18, డిసెంబర్ 2013, బుధవారం

కంచి శంకరాచార్యపై ఇంతటి కుట్రకు పాల్పడినవారెవరు?

కంచి శంకరాచార్యపై ఇంతటి కుట్రకు పాల్పడినవారెవరు?


తొమ్మిది సంవత్సరాలపాటు సాగిన కంచి కథకు ఎట్టకేలకు నవంబర్ 26వ తేదీన పుదుచ్చేరి ప్రత్యేక కోర్టు ముగింపు పలికింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శంకర్ రామన్ హత్య కేసులో కంచి స్వామీజీ జయేంద్ర సరస్వతి, విజయేంద్ర సరస్వతి స్వాములు ఇద్దరూ నిర్దోషులని కోర్టు తీర్పు చెప్పింది. మొత్తం 24 మంది నిందితులలో ఒక నిందితుడు 2013 మార్చిలో చెన్నైలో హత్యకు గురవగా మిగిలిన 23 మందిని నిర్దోషులుగా విడుదల చేస్తున్నట్లు జస్టిస్ మురుగన్ ప్రకటిస్తూ తీర్పునిచ్చారు. 

ఈ తీర్పు మరికొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పలేదు. శంకర్ రామన్ ను హత్య చేసింది ఎవరు? 9 సంవత్సరాలు విచారణ చేసిన తరువాత కూడా అసలైన హంతకులను ఎందుకు పట్టుకోలేదు? ఇక రెండవ ప్రశ్న. భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే అందరూ గౌరవించే కంచి పీఠాధిపతులు జయేంద్ర సరస్వతి, విజయేంద్ర సరస్వతి స్వాములను అక్రమంగా నిర్బంధించి, కేసులో ఇరికించి వారి గౌరవ ప్రతిష్ఠలను దిగజార్చటానికి పన్నిన వ్యూహంలో భాగస్వాములు ఎవరు? హిందూ సమాజాన్ని కించపరిచే విధంగా కేసులు నడిపించిన తమిళనాడు ప్రభుత్వానికి కోర్టు ఏమి చెప్పింది? ఏమి చెబితే, ఎంత చెబితే పోయిన స్వామీజీల గౌరవం తిరిగి వస్తుంది? ఈ ప్రశ్నలకు ప్రభుత్వం, కోర్టు, విచారణ యంత్రాంగం, మీడియా ఏమి సమాధానం చెబుతుంది?

శ్రీశ్రీశ్రీ జయేంద్ర సరస్వతి స్వామికి, తమిళనాడు ముఖ్యమంత్రి కుమారి జయలలితకు మధ్య మీడియా కూడా గుర్తించని వైరం ఏదో ఉండి ఉంటుందని ఆ సమయంలో (2004లో) వార్తలు వచ్చాయి. ఆ కక్షసాధింపు చర్యలో భాగంగా ఈ ఘాతుకం జరిగి ఉంటుందా?

2004లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పాలమూరు జిల్లాలో తెల్లవారితే దీపావళి పండుగ అనగా అర్థరాత్రి పూట పోలీసులు స్వామీజీని అదుపులోకి తీసుకొని జైలుకు తరలించారు. ఆ సమయంలో ''అర్థరాత్రి చడీచప్పుడు కాకుండా నిర్బంధించటానికి నేనేమైనా వీరప్పన్ నా?'' అని స్వామీజీ పోలీసులను ప్రశ్నించారు. తెల్లవారితే దీపావళి పండుగ అనగా అభియోగాలపై అభియోగాలు మోపి బెయిల్ పై త్వరగా బైటపడకుండా కూడ చూసారు. చేసిన ఒక తప్పును కప్పిపుచ్చుకోవడానికి ప్రభుత్వం అనేక తప్పులు చేసింది.  ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం వ్యవహరించిన తీరును జ్ఞాపకం చేసుకొంటే ఒక్కసారిగా మనస్సు కలుక్కుమంటుంది. 80 కోట్లకు పైగా జనాభా ఉన్న హిందూ సమాజం, హిందూ సంస్థల నాయకులు దీనిపై వెంటనే ఏమీ చేయలేకపోయారు...!? రాజకీయ అధికారం ముందు ఏమీ తోచనివారయ్యారా? అటువంటి పరిస్థితులు ఎందుకు నిర్మాణమయ్యాయి? ఆలోచించవలసిన అవసరం మనందరకు ఉంది.

