాల్గొనడం సర్వ సాధారణంగా మారింది. ఇక... క్రైస్తవ అనుకూల నిర్ణయాలు తీసుకునేలా అధికారులపై బ్రదర్ అనిల్ ఒత్తిళ్లు తెచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. విశాఖ జిల్లాలోని నర్సీపట్నంలో ఇతరులకు కేటాయించిన బంజరు భూమిని క్రైస్తవ మత సంస్థకు అప్పగించాలంటూ రెవెన్యూ అధికారులపై ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది.

జగన్ భజన...
తమ్ముడు తన వాడైనా న్యాయం చెప్పాలంటారు! కానీ... జగన్ 'మన వాడు' కాబట్టి ఎన్ని తప్పులు చేసినా క్షమించాలంటున్నారు కొందరు పాస్టర్లు! ఔను... రాష్ట్రంలోని చాలా చర్చిల్లో ఇప్పుడు జగన్ భజన జరుగుతోంది. ఆయన చేసిన అక్రమాల సంగతి పక్కన పెట్టి... కేవలం 'మన వాడనే' కారణంగా వెనకేసుకేసుకొస్తున్నారు. వైఎస్ కుటుంబం క్రైస్తవులను ఆ స్థాయిలో ప్రభావితం చేసింది మరి! జగన్‌ను అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పని చేస్తున్న చర్చిలు కూడా ఉన్నాయి.

ఆయనకు అన్యాయం జరుగుతోందంటూ ఆదివారం ప్రార్థనల్లో పాస్టర్లు భోదించడం పరిపాటిగా మారింది. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం పరిధిలోని రావిపాటివారిపాలెంలో సెప్టెంబర్ 30న ఓ చర్చిని ప్రారంభించారు. ఈ సందర్భంగా గాస్పెల్ మినిస్ట్రీస్ దైవ సేవకుడు రంజిత్ ఓపిల్ తన ప్రసంగంలో ఏసు ప్రభువును పక్కన పెట్టి జగన్‌నే కొనియాడారు. "వైఎస్‌లాంటి బలమైన నాయకుడు లేనందునే రాష్ట్రం ఆందోళనలతో అట్టుడుకుతోంది. జగన్ ముఖ్యమంత్రి కావాలి. వచ్చే ఎన్నికల్లో ఇది జరుగుతుంది'' అని జోస్యం చెప్పారు.

ఇటీవల కడప పార్లమెంటు, పులివెందుల అసెంబ్లీ ఉప ఎన్నికల్లో క్రైస్తవ మత పెద్దలు నేరుగా ప్రచార బరిలోకి దిగారు. క్రిస్టియన్ మైనారిటీ అలయెన్స్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశోక్ కుమార్ పులివెందులలో వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. క్రైస్తవులంతా ఏకమై ప్రచారంలో పాల్గొనాలని, జగన్, విజయమ్మలను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో ఒక ఫాదర్ కూడా పాల్గొనడం గమనార్హం. విశాఖపట్నం జిల్లా మాకవరంపాలెం మండలంలోని ఒక ప్రచార సంస్థ గ్రామ రాజకీయాలను శాసించే స్థాయికి చేరుకుంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల కోసం చర్చిల్లో సభలు, సమావేశాలు, సన్మానాలు, ప్రార్థనలు జరిపించారు.

ఇలా మతంలోకి రాజకీయాలను జొప్పించడాన్ని క్రైస్తవులే విమర్శిస్తున్నారు. వైఎస్ అధికారంలో ఉండగా... 'ఈ ప్రభుత్వం మాదే' అని భావిస్తూ యథేచ్ఛగా మత మార్పిళ్లకు పాల్పడిన ప్రచారకులు ఎందరో ఉన్నారు. దీనికి ప్రభుత్వ పథకాలనూ ఉపయోగించుకున్నారు. 'మతం మారితే ప్రభుత్వ పథకాలను మంజూరు చేయిస్తాం' అని మభ్యపెట్టి మరీ ఇతరులను ఆకర్షించిన సంఘటనలు కొన్ని జిల్లాల్లో జరిగాయి. కొన్ని చోట్ల ప్రభుత్వ పథకాల్లో మతం మార్చుకున్న వారికే ప్రాధాన్యం ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఉదాహరణకు... తూర్పు గోదావరి జిల్లాలో బాలికా శిశుసంరక్షణ యోజన అమలులో ఇదే జరిగింది. ఇద్దరు ఆడపిల్లలు పుట్టాక తల్లి కు.ని. చేయించుకుంటే... ఒక ఆడ శిశువు పేరిట ప్రభుత్వం రూ.5 వేలు బ్యాంకులో జమ చేస్తుంది. అమ్మాయికి 18 ఏళ్లు వచ్చాక దీనిని వడ్డీతో సహా చెల్లిస్తారు. 1996లో ప్రవేశ పెట్టిన ఈ పథకాన్ని 2005లో మార్చారు. డబ్బును డిపాజిట్ చేయడానికి బదులుగా బీమా సదుపాయాన్ని కల్పించారు. తూర్పు గోదావరి జిల్లాలో 2005 నుంచి ఈ ఏడాది అక్టోబర్ వరకు 58,152 మందికి బీమా చేశారు. లబ్ధిదారుల్లో 35 శాతం మంది దళిత క్రైస్తవులు, మైనారిటీ క్రైస్తవులే కావడం గమనార్హం. ఒక్క పథకంలో, ఒక్క జిల్లాలోనే ఇదీ పరిస్థితి!

ఏది ఒప్పు?
సాధారణంగా... మైనారిటీ వర్గాల సంక్షేమం కోసం వివిధ పథకాలు ప్రవేశపెట్టి, అమలు చేయడం సర్వసాధారణం. కానీ... ప్రార్థనా మందిరాల నిర్మాణానికి వైఎస్ భారీ స్థాయిలో నిధులు విడుదల చేయడం విశేషం. ఇది కూడా రాజ్యాంగ విరుద్ధమేమీ కాదు. కానీ... ఒకే నెలలో ఇంత స్థాయిలో ప్రార్థనా మందిరాలకు నిధులు విడుదల చేసిన దాఖలాలు గతంలో లేవు. అదే స్థాయిలో వక్ఫ్ సంస్థలకూ నిధులు కేటాయించారు.

దీనిపై హిందూత్వ సంఘాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే... రాష్ట్రంలోని ఏ ఆలయానికీ ప్రభుత్వ ఖజానా నుంచి పైసా అందదు. పైగా... ఆలయాల నుంచే ప్రభుత్వం సొమ్ములు గుంజుతుంది. కంట్రిబ్యూషన్, ఆడిట్ ఫీజు, సర్వ శ్రేయో నిధి (సీజీఎఫ్), ధూప దీప నైవేద్య పథకం అమలు, అర్చక సంక్షేమ నిధి... ఇలా వివిధ రూపాల్లో ఆలయాల ఆదాయం నుంచి, అంటే భక్తులు కానుకల రూపంలో సమర్పించుకున్న సొమ్ము నుంచి 26.5 శాతం నిధులను సేకరిస్తుంది.

ఇందులో సీజీఎఫ్ రూపేణా సేకరించిన 3 శాతం సొమ్మును దేవాలయాల పునరుద్ధరణకు కేటాయిస్తారు. ఆలయ సిబ్బందితోపాటు... దేవాదాయ శాఖకు చెందిన ప్రధాన కార్యాలయంతోపాటు అన్ని ఆఫీసుల ఉద్యోగులకు భక్తుల ఇచ్చిన సొమ్ము నుంచే జీతాలు చెల్లిస్తారు. 'వారికో న్యాయం, మాకో న్యాయమా? ఇదేం అన్యాయం?' అని హిందూ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.

19, డిసెంబర్ 2011, సోమవారం

ఆచారాల్లోకి చొరబడుతూ [ఏమార్చే మతం -4]

13-11-2011 andhrajyothy daily

ఆచారాల్లోకి చొరబడుతూ

హైదరాబాద్, నవంబర్ 12 : తాయెత్తులు, మొక్కులు, కొబ్బరి కాయలు, తలనీలాలు... ఇవి హిందువులకే పరిమితమనుకుంటే పొరపాటు పడినట్లే! క్రైస్తవంలోకీ ఈ సంప్రదాయాలు వచ్చాయి. ప్రచారాలు, ప్రలోభాలు, విద్య, వైద్యం పేరిట మత మార్పిడిని ప్రోత్సహిస్తున్న క్రైస్తవ మిషనరీలు.. హిందువులను తమ వైపు ఆకర్షించేందుకు హైందవ సంస్కృతినీ తమలో మిళితం చేసుకుంటున్న తీరిది. హైందవ దేవాలయాల్లో తీర్థ ప్రసాదాలు ఇవ్వడం సరికాదని చెప్పే క్రైస్తవ సంస్థలు.. హిందూ మతంలో అనాదిగా వస్తున్న ఆచారాలైన తలనీలాలు సమర్పించుకోవడం, కొబ్బరి కాయలు కొట్టడం, అగరబత్తులు వెలిగించడం వంటి వాటిని తమ మతంలోనూ ప్రవేశపెట్టాయి.

ఏసు మహిమలను కీర్తిస్తూ.. సంకీర్తనలు రూపొందించడం, పద్యాలను కూర్చడం కూడా చేస్తున్నాయి. త్యాగరాజ కృతులను పోలిన ఏసు సంకీర్తనలను కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో రూపొందించారు. ఇలా భారతీయ సాహిత్య రూపాల్లోనూ క్రైస్తవ సాహిత్యాన్ని తయారు చేస్తున్నారు. తైలాభిషేకాలు, హారతులు వంటి పద్ధతులనూ క్రైస్తవ మిషనరీలు చర్చిలలో ప్రవేశ పెట్టాయి. 'క్రిస్టియన్ యోగా' అనే కొత్త పద్ధతికి కూడా క్రైస్తవ సంస్థలు రూపకల్పన చేశాయి.

అంటే.. క్రైస్తవాన్ని 'భారతీకరణ' (ఇండియనైజేషన్) చేస్తున్నాయన్న మాట. తద్వారా మతం మారాలనుకొనే హిందువులకు.. క్రైస్తవంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా సంప్రదాయబద్ధమైన మార్పులను చేస్తున్నారు. హిందువులకు సాంస్కృతికంగానూ దగ్గరయ్యే ప్రక్రియలో భాగంగానే ఇదంతా జరుగుతోంది.

గతంలో వాటికన్‌లో భరతనాట్య ప్రక్రియలో క్రీస్తు జీవిత విశేషాలను ప్రదర్శించారు. క్రైస్తవంలోనూ తైలాభిషేకాలు జరుగుతాయి. మంత్రించిన కొబ్బరి నూనె చల్లినా, సేవించినా స్వస్థత చేకూరుతుందంటూ ప్రచారం జరుగుతోంది. అనంతపురం జిల్లా గుత్తిలో తరచూ స్వస్థత మహా సభలు జరుగుతాయి. ఈ సభలకు ఇతర జిల్లాల నుంచి కూడా భారీ ఎత్తున జనం వస్తారు. ఇక్కడ ఇచ్చే నూనెను సేవిస్తే 'ఆరోగ్యం గ్యారెంటీ' అనే ప్రచారమే ఇందుకు తార్కాణం.

మతం మారినా మారని కులం
అంతేకాదు.. కుల వ్యవస్థ అన్నది హిందూ మతానికే ప్రత్యేకం. కానీ.. మన దేశంలోని క్రైస్తవంలోనూ కుల వ్యవస్థ ప్రవేశించింది. హిందూ మతాన్ని వీడి.. క్రైస్తవ మతాన్ని తీసుకున్న వివిధ కులాల వారు తమ కుల వ్యవస్థను యథాతథంగా కొనసాగిస్తారు. తమ కులం వారినే పెళ్లి చేసుకుంటారు. కులాచారాలనూ తు.చ. తప్పకుండా పాటిస్తారు. హైందవం నుంచి క్రైస్తవంలోకి చేరిన వారిలో చాలామంది కుల చిహ్నాన్ని సూచించే పదాలను యథాతథంగా కొనసాగిస్తారు.

అగ్ర కులం వారికి.. తక్కువ కులం వారికీ మధ్య అంతరం అలానే కొనసాగుతుంది. కొన్ని చోట్ల.. అగ్రకులాల వారికి వేరుగా, నిమ్న కులం వారికి వేరుగా చర్చిలు వెలవడమే ఇందుకు నిదర్శనం. అంటే... ఒక కులం చర్చికి మరొక కులం వారు వెళ్లరన్న మాట! కాగా.. మతమార్పిడి గురించి 'ఆంధ్రజ్యోతి' ప్రచురిస్తున్న కథనాలకు రాష్ట్ర నలుమూలల నుంచి విపరీతమైన స్పందన వస్తోంది.

'ఆంధ్రజ్యోతి' కేంద్ర కార్యాలయానికి పాఠకులు పెద్ద ఎత్తున ఫోన్లు చేస్తూ.. మత మార్పిడులపై తమకు తారసపడ్డ అనుభవాలను వివరిస్తున్నారు. కొందరైతే.. క్రైస్తవ మిషనరీల ప్రచారాన్ని నమ్మి.. అనారోగ్య కారాణాలు ఇతరత్రా కారణాల వల్ల తాము మతం మారామని అంగీకరిస్తున్నారు. వీరిలో కొందరు క్రైస్తవంలో తాము ఇమడలేక.. తిరిగి హిందూ మతంలోకి వచ్చేశామనీ చెబుతున్నారు.

ధనం మూలం..
మత విస్తరణ కాంక్షతో మార్పిడిని ప్రోత్సహించే వారు కొందరు! కేవలం... ధనకాంక్ష తో టార్గెట్లు పెట్టుకుని మరీ మతం మార్పించే వారు ఇంకొందరు! ఈ వ్యవహారం డబ్బు చుట్టూ తిరుగుతోందని బలమైన ఆరోపణలు ఉన్నాయి. ప్రతి మిషనరీ, దాని అనుబంధ సంస్థలు ఎంతమందిని మతం మార్పించిందీ అంతర్జాతీయ సంస్థలకు ప్రతి నెలా నివేదిక లు పంపుతాయి. వాటి ఆధారంగానే నిధులు అందుతాయి. ఒక్కో మత మార్పిడికి ఇంత సొమ్మని చర్చి ఫాదర్లు, పాస్టర్లకు ఇస్తారని చెబుతారు.

ప్రార్థనా మందిరాల నిర్మాణం పేరిట భారీగా నిధులు సేకరిస్తున్నారు. కొన్నేళ్ల క్రితం సైకిళ్లపై తిరుగుతూ మత ప్రచారం చేసిన కొందరు పాస్టర్లు ఇప్పుడు విలాసవంతమైన కార్లలో తిరుగుతున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో ఒక్క కుటుంబాన్ని మతం మార్పిస్తే రూ.10 వేల వరకు చెల్లిస్తున్నట్లు సమాచారం. పేదల సంక్షేమం నిధులు ఖర్చు చేస్తున్నామని అంతర్జాతీయ క్రైస్తవ మిషనరీలకు తప్పుడు సమాచారం పంపి, డబ్బులు వెనకేసుకునే వారూ ఉన్నారు.

గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో 75 శాతం చర్చిలు విదేశీ నిధులతోనే నడుస్తున్నాయి. అన్యమతస్తులకు బాప్టిజం ఇప్పించినట్లుగా ఫొటోలు, వీడియో క్లిప్పింగ్‌లు పంపిస్తూ నిధులు సేకరిస్తున్నారు. నిజాయితీగా మతం కోసం మాత్రమే పని చేస్తూ, స్థానిక విరాళాలు, చందాలతో జీవించే వారూ ఉన్నారు. 1989లో ఉన్న అధికారిక సమాచారం ప్రకారమే... ప్రపంచ వ్యాప్తంగా చర్చిలు 14,500 కోట్ల డాలర్లు ఖర్చు పెడుతున్నాయి.

లెక్కకు చిక్కరు..
'రాష్ట్రంలో ఎంతమంది మతం మార్చుకుంటున్నారో అధికారిక లెక్కలు లేవు. ఎందుకంటే.. అలాంటివి నమోదు చేయాలన్న నిబంధన లేదుగనుక. కేరళ, తమిళనాడు తదిత ర రాష్ట్రాల్లో బాప్టిజం పొందాలంటే రెవెన్యూ అధికారుల వద్ద రిజిస్ట్రేషన్ తప్పనిసరి. దళితులు క్రైస్తవంలోకి మారితే సామాజిక హోదా ఎస్సీ నుంచి బీసీలుగా మారి, రిజర్వేషన్లపరంగా నష్టపోతారు. దీంతో మతం మారినా వారు ఎస్సీలుగానే కొనసాగుతున్నారు. దీనివల్ల అసలైన ఎస్సీలకు అన్యాయం జరుగుతోందని ఈ వర్గాలు వాపోతున్నాయి.

చావు.. పుట్టుక!
రాజమణికి 80 ఏళ్లు. హైదరాబాద్ సమీపంలోని రామవరం అనే కుగ్రామం. కార్తీక మాసంలో ఆమె శివాలయాల చుట్టూ తిరిగేవారు. రోజంతా పూజలతో గడిచిపోయేది. 9 నెలల క్రితం ఆమె మతం మార్చుకున్నారు. పూజలు మానేసి ప్రతి ఆదివారం చర్చికి వెళ్తున్నారు. 'మతం ఎందుకు మార్చుకున్నారు?' అని అడిగితే... 'చనిపోయాక కర్మ కాం డల అవసరం ఉండదని చర్చి అధికారులు చెప్పారు. కుటుంబానికి ఎలాంటి ఖర్చూ ఉం డదన్నారు. అందుకే మారాను' అని తెలిపారు.

కుటుంబ సభ్యులకు ఇదంతా ఇష్టం లేదు. సుమారు రెండు వారాల క్రితం ఆమె మరణించారు. ఆమెకు క్రైస్తవ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహిస్తామంటూ చర్చి అధికారులు వచ్చారు. దీనిపై కుటుం బసభ్యులు అభ్యంతరం వ్యక్తం చేసినా చివరకు... క్రైస్తవం ప్రకారమే ఆ పని కానిచ్చేశా రు. మత మార్పిడితో కుటుంబ స్థాయిలో సంఘర్షణకు ఇదో ఉదాహరణ!

మళ్లీ మరాం..
'ఆంధ్రజ్యోతి' కథనాలపై పాఠకులు పెద్దసంఖ్యలో ఫోన్లు చేస్తున్నారు. నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం ఐకపాముల గ్రామవాసులు ఐదుగురు శనివారం 'ఆంధ్రజ్యోతి'కి చెప్పిన విషయమిది... "ఏసయ్య ధనం ఇస్తాడు. పాపాలన్నీ రక్తంతో శుద్ధి చేస్తాడు. ఉబ్బసం వంటి మొండి వ్యాధులను కూడా తగ్గిస్తాడు.

