హిందూసమాజం అంటే వెంటనే ప్రతిఒక్కరికీ గుర్తొచ్చేది అందులోని కులవ్యవస్థ. అది ఏర్పడేందుకు గల కారణాలు, తర్వాత కాలక్రమంలో వ్యవస్థను స్థిరీకరింపచేసి సమాజంలో బాధ్యతలను పంచుకోవటంలో దానిపాత్ర. అలానే కలిప్రభావంతో ఇప్పుడు ఎదుర్కుంటున్న అపనిందలు హిందూధర్మం పట్ల నమ్మకం ఉన్నవారికి, తటస్థులకు అలానే కలిఅంశలకు సైతం తెలుసు.(కాకపోతే వాళ్లు తెలిసినా అడ్డంగా వాదించుకుని మురిసిపోతారు అంతే.)
ఈ వ్యవస్థలో మనకు ముందుగా గుర్తొచ్చేది బ్రాహ్మణులు- వీరికి సమాజంలో పెద్దన్న పాత్ర. గౌరవ మర్యాదలతో పాటు విపత్కాలంలో సమాజానికి దిశానిర్దేశం చెయ్యాల్సిన బాధ్యత అప్పగించారు. పురాణాల్లోని కథల్లోనే కాదు చరిత్రలోనూ, ఇటీవలి స్వాతంత్ర్యసంగ్రామంలోనూ ఇంకా అనేక సందర్భాల్లో తమ బాధ్యతలను ప్రశంసనీయంగా నిర్వర్తించారు. అయితే ప్రస్తుతం? కనీసం సంధ్యావందనంచేసే అలవాటున్నవారెందరు ? మన హిందూ దేవుళ్లపై చెణుకులూ, చెమక్కులు అవాకులూ, చెవాకులు విసరడం మొదలెట్టింది కొద్దిమంది అల్పవిశ్వాసులైన బ్రాహ్మణ మేధావులే. ఆ తర్వాతే బయటివారికి హిందూధర్మంపై వేలెత్తే ధైర్యం వచ్చింది.
తరువాత క్షత్రియులు- గోబ్రాహ్మణ రక్షణ, థర్మాన్ని నాలుగుపాదాలా నిలపడం, దేవతలకు తనరాజ్యంలోని ప్రజలకు మద్య వారథి. యవనులు తదితర ముష్కర మూకలవల్ల ముందునష్టపోయింది వీళ్లే. అంతర్గత కలహాలు, వెన్నుపోట్లతో మ్మొదలైన వీరి పతనం హిందూజాతికి ఎనలేని నష్టం కలుగజేసింది. తమకోసం ముందుండి పోరాడే నాయకుడు అంగార్థబలాలు కోల్పోయి అచేతనంగా పడి ఉంటే మూగగా రోదిస్తోంది హిందూత్వం.
ఇక శూద్రుల విషయానికి వస్తే వీరికి దైవభక్తి మెండు. కానీ ధర్మసిధ్థాంతాలలోని సూక్ష్మాన్ని అర్థం చేసుకునే సామర్థ్యం ఉన్నవారు అతికొద్దిమంది. అలాగే హిందూత్వంపై జరుగుతున్న వ్యూహాత్మక దాడిని అర్థంచేసుకునేంతగా వారికి పరిజ్ఞానం లేదు. ఊరిలో ఉన్న పురోహితుడు లేదా వ్యక్తిగతంగా గురి ఏర్పడిన ఎవరో ఒక పెద్దమనిషి చెప్పిన మాటను విని అనుసరించటం ఒక్కటే వీరికి తెలిసింది. వీరి ఆర్థిక, సామాజిక స్థితిగతులు సమాజంలో సైద్ధాంతిక ప్రమేయాన్ని అడ్డుకున్నాయి.
మిగిలినది వైశ్యులు. హిందూ ఆచారాలపై విశ్వాసాలు లేనివారిని మీరే కులంలోనైనా చూడొచ్చు గానీ వీరిలో చాలా అరుదు. (బహుశా ఉండకపోవచ్చు) గ్రామంలో గానీ పట్టణాల్లో గానీ వీరి ప్రమేయంలేకుండా ఉత్సవాలు (వినాయకచవితి, రామనవమి వంటివి) జరుగడం అరుదు.. దాదాపూ అన్ని హైందవ సంస్థలకూ ఆర్థికసహాయం చేయడంలో వీరే ఎక్కువ. వీరిచే నడిపే వాసవి అన్నదాన సత్రాలు దాదాపూ ఒక మోస్తరు పట్టణాలు ప్రతిచోటా ఉంటాయి. కళ్యాణ మండపాలు ఈరోజుల్లో వ్యాపారం అయిపోయాయి. కానీ అది ఒక సమాజసేవగా భావించబడిన రోజుల్లో ముప్పాతికభాగం నిర్మించినది వాళ్లే. వాటిలో కొన్ని వ్యాపారదృక్పదంతో నిర్వహిస్తున్నా ఇప్పటికీ ఎన్నో ఆర్యవైశ్య కళ్యాణ మండపాలు లాభాపేక్షలేకుండా నడుస్తున్నాయి. ఏదైనా గుడికెళ్ళి దాన్ని కట్టినప్పుడు సాయంచేసిన దాతలపేర్లు చూడండి. వైశ్యుల పేరు కనపడని గుడి ఉండదు.