నిర్ధారణగా ఇది అని చెప్పలేము గాని, ఒక్కసారి గతంలోకి వెళితే కొన్ని విషయాలు, కొన్ని చేదు నిజాలు మనకు జ్ఞాపకం వస్తాయి. రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో పోప్ జాన్ పాల్-2 భారత్ కు వచ్చారు. ఆ సమయంలో ఢిల్లీలో పోప్ జాన్ పాల్ చేసిన వ్యాఖ్యను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. "ఆసియా ఖండం, అందులో భారతదేశం కోతకు సిద్ధంగా ఉంది" - అంటే భారతదేశాన్ని క్రైస్తవదేశంగా చేయటానికి అనువుగా ఉంది అని ప్రకటించారు. దేశంలో క్రైస్తవ ప్రాబల్యం పెరిగితే దానిని నిరోధించేది, ఎదుర్కొనేది హిందూ సమాజంలోని సాధుసంతులు, సంఘము, విశ్వహిందూ పరిషత్ లాంటి సంస్థలు. వాటి గౌరవ ప్రతిష్ఠలను సమాజంలో దిగజార్చాలని నిర్ణయించారా? అందుకే ఈ పథకం రచించబడిందా?

కేంద్రంలో యుపిఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆ పథకం అమలులో భాగంగా ఈ అరెస్టులు, స్వామీజీల మీద, సంఘం మీద దాడులు, ఆరోపణ పర్వాలు సాగుతున్నాయా? ఇవి ఏవి హిందూ సమాజానికి పట్టవు. ఇక్కడ మీడియా రంగం కూడా వ్యవహరించిన తీరు ఎంతో గర్హించదగినది. ప్రపంచంలో అనేక దేశాలలో అమెరికా అండదండలతో క్రైస్తవం ఎన్నో అరాచకాలు సృష్టించింది. ఎక్కడోదాక అవసరం లేదు - కేరళ, తమిళనాడులలో క్రైస్తవుల అకృత్యాలే అనేకం. వాటిని విచారణ జరిపించి దోషులను శిక్షించారా? కేరళలో నన్స్ పై అత్యాచారాలు, హత్యలు మొదలైనవి పుస్తకాలే వచ్చాయి. అధికారుల అండదండల కారణంగా వేటిపైన సరియైన చర్య తీసుకోలేదు. పెరిగిపోతున్న క్రైస్తవుల అరాచకాల గురించి అనేక మంది పెద్ద మనుషులను వ్యక్తిగతంగా కలిసినప్పుడు తమ బాధను, ఆక్రోశాన్ని వ్యక్తం చేస్తారు. కాని క్రైస్తవానికి వ్యతిరేకంగా గళం మాత్రం విప్పరు. ఇది కాంగ్రెసుకు కలిసి వస్తున్నది. ఇప్పుడున్న కేంద్రప్రభుత్వం చేజారుతున్న తన ఆశలను పెంచుకొనేందుకు ఏమైనా చేసేందుకు సిద్ధం కావచ్చు. మైనార్టీల సంరక్షణ పేరుతో హిందూ సంస్థలను స్వామీజీలను వేధించే ప్రయత్నం చేయవచ్చు. ఇది హిందూ సమాజానికి ఒక హెచ్చరిక.