పరలోక ప్రయాణానికి ఆటంకాలు లేకుండా ఆశీర్వదిస్తాడు... అని చర్చిలో చెప్పేవారు. మమ్మల్ని గుడికి వెళ్లొద్దని చెప్పేవారు. బంధువులెవరైనా చనిపోతే ముట్టుకోకూడదనేవారు. మా భార్యలను గాజులు తీసెయ్యమన్నారు. బొట్టుపెట్టుకోద్దన్నారు. దీంతో మేం చర్చికి వెళ్లడం మానేసి, మళ్లీ హిందూ మతంలోకి వచ్చేశాం! ఇలాంటి 20 కుటుంబాలు గ్రామంలో ఉన్నాయి.''

మంత్రం తంత్రం...
తాయెత్తులు, మొక్కులు, కొబ్బరి కాయలు, తలనీలాలు... ఇవి హిందువులకే పరిమితమనుకుంటే పొరపాటు పడినట్లే! క్రైస్తవంలోకీ ఈ సంప్రదాయాలు వచ్చాయి. లేదా... తీసుకొచ్చారు. క్రైస్తవంలో హైందవంలో ఉన్నన్ని పూజలు, పునస్కారాలు లేవు. కానీ, మతం మారిన, మారాలనుకున్న వారికి ఇబ్బంది లేకుండా సంప్రదాయబద్ధమైన మార్పులను చేర్చినట్లు తెలుస్తోంది. గతంలో వాటికన్‌లో భరతనాట్య ప్రక్రియలో క్రీస్తు జీవిత విశేషాలను ప్రదర్శించారు.

ఇటీవలి కాలంలో 'క్రిస్టియన్ యోగా' ప్రచారంలోకి వస్తోంది. క్రైస్తవంలోనూ తైలాభిషేకాలు జరుగుతాయి. మంత్రించిన కొబ్బరి నూనె చల్లినా, సేవించినా స్వస్థత చేకూరుతుందంటూ ప్రచారం జరుగుతోంది. అనంతపురం జిల్లా గుత్తిలో తరచూ స్వస్థత మహా సభలు జరుగుతాయి. ఈ సభలకు ఇతర జిల్లాల నుంచి కూడా భారీ ఎత్తున జనం వస్తారు. ఇక్కడ ఇచ్చే నూనెను సేవిస్తే 'ఆరోగ్యం గ్యారెంటీ' అనే ప్రచారమే దీనికి కారణం.

ఆచారాల్లోకి చొరబడుతూ [ఏమార్చే మతం -4]

13-11-2011 andhrajyothy daily

ఆచారాల్లోకి చొరబడుతూ

హైదరాబాద్, నవంబర్ 12 : తాయెత్తులు, మొక్కులు, కొబ్బరి కాయలు, తలనీలాలు... ఇవి హిందువులకే పరిమితమనుకుంటే పొరపాటు పడినట్లే! క్రైస్తవంలోకీ ఈ సంప్రదాయాలు వచ్చాయి. ప్రచారాలు, ప్రలోభాలు, విద్య, వైద్యం పేరిట మత మార్పిడిని ప్రోత్సహిస్తున్న క్రైస్తవ మిషనరీలు.. హిందువులను తమ వైపు ఆకర్షించేందుకు హైందవ సంస్కృతినీ తమలో మిళితం చేసుకుంటున్న తీరిది. హైందవ దేవాలయాల్లో తీర్థ ప్రసాదాలు ఇవ్వడం సరికాదని చెప్పే క్రైస్తవ సంస్థలు.. హిందూ మతంలో అనాదిగా వస్తున్న ఆచారాలైన తలనీలాలు సమర్పించుకోవడం, కొబ్బరి కాయలు కొట్టడం, అగరబత్తులు వెలిగించడం వంటి వాటిని తమ మతంలోనూ ప్రవేశపెట్టాయి.

ఏసు మహిమలను కీర్తిస్తూ.. సంకీర్తనలు రూపొందించడం, పద్యాలను కూర్చడం కూడా చేస్తున్నాయి. త్యాగరాజ కృతులను పోలిన ఏసు సంకీర్తనలను కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో రూపొందించారు. ఇలా భారతీయ సాహిత్య రూపాల్లోనూ క్రైస్తవ సాహిత్యాన్ని తయారు చేస్తున్నారు. తైలాభిషేకాలు, హారతులు వంటి పద్ధతులనూ క్రైస్తవ మిషనరీలు చర్చిలలో ప్రవేశ పెట్టాయి. 'క్రిస్టియన్ యోగా' అనే కొత్త పద్ధతికి కూడా క్రైస్తవ సంస్థలు రూపకల్పన చేశాయి.

అంటే.. క్రైస్తవాన్ని 'భారతీకరణ' (ఇండియనైజేషన్) చేస్తున్నాయన్న మాట. తద్వారా మతం మారాలనుకొనే హిందువులకు.. క్రైస్తవంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా సంప్రదాయబద్ధమైన మార్పులను చేస్తున్నారు. హిందువులకు సాంస్కృతికంగానూ దగ్గరయ్యే ప్రక్రియలో భాగంగానే ఇదంతా జరుగుతోంది.

గతంలో వాటికన్‌లో భరతనాట్య ప్రక్రియలో క్రీస్తు జీవిత విశేషాలను ప్రదర్శించారు. క్రైస్తవంలోనూ తైలాభిషేకాలు జరుగుతాయి. మంత్రించిన కొబ్బరి నూనె చల్లినా, సేవించినా స్వస్థత చేకూరుతుందంటూ ప్రచారం జరుగుతోంది. అనంతపురం జిల్లా గుత్తిలో తరచూ స్వస్థత మహా సభలు జరుగుతాయి. ఈ సభలకు ఇతర జిల్లాల నుంచి కూడా భారీ ఎత్తున జనం వస్తారు. ఇక్కడ ఇచ్చే నూనెను సేవిస్తే 'ఆరోగ్యం గ్యారెంటీ' అనే ప్రచారమే ఇందుకు తార్కాణం.

మతం మారినా మారని కులం
అంతేకాదు.. కుల వ్యవస్థ అన్నది హిందూ మతానికే ప్రత్యేకం. కానీ.. మన దేశంలోని క్రైస్తవంలోనూ కుల వ్యవస్థ ప్రవేశించింది. హిందూ మతాన్ని వీడి.. క్రైస్తవ మతాన్ని తీసుకున్న వివిధ కులాల వారు తమ కుల వ్యవస్థను యథాతథంగా కొనసాగిస్తారు. తమ కులం వారినే పెళ్లి చేసుకుంటారు. కులాచారాలనూ తు.చ. తప్పకుండా పాటిస్తారు. హైందవం నుంచి క్రైస్తవంలోకి చేరిన వారిలో చాలామంది కుల చిహ్నాన్ని సూచించే పదాలను యథాతథంగా కొనసాగిస్తారు.

అగ్ర కులం వారికి.. తక్కువ కులం వారికీ మధ్య అంతరం అలానే కొనసాగుతుంది. కొన్ని చోట్ల.. అగ్రకులాల వారికి వేరుగా, నిమ్న కులం వారికి వేరుగా చర్చిలు వెలవడమే ఇందుకు నిదర్శనం. అంటే... ఒక కులం చర్చికి మరొక కులం వారు వెళ్లరన్న మాట! కాగా.. మతమార్పిడి గురించి 'ఆంధ్రజ్యోతి' ప్రచురిస్తున్న కథనాలకు రాష్ట్ర నలుమూలల నుంచి విపరీతమైన స్పందన వస్తోంది.

'ఆంధ్రజ్యోతి' కేంద్ర కార్యాలయానికి పాఠకులు పెద్ద ఎత్తున ఫోన్లు చేస్తూ.. మత మార్పిడులపై తమకు తారసపడ్డ అనుభవాలను వివరిస్తున్నారు. కొందరైతే.. క్రైస్తవ మిషనరీల ప్రచారాన్ని నమ్మి.. అనారోగ్య కారాణాలు ఇతరత్రా కారణాల వల్ల తాము మతం మారామని అంగీకరిస్తున్నారు. వీరిలో కొందరు క్రైస్తవంలో తాము ఇమడలేక.. తిరిగి హిందూ మతంలోకి వచ్చేశామనీ చెబుతున్నారు.

ధనం మూలం..
మత విస్తరణ కాంక్షతో మార్పిడిని ప్రోత్సహించే వారు కొందరు! కేవలం... ధనకాంక్ష తో టార్గెట్లు పెట్టుకుని మరీ మతం మార్పించే వారు ఇంకొందరు! ఈ వ్యవహారం డబ్బు చుట్టూ తిరుగుతోందని బలమైన ఆరోపణలు ఉన్నాయి. ప్రతి మిషనరీ, దాని అనుబంధ సంస్థలు ఎంతమందిని మతం మార్పించిందీ అంతర్జాతీయ సంస్థలకు ప్రతి నెలా నివేదిక లు పంపుతాయి. వాటి ఆధారంగానే నిధులు అందుతాయి. ఒక్కో మత మార్పిడికి ఇంత సొమ్మని చర్చి ఫాదర్లు, పాస్టర్లకు ఇస్తారని చెబుతారు.

ప్రార్థనా మందిరాల నిర్మాణం పేరిట భారీగా నిధులు సేకరిస్తున్నారు. కొన్నేళ్ల క్రితం సైకిళ్లపై తిరుగుతూ మత ప్రచారం చేసిన కొందరు పాస్టర్లు ఇప్పుడు విలాసవంతమైన కార్లలో తిరుగుతున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో ఒక్క కుటుంబాన్ని మతం మార్పిస్తే రూ.10 వేల వరకు చెల్లిస్తున్నట్లు సమాచారం. పేదల సంక్షేమం నిధులు ఖర్చు చేస్తున్నామని అంతర్జాతీయ క్రైస్తవ మిషనరీలకు తప్పుడు సమాచారం పంపి, డబ్బులు వెనకేసుకునే వారూ ఉన్నారు.

గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో 75 శాతం చర్చిలు విదేశీ నిధులతోనే నడుస్తున్నాయి. అన్యమతస్తులకు బాప్టిజం ఇప్పించినట్లుగా ఫొటోలు, వీడియో క్లిప్పింగ్‌లు పంపిస్తూ నిధులు సేకరిస్తున్నారు. నిజాయితీగా మతం కోసం మాత్రమే పని చేస్తూ, స్థానిక విరాళాలు, చందాలతో జీవించే వారూ ఉన్నారు. 1989లో ఉన్న అధికారిక సమాచారం ప్రకారమే... ప్రపంచ వ్యాప్తంగా చర్చిలు 14,500 కోట్ల డాలర్లు ఖర్చు పెడుతున్నాయి.

లెక్కకు చిక్కరు..
'రాష్ట్రంలో ఎంతమంది మతం మార్చుకుంటున్నారో అధికారిక లెక్కలు లేవు. ఎందుకంటే.. అలాంటివి నమోదు చేయాలన్న నిబంధన లేదుగనుక. కేరళ, తమిళనాడు తదిత ర రాష్ట్రాల్లో బాప్టిజం పొందాలంటే రెవెన్యూ అధికారుల వద్ద రిజిస్ట్రేషన్ తప్పనిసరి. దళితులు క్రైస్తవంలోకి మారితే సామాజిక హోదా ఎస్సీ నుంచి బీసీలుగా మారి, రిజర్వేషన్లపరంగా నష్టపోతారు. దీంతో మతం మారినా వారు ఎస్సీలుగానే కొనసాగుతున్నారు. దీనివల్ల అసలైన ఎస్సీలకు అన్యాయం జరుగుతోందని ఈ వర్గాలు వాపోతున్నాయి.

చావు.. పుట్టుక!
రాజమణికి 80 ఏళ్లు. హైదరాబాద్ సమీపంలోని రామవరం అనే కుగ్రామం. కార్తీక మాసంలో ఆమె శివాలయాల చుట్టూ తిరిగేవారు. రోజంతా పూజలతో గడిచిపోయేది. 9 నెలల క్రితం ఆమె మతం మార్చుకున్నారు. పూజలు మానేసి ప్రతి ఆదివారం చర్చికి వెళ్తున్నారు. 'మతం ఎందుకు మార్చుకున్నారు?' అని అడిగితే... 'చనిపోయాక కర్మ కాం డల అవసరం ఉండదని చర్చి అధికారులు చెప్పారు. కుటుంబానికి ఎలాంటి ఖర్చూ ఉం డదన్నారు. అందుకే మారాను' అని తెలిపారు.

కుటుంబ సభ్యులకు ఇదంతా ఇష్టం లేదు. సుమారు రెండు వారాల క్రితం ఆమె మరణించారు. ఆమెకు క్రైస్తవ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహిస్తామంటూ చర్చి అధికారులు వచ్చారు. దీనిపై కుటుం బసభ్యులు అభ్యంతరం వ్యక్తం చేసినా చివరకు... క్రైస్తవం ప్రకారమే ఆ పని కానిచ్చేశా రు. మత మార్పిడితో కుటుంబ స్థాయిలో సంఘర్షణకు ఇదో ఉదాహరణ!

మళ్లీ మరాం..
'ఆంధ్రజ్యోతి' కథనాలపై పాఠకులు పెద్దసంఖ్యలో ఫోన్లు చేస్తున్నారు. నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం ఐకపాముల గ్రామవాసులు ఐదుగురు శనివారం 'ఆంధ్రజ్యోతి'కి చెప్పిన విషయమిది... "ఏసయ్య ధనం ఇస్తాడు. పాపాలన్నీ రక్తంతో శుద్ధి చేస్తాడు. ఉబ్బసం వంటి మొండి వ్యాధులను కూడా తగ్గిస్తాడు.

పరలోక ప్రయాణానికి ఆటంకాలు లేకుండా ఆశీర్వదిస్తాడు... అని చర్చిలో చెప్పేవారు. మమ్మల్ని గుడికి వెళ్లొద్దని చెప్పేవారు. బంధువులెవరైనా చనిపోతే ముట్టుకోకూడదనేవారు. మా భార్యలను గాజులు తీసెయ్యమన్నారు. బొట్టుపెట్టుకోద్దన్నారు. దీంతో మేం చర్చికి వెళ్లడం మానేసి, మళ్లీ హిందూ మతంలోకి వచ్చేశాం! ఇలాంటి 20 కుటుంబాలు గ్రామంలో ఉన్నాయి.''

మంత్రం తంత్రం...
తాయెత్తులు, మొక్కులు, కొబ్బరి కాయలు, తలనీలాలు... ఇవి హిందువులకే పరిమితమనుకుంటే పొరపాటు పడినట్లే! క్రైస్తవంలోకీ ఈ సంప్రదాయాలు వచ్చాయి. లేదా... తీసుకొచ్చారు. క్రైస్తవంలో హైందవంలో ఉన్నన్ని పూజలు, పునస్కారాలు లేవు. కానీ, మతం మారిన, మారాలనుకున్న వారికి ఇబ్బంది లేకుండా సంప్రదాయబద్ధమైన మార్పులను చేర్చినట్లు తెలుస్తోంది. గతంలో వాటికన్‌లో భరతనాట్య ప్రక్రియలో క్రీస్తు జీవిత విశేషాలను ప్రదర్శించారు.

ఇటీవలి కాలంలో 'క్రిస్టియన్ యోగా' ప్రచారంలోకి వస్తోంది. క్రైస్తవంలోనూ తైలాభిషేకాలు జరుగుతాయి. మంత్రించిన కొబ్బరి నూనె చల్లినా, సేవించినా స్వస్థత చేకూరుతుందంటూ ప్రచారం జరుగుతోంది. అనంతపురం జిల్లా గుత్తిలో తరచూ స్వస్థత మహా సభలు జరుగుతాయి. ఈ సభలకు ఇతర జిల్లాల నుంచి కూడా భారీ ఎత్తున జనం వస్తారు. ఇక్కడ ఇచ్చే నూనెను సేవిస్తే 'ఆరోగ్యం గ్యారెంటీ' అనే ప్రచారమే దీనికి కారణం.

18, డిసెంబర్ 2011, ఆదివారం

క్రైస్తవ స్నేహితుడిగా చెబుతున్నా బలవంతపు మార్పిడులు నిషేధించండి పోప్ బెనెడిక్ట్‌కు స్వామి అగ్నివేశ్ లేఖ

andhrajyothy daily 12-11-2009

మార్చే 'స్వేచ్ఛ' లేదు!
సమస్యలు సాకుగా ప్రేరేపణ

పరిణితిలేని మనసులపై ప్రభావం
మతం మారాలంటూ నూరిపోస్తున్నారు
క్రైస్తవ స్నేహితుడిగా చెబుతున్నా
బలవంతపు మార్పిడులు నిషేధించండి
పోప్ బెనెడిక్ట్‌కు స్వామి అగ్నివేశ్ లేఖ

బలవంతపు మత మార్పిడులపై 'నిషేధం' విధించాలంటూ సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేశ్ పోప్ బెనెడిక్ట్-16ను కోరారు. ఇటువంటి మత మార్పిడులతో భారత్ వంటి దేశాల్లో తీవ్ర స్పందనలు వ్యక్తమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దీపావళి సందర్భంగా స్వామి అగ్నివేశ్‌కు పోప్ ఓ లేఖ రాశారు. 'మతం మారే స్వేచ్ఛ'కు ఆ లేఖలో పోప్ పూర్తిస్థాయి మద్దతు ప్రకటించారు. దానికి స్పందనగానే అగ్నివేశ్ లేఖ రాశారు.

ఆయన రాసిన లేఖ పూర్తి పాఠం ఇదీ..


దీపావళి సందర్భంగా హిందువులతో పరస్పర చర్చలకు పిలుపునిస్తూ పాంటిఫికల్ కౌన్సిల్ పంపిన సందేశం అందింది. దానికి స్పందనగానే ఈ లేఖ రాస్తున్నాను. మీకు, మరీ ముఖ్యంగా భారత్‌లోని క్రైస్తవులకు స్నేహితుడిగా ఈ లేఖ రాస్తున్నా! హిందువులు సహా ఇతర మతాల్లోని ఛాందసవాదులు దాడులు చేసినప్పుడు క్రైస్తవుల తరఫున పోరాడిన వారిలో నేనే ముందు వరుసలో ఉంటాను.

