26, జూన్ 2012, మంగళవారం

చారిత్రిక అనుభవాలనుంచి హిందువులు గుణపాఠాలు నేర్వాలి

పాశ్చాత్య విద్యా వ్యామోహం ఒక తీయని విషం. అది ఆధునికీకరణ పేరుతో అమలవుతున్న భస్మాసుర హస్తం. అది మనల్ని కరకరా నమిలి మింగడానికి సిద్ధంగా ఉన్న కలిపురుషుడి కరాళదంష్ట్ర. ప్రతివారినీ బాగు చేసేస్తామని ప్రచారం ద్వారా మభ్యపెట్టి, వాళ్ళ చేతికి ఒక లాటరీ టిక్కెట్టిచ్చి, వారందఱినీ తమ పూర్వస్థానాల నుంచి భ్రష్టుల్ని చేసి, ఆఖరికి వారిలో కొద్దిమందిని మాత్రం బాగుచేసి మిగతా కోట్లాదిమందిని పేదలుగా, అనాథలుగా మిగిల్చే ఒక మోసపూరిత ప్రక్రియ. ఉదాహరణకి, మన రాష్ట్రంలో యావత్తు విద్యావిధానమూ జనాన్ని అమెరికా, ఆస్ట్రేలియా పంపడమే లక్ష్యంగా పనిచేస్తోంది. అందఱమూ ఇంగ్లీషు నేర్చుకొని రాష్ట్రాన్ని వదిలిపెట్టి పారిపోదామనే పిఱికి ఎస్కేపిస్టు ఫిలాసఫీని ఇది ప్రచారం చేస్తోంది. పాఠశాలలకి పేర్లు కూడా ఆ లక్ష్యానికి అనుగుణంగానే పెడుతున్నారు, తల్లిదండ్రుల్ని ఆకర్షించే ఉద్దేశంతో ! కెనడీ హై అట, సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ అట. చైతన్య టెక్నో అట.... వీటిల్లో చదివే పిల్లలంతా భావి అమెరికన్లు గా భావించుకోబడుతున్నారు గనుక వీటిల్లో తెలుగనే సబ్జెక్ట్ ఉండదు. తెలుగు రావడం ఈ కాబోయే బ్రౌన్ అమెరికన్లకి అవమానం గదా !

ఈ హైప్ వెనక ఉన్న వాస్తవమేంటంటే, నిజానికి అమెరికాలోనూ, ఆస్ట్రేలియాలోనూ, యూరప్ లోనూ ప్రస్తుతం పెద్దగా ఉద్యోగాలేమీ లేవు. వాళ్ళకే లేవు. ఇంక మనకేమిస్తారు ? గత కొద్ది సంవత్సరాలుగా ఆ దేశాలు గొప్ప ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి ఉన్నాయి. అందులోంచి అవి ఎప్పుడు బయటపడతాయో ఎవఱికీ తెలీదు. వాళ్ళు ఏటా మనకు జారీ చేస్తున్న వీసాలు కేవలం కొద్దివేలల్లోనే ! అయినా ఆ లక్ష్యంతోనే మిలియన్లాదిమంది చదువుకుంటున్నారు దేశీ బ్రౌన్ అమెరికన్ స్కూళ్ళల్లో ! కానీ అక్కడికి పోవడాన్ని ఘనపఱుస్తూ ఆ వలసవాద, వలసదారీ భావజాలాన్ని మనకు అమ్మజూపుతున్నాయి ఈ విద్యాసంస్థలు. "చచ్చినోడి కళ్ళు చేరెడేసి బాబూ, రండి, రండి ! భలే మంచి బేరము" అని కేకేస్తూ ! మన తెలివితేటలు మన దేశాభివృద్ధికీ, మన సాంస్కృతిక వారసత్వానికీ పనికొచ్చే విధంగా మన విద్యావిధానం ఉండాలి. చైనాకి పనికిరావాలని జపాన్ వాళ్లు చదువు నేర్చుకోరు. ఫ్రాన్సుకి పనికొచ్చే ఉద్దేశంతో స్పెయిన్ వాళ్ళు చదువు నేర్చుకోరు. కానీ ఇండియాలో - ముఖ్యంగా ఆంధ్రాలో అంతా తారుమారుగా చిత్రవిచిత్రంగా నడుస్తోంది.

గతంలో మన రాష్ట్రంలో ఒక సనాతన సామాజిక వర్గం ఇలాంటి వ్యామోహాల్లో పడి ఎలా అధః పతనం చెందిందో మనకు కనువిప్పు కావాలి.  

స్వాతంత్ర్యానికి ముందు బ్రాహ్మణులకు రాష్ట్రంలో లక్షలాది ఎకరాల వ్యావసాయిక ఎస్టేట్లు ఉండేవి.బ్రాహ్మణులు ఒక బలీయమైన వ్యవసాయకులంగా ఉండేవారు. వనపర్తి, ఉర్లామ్, పోలవరం లాంటి చోట్ల వారు రాజాలుగా, జమీందార్లుగా కూడా ఉండేవారు. ఇంత స్థాయిలో కాకపోయినా ప్రతి బ్రాహ్మణుడికీ ఎంతో కొంత పొలం ఉండేది. ఆ రోజుల్లో బ్రాహ్మణుల రాజకీయ నాయకత్వానికి వారి దేశభక్తితో పాటు ఈ భూస్వామ్యం కూడా ఒక కారణం. దేశం ఎంతగా బ్రాహ్మణుల్ని అనుసరించేది అంటే - మొట్టమొదటి లోక్‌సభ (1952) కు ఎన్నికైన MP లలో 340 మంది బ్రాహ్మణులేనంటే ఈనాటివారికి దిగ్భ్రాంతి కలగొచ్చు. పత్రికలూ, పుస్తక ప్రచురణ, రేడియోల్లాంటి మీడియా కూడా బ్రాహ్మణుల చేతుల్లోనే ఉండేది. స్వాతంత్ర్యానంతరం కేవలం ఒకటి=రెండు దశాబ్దాల్లోనే ఈ స్థితిమత్త్వం నెమ్మదినెమ్మదిగా అదృశ్యమౌతూ వచ్చింది. ఇందులో బ్రిటీషువారు రాజకీయ కక్షలతో చేసినదాని కంటే, లేదా భూసంస్కరణల పేరుతో దేశీ ప్రభుత్వాలు లాక్కున్నదానికంటే బ్రాహ్మణులు అనాలోచితంగా దూరదృష్టిలేమితో స్వయంగా చేసుకున్నదాని పాత్రే చాలాఎక్కువ. 