వైరము లేని హింసను చేయటానికి సిద్ధపడని హిందూసమాజం తన పైన శతృత్వం వహించి పని చేస్తున్న శక్తులను గుర్తించే పరిస్థితులు లేవు. శ్రీశ్రీశ్రీ జయేంద్ర సరస్వతి స్వామీజీ కేవలం ఆధ్యాత్యిక రంగంలోనే కాదు, సామాజిక రంగంలో కూడా గడిచిన రెండు దశాబ్దాలుగా పని చేస్తున్నారు. సమాజంలోని అట్టడుగు వర్గాల సంక్షేమానికి జనకల్యాణ పరిషత్ స్థాపించారు. దేశవ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు వారి మార్గదర్శనంలో నడుస్తున్నాయి. వాటికి అడ్డుకట్ట వేయాలని క్రైస్తవులు అనుకొని ఉండి ఉండవచ్చు. వాళ్లకు ప్రభుత్వాలు సహకరిస్తూ ఉండి ఉండవచ్చు. ఇది ఈ రోజు హిందూ సమాజానికి ఎదురవుతున్న సవాళ్లు. ఈ సవాలును స్వీకరించి ఆ ఎత్తుగడలను వమ్ము చేయగలుగుతామా?

యుపిఎ ప్రభుత్వం 2009లో రెండవసారి అధికారంలోకి వచ్చిన తరువాత నుండి హిందూ సమాజంలోని పెద్దలు, స్వామీజీల సంస్థలను నైతికంగా (తాత్కాలికంగానైనా) దిగజార్చాలనే ప్రయత్నాలు వేగవంతమయ్యాయి. ఇది గమనించదగ్గ పరిణామం.

దేశంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. దూషణల పర్వం ఎప్పుడో ప్రారంభమయింది. ఇక కావలసింది ప్రజలను గందరగోళంలో పడేయటం. దానిద్వారా తిరిగి అధికారం కాపాడుకోగలుగుతామా అన్నది ఇప్పటి కాంగ్రెస్ వ్యూహం. దీనిని జాగ్రత్తగా గమనించి మరిన్ని దాడులు జరగకుండా హిందూసమాజం అప్రమత్తం కావాలి. మీడియా ఎత్తుగడలను కూడా గమనించాలి. అప్పడు మనం మన సమాజాన్ని కాపాడుకోగలుగుతాం.

9 సంవత్సరాల కంచి కథకు ఇప్పుడు ముగింపు లభించింది. భవిష్యత్తులో మరిన్ని కథలు నిర్మాణం కాకుండా చూసుకోవటం ఇప్పుడు హిందూ సమాజం ముందున్న కర్తవ్యం.
- రాము
http://www.lokahitham.net/

8 కామెంట్‌లు:

G.P.V.Prasad చెప్పారు...

మనం చేస్తున్న మొదటి తప్పు ప్రపంచానికి నేను మంచి చేశాను అని చెప్పుకోవడం, అలాకాకుండా నా లోని హిందుత్వం చేసింది అని చెప్పుకోవాలి అప్పుడే ఈ కిరాస్తానీల ఆగడాలు ఆగుతాయి

BHAARATIYAVAASI చెప్పారు...

హిందుత్వాన్ని గురించి బాధపడవలసిన పని లేదు. ఎలిక పిల్ల కదలాలంటే చిన్న ఎండిన ఆకు చప్పుడు చాలు. కానీ, ఏనుగు లాంటి హిందుత్వం కదలాలంటే కొన్ని ఇలాంటివి జరగాలి, అప్పుడు కనుక కదిలితే భారతదేశంలో బౌద్దులకి పట్టిన గతే, హిందువులని పీడించే వారికి పడుతుంది.

అజ్ఞాత చెప్పారు...

ఈ సమస్యకు పరిష్కరం రామోజీరావుని అతని మీడియ కథనాలను పరిశీలిస్తే అర్ధమౌతుంది

vamsee చెప్పారు...

chala baaga Raseru

అజ్ఞాత చెప్పారు...

నకిలి కణికుడు, నంబర్ 10 వర్గ ఆంధ్ర ప్రతినిధి జిరోజీ అబద్దాలు రాసి రాసి, బాబు కి ఇచ్చిన సలహాలు ఎదురు తిరిగి, విలువను కోల్పోవడమె గాక, ఆయన తో పాటుగా అతని సామాజిక వర్గం విలువను కనిష్ట స్థాయికి దిగజార్చాడు.
తెలంగాణా వారి చేతిలో అతని సామజిక వర్గం తిట్టిన తిట్టు తిటించుకొనె దుస్థితి రాజ గురువు తెర వెనుక రాజకీయల చలవే కారణం. శంకరాచార్య సంఘటను చాలా చెడు గా ప్రచూరించిన వారిలో ఇతనొకడు.

hari.S.babu చెప్పారు...