మీ సందేశం చదివిన తర్వాత దానిలోని కొన్ని అంశాలు నాలాంటి శ్రేయోభిలాషులను కూడా ఇబ్బంది పెడుతున్నాయి. మత స్వేచ్ఛ ఉండాల్సిన ఆవశ్యకతను ఆ సందేశంలో మీరు బాగా వివరించారు. దానిని వివిధ కోణాల్లో పరిశీలిస్తే.. 'మత స్వేచ్ఛ అంటే ఒకరి మతాన్ని మార్చుకునే స్వేచ్ఛ కూడా' అని మీరు పేర్కొన్నారు. దీనిపై కొంత చర్చ జరగాల్సిన అవసరం ఉంది.

లేకపోతే.. ఎవరు ఏ మతాన్ని అయినా విశ్వసించవచ్చు, ఆచరించవచ్చునన్న మీ సందేశానికి బదులుగా మత మార్పిడులను సమర్థిస్తున్నారనే భావన కలుగుతుంది. భారత్ వంటి దేశాల్లో ఈ భావన తీవ్ర స్పందనలను రేకెత్తిస్తుంది. ముల్లాలు, మిషనరీలు ప్రచారం చేస్తున్న విశ్వాసాలను నమ్మకపోతే, సొంత విశ్వాసాలను వదలకపోతే ప్రజలు తమను తాము రక్షించుకోలేరని ఇప్పటికే అనేక మంది వ్యక్తులు, సంస్థల వారు ప్రచారం చేస్తున్నారు. అలాంటి వారి చేతిలో మేము ఇప్పటికే చాలా బాధలు పడి ఉన్నాం. ఈ సందర్భంగా మీకో విషయం చెప్పాలి. పోప్ జాన్‌పాల్-2 1999లో భారత్‌కు వచ్చారు. బిషప్‌లను, కార్డినల్స్‌ను ఉద్దేశించి ప్రసంగించారు.

"మొదటి మిలీనియంలో యూరప్ గడ్డపై శిలువను ప్రతిష్ఠించగలిగాం. రెండో మిలీనియంలో అమెరికా, ఆఫ్రికాల్లో ప్రవేశించాం. మూడో మిలీనియంలో సువిశాల, ప్రాణాధారమైన భారత ఉప ఖండంలో విశ్వాసమనే పంట పండుతుందని ఆశిస్తున్నాం'' అని పోప్ ప్రకటించారు. రక్షకుడైన ఏసుక్రీస్తుపట్ల అచంచల విశ్వాసం ఉందని ఆ సందేశం చెబుతోందని, మత మార్పిడులకు అది పిలుపునిస్తోందని మాకు చెప్పారు.

అంతేనా.. "ప్రభువు నుంచి మొత్తం ఆసియా శాంతి పొందే దాకా చర్చి హృదయం తల్లడిల్లుతూనే ఉంటుంది'' అని కూడా పేర్కొన్నారు. ఈ సందేశం ద్వారా - మత స్వేచ్ఛ అంటే మత మార్పిడులు చేయడానికి మిషనరీలకు ఉన్న స్వేచ్ఛ అని అర్థమవుతుంది. అయితే, మీరు, మేము చేయబోయే పర్యటన లక్ష్యాలకు ఇది విరుద్ధంగా ఉంది. ఆ యాత్రకు శాంతి, సత్యం ప్రధాన లక్ష్యాలని మీరు ఇప్పటికే ప్రకటించారు. అంతేకాకుండా మా సుప్రీం కోర్టు కూడా కొన్ని మార్గదర్శకాలను ప్రవచించింది. వీటి ప్రకారం- మత ప్రచార స్వేచ్ఛ అంటే మత మార్పిడులు చేయడానికి స్వేచ్ఛ ఉన్నట్లు కాదు. ఈ మార్గదర్శకానికి వెనక కొన్ని కారణాలు ఉన్నాయి.

పేద ప్రజలకు ఉన్న ఇబ్బందులను సాకుగా చూపించి చాలాసార్లు తమ తమ మతాలను వదిలిపెట్టేలా వారిని రెచ్చగొడుతున్నారు. చర్చి చరిత్రను జాగ్రత్తగా గమనిస్తే- తీవ్రమైన కరువు పరిస్థితులను కూడా ఉపయోగించుకొని తమ మతాన్ని ప్రచారం చేసుకొన్న ఉదం తాలు కనిపిస్తాయి. హిందూ దేవతలు, దేవుళ్లపై అమాయక పేదలకు అనేక రకాలైన దుష్ప్రచారాలనూ నూరిపోస్తున్నారు.

అద్భుతాలు చేస్తామని, మహిమలు చూపిస్తామని క్రైస్తవ మత ప్రచారకులు ప్రజలను మోసం చేస్తున్నారు. ఇలాంటి మహిమల మాట పక్కన పెడితే- భారత దేశంలో వెనకబడిన కులాల ప్రజలకు సమానత్వాన్ని కూడా కల్పించలేకపోతున్నారు. ఈ విషయంపై మత మార్పిడి చేసుకున్నవారు పుంఖానుపుంఖాలుగా రాశారు.

చాలాసార్లు మత మార్పిడులు చాలా గర్హించదగ్గ పద్ధతుల్లో జరుగుతున్నాయి. ఇలాంటి వాటిని మీ సందేశంలో కూడా ఖండించారు. ఈ తరహా మత మార్పిడులు వ్యక్తులను చాలా సందిగ్ధంలో పడేస్తాయి. అండగా ఉండే సమాజాల నుంచి వారిని వేరు చేస్తాయి. పెద్ద సంఖ్యలో మత మార్పిడులు జరిగినప్పుడు- ఆ ప్రజలు తాము నివసిస్తున్న సమాజానికి దూరంగా జరుగుతున్నారు. దీనివల్ల క్రైస్తవ మత ప్రచారకులకు, గ్రూపులకు వ్యతిరేకంగా హింస చెలరేగుతోంది. ఇలాంటి వాటి వల్ల సహ జీవనం, ప్రశాంతత దెబ్బతింటున్నాయి.

ప్రతి వ్యక్తికి ఇతర మతాల గురించి తెలుసుకొనే హక్కు ఉంటుందనే మీ వాదనతో ఏకీభవిస్తున్నాను. అయితే, అది స్వేచ్ఛతో, ఆ వ్యక్తి స్వయంగా తీసుకున్న నిర్ణయమై ఉండాలి. అది ప్రలోభాలతో కూడినదై ఉండకూడదు. ఒత్తిళ్లతో ఇలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు. అబద్ధాలతోను, తప్పుడు హామీలతోను దానిని ముందుకు నడిపించకూడదు. ఇలాంటి మత మార్పిడులు జరిగినప్పుడు తీవ్రమైన స్పందనలు వస్తాయి. దీనివల్ల సమాజంలో ఉద్రిక్తతలు ఏర్పడతాయి. హింసాపూరితమైన స్పందనలు వస్తాయి.

ఇలాంటి పరిస్థితుల్లో మీ సందేశంలో చెప్పిన అంతఃస్సూత్రం కాకుండా.. మూకుమ్మడి, బలవంతపు మత మార్పిడులపై నిషేధం విధించాలని కోరుతున్నాను. ముఖ్యంగా-ఎవరికైతే పరిణతి ఉండదో.. ఎవరైతే సొంత నిర్ణయాలు తీసుకోలేరో వారిని మత మార్పిడులు చేయకుండా నిషేధించాలని కోరుతున్నాను. చదువుకోని ఆదివాసీ కానీ, ఒక చిన్న పిల్లవాడు కానీ తమ మతం గురించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోగలరు?

ఇలాంటి నిషేధం వల్ల మిగిలిన మతాలకు చెందిన ప్రజలకు కొంత వ్యవధి చిక్కుతుంది. వారు తమ ఆలోచనలను పునరాలోచించుకోగలుగుతారు. వివిధ సంస్థలు తమ పనితీరును సమీక్షించడానికి వీలవుతుంది. ఈ సమయంలో నచ్చిన మతాన్ని అనుసరించే హక్కు వ్యక్తులకు ఉంటుంది. వేరే మతాన్ని ఆదరించాలని వారి అంతరాత్మ చెబితే వారు దానినే పాటిస్తారు. మన సమావేశంలో ఈ విషయాలన్నింటి గురించి మాట్లాడే అవకాశం ఉంటుందని ఆశిస్తున్నా.

17, డిసెంబర్ 2011, శనివారం

ఏ 'మార్చే' మతం-2 ప్రచారమా.. ప్రలోభమా? వివాదాస్పదమవుతున్న మత మార్పిడులు అగ్ర వర్ణాలలో పెరుగుతున్న ధోరణి

andhrajyothy daily 11-11-2011

ఏ 'మార్చే' మతం-2
ప్రచారమా.. ప్రలోభమా?
వివాదాస్పదమవుతున్న మత మార్పిడులు
అగ్ర వర్ణాలలో పెరుగుతున్న ధోరణి
వెంటబడ్డారు

హైదరాబాద్, నవంబర్ 10 : తమది ప్రచారం మాత్రమే అంటారు వాళ్లు.
దాని వెనక ప్రలోభం దాగి ఉంది అంటారు వీళ్లు.
కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడంలో తప్పేముంది అంటారు వాళ్లు.
ఆదుకునే పేరుతో అమాంతంగా మతం మార్చేస్తున్నారంటారు వీళ్లు!
ఏది నిజం? దేనిలో ఎంత వాస్తవం? రాష్ట్రంలో జరుగుతున్న మత మార్పిడులను లోతుగా పరిశీలిస్తే పై రెండు వాదనల్లోనూ వాస్తవం ఉందని తేలుతోంది. రాజ్యాంగం ప్రకారం మత ప్రచారం చేసే హక్కు, నచ్చిన మతంలోకి స్వచ్ఛందంగా మారే హక్కూ ఎవరికైనా ఉన్నప్పటికీ, జరుగుతున్న సంఘటనలు అంత సాఫీగా సాగిపోతున్నట్టు కనిపించడం లేదు. అనేక సందర్భాల్లో 'తీవ్రమైన ప్రచార ఒత్తిడి'కి లోనైన వారు క్రైస్తవంలోకి మారిన ఉదంతాలు వెలుగుచూస్తున్నాయి.

'సమస్య లేని సమాజం, ఇబ్బంది లేని మనిషి ఎవరుంటారు? ఆ ఇబ్బందిని పరిష్కరించుకోవడానికి సాయపడడం మానవత్వం. ఆ ఇబ్బందిని పరిష్కరిస్తాం. మా మతంలోకి రండి అనడం షరతులతో కూడిన ప్రలోభం. క్రైస్తవం మతాంతరీకరణ అంశంలో మామూలు ప్రచారంతో పాటు రెండోదీ ఉధృతంగా సాగుతోంది'' అని ఒక సామాజిక విశ్లేషకుడు పేర్కొన్నారు. ఒకప్పుడు హిందూమతంలో ఉన్న వివక్షను, సామాజిక అంతరాలను ఎదిరించడానికి, అగ్ర కులాల దుర్మార్గాల నుంచి తప్పించుకోవడానికి దళిత వర్గాలు మత మార్పిడిని ఎంచుకున్నాయి. స్వచ్ఛందంగా మతాన్ని మార్చుకున్నాయి.

ఇందులో ఎలాంటి తప్పూ లేదు. దీన్ని ఎవరూ తప్పుబట్టలేరు కూడా. అంతెందుకు; భారత సమాజంలో దళితులు ఎదుర్కొనే వివక్షకు 'మతం మారడమే మందు' అని దళిత జనోద్ధారకుడు, రాజ్యాంగ నిర్మాత, దార్శనికుడైన బాబాసాహెబ్ అంబేద్కర్ తేల్చి చెప్పారు. ఆయన ఆధ్వర్యంలో 1956 అక్టోబర్ 14న ఐదు లక్షల మంది దళితులు హిందూ మతం నుంచి బౌద్ధంలోకి మారారు. వివక్షను ఎదుర్కొనే అణగారిన వర్గాల వారికి అంబేద్కర్ ఈ పరిష్కార మార్గాన్ని చూపించారు. అయితే సామాజికంగా ఎలాంటి వివక్షకు లోను కాని వారు, పై అంతస్తులో ఉన్నవారు కూడా మతం మారుతుండడం ఇటీవలి కాలంలో కనిపిస్తున్న పరిణామం. అగ్రవర్ణాల వారైనా, మరెవరైనా స్వచ్ఛందంగా మారితే సమస్యే లేదు.

కానీ అసలు విషయమేమిటంటే... పలు సందర్భాలలో ఇతరత్రా కారణాలు వారిపై ప్రభావం చూపుతున్నాయి. వికసించీ వికసించని మనసులను అనేక ప్రలోభాలకు గురి చేసి, ప్రభావితం చేసి మతం మార్పించుకుంటున్న సంఘటనలు అనేకం ఉన్నాయి. మత మార్పిడులపై ప్రచురించిన 'దేవుడు పిలిచాడు' కథనాన్ని చదివి, వరదరాజులు అనే బీసీ వర్గానికి చెందిన ఒక వ్యక్తి తనంతతానుగా ఆంధ్రజ్యోతి కార్యాలయానికి ఫోన్ చేశారు. తన కూతురిని ఇలాగే ప్రలోభ పెట్టి, నన్‌గా మార్చారని ఆవేదన వ్యక్తంచేశారు. పాత్రికేయ రంగంలో లబ్ధ ప్రతిష్ఠుడైన, అగ్ర కులానికి చెందిన ఒక ప్రముఖుడి కూతురితో కూడా మతం మార్పించేందుకు గట్టి ప్రయత్నాలే జరిగాయి.

కానీ సఫలం కాలేదు. ఇదే తరహాలో విశాఖపట్నానికి చెందిన కుటుంబం విషయంలో మత మార్పిడి జరిగిపోయింది. ఇది వివక్షకు అందని కోణం. 'ఎందుకిలా?' అని ప్రశ్నిస్తే ఆరోగ్యం బాగుపడుతుందని, ఆర్థికంగా బాగుంటుందని... రకరకాల సమాధానాలు వినవస్తున్నాయి. వ్యక్తులు, చట్టాల సంగతి ఎలా ఉన్నప్పటికీ... మత మార్పిళ్లపై ఘర్షణలు జరుగుతున్న సందర్భాలూ అనేకం! కుటుంబాల స్థాయిలో ఆవేదనను మిగిల్చిన ఉదంతాలూ ఉన్నాయి. నాణేనికి రెండు కోణాలు ఉన్నట్లే.... మత మార్పిడికీ రెండు కోణాలు ఉన్నాయి. ఎవరి అనుభవాలు వారివి. అవీ ఇవీ... అన్నీ... (వారివారి అభ్యర్థన మేరకు కొందరి పేర్లు మార్చాం)

12 రోజుల క్రితం రాజమండ్రి కోటిపల్లి బస్‌స్టాండ్‌లో బస్సు దిగాం. కాసేపటికి ముగ్గురు ఆడవాళ్లు మాకు ఎదురుగా వచ్చారు. 'మతం మార్చుకోండి. దేవుడు మిమ్మల్ని కరుణిస్తాడు. మీకు ఆర్థికంగా కూడా బాగుంటుంది' అని చెప్పారు. 'మాకు అలాంటి ఉద్దేశం లేదు' అని చెప్పి ముందుకు నడిచాం. కానీ, వాళ్లు మమ్మల్ని వదల్లేదు. 'ఒక్కసారి ఆలోచించండి. ఈ పుస్తకాలు చదివితే మతం గురించి అర్థమవుతుంది' అని కొన్ని పుస్తకాలు ఇవ్వడానికి ప్రయత్నించారు. 'మాకు అవసరం లేదు. మమ్మల్ని వదిలేయండి' అని ముందుకు నడిచినా వారు వదిలిపెట్టలేదు. గట్టిగా కోప్పడటంతో వెళ్లిపోయారు. కోటిపల్లి బస్‌స్టాండ్‌లో మా చుట్టాల్లోనూ కొందరికి ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయి. - సరస్వతి, హైదరాబాద్

మా అమ్మాయిని ఇప్పించండి..
దాదాపు 50 ఏళ్లుగా హైదరాబాద్‌లో నివసిస్తున్నాం. మాకు ఇద్దరు అమ్మాయిలు. ఇద్దరు అబ్బాయిలు. చిన్నమ్మాయిని బాగా చదివించా. హైదరాబాద్ ఇన్ఫోసిస్‌లో పనిచేస్తూ ఉండేది. మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలనుకున్నాం. ఈ ఏడాది జులైలో ఒక రోజు ఊరు వెళ్తున్నానని చెప్పింది. మర్నాడు మాకు చెన్నై నుంచి ఫోన్ వచ్చింది. 'నాన్నా.. నేను నన్‌గా మారిపోతున్నా. దానికున్న కారణాలన్నీ ఆరు పేజీలు ఉత్తరంలో రాసి ఉంచాను' అని చెప్పింది.

మాకు షాక్ కొట్టినట్లయింది. వెంటనే బయలుదేరి చెన్నై వెళ్లాం. మా అమ్మాయిని చూడటానికి ఉదయం నుంచి సాయంత్రం దాకా వేచి ఉండాల్సి వచ్చింది. సాయంత్రానికి మా అమ్మాయి బయటకు వచ్చింది. తెల్లటి దుస్తులు వేసుకుంది. ఆమెను చూడగానే ఏడుపొచ్చింది. ఆమెతో ఏకాంతంగా మాట్లాడదామంటే.. చుట్టూ కాపలా! ఇక లాభం లేదని వాళ్లతో గొడవ పడ్డాను. అప్పుడు లోపలి నుంచి ఒకాయన వచ్చి నా చేతిలో ఓ కాగితం పెట్టాడు.

తాను మేజర్‌నని.. ఇష్టపూర్వకంగా మతం మార్చుకున్నానని.. తల్లిదండ్రులు (మేము) బలవంతంగా తీసుకువెళ్లిపోయే అవకాశం ఉంది కాబట్టి రక్షణ కల్పించాలని కోరుతూ చెన్నై పోలీస్ కమిషనర్‌కు మా అమ్మాయి రాసిన ఉత్తరం అది. దాన్ని చూసి మరోసారి షాక్‌కి గురయ్యాను. నాకు, మా అమ్మాయికి ఎటువంటి విభేదాలు లేవు. అందరం అప్యాయంగా ఉండేవాళ్లం. అలాంటిది నామీద పోలీస్ కమిషనర్‌కు ఉత్తరం ఎలా రాస్తుంది. కొద్దిసేపు ఆమెను బతిమాలాం. కన్నీళ్లు పెట్టుకున్నాం. మా అమ్మాయి కూడా ఏడ్చింది. కానీ, నోరు తెరిచి ఏమీ మాట్లాడలేదు. ఇక చేసేదేమీ లేక తిరిగి వచ్చాం.