బ్రాహ్మణులు చేసిన పొఱపాటు ఏంటి ? అంటే, వారు ఒక దశలో బ్రిటీషువారిచ్చే ఉద్యోగాల కోసం, లేదా లా చదవడం కోసం ఉన్న భూములమ్మేసి పట్టణాలకు చేఱుకోవడం. లేదా ఆ పొలాల్ని ఎవఱో ఇతర కులస్థులకు కౌలుకిచ్చేసి పట్టణాలకు చేఱుకోవడం. ఆ తరువాత ఆ భూములతో, ఆ ఊళ్ళతో సంబంధాలు తెగిపోవడం. ఆ తరువాత వారి వారసులు ఆ పొలాల్ని ఐనకాడికి అమ్మేసుకుని శాశ్వతంగా పట్టణాలలో స్థిరపడ్డం. ఈ క్రమంలో - క్రమం తప్పని ఆదాయంగా భావించి ఏ నెలజీతపు ఉద్యోగాల కోసమైతే తాము ఎగబడ్డారో అవి, తమకొచ్చినంత సులభంగా తమ సంతానానికి రాని పరిస్థితి తలెత్తడం. ఏతావతా రెంటికీ చెడ్డ రేవడిలా, ఇటు పొలమూ లేక, అటు అనుకున్నంత స్థాయిలో జీవితానికి కుదిరికా లేక బ్రాహ్మణులు దెబ్బదిన్నారు. వారు సలామ్ చేయదగ్గ భూస్వాముల స్థాయి నుంచి అందఱికీ సలాములు కొట్టే నెలజీతగాళ్ళ స్థాయికి పడిపోయారని గమనించాలి. అయితే కులపరంగా తరతరాలుగా ఉన్న సాంస్కృతికస్థాయి, సంప్రదాయాల మూలంగా వారు పూర్తిగా నాశనం కావడం జఱగలేదు. ఆ అడ్వాంటేజిలు లేని ఇతరులు ఆంగ్లవిద్య అనే ఈ లాటరీ టిక్కెట్టు కొనుక్కుని ఏమవుతారో తల్చుకుంటే భయమేస్తుంది.

ఒకప్పుడు బ్రాహ్మణులు త్రొక్కిన ఆ తప్పుదారినే, తెలిసో, తెలియకో ఇప్పుడు అందఱూ త్రొక్కుతున్నారు. వ్యవసాయ కులాలన్నీ పాశ్చాత్యవిద్యావ్యామోహంతో, MNC ఉద్యోగాల వ్యామోహంతో పొలాల్ని వదిలేసి నగరాల బాట పట్టుతున్నాయి. పొలాల్ని ఒకసారి వదిలిపెడితే ఇహ మళ్లీ వాటిల్లో అడుగుపెట్టడం అసాధ్యం. పొలాన్ని అమ్మగలం గానీ, కొనాలనుకున్నప్పుడు మళ్లీ కొనలేం. ఎన్ని చెప్పినా ఈ దేశంలో Land is power. అది పోగొట్టుకున్నవారికి రాజకీయాధికారం కూడా దూరమైపోతుంది. కనుక ఇప్పుడు మనం అగ్రకులాలూ, రాజకీయంగా బలవత్తరులైన కులాలూ అనుకుంటున్నవన్నీ ఒక యాభయ్యేళ్లల్లో పేదలుగా, మధ్యతరగతిగా మారే సంభావ్యత ఉంది. ఇది హిందూధర్మం మీద కూడా ప్రభావం చూపవచ్చు. 

బ్రాహ్మణులు చేసిన పొఱపాట్లను ఇతరులు పునరావృత్తం చేయకూడదు. తల్లిని నమ్మినవాడూ, భూమిని నమ్మినవాడూ చెడడనే నానుడిని మనసా వాచా కర్మణా విశ్వసించి ఎన్ని ఇబ్బందులున్నా మనం మన జీవనవిధానాన్ని కాపాడుకోవాలి.

16, జూన్ 2012, శనివారం

తెలుగుహిందువులంతా ఒకే వోట్ బ్యాంకుగా మారాలి

ఇప్పుడు జఱిగిన ఉపఎన్నికల్లో జగన్ పార్టీకి 50 శాతం కన్నా ఎక్కువ వోట్లు పడ్డాయి. ఈ ఊపు ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో అతను అధికారాన్ని చేపట్టడం ఖాయం. ఈ వోట్లలో 10 శాతం క్రైస్తవులవి, ఇంకో 10 శాతం ముస్లిములవీ, మఱో 10 శాతం హిందూ రెడ్లవీ కాక మిగతావి తక్కిన హిందూ కులాలవి. కనుక చాలావఱకూహిందువుల వోట్లతోనే అతను అధికారాన్ని చేపట్టగలడని సులభంగా అర్థం చేసుకోవచ్చు.

