ఒకాయన అమెరికా లో ఉన్న తన కొడుకు దగ్గరికి ఒకసారి వెళ్ళాడట.
ఒక Weekend సందర్భంలో కొడుకు తన స్నేహితుని ఇంట్లో Dinner కి సకుటుంబంగా
వెళ్ళుతూ తన తండ్రిని కూడా వెంట తీసుకుని వెళ్ళాడు. భోజనం అంతా serve చేసి
భోజనము అంతా ఐన తరువాత వెళ్లబోయే ముందర ఆ కొడుకు తండ్రికి ఒక సూచన చేశాడు. అది ఏమిటంటే ఆ అబ్బాయి Send Off చెయ్యటానికి వచ్చినప్పుడు మంచి భోజనము పెట్టారు చాలా బాగుంది అని చెప్పి థాంక్స్ చెప్పమని.
అట్లాగే ఆ స్నేహితుడు Send Off చెప్పటానికి వచ్చినప్పుడు తండ్రి అతనితో
భోజనం చాలా బాగున్నది బాబు.
I am so happy. So kind of you to have offered such a good dinner. We
have enjoyed a lot. చాలా Thanks అని చెప్పి తరువాత .. కానీ మా ఇండియా
లో పద్ధతి ఇట్లా ఉండదు అని చెప్పాడు (స్నేహితులు ఇద్దరి మధ్యా ఉన్న చొరవని ఆసరాగా తీసుకుని).
అతను కూడా భారతీయుడే కాని అమెరికా లో పుట్టి పెరిగిన భారతీయుడు. అతనికి ఈ మాట అర్ధం కాలేదు. ఈ పెద్దాయనని వొత్తిడి చెయ్యటం తో పెద్దాయన
అట్లా
కాదు బాబూ. మా ఇంటికి ఎవరైనా భోజనానికి వస్తే వారు రాగానే కాళ్ళు కడుక్కో
టానికి నీళ్ళు ఇస్తాము. కాళ్ళు తుడుచుకోటానికి టవలు ఇస్తాము.
కూర్చోపెట్టి భోజనం వడ్డిస్తాము. భోజనము ఐనంక వారిని సాగనంపే టప్పుడు వారితో .. మీరు భగవత్ స్వరూపంగా మా ఇంటికి వచ్చారు. మా ఆతిధ్యం స్వీకరించారు మీకు మా ధన్యవాదాలు అని మేము చెప్పుతాము. వారికి మేము కృతజ్ఞతలు చెప్పుతాము.
పరమేశ్వరునికి ప్రాధ్యానత ఇచ్చే భూమి అది. అందుకనే అక్కడ భోక్తకి ప్రాధాన్యం ఇచ్చి అతణ్ణి పరమేశ్వర స్వరూపంగా భావిస్తాము. అక్కడ అతిథి సత్కారం అన్నది గృహస్తు ధర్మం. కర్త తను నెరవేర్చాల్సిన ధర్మం నేరవేరుస్తున్నాడు. అదే రెండు దేశాల సంస్కృతి లో తేడా అని వివరించాడు.
(అయ్యా .. ఇది ఏ ఒక్కరినీ కించ పరుస్తూ వ్రాసింది కాదు. భారత దేశ సంస్కృతిని, భావనల్ని వక్కాణించటము కొరకు మాత్రమే అని భావించ ప్రార్ధన.)
[కె.బి.యన్. శర్మ గారు]
21, మే 2013, మంగళవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
1 కామెంట్:
నాకొక సందేహం. కాళ్ళు కడుక్కోనిస్తారా.. లేక మీరే కడుగుతారా ?
కామెంట్‌ను పోస్ట్ చేయండి