ఆమె బట్టలు, సెల్‌ఫోన్లు అన్నీ తిరిగి ఇచ్చేశారు. ఇంటికి వచ్చిన తర్వాత ఫోన్‌లో చూస్తే- "నువ్వు ప్రత్యేకమైన వ్యక్తివి కాబట్టి దేవుడు నిన్ను ఎంపిక చేశాడు. దేవుడి సేవలో ఉన్న ప్రశాంతత మరెక్కడా లేదు. కొన్ని కోట్ల మందిలో నీకు మాత్రమే ఆ అదృష్టం దక్కింది. ప్రభువు సేవ చేసుకొని తరించుకుందుగాని రా!'' అనే అర్థంలో అనేక మెసేజ్‌లు ఉన్నాయి. దీనిపై కేసు పెట్టడం వల్ల ప్రయోజనం ఉండదని.. చర్చి అధికారుల ద్వారానే ప్రయత్నించాలని ఒక న్యాయవాది చెప్పారు.

మల్కాజ్‌గిరిలో ఒక చర్చి దగ్గరకు పంపాడు. నేను ఈ ప్రస్తావన తెచ్చిన వెంటనే వారు 'ఆ విషయాలు మాకు తెలియవు..' అంటూ లోపలికి వెళ్లిపోయారు. 'మీ అమ్మాయి నన్‌గా మారిందిట కదా..' అని బంధువులు అడిగితే మొదట్లో బాగా కోపం వచ్చేది. తర్వాత... కోపం తగ్గింది. బాధ మాత్రం తగ్గలేదు. మా అమ్మాయిని ఎందుకు ఆకర్షించాల్సి వచ్చింది? ఆమె చేత మతం మార్పించే హక్కు ఎవరిచ్చారు? దయనీయమైన పరిస్థితి ఏమిటంటే... నేను మా అమ్మాయిని తిరిగి తెచ్చుకోలేను.. అలాగని కేసు పెట్టలేను.
- వరదరాజులు, హైదరాబాద్

అమెరికాలో మార్పించారు..
నాకు ముగ్గురు కుమార్తెలు. రెండో కుమార్తె స్రవంతి 2002లో సత్యం కంప్యూటర్స్‌లో చేరింది. మూడే ళ్లు పనిచేశాక అమెరికా పంపించారు. అక్కడికి వెళ్లిన కొద్దికాలానికే పని ఒత్తిడితో బాధ పడుతున్న ఆమెను, సహోద్యోగులు, స్థానిక చర్చి ఫాదర్ కలిసి ఏసును నమ్మితే స్వాంతన చేకూరుతుందని నమ్మించారు. బాప్టిజం ఇప్పించారు.

ఇండియాకి వచ్చాక ఉద్యోగం మానేసింది. అదేమని ప్రశ్నిస్తే... ప్రభువే అన్నీ చూసుకుంటాడని చెప్పింది. పెళ్లి చేసుకోవడం, ఉద్యోగం చేయడం పాపం అని చెప్పింది. భువనేశ్వర్‌లో మానసిక వైద్యుడి వద్ద ఏడాదిన్నర చికిత్స చేయించాం. బాగానే కోలుకుంది. దాంతో విశాఖపట్నం తీసుకొచ్చి నా దగ్గరే వుంచా. అన్నీ మరిచిపోయినా ప్రభువుని మాత్రం గుర్తుంచుకొంది. రెండేళ్ల తరువాత ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. వెతికి తీసుకొచ్చాం.

మళ్లీ రెండుసార్లు అలా పారిపోయింది. ఇప్పుడు హైదరాబాద్‌లో కైస్తవుల వద్దే ఉన్నట్లు తెలిసింది. చదువుకున్న వారిని కూడా ఇలా మాయచేసి, మతం మార్పించడం దారుణం. ఆ బాధ ఓ తండ్రిగా నాకు తెలుసు. ఇతర మతాల్ని ద్వేషించాలని ఏ మతమూ చెప్పదు. కానీ... ఒక లక్ష్యంతో మిషనరీ ఏర్పాటుచేసి మతం మార్చే పనిలో పడ్డారు. దీనికి అడ్డుకట్ట వేయాల్సిందే. - సోమయాజుల త్యాగరాజ శాస్త్రి, హోమియో వైద్యుడు, విశాఖపట్నం

మళ్లీ మారాను...
కొన్నేళ్ల క్రితం నాకు బాగా జబ్బు చేసింది. మతం మారితే స్వస్థత చేకూరుతుందని ఇరుగు పొరుగు, ఆ మత పెద్దలు వచ్చి చెప్పారు. ఆరోగ్యం బాగు పడుతుందన్న ఆశతో మతం మార్చుకున్నాను. రెండేళ్లు శ్రద్ధగా ప్రార్థనలు చేశాను. అయినా, ఫలితంలేదు. దీంతో... తిరిగి మునుపటి మతంలోకి మారిపోయాను. - సత్యవతి, రాజోలు మండలం (తూర్పు గోదావరి)

మిషనరీలతో గ్రామాల్లో మార్పులు
ఒకప్పుడు డబ్బులిచ్చి మతాన్ని మార్పించే వారు. ఇప్పుడు మిషనరీల ద్వారా విద్యా, వైద్య రంగాల్లో అభివృద్ధి జరుగుతుండటంతో మత మార్పిడులు జరుగుతున్నాయి. ఇందులో ఎవరి బలవంతమూ లేదు. క్రిస్టియన్లు బైబిల్ చదివినా చర్చికి వెళ్లినా స్వస్థత చేకూరుతుందని నమ్మకం.
-జ్యోతుల క్రిస్టియన్ రాజు, ప్రధానోపాధ్యాయుడు, శ్రీకాకుళం జిల్లా

"ఎన్నాళ్లు ఇలా పేదలుగా ఉంటారు? మా మతంలోకి మారితే ఇళ్లు ఇస్తాం. అన్ని విధాలుగా బాగా చూసుకుంటాం. రండి... అని ఓ పెద్దాయన చెప్పాడు. ''ఇదీ హైదరాబాద్‌కు చెందిన రాంబాయి చెప్పిన విషయం. మతం మార్చేందుకు చేసే ప్రయత్నాల్లో ఇదొకటి! ఇలా ఇంకెన్నో!
వివరాలు రేపటి సంచికలో!

16, డిసెంబర్ 2011, శుక్రవారం

'దేవుడు' పిలిచాడు... రాష్ట్రంలో జోరుగా మత మార్పిళ్లు

10-11-2011 ఆంధ్రజ్యోతి దినపత్రిక ..


'దేవుడు' పిలిచాడు
రాష్ట్రంలో జోరుగా మత మార్పిళ్లు

హైదరాబాద్, నవంబర్ 9 : క్రైస్తవ మత వ్యాప్తికి మనదేశంలో 18 ప్రధాన సంస్థలు పనిచేస్తున్నాయి. వీటికి అనుబంధంగా మరో 45 సంస్థలున్నాయి. రాష్ట్రంలో ప్రధానంగా కృష్ణా, గుంటూరు, ప్రకాశం, ఉభయ గోదావరి, మెదక్, రంగారెడ్డి, ఆదిలాబాద్, కరీంనగర్, కడప జిల్లాలు కేంద్రంగా మత మార్పిళ్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ జిల్లాల్లో ఇప్పటికే పది శాతం మందిని మతం మార్చినట్లు ఆర్ఎస్ఎస్, వీహెచ్‌పీ వంటి హిందూ సంస్థలు చెబుతున్నాయి.

మత ప్రచార సంస్థల విషయంలో ఆంధ్రప్రదేశ్‌దే అగ్రస్థానం. మన రాష్ట్రాన్ని రెండుగా విభజించి మత ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్-1 కేంద్రంగా 29, ఆంధ్రప్రదేశ్-2లో 77 సంస్థలు పనిచేస్తున్నాయి. ఈ రెండింటికి అనుబంధంగా 205 సంస్థలు ఉన్నాయి. ఇవన్నీ పెద్ద సంస్థలు. ఇక చిన్న చిన్న సంస్థలు చాలానే ఉన్నాయి.

ఆపరేషన్ 'ఏడీ 2000'
వంద కోట్లకు పైబడిన జనాభా... ఇందులో అత్యధికులు 'అన్య మతస్థులు'! దీంతో అంతర్జాతీయ మిషనరీలు భారత్‌పై ప్రత్యేక దృష్టి సారించాయి. భారత్‌లో మిషనరీల కార్యకలాపాలను అనుసంధానిస్తూ, వాటికి అవసరమైన నిధులు అందించేందుకు 'ఏడీ 2000' అనే ప్రత్యేక ప్రాజెక్టును రూపొందించారు. 1995లో జరిగిన ఈ కార్యక్రమానికి దాదాపు 186 దేశాలకు చెందిన మత బోధకులు హాజరయ్యారు. ఇదే 'జాషువా ప్రాజెక్టు'గా పేరుపొందింది.

ఇందులో భారత్‌కు సంబంధించి మూడు ప్రత్యేకమైన వ్యూహాలు రచించారు. అవి... ప్లగ్, ప్రిమ్, నైస్. 'ప్లగ్'లో భాగంగా... ప్రతి భౌగోళిక ప్రాంతానికి అనుసంధానమవుతారు. అక్కడ నివసిం చే ప్రజల ముఖ్యంగా పట్టణాల్లోని పేదల వివరాలు సేకరిస్తారు. 'ప్రిమ్'లో భాగంగా ప్రార్థనలు, పరిశోధనలు, మత ప్రచారం, ప్రజలను సమీకరించటం వంటి కార్యకలాపాలు చేపడతారు. 'నైస్'లో మత మార్పిడుల కోసం ప్రచారకులను ఉపయోగిస్తారు. జాషువా ప్రాజెక్టులో భాగంగా అమెరికాకు చెందిన అనేక మంది వ్యూహకర్తలు భారత్‌కు వచ్చి ఇక్కడి పరిస్థితులను అధ్యయనం చేశారని నిపుణులు పేర్కొంటున్నారు.

ఈ ప్రాజెక్టు కోసం వీరు సేకరించిన సమాచార విస్తృతిని చూసి నిఘా సంస్థలే ఆశ్చర్యపోయినట్లు తెలిసింది. జాషువా మొదటి దశ పూర్తయిందని... ఇప్పుడు 'జాషువా-2' నడుస్తోందని తెలుస్తోంది. ఈ వివరాలతో 'తెహల్కా' పత్రిక తాజాగా 'టాప్ సీక్రెట్' పేరిట ఒక ప్రత్యేక పరిశోధనాత్మక కథనాన్ని ప్రచురించింది. ఒకప్పుడు క్రైస్తవ మిషనరీల కార్యకలాపాలు తీర ప్రాంతాలకు మాత్రమే పరిమితమయ్యేవి. తర్వాత డెల్టాకూ విస్తరించాయి. మిషనరీలు సేవా మార్గంలో ప్రస్థానిస్తూ అదే స్థాయిలో మతాన్నీ విస్తరిస్తున్నాయి.

రాష్ట్రాల స్థాయిలో...
మధ్యప్రదేశ్, గుజరాత్, ఒడిసా, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, జార్ఖండ్ రాష్ట్రాలు మత మార్పిడికి వ్యతిరేకంగా చట్టాలు చేశాయి. వాస్తవానికి, బ్రిటిష్ ఇండియాలో దీనిపై ఎటువంటి చట్టాలు లేవు. రాయగఢ్, ఉదయ్‌పూర్‌వంటి కొన్ని రాజ సంస్థానాలు మాత్రం మత మార్పిడికి వ్యతిరేకంగా చట్టాలు చేశాయి. స్వతంత్ర భారతంలో... 1954లో ఇండియన్ కన్వర్షన్ (రెగ్యులేషన్ అండ్ రిజిస్ట్రేషన్) బిల్లును, 1960లో బ్యాక్ వర్డ్ కమ్యూనిటీస్ (రిలిజియస్ ప్రొటెక్షన్) బిల్లు ప్రవేశపెట్టారు.

వీటికి పార్లమెంటులో తగిన మద్దతు లభించకపోవడంతో వాటిని ఉపసంహరించుకున్నారు. 1979లో ప్రతిపాదించిన మత స్వేచ్ఛ బిల్లును కూడా తర్వాత ఉపసంహరించుకున్నారు. ఇక రాష్ట్రాల విషయానికి వస్తే... ఒడిసా, మధ్యప్రదేశ్‌లు మత స్వేచ్ఛపై 1968, 1969లలో రెండు చట్టాలను చేశాయి. 1978లో అరుణాచల్ ప్రదేశ్‌లో ఈ తరహా చట్టాన్ని చేశారు. 2002లో తమిళనాడు అసెంబ్లీ కూడా బలవంతపు మత మార్పిడిని నిషేధిస్తూ చట్టం తీసుకొచ్చింది.

ం ప్రపంచవ్యాప్తంగా చర్చిలు 22,000 పత్రికలు, 1890 రేడియో, టీవీ స్టేషన్లను నడుపుతున్నాయి. ం మలేసియాలో ఉన్న హిందువులలో 75 శాతం మంది వచ్చే ఐదేళ్లలో మతం మార్చుకుంటారని ఒక అంచనా.

నేరము..శిక్ష
బలవంతంగా మత మార్పిడి చేయడం భారతీయ శిక్షా స్మృతి కింద నేరం. బలవంతపు మత మార్పిడికి పాల్పడిన వారిపై ఐపీసీ 295ఏ, 298 కింద చర్యలు తీసుకోవచ్చు. ఈ కేసుల్లో నేరం రుజువైతే దోషులకు కఠిన కారాగార శిక్ష, జరిమానా విధించవచ్చు. ఒడిసా, మధ్యప్రదేశ్ చేసిన చట్టాల ప్రకారం... చిన్నపిల్లలను, మహిళలను, ఎస్సీ, ఎస్టీలను బలవంతంగా మత మార్పిడి చేసినట్లు తేలితే వారికి శిక్షను రెట్టింపు చేయవచ్చు. ఒక మతానికి చెందిన పుణ్యక్షేత్రంలో ఇతర మతస్థులు ప్రచారం చేయడం నేరం. ఐపీసీ 153(ఎ) ప్రకారం... రెండు వర్గాల మధ్య విద్వేషాలు సృష్టించేలా ప్రసంగించినా, రెచ్చగొట్టినా చర్యలు తీసుకోవచ్చు.

ఆమె పేరు రామలక్ష్మి. సొంతవూరు శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి. భర్త రాజారావు తాగుడుకు బానిసై 12 సంవత్సరాల క్రితం చనిపోయాడు. ఇద్దరు పిల్లలను పోషించేందుకు రామలక్ష్మి నాలుగు ఇళ్లలో పాచి పని చేయడం మొదలుపెట్టింది. పిల్లలకు కడుపు నిండా తిండి పెట్టలేక... వారిని చదివించలేక సతమతమవుతున్న ఆమెను క్రైస్తవ మత ప్రచారకులు ఆకర్షించారు. 'నీ బిడ్డలను చదివిస్తాం' అన్నారు. రామలక్ష్మి... ఇప్పుడు మేరీగా మారింది. ఇద్దరు కుమారులు మిషినరీ స్కూల్‌లో చదువుతున్నారు. మేరీ అలియాస్ రామలక్ష్మి జీవితం గతంలోకంటే మెరుగుపడింది! మరి... రామలక్ష్మి మతం మారడాన్ని ఎలా తప్పు పట్టగలం? ఎక్కడుంది మూలం?

రేపటి సంచికలో...

15, డిసెంబర్ 2011, గురువారం

దయ్యాలు పిశాచాలు యోగం చేస్తాయి

దయ్యాలు పిశాచాలు యోగం చేస్తాయి



"భూమి" బల్ల పరుపుగా ఉన్నది. గుండ్రముగా ఉన్నదంటే మేము ఒప్పుకోము. ఎందుకంటే మా మత గ్రంథంలో అలాగే ఉంది" అని అడ్డంగా వాదించే క్రైస్తవ పండితుల గురించి మనకు తెలుసు. "కపిద్ధాకార భూగోళం అని మూర్ఖులు వాదిస్తారు" అని అంటారు వీరు. యోగాసనాల మీద వీరు చేసిన హేళనలలో ఒక అడుగు ముందుకు వేసి ఏమంటున్నారో చూడండి.

రోమన్ కాథలిక్ మతానికి సర్వాధికారి అయిన వాటికన్ వ్యవస్థలోని ప్రముఖుడు గాబ్రియేలు అమోర్ద్ అంటాడు కదా! "ప్రాచీన కాలం నుండి హిందువులు చేసే అన్ని యోగ ప్రక్రియలు, ఆసనాలు మొదలైనవన్నీ సైతాను ప్రేరితమైనవే కాని, అంతకుమించి ఏమీ కాదు. దయ్యాలు, పిశాచాలూ మాత్రమే యోగం అభ్యసిస్తాయి" అని. పాపం వాటికన్ ను చూస్తే అయ్యో! అనిపిస్తోంది. ఈనాడు భారతదేశంలో కంటే కూడా పాశ్చాత్య దేశాలలోనే యోగం ఎక్కువగా ఆచరించబడుతున్నది. పైగా యోగ ప్రక్రియలోని వైజ్ఞానిక సంపద చూచి యావత్ ప్రపంచం ఈర్ష్యపడుతున్న ఈ కాలంలో వాటికన్ అభిప్రాయాలు వింతగా ఉన్నాయి. "చదువ వేస్తె ఉన్న మతి పోయింది" అంటే ఇదేనేమో.

టైమ్స్ ఆఫ్ ఇండియా - 28/11/2011, పేజి 17
-ధర్మపాలుడు

12, డిసెంబర్ 2011, సోమవారం

తిరుమలలో ఏంజరుగుతోంది ఇప్పుడు?

ఇటీవల "తిరుమలకెళితే పుణ్యక్షేత్రానికి వెళ్ళినట్లు అనిపించడం లేదు. ఏదో క్లబ్బుకెళ్ళిన ఫీలింగ్ కలుగుతోం"దని చినజీయర్ గారు చేసిన వ్యాఖ్యలకి టి.టి.డి. కక్కలేకా, మింగలేకా పిసుక్కుంటోంది. పళ్ళునూఱుతోంది. ఆయనలాంటి ధర్మాచార్యులే ఒక హిందూపుణ్యక్షేత్రం మీద అడ్డగోలు వ్యాఖ్యలు చేయడమేం"టని
మండిపడుతున్నారు తప్ప తమ కింద ఎంత నలుపుందో చూసుకోవడం లేదు. ప్రధానంగా ప్రభుత్వం చేతుల్లో నిరంతర దోపిడికి గుఱవుతూ, వ్యవస్థంతా కుప్పకూలి, సరిగా పనిచేసేవాళ్లూ, నియమ నిబంధనల్ని అమలుజఱిపేవాళ్లూ ఎవఱూ లేక ఈసురోమని కునారిల్లుతోంది.