ఇన్ని చేస్తున్నా వైశ్యుడెప్పుడూ పదిమందిలో సిద్ధాంతాలపై రాద్ధాంతంచేయడు. తాను చేయదల్చుకున్న సహాయాన్ని గుట్టుచప్పుడుకాకుండా చేస్తారు. అలా గుప్తదానాలు ఇచ్చిన శెట్టిగార్లు ఎందరో ఉన్నారు. విశ్వహిందూపరిషత్ వంటి హైందవ సంస్థలకి, ఇస్కాన్ వంటి ధార్మిక సంస్థలకి, కంచిమఠాల వంటి వాటికి ఆర్థిక సహాయాన్ని అందించేవారు వారిలో మెండు.
అంతెందుకు, ఇటీవలి సంఘటన- దేవాదాయ ధర్మాదాయ శాఖ పాల్పడుతున్న అధర్మాలు అందరికీ తెలిసినవే. ఒక మాజీ ప్రభుత్వాధినేత చేసిన దారుణాలకు అందరూ కలవరపడుతూండగా వైశ్యులు గుట్టుచప్పుడు కాకుండా తమ ధర్మం తాము చేశారు. వాసవీ కన్యకాపరమేశ్వరీ దేవస్థానాలకు, అనుబంధ అన్నదాన సంఘాలకు మరియు కళ్యాణమండపాలకు స్వయంప్రతిపత్తి విషయమై ఒక జీఓ కొన్నినెలల కిందట విడుదలైంది. ఇప్పుడు ఉన్నరాజకీయ పరిస్థితుల్లో ప్రభుత్వాధినేతగా ఉంటూ హిందూ అనుకూల కార్యక్రమాలు చెయ్యడం ఎంత కష్టమో మనకి తెలియందికాదు. పైన 'ఆ యమ్మ' ఎన్ని ఆంక్షలు పెడుతున్నా కంచిపీఠానికి వైద్యకళాశాల కేటాయించడం ఎంతకష్టమైన పని. ఆయన ఎప్పుడూ ఉపన్యాసాలు ఇవ్వలేదు. పూర్తిస్థాయి హిందూవ్యతిరేక కార్యక్రమాలకు ఒక బృహత్‌ప్రణాళిక రచించి దాన్ని తు.చ. తప్పక అమలు పరుస్తున్న పార్టీలో ఉంటూ ఇలాంటి పని చెయ్యడం పదవికేకాదు ప్రాణాలకు కూడా ప్రమాదం.
అలాంటి శ్రేష్టులపై ఇప్పుడు వ్యూహాత్మకదాడికి పథకం తయారయ్యింది.
ఇన్ని శతాబ్దాలుగా భరతఖండపు వర్తక వాణిజ్యాలకు ప్రతినిథులుగా ఉంటున్న వీరిని దెబ్బతీయడం ద్వారా హిందూసమాజపు వెన్నెముకను విరగ్గొట్టేందుకు ప్రయత్నాలు మొదలయ్యి దశాబ్దం అయ్యింది.ఈస్ట్ ఇండియా కంపెనీకంటే కూడా దుర్మార్గపు పోకడలు మొదలయ్యాయి. అందులో అతి ముఖ్యమైనది వారి రిటైల్ వ్యాపారం. ప్రభుత్వం సంస్కరణలు మొదలుపెట్టినప్పుడు ఈ రంగాన్ని మినహాయించింది. ఇది మన స్వావలంబనకు అత్యంత ప్రధానం.
ఇక్కడ ఇతరులను ప్రవేశపెట్టేందుకు వాళ్లు చెబుతున్న కుంటిసాకులు అన్నీ తాత్కాలిక ప్రయోజనాలే. నాణ్యత, పన్నుకట్టడం, సులభతర వాణిజ్యం, అంతర్జాతీయ పోటీలో నిలబడడం ఇలాంటివి. కొన్నేళ్ల తర్వాత ఆ కంపెనీలు ఇదే స్థాయి నాణ్యతను కొనసాగిస్తాయి అన్న నమ్మకముందా? వాళ్లు కొనసాగిస్తాం అన్నా మన నాయకులు ఒప్పుకుంటారా? ఇక్కడివాళ్లకి చేసేందుకు పనిలేకుండా చేసి ఆ వచ్చే పన్నుతో ఎవరిని ఉధ్ధరిద్దాం అని? అంతర్జాతీయ పోటీ ఉండాల్సిన రంగమా కిరాణా కొట్లు ?
కాబట్టి హిందూసోదరులారా ! మన వైశ్యసోదరులకు నైతికమద్దతునివ్వండి. వారితో సంబందాలు పెంచుకోండి. వారితో వ్యక్తిగతంగా కొంతకాలం మసలండి. వారిలోని నీతినియమాలు మీకే తెలుస్తాయి. మిగతా వర్గాలతో పోలిస్తే దురలవాట్లు వీరిలో చాలాతక్కువ. ఆర్థిక లావాదేవీల్లో సైతం మీరు నిబద్దతను పాటించినంతకాలం వారు కోపించరు. వారిచే నడుపబడుతున్న అంగళ్లలోనే లావాదేవీలు జరిపేందుకు ప్రయత్నించండి. మీకు ఇప్పుడు వారిలో కొన్ని అల్పదోషాలు కనిపిస్తుండవచ్చు. కానీ ప్రపంచంలో వ్యాపారాలు చేసే ఏ వర్గంతో పోల్చి చూసినా వీళ్లు ఎన్నోరెట్లు నయం. చేతిలో డబ్బును పెట్టుబడిగా పెట్టి వ్యాపారం చేసి వారు ఎంత అభద్రతాభావాన్ని పొందుతుంటారో షేర్లలో పెట్టే ప్రతి ఒక్కరికీ తెలిసిందే. అలాంటిది, వాళ్లు జీవితాంతం అదే ఒత్తిడిలో ఉంటారు.