హిందువుల విషయానికొస్తే హిందువులకు ఈ మైనారీటీ నాయకత్వ పార్టీలు తప్ప వేఱే దిక్కు లేని పరిస్థితి దాపఱించింది. ఆంధ్రాలో స్థానికంగా హిందువుల కోసం పోరాడే పార్టీ ఏదీ లేదు.  హిందువుల పార్టీలు ఆచరణలో కులపార్టీలు మాత్రమే. అంటే మనకి కులపార్టీలు తప్ప మతపార్టీలేమీ లేవు. మైనారిటీలకు కాంగ్రెస్ ఉంది ఉమ్మడివేదికగా. ఇప్పుడు దాని స్థానాన్ని వైయస్సార్ కాంగ్రెస్ ఆక్రమించింది. అదొక్కటే తేడా.

తెలుగుదేశాన్ని ప్రజలు తెలుగుహిందువుల పార్టీగా చూడ్డం లేదు. దాన్ని సాదా సీదా కులపార్టీగానే చూస్తున్నారు. అది అన్ని ఎన్నికల్లోనూ వరసపెట్టి ఘోరంగా ఓడిపోవడానికి ఇదే కారణం. మఱోపక్క ప్రజాస్వామ్యంలో ఇతర కులాల మద్దతు లేకుండా, వాళ్ళందఱినీ కలుపుకు పోకుండా ఏ ఒక్క కులమూ స్వతంత్రంగా ఆధిపత్యంలో ఉండడం అసాధ్యమనే తెలివిడీ, వివేకమూ హిందూ అగ్రకులాలలో పూర్తిగా లోపించాయి. ఈ విషయమై నగరాల్లో కొంత చైతన్యం ఉంది. కానీ గ్రామాలకి పోయి చూస్తే అక్కడి అగ్రకులాల ప్రజలు యథాప్రకారంగా తమ సంకుచిత కులతత్త్వంలో, మతపరమైన అజ్ఞానంలోబ్రతుకుతున్నారు.

ఈ పరిస్థితి మారాలంటే వోటర్లలో విస్తృతమైన పోలరైజేషన్ రావాలి. అలా రావాలంటే హిందువుల రాజకీయ పార్టీలు కూడా తమ వంతు జాగృతిని వోటర్లలో కలిగించాలి. ఊరికే సెక్యులర్ పోజులివ్వడం వల్ల ఏమీ లాభంలేదు. ఇలాంటి పోజుల మూలానే వై.ఎస్. హయాంలో హిందూ దేవాలయాలకు జఱిగిన అపకారం గుఱించి మాట్లాడకుండా గమ్మున కూర్చున్నాయి అప్పట్లో హిందువుల సెక్యులర్ పార్టీలు. అలా వోట్లని  పోలరైజ్ చేసి లాభపడగల సువర్ణావకాశాన్ని అవి జాఱవిడుచుకున్నాయి.భవిష్యత్తులో కూడా YSRCP లాంటి మైనారిటీ నాయకత్వ పార్టీలు తమ మతోన్మాదం కొద్దీ, హిందువులంటే తమకున్న చిన్నచూపు కొద్దీ వై.ఎస్.ఆర్. చేసిన పొఱపాట్లనే యథాపూర్వంగా పునరావృత్తం చేస్తాయనడంలో సందేహం లేదు. వాళ్ళు తాము చేసే అపచారాలతో, తప్పులతో హిందువులకు చాలా అవకాశాలిస్తారు.  కానీ వాటిని హిందూ ప్రజానీకంలోకి విస్తృతంగా తీసుకెళ్ళి,  వోట్ల పోలరైజేషన్ ని సాధించే సత్తా, ఉద్దేశమూ తెలుగుదేశంలాంటి హిందూ పార్టీలకుందా ? అనేది సందేహాస్పదం. ఎందుకంటే వాటి ట్రాక్ రికార్డు మఱోలా ఉన్నట్లు కనిపిస్తోంది.

9, జూన్ 2012, శనివారం

విద్రోహాన్ని పెంచనున్న ‘రాజ్యాంగ సమీక్ష’!

తగాదా పడుతున్న ఉభయ పక్షాల మధ్య తగవు తీర్చడానికి మధ్యవర్తులు అవసరం. ‘జమ్మూకాశ్మీర్’ సమస్యను పరిష్కరించడానికి ముగ్గురు మధ్యవర్తులను నియమించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం వారు ఆ రాష్ట్రం విషయంలో తమకూ మరెవరికో మధ్య వివాదం కొనసాగుతున్నట్టు గుర్తించినట్టయింది! ఇలా గుర్తించడం మన రాజ్యాంగ వ్యవస్థ స్ఫూర్తికి విరుద్ధమైన అంశం! ప్రజలకూ ప్రభుత్వానికీ మధ్య తగాదా ఏమిటి?? దాదాపు పంతొమ్మిది నెలల క్రితం నియుక్తులైన ఈ మధ్యవర్తి మహాశయులు కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిన పరిష్కార నివేదిక గత నెల 24వ తేదీన బయటపడింది! కాశ్మీర్‌లోని విచ్ఛిన్నవాదుల ఆకాంక్షలకు పాకిస్తాన్ అనుకూల విద్రోహపు తండాల మనోభావాలకు ఈ నివేదిక అద్దంపడుతోంది! ఈ నివేదికలోని సిఫార్సులను అమలుజరిపినట్టయితే జమ్మూకాశ్మీర్ కథ క్రీస్తుశకం 1947వ, 1952వ సంవత్సరాల మధ్య నడచిన విద్రోహకాండకు పునరావృత్తికాగలదు. ఎటొచ్చీ ఈ పునరావృత్త గాధలో కాశ్మీర్ లోయలోని హిందువులు మాత్రం ఉండరు!