తిరుమలలో ఉన్నత అధికార స్థానాల నియామకాలన్నీ పార్టీరాజకీయాలు. ముఖ్యంగా అధికార పార్టీ. ఆ పార్టీవాళ్ళకి ఏ నియమనిబంధనలూ వర్తించవు. వాళ్ళు పోలోమని జీపులూ, వ్యాన్లూ ఎక్కి గుంపులు గుంపులుగా కొండెక్కి అక్కడ రాజకీయ వేడుకలు నిర్వహిస్తున్నారు. వాటిల్లో తాగి తందనాలాడుతున్నారు. ఆడుకుంటున్నారు. గోవిందా అని నోరారా భజించాల్సిన చోట. సోనియాకీ జై, రాహుల్ కీ జై అని అఱుస్తున్నారు. వాళ్ళని చూసి ఇతరపార్టీలవాళ్ళు కూడా అలాగే అఱుస్తున్నారు తమ తమ నాయకుల గుఱించి ! మొన్నామధ్య శివసేన గుంపొకటి మహారాష్ట్ర నుంచి వచ్చి క్యూకాంప్లెక్సుల్లో జై శివాజీ అని అఱవడం నేను కళ్ళారా చూశాను. చెవులారా విన్నాను. గోవిందనామం వినపడ్డమే కఱువైపోయింది. ఇదివఱకు దేవస్థానం బస్సు బయల్దేఱేటప్పుడైనా ప్రయాణీకులంతా "గోవిందా
గోవింద" అని నినదించేవారు. ఇప్పుడు అది కూడా మానేశారు.

భక్తుల సంఖ్య పెఱిగినాక కూడా అతికొద్ది లడ్డూ కౌంటర్లతో లాగిస్తున్నారు. వాటిల్లో సగం ఎప్పుడూ మూతపడే ఉంటాయి. ఎందుకో తెలీదు. వాటికోసం క్యూలలో నిలబడ్డ జనం సహనం నశించి ఒకఱినొకఱు తోసుకోవడం, (అదొక పవిత్ర పుణ్యక్షేత్రమని మర్చిపోయి) అమ్మనాబూతులు తిట్టుకోవడం, తన్నుకోవడం జఱుగుతోంది. టి.టి.డి. మాత్రం చిద్విలాసంగా చోద్యం చూస్తోంది.
''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''
హిందు దేవాలయాలు, సెక్యులర్ ప్రభుత్వము (అందునా హిందు వ్యతిరేకతే సెక్యులరిజం అనుకునే పార్టీల ప్రభుత్వాల) చేతుల్లో ఉన్నంత వఱకు ఇలాంటివి భరించాలి.

అసలు సెక్యులర్ ప్రభుత్వము దేవాలయాలను మానేజ్ చేయడము ఏమిటి?. ఇలాంటిది ప్రపంచములొ ఎక్కడా లేదు!.
ఇండియాలొ ఇది "కుల హిందువుల" చేతకాని తనము వల్ల సాధ్యపడింది, మఱి ఇంకేమి కాదు.

ఇప్పటికైనా హిందువులు కళ్ళు తెఱిచి, అన్ని దేవాలయాలను తమ చేతులలోకి తెచ్చుకోవాలి.
--------------------------------------------------------------------------------

నిఱుడు నేను తిరుమల వెళ్లాను /క్యూలైన్లలో గంటలసేపు నిలబెట్టారు. పసిపిల్లలు వృద్దులకు నరకమే. బ్రేక్ దర్శనాలట. "ఏమిటయ్యా ఈ విఐపీ దర్శనాలు ?" అని దగ్గరలో ఉన్న కానిస్టేబుల్ను అడిగితే, "ఎవడు విఐపీనో ఎవడు వీపీనో అర్ధమై చావటంలేదు. ఎప్పుడుపడితే అప్పుడు ఎవడుపడితే వాడు రావటం, బ్రేక్ దర్శనం అనటం, జనం మమ్మల్ని తిట్టడం మాఖర్మ" అంటూ వాపోయాడు . ఇదీ రాజకీయనాయకులు, మద్యం వ్యాపారుల చేతిలో పుణ్యస్థలాల పరిస్థితి.

11, డిసెంబర్ 2011, ఆదివారం

ఏ వినాశనానికి సూచనలు ఈ అనర్ధాలు !!!!!???

సభ్యుడు  ౧

  శ్రీశైలంలో విరిగిపడిన సహస్ర లింగేశ్వర ఆలయ రాతి శిఖరం
          -ఈనాడు
             ఎందుకిలా జరుగుతున్నాయి? జనాల తొక్కిడివల్లనా? లేక వాతావరణంలో మార్పుల
     వల్లనా?


సభ్యుడు ౨ 
       

      వినాశకాలానికి సూచనగా


సభ్యుడు  ౩  

       ఈ దేశప్రభుత్వానికి కొంతకాలం దాకా దశ బాలేదు. ఇవి శకునాలు మాత్రమే.
ముందుముందు తెలియవచ్చు అసలువిషయం.


సభ్యుడు    ౪

     శ్రీ కాళహస్తి ఆలయం లో, భక్తుల తోపులాటలో  కుమార స్వామి విగ్రహం
విరిగిపోయిందిట.  ఈ రోజు ఈనాడు లో ఒక వార్త.


సభ్యుడు  ౫

      రామ రామ! దేవతానుగ్రహం మెల్లిగా తగ్గుతోంది అని స్పష్టంగా తెలుస్తోంది!

సభ్యుడు  ౬

        సిద్దంగాఉండాలి  మనం రామనామస్మరణతో ,రాబోయే విపత్తులను ఎదుర్కొనేందుకు

సభ్యుడు  ౭

      దేవతలు మళ్లీ శంకరాచార్యుల కాలం ముందు వలె ఉగ్రరూపం దాలుస్తారేమో! మళ్లీ ఆ
శంకరులే జన్మించాల్సి వస్తుందేమో! మనం కూడా ఆయన రాక కోసం భగవద్స్మరణ
నిరంతరాయంగా చేయాల్సిందే, తప్పదు.


సభ్యుడు   ౮


     ఇ సూచనల్ని బట్టి - ప్రాకృతిక విపత్తుల కంటే సామాజిక, రాజకీయ ఉద్రికతలు
పెచ్చుమీఱి భారీయెత్తున రక్తపాతాలూ, తన్మూలకమైన జననష్టం జఱగడానికి అవకాశం
ఉంది. అలాగే కొన్ని ప్రభుత్వాలకీ, రాజ్యాంగాలకీ ఎసఱు రావడానిక్కూడా
అవకాశం ఉంది.

నిజానికి ఈ సూచనలు 2007-2008 నుంచే మొదలయ్యాయి, ఉగాదినాడూ, జనవరి 1 నాడూ
సూర్యగ్రహణాలు చోటుచేసుకోవడంతో ! ఆ తరువాత 2010 జనవరిలో తిరుమలలో
స్వామివారి గజవాహనం కట్టుతెంచుకొని మాడవీథుల్లో వెంటబడితే భక్తజన సందోహం
భయంతో పరుగులు తీశారు. ఆ తరువాత శ్రీకాళహస్తిలో రాజగోపురం కూలిపోయింది. ఆ
తరువాత చాలా గోపురాలు కూలాయి. ఇప్పుడు జఱిగినది తాజాది.

నిన్న వచ్చిన చంద్రగ్రహణం మంచిది కాదు. అది ఘాతదోషం గల గ్రహణం. జనం
జలగండాలకీ, అగ్నిప్రమాదాలకీ, విషాహారాలకీ బలై చనిపోయే అవకాశం ఉంది.
అందువల్లనే అది జఱగబోతూండగా కలకత్తాలో ఆస్పత్రిలో అగ్నిప్రమాదం జఱిగి 90
మంది పోయారు. అంతకుముందు 2008 లో అక్టోబర్ 1 న సూర్యగ్రహణం జఱగడానికి
తక్షణం ముందు, సెప్టెంబరు 30 న అనుకుంటా, వరంగల్ జిల్లా కేసముద్రం దగ్గఱ
ఒక ఎక్స్‌ప్రెస్ ట్రెయిన్‌లో మంటలు చెలరేగి ప్రయాణికులంతా చనిపోయిన సంఘటన
గుర్తుచేసుకోండి. గ్రహణాలు సామాన్యమైనవి కావు.  చాలామందికి వీటి గుఱించిన
అవగాహన లేదు. లేకపోవడంతో, అద్భుతదృశ్యం, celestial event అనుకుంటూ
అజ్ఞానంలో జీవిస్తున్నారు. మానవులు మంత్రపూర్వకమైన అగ్నిహోత్రాలతో
అగ్నిదేవుణ్ణి కనీసం అప్పుడప్పుడైనా తృప్తిపఱచకపోవడం వల్ల కూడా ఆయన ఇలా
తన దారి తాను వెతుక్కుని స్వయంపాకం చేసుకుని ఆకలి చల్లార్చుకుంటూ
ఉంటాడు.

క్షుద్రమాంత్రికులు కొత్తశక్తుల్ని సంపాదించడానికి గ్రహణకాలాన్నే
ఎందుకెంచుకుంటారో అర్థం చేసుకుంటే విషయం తెలుస్తుంది.

14, అక్టోబర్ 2011, శుక్రవారం

థాయ్ ల్యాండ్ : ఇది బౌద్ధదేశమా ? హిందూదేశమా ?

థాయ్ ల్యాండ్ - మనకు పొఱుగున బర్మా (మయన్మార్) పక్కన ఉన్న దేశం. మలేషియాతో కూడా దీనికిసరిహద్దుంది. అయితే మలేషియా ముస్లిమ్ దేశం కావడం చేత దీనికీ, దానికీ మధ్య చాలా గొడవలున్నాయి. మలేషియా తమ దేశపు దక్షిణప్రాంతంలోని ముస్లిమ్ లని మచ్చిక చేసుకొని వాళ్ళని టెఱ్ఱరిస్టులుగా మార్చి తమ మీదికి పంపుతున్నదని థాయ్ ల్యాండ్ చాలా రోజులనుంచి ఆరోపిస్తున్నది. ఇది ఆసియాఖండంలో విదేశీ పరిపాలనని ఎప్పుడూ చవిచూసి ఎఱుగని అరుదైన దేశాల్లో ఒకటి. విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెట్టింపు ఉండే ఈ దేశంలో జనాభా ఆఱున్నఱకోట్లు మాత్రమే. ప్రస్తుతం ఆ దేశాన్ని పరిపాలిస్తున్న చక్రవర్తి శ్రీ భూమిబల్ అతుల్యతేజ(జ్) భారతీయ క్షత్త్రియవంశానికి చెందినవాడు. నేపాల్ రాజవంశం రాజా బీరేంద్ర బిక్రమ్ షహా తో అంతరించి పోయాక బహుశా ఈయనొక్కడే ఇప్పుడీ కలియుగంలో భూమండలం మీద మిగిలిన ఏకైక క్షత్త్రియరాజు. ఆయన బహుచిన్నతనం నుంచి అంటే 1945 నుంచి రాజుగానే ఉన్నాడు.



ఇక్కడ విచిత్రమేంటంటే రాజు హిందువు. ప్రజలేమో బౌద్ధులు. కానీ థాయ్ రాజబిరుదాల్లో ఆయన్ని థేరవాద బుద్ధధర్మ పరిరక్షకుడని చదువుతారు. (చిఱు వివరణ :- థేరవాదం అంటే బుద్ధుణ్ణి దేవుడుగా కాక గురువుగా మాత్రమే భావించే బౌద్ధశాఖ. మన ఆంధ్రదేశంలో ఒకప్పుడు నాగార్జునుడు బోధించిన మహాయాన బౌద్ధానికి ఇది కొంచెం విరుద్ధంఅన్నమాట. మహాయానంలో బుద్ధుణ్ణి దేవుడుగా కొలుస్తారు)


అయితే రాజు చాలా విషయాల్లో బౌద్ధాన్ని అనుసరించడు. అందుచేత తనకోసం ప్రత్యేకంగా ఒక హిందూబ్రాహ్మణ్ణి రాజగురువుగా పెట్టుకున్నాడు. ప్రస్తుత రాజగురువు పేరు ఫారా రాజగురు వామదేవముని. అలాగే సలహాలివ్వడానికి ఆయనకొక రాయల్ కౌన్సిల్ ఉంది. అందులో ఏడుగురు భారతీయ బ్రాహ్మలున్నారు. వాళ్ళ పూర్వీకులు కూడా రాజుగారి పూర్వీకుల మాదిరే ఏ కాలంలోనో భారతదేశం నుంచి వలసపోయినవాళ్ళు. స్థానిక థాయ్ ఆడవాళ్ళని చేసుకోవడం వల్ల ఇప్పుడు వాళ్ళ ముఖకవళికలు భారతీయుల్లా అనిపించవు. ఇప్పుడు వాళ్ళందఱికీ థాయ్ భాషే మాతృభాష. ఈ థాయ్ భాష అక్షరాలు ప్రాచీన దాక్షిణాత్యబ్రాహ్మి (అంటే ఇప్పటి తమిళలిపికి దగ్గఱ) నుంచి ఉద్భవించాయట.



థాయ్ ల్యాండ్ లో తొంభై అయిదుశాతం మంది బౌద్ధులుగా నమోదయ్యారు. అయిదుశాతం మంది మాత్రమేబౌద్ధేతరులు. అందులో కేవలం ఒక లక్ష జనాభా గల హిందువులు కూడా ఉన్నారు. ఈ హిందువుల్లో ఎక్కువమంది ఇటీవలి శతాబ్దాల్లో భారతదేశం నుంచి అక్కడికి వలసపోయినవాళ్ళే. వీళ్ళు వలసపోవడానికి ముందే ఆ దేశంలో శివాలయాలూ, బ్రహ్మాలయాలూ, విష్ణ్వాలయాలూ, విఘ్నేశ్వరుడి ఆలయాలూ వేలాదిగా ఉన్నాయంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. వాటిల్లో పెక్కు ఆలయాలు ఈమధ్య కట్టినవి కావు. చాలా ప్రాచీనమైనవి. కట్టించినది భారతీయులు కారు. థాయ్ వాసులే. కొన్నైతే రాజుగారే ప్రత్యేక గ్రాంట్లు మంజూరు చేసి మఱీ కట్టించాడు. ఎటొచ్చీ, ఇక్కడొక తమాషా ఉంది. బౌద్ధంలోంచే హిందూమతం ప్రభవించిందని ఎక్కువమంది థాయ్ వాసులు నమ్ముతారు. ఇదొక అమాయక నమ్మకమే తప్ప ఇందులో మనల్ని (భారతీయుల్ని) అవమానించేదేమీ లేదు. ఎందుకంటే తాము అవలంబిస్తున్న హిందూమతాన్ని ఇండియా అనే ఒక పొఱుగుదేశంలో కూడా అవలంబిస్తారని బాగా చదువుకున్నవాళ్ళకి తప్ప సామాన్య థాయ్ పౌరులకి తెలీదు.



థాయ్ బౌద్ధ భక్తుల ద్వారా ఈ దేవాలయాలకి భారీగా ఆదాయలొచ్చిపడుతున్నాయి. కారణం ఏంటంటే - థాయ్ ప్రజలు వేదాంతంలో బౌద్ధాన్ని, లౌకిక జీవితంలో హిందూమతాన్ని అవలంబిస్తారు. ఉదాహరణకి - బౌద్ధంలో సన్న్యాసం తప్ప వేఱే ఆశ్రమం లేదు. కనుక పెళ్ళిళ్ళూ పేరంటాలూ, గృహప్రవేశాలూ గట్రా కర్మతంత్రాలకి హిందూ ఆచరణలు చేస్తారు. అలాగే కోరికల కోసం మొక్కుకోవడానికి హిందూ దేవాలయాలకి వెళతారు. బుద్ధుడు కోరికలు తీర్చడని వారి అభిప్రాయమట. అలా అక్కడ అడుగడుగునా బుద్ధుడికీ, హిందూ దేవతలకీ సమాన ప్రతిపత్తి చాలకాలంనుంచి కొనసాగుతున్నది. ప్రస్తుతం ఆ దేశంలోని మతపరిస్థితుల మీద ఒక విపులమైన వ్యాసాన్ని ఈ క్రింది లంకెమీద నొక్కి చదవొచ్చు.

http://www.hinduismtoday.com/modules/smartsection/item.php?itemid=3760


మఱికొన్ని ఛాయాచిత్రాలు ఈ క్రింద:






భగవంతుడు మన మీద ఆగ్రహిస్తే ఏంచేయాలి ?

సాధారణంగా భగవంతుడికి ఎవరి మీదా ఆగ్రహం కలగదు. ఆయన ఒక తెలివైన కర్మయంత్రాన్ని నిర్మించి ఉన్నాడు. ఆ కర్మయంత్రమే తానై ఉన్నాడు. కనుక మనుషుల దోషాలకి వారిని వాటినుంచి పరిశుద్ధుల్ని చేసే పనిని ఆ యంత్రమే తెలివిగా చేసుకుంటూ పోతుంది. దాని పనిలో ఆయన జోక్యం చేసుకోవడం అరుదు. అయితే తత్కారణం చేత ఆయనకి కామక్రోధాలు లేవని తలచడం సరికాదు. కోపించక పోవడం వేఱు. కోపమే లేకపోవడం వేఱు. సృష్టిఉన్నంతకాలం ఆయన సగుణ పరబ్రహ్మగానే ఉంటాడు. కనుక ఆ స్థితిలో ఆయనకి మాయామయమైన మనస్సు ఉంటుంది. అది ఉంటుంది కనుక కామక్రోధాలూ ఉంటాయి. కల్పాంతంలో సృష్టి అంతమయ్యాక ఆయన నిర్గుణ పరబ్రహ్మగా ఉంటాడు. అప్పుడాయనకి కామక్రోధాలు ఉండవు. మఱి సృష్టి ఉన్నప్పుడు ఆయన ఎందుకలా ? అనడిగితే, సృష్టి నడవాలంటే కామక్రోధాలుండాలి. నీ తండ్రిలో లేనిదేదీ నీలో లేదు. నీ తండ్రికి కామక్రోధాలుంటేనే నీకూ కామక్రోధాలుంటాయి. ఈ సత్యానికి హిందూమతమే కాక అన్ని మతాలూ సాక్ష్యం పలుకుతున్నాయి. "యెహోవా అను పేరుగల నేను మిక్కిలి రోషము గల దేవుడను" అని ఆయన అన్నట్లు యూదుల మతగ్రంథం పేర్కొంటోంది. ఇస్లామ్ కూడా దైవాగ్రహం (wrath of God) గుఱించి ప్రస్తావిస్తుంది. శ్రీపాద శ్రీవల్లభ చరిత్రలో భగవంతుడిలా చెప్పారు : "అవధూతది సంకల్పరహితమైన జ్ఞానం. నాది సంకల్పసహితమైన జ్ఞానం. నేను తల్చుకుంటే మోక్షం పొంది నాలో లీనమైనవాణ్ణైనా సరే, భూలోకంలో జన్మించమని ఆదేశించగలను."