హిందూత్వం గురించి పైన వ్యాస రచయితకీ ఇక్కడ వ్యాఖ్యలు చేసిన వారికీ కొన్ని విషయాలు తెలియదని అనుకోవడం వల్ల నేను కొన్ని మౌలిక విషయాల్ని చెప్పదల్చుకున్నాను. అసలు హిందూత్వం అనేది మతం కాదు. బాగా పరిశీలించండి. మిగతా అన్ని మతాలకీ ఒకే మూల దైవం, ఒకే మూల గ్రంఢం, ఒకే ప్రవక్త అనే మూడు అంశాలు తప్పనిసరిగా ఉంటాయి. కానీ ఇక్కడ అవేవీ లేవు. ఇక్కడ ధర్మానికే ప్రాధాన్యం ఉంది. కాబట్టి హిందూ మతం అనేది యెక్కడా లేదు. హిందూ ధర్మం మాత్రమే ఉంది. ఇది ఒక జీవన విధానం. దైవానికి అవతారాలుగా చెప్పబడే వాళ్ళు కూదా మనందరిలాగే పెరిగారు, బళ్ళోకెళ్ళి చదువుకున్నారు. యెలా బతకాలో చూపించడం కోసమే అది అలా కల్పించబడింది. ధర్మం ప్రధానంగా ఉన్నపుడు ఆచరణకే యెక్కువ ప్రాధాన్యం ఉంటుంది. ఆచరణ పట్ల నిష్ట లేనప్పుడు ధర్మం కేవలం అపెడిక్స్ లాంటి ఒక అవశె షంగానే మిగిలి పోతుంది.

ఆచరణ పట్ల శ్రధ్ధ లేకపోవటమే మన పతనానికీ మనకు కష్టం కలిగించే అవమానాలు జరగడానికీ కారణం. కంచి స్వాములకి జరిగిన అవమానం కూడా అలాంటిదే. ఒకటి గమనించారా? ఈ మధ్యనే హైదరాబాదు పైన పోలీసు చర్యకి సంబందించిన విశేషాలు ఈ మధ్యనే అడ్వాణీ గారి ద్వారా బయట పడినాయి. ఆ యెడ్వినా ప్రియుడు మొదట పోలీసు చర్యకి సంబంధించి పటేల్ ని మత తత్వ వాదివి అని తిట్టే వరకూ వెళ్ళి తీరా రజాకార్లు ఒక క్రైస్తవ్ సన్యాసిని మానభంగం చేసిన వార్త - అదీ ఒక బయటి వాడు రాసిన అభ్యంతరపు లేఖని చూశాక - కదిలి పోయి వెంటనే ఉగ్రంగా మారిపోయాడనే విషయంలో మీకు తెలుస్తున్నదేమిటి? అంతకు ముందు జరిగిన ఘోరాలేమీ ఆ సెక్యులరిష్టు పితామ్హుడ్ని కదిలించకుండా ఆ ఒక్క సంఘటన కే కదిలిపోవటం వెనక ఉన్న రహస్య మేమిటి?

వాటన్నింటితో పోలిస్తే పైన జరిగిన విషయం చాలా చిన్నది.యెంత మహోన్నతమయిన ధర్మబధ్ధమయిన సాంప్ర్దాయమయినా పాటించే వాళ్ళలో ఆచరణ పట్ల నిష్ట లేనప్పుడు అగౌరవం తప్పదు.

BHAARATIYAVAASI చెప్పారు...