1947 అక్టోబర్ 26వ తేదీన కాశ్మీర్ రాజు హరిసింగ్ ఆ ప్రాంతాన్ని మిగిలిన భారతదేశంలో విలీనం చేయడం చారిత్రక వాస్తవం. అందువల్ల కాశ్మీర్‌కు సంబంధించిన వివాదం లేదు! కానీ ఆ తరువాత పాకిస్తాన్ అక్రమ అధీనంలో ఎనబయి మూడు వేల చదరపు కిలోమీటర్ల భూభాగం ఉండిపోవడమే వివాద కారణం! దాన్ని రాబట్టుకోవడం మాత్రమే వివాద పరిష్కారం! కానీ దాన్ని రాబట్టుకొని వివాదాన్ని పరిష్కరించే మాటను మన ప్రభుత్వాలు మరచిపోయాయి. 1993లో పాకిస్తాన్ ప్రభుత్వంవారు కాశ్మీర్‌లో ‘హక్కుల’కు భంగం కలుగుతోందన్న తీర్మానాన్ని ఐక్యరాజ్యసమితిలో ప్రతిపాదించారు! అప్పటి ప్రధాని పి.వి.నరసింహారావు అభ్యర్థన మేరకు ప్రతిపక్ష నాయకుడు అటల్ బిహారీ వాజ్‌పేయి నాయకత్వంలోని ప్రతినిధి బృందంవారు ఐక్యరాజ్యసమితికి వెళ్లి పాకిస్తానీ తీర్మానాన్ని వమ్ముచేసి రాగలిగారు. జమ్మూకాశ్మీర్ భారతదేశంలోని భాగమన్న సత్యాన్ని ప్రపంచ దేశాలు గుర్తించాయి!

1972లో కుదిరిన సిమ్లా ఒప్పందం భారత పాకిస్తాన్ మధ్య ఉన్న వివాదాలన్నీ ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి! మూడవ దేశం ప్రమేయం లేదు! అందువల్ల 1994నాటి తీర్మానం ప్రకారం పాకిస్తాన్ దురాక్రమణలో కొనసాగుతున్న కాశ్మీర్ భూభాగాలు జమ్మూకాశ్మీర్‌తో ఏకీకృతం అయినట్టయితే కథాకధిత కాశ్మీర్ సమస్య లేదు! కానీ ఇలా ఏకీకృతం చేసే విషయం మన ప్రభుత్వాలు మరచిపోయాయి. అందువల్ల పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో తిష్ఠవేసిన పాకిస్తానీ బీభత్సకారులు జమ్మూకాశ్మీర్‌లోని దేశంలోని ఇతర ప్రాంతాలలోకి చొరబడుతున్నారు. దశాబ్దులుగా జమ్మూకాశ్మీర్‌లోను ఇతర ప్రాంతాలలోను పాకిస్తాన్ సృష్టిస్తున్న బీభత్సకాండ మాత్రమే సమస్య! ఈ బీభత్సకాండ ఫలితంగా పాకిస్తాన్ ఆక్రమిత ప్రాంతంలోను, కాశ్మీర్ లోయ ప్రాంతంలోను అనాదిగా జీవించిన హిందువులు హత్యాకాండకు, అత్యాచారాలకు తరిమివేతకు గురిఅయినారు! ఈ హిందువులు భారతదేశ భక్తులు. జమ్మూకాశ్మీర్- పాకిస్తాన్ చైనా ఆక్రమిత భూభాగంతోసహా- భారతదేశంలో కొనసాగాలని భావిస్తున్నారు. 1947నుండి పాకిస్తాన్ ఆక్రమిత ప్రాంత హిందువులు, 1990 నుండి లోయ ప్రాంతంలోని హిందువులు తమ సంస్థలకు దూరమై శరణార్ధి శిబిరాలలోను కాశ్మీర్ వెలుపలి ప్రాంతాలలోను జీవచ్ఛవ జీవన యాత్రను సాగిస్తున్నారు. అందువల్ల పాకిస్తాన్ ప్రేరిత బీభత్సకాండను నిర్మూలించడం జమ్మూకాశ్మీర్‌లో ప్రశాంతికి ప్రధాన పరిష్కారం. బీభత్సకాండ అణగారిపోయినట్టయితే లోయ ప్రాంత హిందువులు తమ స్వస్థలాలకు తిరిగి వెడతారు! పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌ను జమ్మూకాశ్మీర్‌లో ఏకీకృతం చేసినట్టయితే జమ్ములో ఉంటున్న పాకిస్తాన్ ఆక్రమిత ప్రాంత హిందువులు కూడా జన్మస్థలాలకు తిరిగి వెడతారు! ‘మధ్యవర్తుల’ నివేదికలో ఈ బీభత్సకాండ నిర్మూలనకోసం చేసిన సిఫార్సులు లేవు! నిర్వాసిత హిందువులు.. మధ్యవర్తులకు కాని కేంద్రానికి కాని గుర్తులేదని ఇలా స్పష్టమైంది!