దేవుడు మనలాంటివాడు కాదు గనుక ఆయనకి కామం లేదనీ, క్రోధం లేదనీ ఆయనెప్పుడూ చిఱునవ్వులు చిందిస్తూనే ఉంటాడనీ, మనమెన్ని వెధవపనులు చేసినా, ఎన్నిసార్లు చేసినా క్షమిస్తూ పోవడమే తప్ప ఆయనకి వేఱే పని లేదనీ - ఈ రకమైన అడ్డదిడ్డమైన, అవాస్తవిక పచ్చి అబద్ధాలు, దగాకోరు సిద్ధాంతాలు - కేవలం తమ మతప్రచారం, మతమార్పిళ్ళ కోసం కొందఱు కనిపెట్టినవి. ప్రపంచంలో పాపాత్ములెక్కువ కనుక వాళ్ళకి ఈ సిద్ధాంతాలు బాగా నచ్చుతాయని వాళ్ళకి తెలుసు. ఇవి తమ పాపాల్ని తామే క్షమించేసుకునే హక్కుని మానవులకి కట్టబెట్టాయి. వీటి ప్రచార ప్రభావానికి హిందువులు కూడా లోనై తమ మతగ్రంథాలు భగవంతుడి సంపూర్ణ మూర్తిమత్త్వాన్ని గుఱించి చేసిన వర్ణనల్ని మర్చిపోతున్నారు. మర్చిపోయారు. శివుడు సంభోగించడమేమిటంటున్నారు. కృష్ణుడు దేవుడైతే ఆయనకి గోపికలతో రాసలీలలేంటంటున్నారు. ఇదంతా విదేశీ మతసిద్ధాంతాల ప్రభావం.

భగవంతుడిలో దివ్యాంశలూ ఉన్నాయి. రాక్షసాంశలూ ఉన్నాయి. మంచీ ఆయనదే, చెడూ ఆయనదే. అయితే పామువిషం పాముకి బాధాకరం కానట్లే భగవంతుడి మాయాశక్తికి సంబంధించిన ఈ అంశల వల్ల ఆయనకి మాత్రం ఏ నష్టమూ లేదు. కానీ ఇవి మనలాంటి జీవుల అదుపాజ్ఞల్లో ఉన్న అంశలు కావు కనుక, ప్రస్తుతం మనమే వాటి అదుపాజ్ఞల్లో ఉన్నాం కనుక వీటి నాశ్రయించడం వల్ల మనకి నష్టం ఉంది - ఇదే హిందూమత సారాంశం. ఇందాక అనుకున్నట్లు భగవంతుడికి నిజంగా నిజమైన కోపం వచ్చేసందర్భాలు మహా అరుదు, అపురూపం. కారణం - సాధారణంగా మనం మనలాంటివాళ్ళ మీదా మన స్థాయిలో ఉన్నవాళ్ళ మీదా మాత్రమే కోపిస్తాం (కోపించగలం) తప్ప తద్భిన్నులైనవారియందు కోపించడం జఱగదు. పెళ్ళాం మీద కోపమొస్తుంది గానీ బాస్ మీద రాదు. మనమేంటో మన స్థాయి ఏంటో, మన పూర్వజన్మకర్మ ఏంటో, భవిష్యద్‍గతి ఏంటో అంతా ఆయనకి కూలంకషంగా తెలుసు కనుక ఆయనకి కోపం రాదు. ఒకవేళ వచ్చినా అది వాచా వ్యక్తీకరించబడక సంఘటనల రూపంలో వెల్లడవుతుందంతే ! దేవుడు కనిపించి కోపంగా మాట్లాడాడంటే మాత్రం ఆ వ్యక్తిమీద ఆయనకి విశేషమైన అనుగ్రహం ఉందనీ, అతన్ని మరమ్మత్తు చేసి అతని ద్వారా ఏదో లోకకల్యాణాన్ని సాధించదల్చుకున్నాడనీ అర్థం.

భగవంతుడికి తనమీద కోపం వచ్చిందని భావించిన భక్తుడు భగవంతుని అప్రమాద్యత (infallibility) పట్లా, న్యాయబుద్ధి (sense of justice) పట్లా అచంచల విశ్వాసాన్ని ఉంచాలి. కోపంలో సైతం ఆయన న్యాయంగానే వ్యవహరిస్తాడనీ, జీవుల్ని దయగానే చూస్తాడనీ నమ్మాలి. ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసి, "హే భగవాన్ ! నేను అల్పుణ్ణి. నీవు మహోన్నతుడివి. నువ్వు జ్ఞానసముద్రానివి. నేను మూఢుణ్ణి. నేను జీవుణ్ణి,. నువ్వు పరమాత్ముడివి. తప్పులు చేయడమే నాకు సహజం. నా తప్పుల పట్ల కోపించడం నీకు సహజం. నీ మందలింపులకీ, దండనకీ నేనెల్లప్పుడూ పాత్రుణ్ణే. నా బుద్ధిహీనత వల్లా, పూర్వ దుస్సంస్కారాల ప్రాబల్యం వల్లా నేను పొఱపాటు చేశాను. ఇంకెప్పుడూ ఇలా చేయను. నీ ఆదేశానుసారమే చరించి నీకు ప్రియతముణ్ణి కావడానికే ప్రయత్నిస్తాను. నన్ను క్షమించు. నేను నీ బిడ్డని. నీ దాసానుదాసుణ్ణి" అని సర్వస్యశరణాగతి చేసి స్తోత్రం చేయాలి. అప్పుడాయన సంతోషించి ప్రసన్నుడై సరైన దారి చూపుతాడు.

4, అక్టోబర్ 2011, మంగళవారం

తపోవనాల పునరుద్ధరణ

ప్రాచీనకాలంలో ఆధ్యాత్మిక జీవనానికి అంకితం కాదల్చుకున్నవారు గ్రామాల్నీ, నగరాల్నీ, పట్టణాల్నీ వదిలిపెట్టి తపోవనాలనబడే ప్రత్యేక ప్రదేశాలకి వెళ్ళేవారు. వాటి ప్రస్తావనని ఈ కాలంవారు సాధారణ అడవులుగా అర్థం చేసుకుంటున్నారు. కానీ అవి సాధారణ అడవులు కావు. వాటికి రాజుల (ప్రభుత్వం) నుంచి ప్రత్యేక రక్షణ ఉండేది. వాటిల్లో క్రూరమృగాలూ అవీ తిరక్కుండా రాజులు ఏర్పాట్లు చేసేవారు. విదేశీ దండయాత్రలూ, పాలనా ఆరంభమయ్యాక తపోవనాల పరిభావన అంతరించిపోయింది. ఈ సంప్రదాయాన్ని ఆధునికకాలంలో పునరుద్ధరించడం అవసరం. తమలాంటివారి సత్సంగంలో ఆధ్యాత్మిక జీవనం మఱింత ఆనందదాయకంగా, ఏకాగ్రంగా ఉంటుంది.


ఈ రోజుల్లో కూడా కొంతమందికి నగరాల రణగొణధ్వనికీ, నాగరికుల కుళ్ళుకూ, డబ్బుకుత్సితాలకూ దూరంగా, ప్రశాంతంగా, ఒంటరిగా ఆధ్యాత్మిక జీవితాన్ని గడపాలని ఉంటుంది. కానీ ఆ కోరిక తామొక్కఱే ఎలా తీర్చుకోగలరో తెలీక యథాపూర్వంగా మిగుల్తూంటారు. అందుచేత వ్యక్తిగతంగా కాకుండా అందఱమూ కలిసి ఒక సామూహిక కార్యక్రమంగా పూనుకొని ఇలాంటివారి కోసం కనీస సౌకర్యాలతో తపోవనాల్ని ఏర్పాటు చేస్తే బావుంటుంది. ఇవి వృద్ధాశ్రమాలుగా కూడా ఉపయోగపడతాయి. వీటికి వ్యాసారణ్యం, వసిష్ఠాశ్రమం, వైశంపాయనం లాంటి సాంప్రదాయిక నామాలు పెట్టుకోవాలి.


నా ఆలోచనలు వ్రాస్తున్నాను. తేలిగ్గా తీసుకోకుండా, కొట్టిపారేయకుండా పరిశీలించగలరు.


౧. ఎక్కడైనా ఒక గ్రామీణ/ గిరిజన ప్రాంతంలో ఒక చిన్న పట్టణానికి గరిష్ఠంగా 40 కి.మీ.ల దూరంలో ఒక వందెకరాల స్థలాన్ని సేకరించాలి.


౨. ఆ స్థలం చుట్టూ ఎత్తైన ప్రహరీ గోడ కట్టాలి.


౩. లోపల దేన్నీ చదును చేయనక్కఱలేదు. అలాగే వదిలేసి మంచి నీడనిచ్చే చెట్లూ, ఫలపుష్పవృక్షాలూ పెంచాలి.


౪. చిన్నాపెద్దా మట్టిరోడ్లు వేయాలి.


౫. మూడే మూడు గదులు గల కాటేజీ కట్టడాలు, కేవలం రెండు అంతస్తులవి సుమారు 100 - 200 దాకా నిర్మించాలి.


౬. ప్రతి కాటేజికి నీరు, విద్యుత్తు, ల్యాండ్‌లైన్ టెలిఫోను సౌకర్యాలు మాత్రం కల్పించాలి.


౭. తపోవనంలో శాశ్వత సభ్యత్వానికి దరఖాస్తు చేసుకున్న ప్రతి హిందువూ/ ప్రతి హిందూ జంటా రు. ఇంత అని రుసుము పెట్టాలి. అది 4 వాయిదాల్లో 6 సంవత్సరాల లోపల చెల్లించమని కోరాలి. ఇహ నెలవారీ కట్టేది ఏమీ ఉండ(కూడ)దు. ఇది మొదటి 20 ఏళ్ళలోపల 50% మాత్రమే ప్రతిదాతవ్యం (refundable). 20 ఏళ్ళు గడిచాక 25% శాతం మాత్రమే ప్రతిదాతవ్యం.


౮. రుసుము కట్టినంత మాత్రాన కాటేజీలు సభ్యుల ఆస్తులు కావు. అవి తపోవనం ఆస్తులే. వారి మరణానంతరం అవి ఇతరులకి కేటాయించబడతాయి.


౯. 45 ఏళ్ళలోపువారికి తపోవనంలో సభ్యత్వం లేదా వాస్తవ్యహోదా ఇవ్వకూడదు. వారు సభ్యుల కుటుంబసభ్యులైనా సరే ! ఒక్కొక్క కాటేజికి గరిష్ఠంగా నలుగుఱు వాస్తవ్యుల్ని అనుమతించవచ్చు. ఎవఱి తిండి, బట్ట, వైద్యం లాంటి నిర్వహణ ఖర్చులు వారివే. తపోవనం బాధ్యత తీసుకోదు.


౧౦. తపోవనానికి ఒక కార్యాలయం, ఒక గ్రంథాలయం, ఒక దుకాణ సముదాయం, ఒక కమ్యూనిటీ సెంటర్, ఒక వైద్యశాల, ఒక ఆడిటోరియమ్ ఉండాలి.


౧౧. తపోవనం కేంపస్ లో హోటళ్ళనీ, లాడ్జింగుల్నీ, విందు-వినోదాల కేంద్రాల్నీ, వ్యాపార కేంద్రాల్నీ, స్కూళ్ళనీ, కాలేజీలనీ, గోడౌన్లనీ అనుమతించకూడదు.


౧౨. తపోవనంలో 5 - 10 హిందూ దేవాలయాలు ఉండాలి. ఇతర మతాల ప్రార్థనామందిరాల్ని అనుమతించకూడదు.


౧౩. ఇదంతా ఒక ఆధ్యాత్మిక ప్రయోజనం కోసం కనుక కాటేజిలకి బాహ్యప్రపంచంతో సంబంధం కల్పించే టివి., రేడియో, సెల్‌ఫోను, అంతర్జాలం, దినపత్రిక లాంటి సౌకర్యాల్ని నిషేధించాలి. కావాల్సినవారు తపోవనం కమ్యూనిటీ సెంటర్ కి వెళ్ళి వాటిని ఉపయోగించుకోవచ్చు,


౧౪. కాటేజివాసులు సొంత కంప్యూటరు, ప్రింటరు, గ్యాస్ బండ, గీజరు, ఐరన్, సి.డి.ప్లేయరు, డి.వి.డి. ప్లేయరు, క్యామరా, రిఫ్రిజిరేటరు, మిక్సీ లాంటివి పెట్టుకుని వాడుకోవచ్చు.


౧౫. సొంత సైకిళ్ళకి తప్ప ఏ విధమైన పెట్రోలు/ డీసెలు వాహనాలకీ కేంపస్ లో అనుమతి ఇవ్వకూడదు. కావాల్సినవారు తపోవనం బస్సులో సమీప పట్టణానికి వెళ్ళి పనులు చూసుకొని రావచ్చు.


౧౬. సభ్యులు అన్నిరకాల లౌకిక మఱియు ధనసంపాదన కార్యకలాపాల నుంచి formal గా విరమించుకున్నవారై ఉండాలి. కేంపస్ లో ఉంటూ పుస్తకాలు వ్రాయడం, ముద్రించడం, అమ్మడం, ఉపన్యాసాలివ్వడం తప్ప ఇంక ఏ విధమైన లాభసాటి ఉద్యోగ, వ్యాపార కార్యకలాపాల్నీ సాగించకూడదు.

30, సెప్టెంబర్ 2011, శుక్రవారం

ఇతరమతాల నుంచి, మతస్థుల నుంచి హిందువులం ఏమేం నేర్చుకోవచ్చు ?

ఒక సభ్యుడు చేసిన వినతి

ఆర్యులారా !

హిందువులమైన మనం మన ధర్మాన్ని మన వఱకూ ఆచరించడంతో సంతృప్తి చెందుతూంటాం.అందువల్ల ఇతరులకి (కనీసం మన ధర్మంలోనే కొనసాగుతూ ఉన్న నిమ్నజాతులవారికి) ఈ ధర్మనిగూఢాల్ని బోధపఱిచే ప్రయత్నం మనమెప్పుడూ చేయలేదు. నిజానికి ఈధర్మం పురోహితుల చేతుల్లో బందీగా మారింది. ఇలాంటి సామాజిక, మానసిక కారణాల్ని పురస్కరించుకొని ఈ ధర్మం గతకొన్ని దశాబ్దాలుగా దెబ్బదినిపోతోంది. మన ఇంట్లో సాక్షాత్తూ అమృతమే ఉన్నప్పటికీ దాన్తో మనం నిమ్నజాతీయుల హృదయ, ఆత్మిక ఆకలిని మనం తీర్చలేకపోవడంతో వారు బయటికెళ్ళి పరధర్మపు చలివేంద్రాల్లో మంచినీళ్ళు తాగుతున్నారు. తాగి అది అమృతంలా ఉందని చెబుతున్నారు.

మనం పరధర్మీయుల చేతుల్లో ఎక్కడ వ్యూహాత్మక ఓటమిని పొందుతున్నాం ? హైందవం ఇవ్వజూపని ఏ వెసులుబాట్లని, feel good factors ని పరధర్మం ఇవ్వజూపగలుగుతోంది ? ధన/ ద్రవ్య ప్రలోభాలు కూడా ఉన్నాయని మనకి ఇదివఱకే తెలుసు. అవి కాకుండా ఇంకా ఏయే అంశాలున్నాయి ? వారి నుంచి మనం ఏమేం నేర్చుకొని వారిలాగే మన మతాన్ని కూడా అంతర్జాతీయ మతంగా మార్చగలుగుతాం ? ఎప్పటిలా పరమతాల్ని ద్వేషభావనతో చూడకుండా, కాస్త తెఱుపుడు మనస్సు (open mind) తో మన మతస్వార్థం కోసమే, వారిలోని మంచిని కాసేపు పరిశీలించి వెలికి తీద్దాం. కాసేపు పక్కా వాస్తవవాదులం అవుదాం. ఆత్మకరుణ (self-pity) లేని కఠిన కర్కశ తార్కికులమవుదాం. ఆత్మవిమర్శకులమవుదాం. ఈ మార్గంలో మీ మీ చింతనాధారని ఇక్కడ పంచుకోగలరని ప్రార్థన.

అందుకు ఇతర సభ్యుల సమాధానాలు :

ఒక సభ్యుడు : 1. క్రైస్తవం లేదా ఇస్లాం నుంచీ మనం నేర్చుకోవాల్సింది సామూహిక చింతన.కిరస్తానీలు, ముస్లింలు ప్రతీ వారం చర్చిలకు మసీదులకు గుంపులుగా వెళతారు.. మనలోఎంతమంది గుడికి వెళ్ళేటప్పుడు కనీసం మన ఇంట్లో వాళ్ళను తీసుకుని వెళతాం ?? అలా గుంపుగా వెళ్ళడం వల్ల వాళ్ళ మధ్య ఒక బలమైన బంధం ఏర్పడుతుంది.. ప్రతీ ఒక్కరికీ తమకంటూ ఎవరో ఉన్నారు అనే భావన, ఆ ఉన్న వాళ్ళు కేవలం తమ మతం వల్ల మాత్రమే ఉన్నారు అనిపిస్తుంది.. సంఘజీవి అయిన మనిషికి ఇది సహజంగానే మానసికధైర్యాన్ని ఇస్తుంది.

2. వాళ్ళనుంచీ నేర్చుకోవాల్సింది వాళ్ళ మతం పట్ల వాళ్ళకున్న అంకిత భావం.. ఒక ముస్లిం కు ఎన్ని పనులున్నా వాడు నమాజ్ చేయకుండా బయటికి కదలడు.. మనం మాత్రం ఏదైనా పని తగిలితే మొదట మానేసేది మన పూజా కార్యక్రమాలనే.. వాళ్ళు ఎప్పుడూ నమాజ్ చేయడం గురించి లేదా చర్చికి వెళ్ళడం గురించి సిగ్గు పడరు.. మనకేమో గుడికివెల్తున్నామంటే, ధ్యానం చేస్తున్నామంటే అదొక నామోషీగా భావిస్తాం.