మతం అంటే ఒకే దేవుడు, ఒక మత గ్రంధం ఉండటం అని ఎవరు నిర్వచించారు??? మతమనేది అన్నిప్రాంతాలలో ఒకేలాగు ఉండదు. ఆ ప్రాంతం యొక్క ప్రజల జీవన విధానంలో ఉన్న మంచితనం మరియు చెడ్డతనాలబట్టి ఆయా మతగ్రంధాలు దేవుళ్ళు ఉంటారు. కేవలం హిందూ మతమే కాదు అన్ని మతాలలోను "దేవుళ్ళు మరియు దేవతలూ" ఉంటారు. ఇతర మతగ్రందాలని లోతుగా పరిశిలిస్తే అర్ధం అవుతుంది. అన్నిమతాలూ ఒకేలాగుండాలని లేదు. యూరప్ వాళ్ళే మనకి ఆదర్శం కాదు.

hari.S.babu చెప్పారు...

మీరన్నది నిజమే. దేవుళ్ళు, దేవతలు ప్రతి మతం లోనూ ఉంటారు. కానీ ముఖ్యంగా ఉండే మూలదైవం ఒక్కరే ఉంటారు. ఇస్లాం లో అల్లాహ్ ప్రధాన మూర్తి, క్రైస్తవం లో యహోవా. అలా హిందూ మతానికి యెవరిని మీరు ప్రతిపాదించగలరు? ఇస్లాం కి ఖురాన్, క్రైస్తవానికి బైబిల్ లాగ హిందువులకి యేదైనా ఒకే గ్రంధం ఉందా? ఇస్లాం కి ప్రవక్త మూల వ్యక్తి. ఖురాను మొత్తం అతని బోధనల సమాహారం.ప్రతీ ముసల్మాన్ తన అనుష్టానానికి కావలసిన ప్రతీ దాన్నె అందులోంచే క్రైస్తవం లో పాత నిబంధన మరియు కొత్త నిబంధన ని దాటి వెళ్ళడానికి వీలు లేదు. అలా హిందువులకి యేదైనా ఉందా? వేదలూ ఉపనిషత్తులూ ఇంకా భగవద్గీత ఇవన్నీ ఒకే సారాంశాన్ని చెప్పడం లేదు కదా? యేవరి జ్ఞానాన్ని బట్టి ఆయా గ్రంధాల నుంచి ప్రేరణ పొందటమే తప్ప హిందువులకి ప్రత్యేకించి ఒకే గ్రంధం ఉందా?మీరు చెప్తున్న దేవుళ్ళు దేవతలు అనే వాళ్ళకి యేంజెల్స్ అని క్రైస్తవులు, యక్ష గంధ్ర్వ కిన్నర జాతులని మనమూ చెప్పేవాళ్ళంతా రెండవ శ్రేణికి చెందిన వాళ్ళు. కేంద్రం లో మాత్రం ఉందేది ఒక్కరే. అలా హుందువులకి యెవరున్నారు? ఇస్లాము లో అసలు పురాణాలనే పేరుతో కల్పిత కధల్ని ప్రవక్త నిషేధించేసారు. కానీ కర్బలా మైదానం లో జరిగిన సంఘటనకి ప్రాముఖ్యత నిచ్చి అక్కడ బలి దానం చేసుకున్న వాళ్ళని ప్రత్యేకంగా వీరులుగా గుర్తించటం ఉంటుందనుకుంటాను.

అందరికీ యెక్కువగా తెలిసిన ఈ మతాలలో ఉన్న ఈ అంశాలనే నేను చూశాను. మతం అనే పేరుతో నిర్వచించబడిన వాటిలో ఉన్న సామాన్య ధర్మాల్ని పరిశీలిస్తే నాకు గోచరించిన విషయాలు అవి. యే ప్రాంతాన్ని తీసుకున్నా ప్రజల జీవన విధానాల్లో ఉండే అలవాట్లన్నీ మతానికి సంబంధించినవే అయి ఉండక్ఖర్లేదు కదా! నేను మతాలకి సంబంధించిన ప్రాధమిక విషయాలనె తీసుకున్నాను నా పరిశీలనకి.ఇవన్నీ పూర్తిగా నా పరిశీలనలే.