ఇలా అసలు సమస్యను వదలివేసిన మధ్యవర్తులు జమ్మూకాశ్మీర్‌కు వర్తిస్తున్న కేంద్ర ప్రభుత్వపు చట్టాలను సమీక్షించాలని సూచించారు. అలాగే 1950 తరువాత వివిధ సమయాలలో జమ్మూకాశ్మీర్‌కు వర్తింపచేసిన భారత రాజ్యాంగ విషయాలను కూడ సమీక్షించాలని మధ్యవర్తుల సంఘం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టాలవల్ల జమ్మూకాశ్మీర్ ప్రజలకు జరిగిన నష్టం ఏమిటన్నది మధ్యవర్తుల బృందం సూచించలేదు! అలాగే భారత రాజ్యాంగంలోని వివిధ అంశాలు మిగిలిన రాష్ట్రాలతోపాటు కాశ్మీర్‌కు వర్తించడంవల్ల ఆ రాష్ట్ర ప్రజలలో కలిగే ఇబ్బందులు ఏమిటో కూడ మధ్యవర్తులు విశే్లషించలేదు. 1953 సంవత్సరానికి ముందు కాశ్మీర్‌కు ఉండిన ప్రతిపత్తిని పునరుద్ధరించడం సాధ్యంకాదని చెప్పిన మధ్యవర్తుల ‘నివేదిక’. మరోవైపు దీన్ని సాధ్యం చేయడానికి అవసరమైన ‘సమీక్ష’లను సిఫార్సుచేసింది! ‘సమీక్ష’ కోరుతున్న వారు బీభత్సకారులను సమర్ధిస్తున్న ‘హురియత్’ కాన్ఫరెన్స్ వంటి ముఠాలవారు! నిజానికి సమీక్ష మాత్రమే ఈ ముఠాల లక్ష్యంకాదు! మన దేశంనుండి జమ్మూకాశ్మీర్‌ను విడగొట్టడానికి జరుగుతున్న కుట్రకు ఈ ‘సమీక్ష’ దోహదపడగలదని మాత్రమే ఈ ముఠాలు భావిస్తున్నాయి! కాశ్మీర్ లోయలో పాకిస్తాన్ అనుకూల బీభత్స ముఠాలు సమాంతర పాలన నిర్వహిస్తున్నాయి. అందువల్ల ఈ ముఠాల మద్దతును కూడ కట్టుకొనడంవల్ల ఎన్నికలలో విజయం సాధించవచ్చునన్నది ‘రాజ్యాంగ నిబద్ధత’కల రాజకీయ పార్టీల ఆశ. ఫలితంగా ఈ ‘సమీక్ష’కు అనుగుణమైన అనేక కోరికలను ఈ పార్టీలు దశాబ్దులుగా వెళ్లబుచ్చుతున్నాయి.

మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా ప్రస్తుత ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లాల నాయకత్వంలోని ‘నేషనల్ కాన్ఫరెన్స్’వారు జమ్మూకాశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తి- అటానమీ- గురించి ప్రచారం చేస్తున్నారు. భారత రాజ్యాంగం 370వ అధికరణ కాశ్మీర్‌కు ప్రసాదించిన ‘ప్రత్యేక ప్రతిపత్తి’వల్ల, ఈ ‘ప్రత్యేక ప్రతిపత్తి’ - స్పెషల్ స్టాటస్-కి 1950వ దశకంలో ఆ అధికరణంలో లేని అర్ధాలు కల్పించడంవల్ల, ఇలా అర్ధాలు కల్పించిన వారిని నిలదీసిన వారు లేకపోవడంవల్ల 1953 వరకు కాశ్మీర్ ముఖ్యమంత్రిని ప్రధానమంత్రి అని పిలిచేవారు. అలాగే కాశ్మీర్‌కు ప్రత్యేక రాజ్యాంగం, ప్రత్యేక పతాకం ఏర్పడి ఉన్నాయి! ప్రముఖ జాతీయ సమైక్యతావాది, స్వాతంత్ర సమరయోధుడు ‘జనసంఘ్’ నాయకుడు డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ చేసిన బలిదానం ఫలితంగా కాశ్మీర్ ‘ప్రధానమంత్రి’ పదవిని ‘ముఖ్యమంత్రి పదవి’గా మార్చడం అనివార్యం అయింది. ఒకే దేశంలో ‘ఇద్దర ప్రధానమంత్రులు’ ఉండడం 1953 సంవత్సరపు పూర్వస్థితి! తమ ‘స్వయం ప్రతిపత్తి’ ద్వారా 1953 నాటికి ముందున్న రాజ్యాంగ వైపరీత్యాన్ని మళ్లీ సృష్టించాలన్నది ‘నేషనల్ కాన్ఫరెన్స్’ వారి వ్యూహం. ఇందుకు అనుగుణంగా ఫరూక్ అబ్దుల్లా ప్రభుత్వం 1990 దశకంలోను, ఈ శతాబ్ది ఆరంభంలోను అనేకసార్లు తీర్మానంను ఆమోదించింది.

మరో మాజీ ముఖ్యమంత్రి ముఫ్తిమహమ్మద్ సరుూద్, ఆయన కుమార్తె మెహబూబాముఫ్తి నాయకత్వంలోని పీపుల్స్ డెమొక్రాటిక్ పార్టీవారు కోరుతున్న ‘స్వయంపాలన’- సెల్ఫ్‌రూల్-‘ప్రత్యేక ప్రతిపత్తి’కంటే మరింత ప్రమాదకరమైనది! ఈ ‘స్వయం పాలన’ ప్రతిపాదనను నిజానికి అప్పటి పాకిస్తాన్ నియంత పర్‌వేజ్ ముషారఫ్ 2005వ సంవత్సరంలో ప్రకటించాడు. దీన్ని ‘పిడిపి’వారు అందిపుచ్చుకున్నారు! భారత వ్యతిరేకతను పాకిస్తాన్ అనుకూలతను ప్రకటించినప్పుడు మాత్రమే లోయ ప్రాంతంలోని వోటర్లు తమ పార్టీని గెలిపిస్తారన్న ‘భ్రాంతి’ దీనికి కారణం. నిజానికి ‘లోయ’ ప్రాంతం ప్రజలలో అత్యధికులు దేశభక్తులు, బీభత్సకాండను వ్యతిరేకిస్తున్నారు. కానీ వేల సంఖ్యలోను బీభత్సకారులకు భయపడి మెజారిటీ ప్రజలు తమ భావాలను వ్యక్తంచేయడం లేదు. ‘భ్రాంతి’కి లోబడి ఉన్న ‘పిడిపి’ మాత్రం ‘హురియత్’ కాన్ఫరెన్స్‌కు చెందిన ముదురు ముఠా - హార్డ్ లైన్ ఫ్యాక్షన్- వారికి అనుకూలంగా ప్రవర్తిస్తోంది. ఈ హురియత్ ముదురు ముఠావారు జమ్మూకాశ్మీర్‌ను పాకిస్తాన్‌లో కలపాలని వాంఛిస్తున్నారు. భారత రాజ్యాంగం పట్ల విధేయతను ప్రకటించడం లేదు. ‘స్వయంపాలన’లో భాగంగా కాశ్మీర్‌కు కొత్త ద్రవ్య వినిమయ విధానం- మానిటరీ సిస్టమ్- కావాలట! భారతీయ కరెన్సీ స్థానంలో కాశ్మీరీ కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టాలట!