3. ముస్లింలు, కిరస్తానీలు సొంతంగా వ్యాపారాలు ఎక్కువగా చేస్తున్నారు. మనవాళ్ళు ఉద్యోగాలు చెయ్యడానికి ఆసక్తి చూపుతున్నారు.. ఎంత చిన్నదైనా సరే సొంతంగా చేసే వ్యాపారం సమాజం లో ఎంతో కొంత పరపతిని పెంచుతుంది.. ఎందుకంటేవ్యాపారం చేస్తున్న వాడి దగ్గరికి ఒక రాజకీయ నాయకుడు వచ్చి పార్టీ చందా అడుగుతాడు, లేబర్ యూనియన్ల వాళ్ళు వచ్చి చందాలడుగుతారు.. మనం కూడా entrepreneurs గా మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఉదా:- కర్నూల్ పుల్లా రెడ్డి గారు పక్కా హిందుత్వవాది కానీ ఆయన్ను విమర్శించే ధైర్యం ఎవరికీ లేకపోయింది.. ఎందుకంటే సమాజం లో ఆయన విలువ అలాంటిది.. అదే ఇంకెవరైనా అయ్యుంటే మన కమ్యూనిష్టులు, సెక్యులరిస్టులు, మట్టిస్టులు, మశానిస్టులు ఎప్పుడు ఆయన వ్యక్తిత్వ హననానికి పాల్పడేవారు.

మఱో సభ్యుడు : నాకున్న కొద్దిపాటి అనుభవంతో నా అభిప్రాయాలు కొన్ని పంచుకుంటాను.

1. క్రైస్తవం లేదా ఇస్లాం నుంచీ మనం నేర్చుకోవాల్సింది సామూహిక చింతన.

నాకు ఇది సెకండరీ అని అనిపిస్తుంది. వాళ్ళు మతం మారడానికి ముఖ్యకారణం డబ్బే. వాళ్ళు ఒక సారి మారిన తర్వాత ప్రతి ఆదివారం ప్రార్థనామందిరానికి రావాలనీ, వాళ్ళ సామూహిక ప్రార్ధనలలో పాల్గోవాలనీ వారిని బలవంత పెడుతుంటారు. పేదరికం కారణంగా ముందు మతం మారినా, తర్వాత ఇష్టం లేకున్నా వారు తప్పనిసరిగా ఆ మత నియమాలను పాటించాల్సిందే. అలాగే ఎవరైనా కొత్తవారిని వారి మతంలోకి తీసుకువస్తే అలా తీసుకు వచ్చిన వారికి కొంత డబ్బు ఇస్తారు.

వినాయక చవితి నాడు మాత్రం మన వాళ్ళు పూజ అయ్యాక సినిమా పాటలు పెడతారు. అక్కడికి వెళ్ళి చూస్తే చిన్న పిల్లలు కేరమ్స్ ఆడుకుంటూ కనిపించారు. పెద్దవాళ్ళంతా ఎవరి పనులలో వాళ్ళు వెళ్ళిపోయారు. చిన్న పిల్లలు వాళ్ళకి నచ్చిన పాటలు వాళ్ళు పెట్టుకున్నారు. ఈ పరిస్థితి మారాలి. మనమంతా తప్పని సరిగా దేవతా స్త్రొత్రాలనో, ఆధ్యాత్మిక ప్రసంగాలనో, పూజ్యుల ప్రవచనాలనో ఇలాంటి సంధర్భాలలో పెట్టేటట్లుగా చూడాలి. వీలైతే మనమే ప్రతిరోజు కొంత సమయం కేటాయించి మన ఇరుగుపొరుగులో ఉన్న చిన్నపిల్లలకు, పెద్దవాళ్ళకు, మన మత గొప్పతనాన్ని వివరించాలి మన ఆచార వ్యవహారాల ప్రాముఖ్యత అందరికీ తెలియజెప్పాలి. వారితో కలిసి కనీసం వారానికి ఒక సారైనా ఇంట్లో కూర్చొని పూజ చేయడం గానీ, దేవాలయానికి వెళ్ళడం కానీ చేయాలి చేయాలి.

వినతి చేసిన సభ్యుడు : నా దృష్టికొచ్చిన ఒకటి-రెండు అంశాలు వ్రాస్తాను.

౧. వారి మతబోధ క్లిష్టమైన వేదాంత సమస్యల చుట్టూ, లోతైన అంతరార్థాల చుట్టూ కాకుండా నిత్యజీవితానికి పనికొచ్చే బైబిలుబోధల చుట్టూ పరిభ్రమిస్తుంది. మనదేమో పక్కా intellectual religion అయికూర్చుంది. ఆ వ్యాఖ్యానాలూ, వివరణలూ కొద్దిమంది వయసుమళ్ళిన ఛాందస మేధావులకి ఆత్మానంద దాయకం. కానీ వినలేకా, అర్థం చేసుకోలేకా మిహతా సామాన్యజనం విసిగున్నారు.

౨. వారి మతబోధలో పరమత దూషణ, పరధర్మీయుల్ని పరాభవించడం, అపహాస్యం చేయడం, హీనంగా మాట్లాడడం కూడా ఉంటాయి. ఈ పనులు మన మతబోధకులు కలలో కూడా చేయరు.

౩. వారి మతగ్రంథాలూ, పాటలూ, స్తోత్రాలూ, మంత్రాలూ (అవి మంత్రాలని మనం అనుకుంటే) జనసామాన్య భాషలోనే ఉంటాయి. అందఱికీ అర్థమయ్యేలా ఉంటుంది యావత్తు మతనిర్వహణ. మనదంతా నిగూఢం. అయోమయం, రహస్యం. ఎంత అర్థం కాకపోతే అంత గొప్ప. చివఱికి ఈ అర్థం కానితనమే మనలో ఒక సంస్కృతిగా పరిణమించింది.

౪. వారిలో - ప్రార్థనామందిరాలకొచ్చే భక్తుల ఆర్థిక సమస్యల్ని కూడా మతగురువులు పట్టించుకుంటారు. ఉదాహరణకి - పేద భక్తుల కోసం హోల్‌సేల్ వ్యాపారులతో ఒక ఒప్పందానికొచ్చి తక్కువధరలకి కిరాణా సరుకుల వేలాన్ని ప్రార్థనామందిరంలోనే నెలకోసారి నిర్వహిస్తారు. మన విషయానికొస్తే, భక్తుల దగ్గఱ ఎంత గుంజుకుందామా ? అనేదే మన కాన్సంట్రేషను.ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. గుర్తుకొచ్చినప్పుడు వ్రాస్తాను.

మొత్తమ్మీద మన మతాన్ని ఒక అంతర్జాతీయ మతంగా, దేశదేశాల ఫెయిత్‌‍గా ఎలా రూపుదిద్దాలా ? అనేదే నా అంతర్మథనం. అలా చేయాలంటే మనం కొన్ని ఛాందసాల్ని వదిలిపెట్టాలనుకుంటాను. ఈ మతాన్ని ఈ దేశంలో పాటిస్తున్నట్లే యథాతథంగా అన్ని ఇతరదేశాల్లోనూ పాటించడం కుదరకపోవచ్చు. కనుక దీన్ని సాధ్యమైనంత అసంస్కృతీకరించి, సరళీకరించి ప్రచారం చేయాల్సి ఉంది. వాళ్ళ అవగాహన కోసం మన వివరణా, వ్యాఖ్యాన పద్ధతుల్ని కాస్త మార్చాలి. పురాణమతాన్ని చాలావఱకు గోప్యం చేయాలి.

వేఱొక సభ్యుడు :-

౧. మత ప్రచారానికి కావాల్సిన మానవ వనరులు సంపాదించుట.ఇది వారు చేసే మొదటి పని. అందుకే పేదలు, అనాథలు అంటూ కొన్ని తరాల పాటు మతానికి కావాల్సిన మానవ వనరులను సంపాదిస్తారు. తరువాత ముసుగులన్నీ తొలగించి పూర్తి మతాంతరీకరణ వైపు జరుపుతారు. ఇలా చేయటం కోసం అప్పటికే ఉన్న మానవీయ కేంద్రాలను నాశనం చేయటం, నేరుగానో, తిరగగానో. అందుచేత ఆర్థికంగా బలంగా ఉండటం. ఇది అన్నింటికంటే ముఖ్యమైనది.

౨. పిడుక్కీ బియ్యానికీ ఒకటే మంత్రం వాడకపోవటం. ఉదాహరణకు జర్మనులు ఒక రకంగా మతాంతరీకరించబడ్డారు, రోమన్లు ఒక రకంగా, ఆఫ్రికన్లు ఒక రకంగా, రెడ్ ఇండియన్లు ఒక రకంగా, దక్షిణ అమెరికన్లు ఒక రకంగా, గోవా వారు ఒక రకంగా, కేరళ వారు ఒక రకంగా.

౩. ప్రణాళికాబద్దంగా పోవటం.

౪. ఓపిగ్గా దశాబ్దాలు, శతాబ్దాలు ప్రయత్నించటం.

౫. కేంద్రీకరించబడ్డ వ్యవస్థ ఉండటం.

ఇంకో సందర్భంలో ఇంకో సభ్యుడు చెప్పినది :


బాగా చెప్పారు. అసలుకీలకం ఆ చివఱి పాయింటులోనే ఉంది.


హైందవేతర ప్రార్థనాస్థలాల్లో రాజకీయాలూ, సామాజికాలూ మాట్లాడ్డం నిషిద్ధం కాదు. అసలుదేవుణ్ణొదిలేసి అవే ఎక్కువగా చర్చిస్తూంటారక్కడ. కానీ హిందూ దేవాలయాల్లో అవి మాట్లాడ్డం నిషిద్ధంగా భావిస్తారు. మనం అవి మాట్లాడబోతే అవన్నీ ఇక్కడొద్దని తోటిహిందువులే మనల్ని వారిస్తారు. నిరుత్సాహపఱుస్తారు. క్రైస్తవంలా, ఇస్లాములా హిందూమతం మతస్థుల సమైక్యాన్ని లక్ష్యంగా పెట్టుకున్న political, strategic creed కాదు. ఇది వ్యక్తియొక్క వైయక్తిక ఆధ్యాత్మిక సాధన, మోక్షం గుఱించి ఎక్కువ emphasis (వక్కాణింపు) చేసే మతం. అందువల్ల హిందువులు గుమిగూడే చోట్ల కూడా తమ సామాజిక, ఆర్థిక, రాజకీయ ప్రయోజనాల గుఱించి వారిని చైతన్యపఱచడం ఇసుమంతైనా సాధ్యం కావట్లేదు. కనీసం Endowments శాఖ కింద లేనటువంటి ప్రైవేటుగుళ్ళల్లోనైనా మన వాళ్ళకి సమావేశాలూ అవీ ఏర్పాటూ చేసి చైతన్యపఱచడం అవసరం. దీన్తోపాటు హిందూనాయకులు చేసిన ప్రసంగాల సీడీలు అక్కడ అందుబాటులో ఉంచి వాటిని తఱచుగా అందఱికీ వినపడేలా మోగిస్తూ ఉండాలి.

10, సెప్టెంబర్ 2011, శనివారం

ఆయుర్వేదాన్ని శాస్త్రీయ పునాదులపై పునర్ నిర్మించడం-2 (సమాప్తం)

ఆయుర్వేదాన్ని ఒక వైజ్ఞానిక శాస్త్రంగా అభివృద్ధి చేయాలంటే-

౧. దాని మీద పడ్డ మతముద్ర తొలగాలి. ఆయుర్వేదంలో కొన్ని మందులకి నారాయణతైలం, నరసింహచూర్ణం మొదలైన పేర్లు ఉండడాన్ని గమనించవచ్చు. ఈ పేర్లు వాటిని తయారుచేసినవాళ్ళ భక్తిప్రపత్తుల్ని సూచిస్తాయే తప్ప శాస్త్రీయ దృక్పథాన్ని ఆవిష్కరించవు. ఇలాంటి పేర్లు పెట్టకూడదు. ఆయా మందులు ఏ పదార్థాలతో తయారయ్యాయో వాటి పేరు మీదుగా పెట్టాలి. లేదా ఏ నలతలకి వాటిని అభిసూచిస్తున్నారో వాటి పేర్ల ననుసరించి పెట్టాలి.

ఔషధాలకి ఇలా మతనామాలు రావడానికి ఒక కారణం - పూర్వం వైద్యులంతా బ్రాహ్మణులే, అందులోనూ శ్రీవైష్ణవులే కావడం. వారు ఈ కాలపు డాక్టర్లలా వైద్యానికి పరిమితమైన స్పెషలిస్టులు కారు. పౌరోహిత్యం, జోతిష్యం, వైద్యం లాంటి రెండుమూడు వృత్తులు ఏకకాలంలో చేసేవారు. అందువల్ల పాతపుస్తకాల ద్వారా తాము నేర్చుకున్నదాన్ని ప్రాక్టీస్ చేయడానికే తప్ప నవీన పరిశోధనలకి ప్రాధాన్యమిచ్చేవారు కారు. నేను విన్నదేమిటంటే - ఆ రోజుల్లో ఎక్కువమంది వైద్యవిద్యా జాఱుకోలరులు (drop-outs in medical education) అని ! వారు ఆయుర్వేద గురువు దగ్గఱ విద్యాభ్యాసానికి చేఱిన ఒకటి-రెండేళ్ళకే "చదివింది చాల్లే, జనానికి ఏదో ఒక మందిచ్చి బతకడానికి ఈమాత్రం పరిజ్ఞానం సరిపోతుంది" అనుకొని లేచి ఇంటికొచ్చేసేవాళ్ళు. కానీ దేశంలోకి ఇంగ్లీషువైద్యం అడుగుపెట్టాక ఇలాంటివాళ్ళ చికిత్సల మీద జనానికి క్రమంగా విశ్వాసం నశించసాగింది. "ఇంగ్లీషుడాక్టర్ ముందు ఆచారిగారు బలాదూర్" అనే మాట వచ్చింది. అలా ఈ అఱకొఱ శిక్షితులు ఆయుర్వేదానికి కొఱివిపెట్టేశారు.

౨. అధునాతన పరిశోధనల వెలుగులో ప్రతిరోగాన్నీ పునర్ నిర్వచించాలి, పునర్ వర్ణించాలి.

౩. వస్తుగుణదీపిక (Ayurvedic Pharmacopeia) ని మఱింత విస్తరించి వ్రాయాలి. కేవలం వనౌషధుల చికిత్సకలక్షణాలనే కాకుండా, ఆ ఔషధులలో ఏయే పదార్థాలు ఏయే అవయవాల మీద ఎలా పనిచేస్తాయో వివరించడం అవసరం. లేకపోతే వాటిని అంతర్జాతీయంగా సమర్థించుకోవడం కష్టమవుతుంది. ఈ రకంగా నిషేధాలకి గుఱికావాల్సి వస్తుంది. మన దేశస్థులకి సొంతబుఱ్ఱ శూన్యమనీ, తెల్లతోలువాళ్ళు ఏదంటే దానికల్లా తానతందానా పాడతారనీ మనకి తెలుసు గనుక, వాళ్ళని అనుసరించి ఇక్కడ కూడా ఆయుర్వేదాన్నినిషేధించాలని డిమాండ్లు బయలుదేఱితే ఆశ్చర్యం లేదు.

౪. విస్తృతమైన ప్రజామద్దతు సంపాదిస్తే తప్ప - ఆయుర్వేదం యొక్క శాస్త్రీయకరణకి అవసరమైన మానవవనరుల్నీ, ఆర్థిక వనరుల్నీ సమకూర్చుకోలేం. అలాంటి మద్దతు కావాలంటే ఆయుర్వేద వైద్యానికి కొన్ని బాహ్యాలంకారాలు కూడా అవసరం. అవి జనాన్ని ఇన్‌స్పైర్ చేసేలా ఉండాలి.

ముఖ్యంగా ఆయుర్వేద వైద్యులు దేశకాలానుగుణంగా తమ వేషభాషల్ని సమూలంగా మార్చుకోవాల్సి ఉంది. ఆయుర్వేదమంటే జనానికి పెద్దగా కళ్ళకి ఆనకపోవడానికీ, తేలిగ్గా చప్పరించేయడానికీ సగం కారణం ఈ నిరాడంబర వేషభాషలే. వీటి మూలాన యువ ఆయుర్వేద వైద్యులకి పెళ్ళికావడం కూడా కష్టమంటే అతిశయోక్తి లేదు. తమదగ్గఱికొచ్చే రోగులకి ఆయుర్వేద పరిభావనల్నీ, రోగలక్షణాల్నీ తెలుగు- సంస్కృత పదాల్లోనే కాక ఇంగ్లీషువాక్యాల్లో కూడా వివరించడం నేర్చుకోవాలి. అలాగే, ఎల్లప్పుడూ మెడలో ఒక స్టెతస్కోపుతో కనిపించాలి. ఒక కారునీ, డ్రైవర్ నీ కూడా మెయిన్‌టెయిన్ చేయాలి. అప్పుడు ఎక్కువమంది నమ్ముతారు. తప్పదు. నువ్వు మంచివాడివైతే సరిపోదు. మంచివాడిలా కనిపించాలి కూడా ! ఇంకొకటి - ఆయుర్వేద వైద్యశాలల్నీ, క్లినిక్కుల్నీ కూడా పాశ్చాత్య పద్ధతిలో తీర్చిదిద్దాలి. ఎందుకంటే ఈ రంగంలో ఈ కాలానికి దేశీయ అలంకరణ బొత్తిగా పనికిరాదు.

ప్రశ్నించడము ఎలా ?

ఒక వ్యక్తినుండి మనకు కావలసిన విషయ సమాచారాన్ని రాబట్టుకోడానికి మనం ఒక ప్రశ్నవేస్తాం. మనం అడిగే ప్రశ్న యొక్క సొంపును బట్టి మనకొచ్చే సమాధానం కూడా అంత అందంగా ఉంటుంది.పైగా ఈ ప్రశ్న అడిగే విధం ఆధ్యాత్మిక జీవనంలో ఎంతో ముఖ్యం. అసలు ప్రశ్న వేసేముందు నిజాయితీ చాలా అవసరం. మనం నిజాయితీగాఅడుగుతున్నామా లేక ఎదుటివాడి పాండిత్యాన్ని తెలుసుకోవడానికి అడుగుతున్నామో ముందు మనమే నిర్ధారించుకోవాలి. రెండవరకమైతే అవతలి వ్యక్తినుంచి సమాధానం కాదుకదా ఈసడింపు కూడా కొన్ని సందర్భాలలో దొరకవచ్చు. 'అసలు ప్రశ్న ఏమిటి? దాని పూర్వాపరాలు ఏవి? ఎక్కడనుంచి ఆ అనుమానం లేదాప్రశ్న వచ్చింది ?' అన్నది ముందు మనం జాగ్రత్తగా గమనించి గుర్తుపెట్టుకోవాలి. అవతలి వ్యక్తిని అడిగినప్పుడు ఆయన "అసలెందుకొచ్చింది నీకీసందేహం ? ఆ సందేహం గురించిన వివరమో కథో చెప్పు ఒక్కసారి" అని అడిగితేఎందుకొచ్చిందో తత్కారణం చెప్పి వివరించగలిగేలా ఉండాలి. అలా కాక, "ఏదో అక్కడ విన్నానండి, ఇక్కడ వీరన్నారు. అందులో ఏముందో తెలుసుకోడానికి అడుగుతున్నా" అని మనకే అర్థంకాని రీతిలో ప్రశ్న చేయకూడదు.

