నేనూ హిందువునే !! - ఫరూక్ అబ్దుల్లా
ఫరూక్ అబ్దుల్లా |
"నేను
మహమ్మదీయుడను కాను, నిజం చెప్పాలంటే నేను కాశ్మీరులోని సారస్వత పండిత
బ్రాహ్మణ కుటుంబానికి చెందిన హిందువును. కొన్ని తరాల క్రితం మేమంతా
ఇస్లాంలోకి మతమార్పిడి చేయబడ్డాం. కాబట్టి మేము మహమ్మదీయులుగా
పరిగణించబడుతున్నాం".
ఈ
మాటలు సాక్షాత్తూ కేంద్ర మంత్రిగా ఉన్న ఫరూక్ అబ్దుల్లా స్వయంగా అన్నారు.
ఆయన కాశ్మీరీ భాషలో మాట్లాడుతూ ఇంకా ఇలా అన్నారు - "నేను కాశ్మీరు సారస్వత
పండితుడను కాబట్టే కాశ్మీరీ భాష మీద ఇంత పట్టు ఉన్నది. ఆ భాష కూడా చక్కగా
మాట్లాడుతున్నాను".
ఫరూక్
అబ్దుల్లా జమ్మూ-కాశ్మీర్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఈ ఫరూక్
అబ్దుల్లా ఒకప్పటి మాజీ ముఖ్యమంత్రి షేక్ అబ్దుల్లాకు కుమారుడు, ప్రస్తుత
ముఖ్యమంత్రి అయిన ఒమర్ అబ్డుల్లాకు తండ్రి కూడా. ఫిబ్రవరి 19, 2014న
జమ్మూ-కాశ్మీరు రాజధాని శ్రీనగర్ లోని ప్రగతి మైదానంలో కాశ్మీరు బాలబాలికల
కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన పుస్తకం విడుదల సందర్భంగా ఫరూక్ అబ్దుల్లా
పై విధంగా ప్రకటించాడు.
ఫరూక్
అబ్దుల్లా ఇంకా మాట్లాడుతూ - "కాశ్మీరు సంస్కృతి, వేష భాషలు, జీవన శైలి
అన్నీ కూడా ఈ పుస్తకంలో ఉన్నాయి" అని చెపుతూ ఇటువంటిదే ఇంకొక కార్యక్రమం
యువత కోసం కూడా చేపట్టబోతున్నట్లు వాగ్దానం చేశారు. కాశ్మీరు భారతీయ
సంస్కృతేనని మనం గమనించాలి.
దేశంలో
మెల్లమెల్లగానైనా ఆహ్వానించదగ్గ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. రాజస్తాన్
లో కూడా ఒక వర్గానికి చెందిన మహమ్మదీయులు తమ పూర్వీకులు హిందూ
క్షత్రియులనీ, తామంతా రాణాప్రతాప్ కోసం పోరాడిన వారమని గర్వంగా చెప్పటమే
కాక తిరిగి హిందుత్వం ఒడిలోకి రావాలని ఉత్సుకత చూపిస్తున్నారు. మతం
మార్చబడినవారు చాలామంది తమ మూలాలను తెలుసుకుని మాతృఒడిలోకి తిరిగి
రావాలనుకోవడం దేశానికి శుభసూచకం.
శుభం భూయాత్
- ధర్మపాలుడు
5 కామెంట్‌లు:
So what?! What is the pleasure you are deriving in a politicians blabber?
యేసు ప్రభువునకు తప్పి పోయిన అమాయకపు గొర్రె తప్పు తెలుసుకుని తిరిగి తనను చేరినప్పుడు కలుగు ఆనందం:-P)
Great information, thank you for sharing....
ins.media
కామెంట్‌ను పోస్ట్ చేయండి