ఇలా పిడిపి, నేషనల్ కాన్ఫరెన్స్ పోటాపోటీగా 1953 పూర్వస్థితిని పునరుద్ధరించాలని కోరుతున్నారు. 2010లో కేంద్ర ప్రభుత్వం మధ్యవర్తుల-ఇంటర్ లొక్యూటర్స్-ను నియమించడానికి నేపధ్యం ఇది. ‘అటానమీ’ కావాలని కోరుతూ జమ్మూకాశ్మీర్ శాసనసభ చేసిన తీర్మానాన్ని 2010 ఆగస్టులో పార్లమెంటు తిరస్కరించింది. ఆ తరువాత సెప్టెంబర్‌లో కేంద్రం కాశ్మీర్ ప్రశాంతికోసం అష్ట సూత్ర ప్రణాళికను ప్రకటించింది! ఈ ప్రణాళికలోని ఒక అంశం ‘మధ్యవర్తులు’ అన్నివర్గాల ప్రజలతోను చర్చలు జరపాలన్నది. పత్రికా రచయిత దిలీప్ పడ్‌గావ్‌కర్, కేంద్ర ప్రభుత్వపు సమాచారశాఖ కమిషనర్ ఎమ్.ఎమ్.అన్సారీ, ఓ స్వచ్చంద సంస్థకు చెందిన రాధాకుమార్ ఈ మధ్యవర్తులు! ఈ మధ్యవర్తులు ప్రధానంగా చర్చలు జరిపింది ‘అటానమీ’. ‘సెల్ఫ్‌రూల్’ వాదులలోను, ‘హురియత్’ వంటి విచ్ఛిన్న ముఠాలతోను మాత్రమే! పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌నుంచి, కాశ్మీర్ లోయనుంచి తరిమివేతకు సరైన దాదాల పది లక్షల మంది బాధితుల ప్రతినిధులను ఈ మధ్యవర్తులు పట్టించుకోలేదు!

దశాబ్దులపాటు వర్తింపచేయడం వల్ల మూడువందల డెబ్బయవ అధికరణం స్ఫూర్తి నీరుకారిపోయిందని మధ్యవర్తుల బృందం నిర్ణయించడం విస్మయకరమేకాదు, అర్థ రహితం కూడ! ‘‘అటానమీ’, ‘స్వయంపాలన’కోరుతున్న వారిని సంతుష్టీకరించడానికి వీలుగా మధ్యవర్తులు ఈ ‘సమీక్ష’ను సిఫార్సుచేశారు! కాశ్మీర్‌కు వర్తిస్తున్న కేంద్ర ప్రభుత్వపు చట్టాలను, రాజ్యాంగ నిబంధనలను ‘సమీక్ష’ చేయడమంటే కొన్నింటిని తొలగించ వస్తుందన్నది ధ్వని! సుప్రీంకోర్టు న్యాయాధికార పరిధిని, కంట్రోలర్ ఆడిటర్ జనరల్- సిఏజి-వారి ఆర్థిక అధికార పరిధిని తొలగించాలనడం, గవర్నర్‌ను నియమించే అధికారాన్ని రాష్టప్రతి పాలనను విధించే అధికారాన్ని కేంద్ర ప్రభుత్వానికి లేకుండా చేయడం వంటివి ‘స్వయంపాలన’ సమర్ధకులు, ‘స్వయంప్రతిపత్తి’ విధానకర్తలు కోరుతున్న కోర్కెలు! సమీక్షకోసం ఏర్పడే ‘రాజ్యాంగ సంఘం’వారు వీరితో జరిపే చర్చల సందర్భంగా ఈ విద్రోహవాంఛలు మళ్లీ విస్తృతంగా ప్రచారవౌతాయి.

7, జూన్ 2012, గురువారం

కదిలెను 'కోదండపాణి'...

నాటక, కథ, నవలా రచయితగా ఐదు దశాబ్దాల అనుభవం ఆయన సొంతం. రంగస్థల నటుడిగా కూడా ఆయన కళాభిమానులకు సుపరిచితులే. ఆయనే నెమలికంటి తారక రామారావు. రామాయణ కావ్యంలో మనకు తెలియని కొత్త కోణాలను ఆవిష్కరిస్తూ ఆయన తాజాగా రచించిన 'కోదండపాణి' నాటకం ఇటీవల భాగ్యనగరిలో మూడు రోజుల ప్రదర్శనలు జరుపుకుంది. రామాయణం విశిష్టతను, ఆ మహాకావ్యంపై ఉన్న అపోహలు, అనుమానాలను నివృత్తి చేయడమే తమ నాటక ప్రధాన ఉద్దేశమంటున్న తారకరామారావుతో కాసేపు...