ప్రశ్నల్ని ముఖ్యంగా రెండు రకాలుగా విభజించుకోవచ్చు

1) స్వతహాగా జీవన విధానంలోనూ, అనుష్ఠానంలోనూ కలిగిన సందేహాలు:- ఇవి అడిగి తెలుసుకుని అనుమాన నివృత్తి చేసుకుని ముందుకు సాగడం చాలా మంచిది.

2) స్వజీవితంలోనివే కాక, ధర్మ సూక్ష్మాలు ఇత్యాదులు:- స్వాధ్యాయం ద్వారా తెలుసుకుంటూ అనుమానం వచ్చినచోట సందర్భానుసారం, సమయానుసారం తెలిసినవారినడిగి తెలుసుకోవడం లేదా ఇతర ప్రామాణిక వ్యాఖ్యానాలు పుస్తకాలు చదివి విని తెలుసుకోవడం. తద్వారా పురాణేతిహాసాలు మనలో జీర్ణమై తదనుగుణంగా
మన జీవన మార్పు ఆధ్యాత్మికోన్నతికి సోపానమవుతుంది

ముఖ్యంగా గురువుల వద్ద, 'ఆయన దొరికారు కాబట్టి ఏదో అడగాలి' అని అడిగేయడం కాక మన ఆధ్యాత్మికోన్నతికి పనికి వచ్చే ప్రశ్నలు, అదీ ఆయన అనుకూల సమయం చూసి అడగాలి. అంతేకాని అప్పున్న వాణ్ణి ఎక్కడ కనపడితే అక్కడ అప్పడిగినట్టు కాదు.

అసలు ప్రశ్న అడిగేముందు ఆ ప్రశ్నకు సమాధానం కోసం మనం మన పరిశ్రమ ముందు చేయాలి. అసలు ఏ పరిశ్రమా లేక ఏదో అడిగేసి వారు తిరిగివేసిన ప్రశ్నకి మన దగ్గర బదులు లేక తత్తర పడకుండా జాగ్రత్త పడాలి.

గతంలో ఎంతోమందిని మన పూజ్యగురువుగారిని ఎక్కడపడితే అక్కడ ఏవో ప్రశ్నలు వేయడం చూసాను అలాంటి ప్రశ్నలు ఎలా వేస్తారో అని నాకో గొప్ప అనుమానం. అవి వారి ఆధ్యాత్మిక జీవనానికి ఎలా ఉపయోగపడతాయో అర్థంకాని ప్రశ్నలు. చాలా ప్రశ్నలు పుస్తక పరిశీలనం పురాణ పరిశీలనం ద్వారా తేలిపోతాయి. అసలు ఆ ప్రశ్నవెనుక వారి పరిశీలనం కాని పరిశ్రమ కానీ ఏమీ ఉండవు.

"భారతంలో ఇలాట కదండీ ! అలా ఎలా అండీ ! రాముడు ఇలా చేసాడు కదండీ ! సినిమాలో
చేప్పారు కదండీ ! నిజమాండీ ! ఎలా అండీ !" వంటి ప్రశ్నలు కొన్ని, ఆ అడిగిన ప్రశ్న ఏ సినిమా చూసో నాటకం చూసో అడిగుతున్నామని అడిగే వాళ్ళకీ తెలుసు. భారత రామాయణాలు చదివితే అందులో ప్రశ్నలకి సమాధానం కూడా దొరుకుతుంది కానీ చదివి చెప్పేవారు తేరగా దొరికారని ఇచ్చవచ్చిన ప్రశ్నలు అడుగుతుంటారు. ఇంకొన్నిప్రశ్నలు కూడా వారిని అడగడం చూసాను. "రామాయణం తెలుగు పుస్తకాలు, భాగవతం తెలుగు పుస్తకాలు ఎక్కడ దొరుకుతాయి టీకా తాత్పర్యాలు ఉన్నవి కావాలి" అని. వారిని చూసి ఎన్నో పుస్తకాల దుకాణాలున్నాయి ఏ పెద్ద దేవాలయానికి వెళ్ళినా అక్కడ ఉండే పుస్తకాల దుకాణదారులని అడిగినా చెబుతారు, అంతర్జాలంలో ఎన్నో పుస్తకాలు విక్రయించే వెబ్ సైట్లున్నాయి, ఉచితంగా చదువుకునే వెబ్ సైట్లున్నాయి. "అరెరె వీరికి అంత పెద్దాయన సమయం కేటాయిస్తే ఎలా సమయం వృధా చేసుకుంటున్నారురా" అనిపిస్తుంది.

రామాయణం బాలకాండ జాగ్రత్తగా చదివితే అసలు ప్రశ్న ఎలావేయాలో తెలుస్తుంది. వాల్మీకి విరచిత శ్రీరామాయణమే ప్రశ్నతో మొదలు. అందులో చక్కగా చెప్తారు వాల్మీకి నారదులవారిని అర్ఘ్యపాద్యాదులతో పూజించి "పరిప్రశ్న" చేసారు అని. పరిప్రశ్న అంటే బాగుగా ప్రశ్న అడుగుట. పరి పరి విధముల ఆలోచించి సరియైన ప్రశ్నను కూర్చి అడగవలసిన వారిని అడిగే విధంగా ప్రశ్న అడగడం. అలానే విశ్వామిత్రమహర్షిని శ్రీరాముడు అలానే సందర్భోచితంగా ప్రశ్నలువేసి విషయాలు తెలుసుకుంటారు.

మనకి ఇప్పుడు ఎన్నోరకాల మాధ్యమాలు అందుబాటులో ఉన్నాయి, ఎక్కడ పుస్తకాలు దొరుకుతాయి, ఎక్కడ ప్రవచనాలు, వ్యాఖ్యానాలు దొరుకుతాయి ఇలా అన్నివిషయాలు ఎన్నో అందుబాటులో ఉన్నాయి. ఐనా కొందరు పరిశీలన చేయరు, పరిశ్రమ చేయరు, ఏ ప్రశ్న అడగాలో ఎలాఅడగాలో, ఎక్కడ అడగాలో అన్న స్మృతికూడా ఉండదు.

ఐతే ప్రశ్న అడగడంతప్పని నేను ఎంత మాత్రమూ చెప్పట్లేదు. ముందు మనని మనం ప్రశ్నించుకోవాలి, పుస్తకాలను ప్రశ్నించి సమాధానం రాబట్టుకోవాలి, పరిశీలనాత్మక దృష్టినేర్పరచుకోవాలి. ఐనా దొరకకపోతే ఆ సమాధానం దొరకకపోవడంవల్ల మన ఆధ్యాత్మిక జీవనానికి ఏమైనా లోటు ఉందా అని తర్కించుకోవాలి. లోటనిపిస్తే ప్రశ్నని చక్కగా కూర్చి పెద్దలనడగాలి.

ముఖ్యంగా గమనించవలసినదేమంటే ఈ టపా చూసి నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు. కొంత మందిని చూసి చూసి ఈవిషయం చెప్పాలని, అటువంటి వారు మనగుంపులో ఉండకూడదని (లేరనే నేను నమ్ముతున్నా) ప్రస్తావించాను.

తెలియకపోవడం తప్పుకాదు. తెలుసుకోవడానికి పరిశ్రమించకపోవడం నేరం.


7, సెప్టెంబర్ 2011, బుధవారం

ఆయుర్వేదాన్ని శాస్త్రీయ పునాదులపై పునర్ నిర్మించడం

కొన్నేళ్ళ క్రితం ఆఫ్రికా నుంచి వచ్చిన ఒక నల్లజాతి క్రీడాకారుడు (పేరు గుర్తులేదు) హైదరాబాదులో పత్రికలవారికి ముఖాముఖీ ఇస్తూ "ఆఫ్రికా, ఇండియా రెండూ ఐరోపేయుల వలసపాలనలో వందలాది సంవత్సరాలు మగ్గిన ప్రాంతాలే. కానీ మీకూ, మాకూ చాలా తేడా ఉందని ఇక్కడికొచ్చినాక గ్రహించాను. వలసపాలనలో మేము మా సర్వస్వమూ పోగొట్టుకున్నాం. మా కట్టూబొట్టూ, ఆచారవ్యవహారాలూ, మతమూ, భాషా అన్నీ పోయాయి, మేమిప్పుడు క్రైస్తవమతాన్ని అవలంబిస్తూ, ఇంగ్లీష్, ఫ్రెంచిలాంటి ఐరోపేయ భాషలు మాట్లాడుతూ జీవిస్తున్నాం. కానీ మీ దేశంలో మీ భాషలు ఇంకా జీవించే ఉన్నాయి. మీ మతం కూడా జీవించే ఉంది. మీ ఆడవాళ్ళు ఇప్పటికీ చీరల్లోనే కనిపిస్తున్నారు. మీ శాస్త్రాలూ, ఆచారాలూ, దేవాలయాలూ అన్నీ సలక్షణం (intact) గా ఉన్నాయి. వందలాది సంవత్సరాల వలసపాలన మిమ్మల్నేమీ చేయలేకపోయింది." అంటూ అభినందించాడు.

అతను కొంతే గమనించాడనీ, పూర్తిగా లోతుల్లోకి వెళ్ళలేదనీ మనకి తెలుసు. మన మతమూ, భాషలూ, ఆచార వ్యవహారాలూ, శాస్త్రాలూ ఎంత ప్రమాదంలో ఉన్నాయో మనకి మాత్రమే తెలుసు.

ఇలా ప్రమాదంలో పడ్డ భారతీయ శాస్త్రాల్లో ఆయుర్వేదం కూడా ఒకటి. ఇది 4 రకాలుగా ప్రమాదంలో పడింది. ఒకటి - ఈ శాస్త్రానికి ప్రభుత్వపోషణ కఱువవుతున్నది. ప్రభుత్వం కొత్త ఆయుర్వేద కళాశాలల్ని గానీ, వైద్యశాలల్ని గానీ స్థాపించడం మానేసింది. ఉన్నవాటికి సరైన నిధులూ, సిబ్బందీ సౌకర్యాలూ లేవు. తద్ద్వారా ప్రజాదరణ కూడా అడుగంటుతున్నది. ప్రత్యేకంగా ఆయుర్వేద ఔషధాలమ్మే కొట్లు తగ్గిపోతున్నాయి. వాటిని కూడా మామూలు అల్లోపతీ మందుల దుకాణాలవాళ్లే అమ్ముతున్నారు.

రెండో కోణం - ఆయుర్వేదం ప్రధానంగా వనమూలికల మీద ఆధారపడ్డ వైద్యం. అడవుల్ని నఱికేయడం వల్లా, గ్రామకంఠాల్ని స్థానికులు దురాక్రమించి నానా ఇతరేతర అవసరాలకి వాడుతూండడం వల్లా అక్కడ సహజంగా పెఱిగే మొక్కలూ, వనమూలికలూ పునరుత్పత్తికి నోచుకోక నశించిపోతున్నాయి. ఉదాహరణకి - స్త్రీలకి ఋతుసమయంలోనూ, ఋత్వంతం (మెనోపాజ్) లోనూ అధిక రక్తస్రావం కాకుండా నిరోధించే తుఱకవేపాకు అనే మొక్క ఇప్పుడు అరుదైపోయింది. అందుకోసమే ఉపయోగపడే రెడ్డివారి నానుబ్రాలు అనే మఱో మొక్క కూడా అలాగే అదృశ్యమైపోతోంది. దాన్తో ఇప్పుడు ఇలాంటివాటన్నింటికీ ఖరీదైన అల్లోపతీ మందులు వాడుతూ, శస్త్రచికిత్సలు చేయించుకుంటూ జనం శాశ్వతంగా మంచాన పడుతున్నారు. ఇలాంటి అద్భుతమైన వనమూలికలెన్నో ఆయుర్వేదంలో ఉన్నాయి. ఇవన్నీ క్రమక్రమంగా అంతరించిపోతున్నాయి.అలనాటి ముఖ్యమంత్రి ఎన్.టి. రామారావు గారు ఇలాంటి వనౌషధుల ప్రాశస్త్యాన్ని గుర్తించి 1988 లో అనుకుంటా, తిరుపతిలో ఒక ఆయుర్వేదిక్ హెర్బేరియమ్‌ని (వనమూలికల ఉద్యానవనం) స్థాపించారు. కానీ అనంతరకాలంలో అధికారంలోకి వచ్చినవాళ్ళు ఆ హెర్బేరియమ్ ని ఏం చేశారో, రియల్ ఎస్టేట్ చేసి అమ్ముకున్నారో ఏంటో ఏమీ తెలియదు.

మూడో కోణం - ఆయుర్వేదం మీద నాస్తికులూ, తదితర సంస్కృతివ్యతిరేకులూ (anti-culture elements), అల్లోపతీ మందుల ఉత్పాదకులైన బహుళ జాతీయ సార్థవాహాలూ పనిగట్టుకొని దుర్బుద్ధితో, ఉద్దేశపూర్వకంగా చేస్తున్న దుష్ప్రచారం. ఇది అంతర్జాతీయ స్థాయిలో విచక్షణారహితంగా చెలరేగిపోతోంది. ముఖ్యంగా ఆయుర్వేద మందుల్లో పాదరసం, బంగారం, వెండి, సీసం లాంటి ఘనలోహాల్ని (hard metals) ప్రమాదకర స్థాయిల్లో మిశ్రమం చేస్తున్నారనీ, అవి వాడితే శరీరం లోపలి కీలక అవయవాలు శాశ్వతంగా దెబ్బ దింటాయనీ ప్రచారం చేస్తూ అమెరికా యూరప్ జనాల్ని భయభ్రాంతులకి గుఱి చేస్తున్నారు. ఈ దుష్ప్రచార ఫలితంగా ఇటీవల యూరోపియన్ యూనియన్ ఆయుర్వేద మందుల్ని నిషేధించింది. త్వరలో అమెరికా చేత కూడా నిషేధింపజేయడానికి ప్రయత్నాలు ముమ్మరం గా జఱుగుతున్నాయి.

నాలుగో పార్శ్వం - ఆయుర్వేదాన్ని ఇతర వైద్యవిధానాలతో కలుషితం చేయడం. కొందఱు ఆయుర్వేద వైద్యులైతే ఆయుర్వేద మందుల్లో ఉత్తేజకాల్ని (steroids) కలిపి పక్కప్రభావాలకి కారకులవుతూ శాస్త్రానికి చాలా చెడ్డపేరు తెస్తున్నారు.

ఆయుర్వేదానికి వంకలు లేవని వాదించడం నా ఉద్దేశం కాదు. అయితే ప్రతివైద్యవిధానం లోనూ ఏదో ఒక లోపం ఉన్నది. ఉదాహరణకి - శరీరాన్ని కోయకుండా అల్లోపతివాళ్ళు ఏ చికిత్సా చేయలేరు. కానీ తెఱవబడ్డ యంత్రాలు తెఱవక ముందున్ననాటి పనితీరు (functioning) ని యథాతథంగా చూపించలేవు ఎట్టి పరిస్థితుల్లోనూ ! అటువంటప్పుడు కేవలం ఆయుర్వేదాన్నే విమర్శించడమూ, దుష్ప్రచారం చేయడమూ సబబు కాదు. అయితే విమర్శలు ఇలా వస్తున్నాయి గనుక ఆయుర్వేద వైద్యులూ, ఔషధ ఉత్పాదకులూ తమ వ్యూహాల్ని కాస్త మార్చుకుంటే బావుంటుంది. లోకుల సంతృప్తి కోసమైనా ఘనలోహాల మిశ్రమం లేకుండా ఔషధాల్ని తయారు చేయాలి. ఏ లోపలి అవయవం ఎలా పనిచేస్తుందో సరైన అవగాహన కల్పించే పాఠ్యపుస్తకాలు ఆయుర్వేదంలో లేవు. ఉన్నవి ఈ కాలపు అవగాహనకి సరిపోవు. అటువంటప్పుడు వాటిని ఇతర వైద్యవిధానాల నుంచి గ్రహించడంలో తప్పులేదు.ఆయుర్వేద వైద్యులిచ్చే మందులు తప్పకుండా పని చేస్తాయి. కానీ ఎలా పనిచేస్తాయో వారు ఈ కాలపు పరిభాషలో వివరించలేరు. ఆయుర్వేదవైద్యులు ఆధునిక రోగనిదాన (డయాగ్నాస్టిక్) పరికరాల్ని ఉపయోగించుకోలేక పోతున్నారు. ఆ పరికరాల ద్వారా తెలియవచ్చిన పరీక్షా ఫలితాలకి అనుగుణంగా మందుల్ని ఉత్పాదించాల్సి ఉంటుంది.

ఇవన్నీ ఎవఱూ గంభీరంగా పట్టించుకుంటున్నట్లు కనిపించదు. అసలు ఆయుర్వేదంలో పరిశోధనే స్తంభించిపోయినట్లు కనిపిస్తోంది. పరిశోధన కుంటువడ్డ శాస్త్రానికి భవిష్యత్తు లేదు. మన పూర్వీకులకి ఏమీ తెలియదనుకోవడం ఎంత మూర్ఖత్వమో, అనీ తెలుసు ననుకోవడమూ అంతే మూర్ఖత్వం. కనుక మన పూజ్య పూర్వీకుల కానుక, జాతికి గర్వకారణమూ అయిన ఈ వేదాంగం ఆయుర్వేదానికి ప్రత్యేక ప్రయోగశాలల్ని నెలకొల్పి సరికొత్త పద్ధతులలో, పరిశోధనాత్మకంగా నూతన జవసత్త్వాలు కల్పించాల్సిన అవసరం ఉంది.

తెలుగులో టైప్ చేయండి

కైఫీయతులు

  © బ్లాగర్ టెంప్లేట్ "ప్సై" రూపొందించినవారు Ourblogtemplates.com 2008

ఈ పుట పైభాగానికి వెళ్ళడం కోసం ఇక్కడ నొక్కండి