అదీ గాక ఆయా మతాల్ని పాటించే వాళ్ళు నేను పైన చెప్పిన మూడు విషయాల్నీ తప్పని సరిగా ఒప్పుకోవాలనే ఉల్లేఖనలు ఆయా గ్రంధాల్లో - కొన్ని చోట్ల హెచ్చరికలూ నిషేఢాల స్థాయిలో కూడా - ఉన్నాయి. కానీ హిందువులంకి అలాంటి హెచ్చరికలు గానీ నిషేధాలు కానీ యేవయినా ఉన్నాయా? మునుల్లో నేను కపిల మునిని అని గీతలో సాక్షాత్తూ భగవాన్ శ్రీ కృష్ణుడు చెప్పాడు కదా, ఆ కపిల ముని యెవరో తెలుసా? నిరీశ్వర సాంఖ్య యోగ ద్రష్ట. కణాద కపిలు లనే పేర్లు వినే ఉంటారు, వాళ్ళది నిరీశ్వర వాదాలు. కణాదుడు ఇవ్వాళ లీవెన్ హాక్ చెప్పిన కణ సిధ్ధాంతాన్ని, అంటే ఈ ప్రపంచమనతా కణాలు అనే ఇటుకలతో నిర్మించబడింది అనే వాదన చేసాడు.అసలు దేవుడే లేడన్నా ఫరవా లేదు కానీ , ధర్మాన్ని మాత్రం తప్పకూడదు అనే స్పూర్తి ఇక్కడ విలసిల్లింది. ఈ ఆధారాల తోనే నేను పైన ఉదాహరించిన సూత్రీకరణలు చేశాను.

వేరే మతాలతో పోల్చడం కాదు నా ఉద్దేశం, హిందూ ధర్మం యొక్క ప్రత్యేకత అది - ప్రజాసామికంగా ఉండడం అనెది కొత్తగా మనం వేరే వాళ్ల నుంచి చేర్చాల్సిన పని లేదు - అని చెప్పడమే నా ఉద్దేశం. మన ఋషి పరంపర మొత్తం పైనించి ఆజ్ణల తోనూ నిషేధాల తోనూ ప్రజల్ని బలవంతంగా మతానికి విధేయులుగా ఉంచడం కాకుండా ప్రజలకు యేది మంచిదో అది మాత్రమే చెప్పి ఆధ్యాత్మిక వికేంద్రీకరణని అంతర్లీనంగా ఉంచడం జరిగింది. అందు వల్లనే మనకి సహిష్ణుత అనే మంచి లక్షణం అలవాటు అయ్యింది. కేవలం అందువల్లనే నిన్న గాక మొన్న ప్రాచుర్యం లోకి వచ్చిన ఇతర మతాల్లో ఆచరణకి సంబంధించిన గందరగోళాలతో విశ్వాసాలు సదలి పోయేటంతగా ప్రబలుతున్నాయి గానీ, కొన్ని వేలయేళ్ళ నుంచీ ఇక్కడి జీవధార అవిచ్చిన్నంగా కొనసాగుతూనే వస్తున్నది.

కంచి స్వాములకి ఆనాడు మనం గట్టిగా సంఘీభావం తెలపక పోవటానికి మనలో ఉన్న ఈ సహిష్ణుత కూడా ఒక కారణం కావచ్చునని అనిపిస్తున్నది- వైరము లేని హింసను చేయటానికి సిద్ధపడని హిందూసమాజం - వ్యాసకర్త అన్నట్టు.అంత తొందరగా ప్రతిదానికీ రెచ్చిపోవడం ముందు ముందు కూడా చెయ్యలేమేమో!యేమయినా సభ్యతా స్థాయిని దాటి హిందూసమాజం మొత్తాన్ని అవమానించే విధమయిన వాటికి మాత్రం మనం గట్టిగానే స్పందించాలి.

తెలుగులో టైప్ చేయండి

కైఫీయతులు

  © బ్లాగర్ టెంప్లేట్ "ప్సై" రూపొందించినవారు Ourblogtemplates.com 2008

ఈ పుట పైభాగానికి వెళ్ళడం కోసం ఇక్కడ నొక్కండి