మాట పుట్టినపుడే రామాయణం పుట్టింది. వాల్మీకి నోట నుంచి రామాయణం వెలువడినపుడు బ్రహ్మాండమైన వెలుగు వ్యాపించినట్లు మహాకవి కాళిదాసు పేర్కొన్నాడు. రామాయణం ఒక పౌరాణిక గ్రంథం మాత్రమే కాదు. మనిషి ఎలా జీవించాలో నేర్పింది..మనిషికి ఉండాల్సిన సద్గుణాలకు శ్రీరాముడే ఆదర్శనీయుడు. ఆడిన మాట తప్పనివాడు, పితృ వాక్యపరిపాలకుడు, ఏకపత్నివ్రతుడు వంటి పరమోత్తమ గుణ సంపన్నుడైన శ్రీరాముడి ధర్మప్రవృత్తిని ఆధునిక సమాజానికి అర్థమయ్యే రీతిలో వివరించే ప్రయత్నం ఈ 'కోదండపాణి' నాటకంలో చేశాను.

మానవ విలువలు పతనావస్థకు దిగజారిన ఈ కాలంలో రామాయణ మహాకావ్యాన్ని నాటకంగా ప్రజలకు చేరువ చేయాలన్న ఆలోచనతో ఈ రచనకు పూనుకున్నాను. భ్రమర కీటక న్యాయం, మార్జాల కిశోర న్యాయం, మర్కట కిశోర న్యాయం వంటివి రామాయణ గా«థకు అన్వయించాను. తెలిసిన రామాయణ గా«థను, తెలియని ఎన్నో విషయాలను విశ్లేషిస్తూ ఈ నాటకం సాగుతుంది. రామాయణం గురించి చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. వాలిని చెట్టు చాటు నుంచి దొంగచాటుగా రాముడు వధించడం సబబు కాదు కదా వంటి అనుమానాలు చాలామందిలో ఉన్నాయి.

ఇలాంటి సందేహాలను నివృత్తి చేయడంతోపాటు రామాయణంలోని రహస్యాల పరమార్థాన్ని కూడా ఈ నాటకం ద్వారా వివరించే ప్రయత్నం చేయాలన్నది నా ముఖ్య ఉద్దేశం. ఇందుకోసం ఇలపావులూరి పాండురంగారావు రచించిన 'రామాయణంలో స్త్రీ పాత్రలు', శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి రచించిన వాల్మీకి రామాయణం, మొల్ల రామాయణం, డాక్టర్ గుండి వెంకటాచార్యులు రచించిన 'వాల్మీకి, రంగనాథ రామాయణాల తులనాత్మక పరిశీలన', విశ్వనాథ అచ్యుత దేవరాయలు రచించిన 'సీత' నవల తదితర అనేక పరిశోధనా గ్రంథాలను పరిశీలించి ఈ 'కోదండపాణి' నాటకాన్ని తయారుచేయడం జరిగింది.

రాముడు 'కోదండపాణే'
రామాయణంలో ధనుస్సుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా మూడు ధనుస్సుల ప్రస్తావన రామాయణంలో వస్తుంది. సీతా కల్యాణంలో శ్రీరాముడు శివధనుస్సును విరిచి సీతను పరిణయమాడతాడు. పరశురాముడి దగ్గర ఉన్నది విష్ణుధనుస్సు. అది కూడా రాముడు సంధించాడు. అధర్వణ వేదంలోని మంత్రాలన్నీ కోదండంలో నిక్షిప్తమై ఉంటాయి. అందుకే కోదండం ధరించిన వాడు మహాబలవంతుడై ఉండాలి. సూర్యవంశంలో మొట్టమొదటిసారి కోదండం ధరించిన వాడు శ్రీరాముడు ఒక్కడే కాబట్టే కోదండపాణి అయ్యాడు. రాముడిని మనం ఎన్నిపేర్లతో పిలిచినా ఆయన అసలు పేరు మాత్రం కోదండపాణే.

పాయసం పంపకం
రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల జననానికి సంబంధించి కూడా ఆసక్తికర ఘట్టం ఉంది. దశరధుడు తనకు పుత్రకామేష్టి యాగం ద్వారా లభించిన దివ్యపాయసాన్ని తన ముగ్గురు భార్యలకు సమానంగా పంచడు. రాముడు పూర్ణాంశంలో సగం. అందుకే పెద్దభార్య కౌసల్యకు పాయసంలో సగం అందచేస్తాడు. మిగిలిన పాయసాన్ని మూడు భాగాలు చేసి అందులో రెండుభాగాలను సుమిత్రకు, ఒక భాగాన్ని కైకేయికి ఇస్తాడు. అందుకే సుమిత్రకు కవలలు-లక్ష్మణుడు, శత్రుఘ్నుడు జన్మిస్తారు. ఇందులో ఒకడు రాముడి వెంట, ఒకడు భరతుడి వెంట ఉంటారు.

నరుడు కాదు నారాయణుడు
సమస్త సంపదలను, సౌభాగ్యాన్ని లంకలో పొదుపుకున్న రావణుడు మర్కట బుద్ధి కలవాడు కావడంతో సర్వనాశనాన్ని కోరి తెచ్చుకున్నాడు. రాముడు మనకు ఆదర్శనీయుడు. మనం ఇలా ఉండకూడదు అని రావణుడిని చూసి నేర్చుకోవాలి. అయోధ్య నుంచి లంకకు వచ్చి తనపై యుద్ధానికి సిద్ధమైన రాముడి గొప్పతనాన్ని రావణుడు చివరిలో గ్రహిస్తాడు. వచ్చిన వాడు నరుడు కాదు నారాయణుడని తెలుసుకుని అతని చేతిలో తనకు మరణం తధ్యమని నిశ్చయించుకుంటాడు. తన భర్తను సంహరించడానికి వచ్చిన రాముడిని చూడాలనుకుంటుంది అతని భార్య మండోదరి. అలాగే యుద్ధానికి ముందు రోజు రాత్రి రాముడిని కలుసుకుంటుంది.

శని పాత్ర ప్రత్యేకత
అలాగే ఈ నాటకంలో మరో విశిష్టపాత్ర శనిదేవుడిది. అడవిలో వేటకు వెళ్లిన దశరథుడు సంధించిన శబ్దభేదికి మునికుమారుడు మరణించగా అతని తండ్రి నీకూ పుత్రశోకం లభిస్తుందని శాపం ఇవ్వడం కూడా శని ప్రభావం వల్లనే. వాల్మీకి- మానిషాద శ్లోక ఆవిర్భావం నుంచి ప్రారంభమయ్యే నాటకంలో దశావతారాల విశిష్టత, సీతారాములకల్యాణం, వనవాసంలో సీతారాముల జీవితం, వనవాసంలో తార రాముడికి శాపం ఇవ్వడం వంటివి కొత్త కోణంలో చూపాము. రావణబ్రహ్మ మందిరంలో శని పాత్రతో నాటకం ముగించడం కూడా ఓ కొత్త ప్రయోగం.

విస్తృత ప్రదర్శనలకు సన్నాహాలు
శ్రీకళానికేతన్, హైదరాబాద్ ఆధ్వర్యంలో డిఎస్ఎన్ మూర్తి దర్శకత్వం వహించిన 'కోదండపాణి' నాటకంలో మొత్తం 26 పాత్రలు ఉంటాయి. నాటకం నిడివి 2.30 గంటలు. 14 మంది సాంకేతిక నిపుణులు, ఓ డజను మంది నృత్య కళాకారులు పనిచేశారు. ఈ నాటక ప్రదర్శనకు కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖ ఆర్థిక సహాయంతో రాష్ట్ర రాజధానిలో మూడు రోజుల ప్రదర్శన ఇచ్చాము. భద్రాచలం దేవస్థానం, తిరుమల తిరుపతి దేవస్థానంతోపాటు, సౌత్ జోన్ కల్చరల్ సెంటర్(తంజావూరు), సౌత్ సెంట్రల్ కల్చరల్ జోన్(నాగపూర్)లను ఈ నాటక ప్రదర్శనకు సంబంధించి సంప్రదింపులు జరుపుతున్నాం.

ఢిల్లీకి చెందిన భారత రంగ మహోత్సవ్ (నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా) వారు ప్రతి ఏటా జనవరిలో 14 రోజుల పాటు నిర్వహించే జాతీయ నాటక మహోత్సవాల కోసం సంప్రదింపులు జరుగుతున్నాయి. మన రాష్ట్ర సాంస్కృతిక శాఖ, సాంస్కృతిక మండలి కూడా ప్రోత్సాహం అందిస్తే రాష్ట్రవ్యాప్తంగా 'కోదండపాణి' నాటక ప్రదర్శనలు ఇవ్వడానికి మేము సిద్ధం. 040-23833878 ఫోన్ నెంబర్‌లో నన్ను సంప్రదించి కళాభిమానులు తమ సూచనలు, ప్రోత్సాహం అందచేయవచ్చు.

తెలిసిన రామాయణ గాథను, తెలియని ఎన్నో విషయాలను విశ్లేషిస్తూ ఈ నాటకం సాగుతుంది. రామాయణం గురించి చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. వాలిని చెట్టు చాటు నుంచి దొంగచాటుగా రాముడు వధించడం సబబు కాదు కదా వంటి అనుమానాలు చాలామందిలో ఉన్నాయి.ఇలాంటి సందేహాలను నివృత్తి చేయడంతోపాటు రామాయణంలోని రహస్యాల పరమార్థాన్ని కూడా ఈ నాటకం ద్వారా వివరించే ప్రయత్నం చేయాలన్నది నా ముఖ్య ఉద్దేశం.

28, ఏప్రిల్ 2012, శనివారం

ఆది హిందువులను అంతంచేయడానికే డానికే బీఫ్ ఫెస్టివల్

నాగరికత నేర్చిన మానవుడు సహజంగా తన శరీర నిర్మాణానికి అనువుగా ఉన్న శాఖాహారాన్ని భుజిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకొంటూ వస్తున్నాడు ,,ప్రపంచమంతా శాఖాహారం తీసుకొనే జాతుల ను నాగరికంగా అభివ్రుద్ది చెందినట్లుగా అనేక మానవ పరిశోధనల ద్వారా స్పష్టం చేస్తున్నా నాగరికం గా అభివ్రుద్ది చెంది  విజ్ఞానవంతుల ను అందించాల్సిన విశ్వవిద్యాలయాల్లో బీఫ్ ఫెస్టివల్లు జరగడానికి ప్రయత్నం చేయడం అనాగరికత నే అవుతుంది.
బీఫ్ తినడం వల్ల వచ్చే నష్టాల ను గమనిస్తే ఐలయ్య బౄందం ఆది హిందువుల ను సంపూర్తి గా నిర్ములించి కేవలం అగ్ర కులాల వారినే బతికించేవిధం గా కుట్ర లు పన్నినట్లు తెలుస్తోంది.
బీఫ్ లో ప్రమాదకరమైన సుక్ష్మ క్రిములు ఉంటాయి,ఇ కోలి అనే ప్రమాదకరమైన బాక్టీరియా అలా గే స్తఫిలోకాస్ అరెఇస్ అనే ప్రమాదకర బాక్టీరియా ,సాల్మొనెల్లా అనే మరో రోగాకారక సుక్ష్మ క్రిములు ఉంటాయని పరీక్షా ల ద్వారా తేలింది .
      • బీఫ్ లొ డయాక్సిన్ అనే ప్రమాదకరమైన రోగ కారక పదర్థం స్థాయి మాములు పదార్థాలకంటె ముదూ వందల రెట్లు ఉంటుంది .డయాక్సిన్ వాళ్ళ కాన్సర్ ,ఎందోమేత్ర్యోసిస్ ,మానసిక సమస్య లు ,ప్రుత్యుఆక త్పత్తి వ్యవస్థ పాడవడం ,నిస్సత్తువ,అలాగే రోగ నిరోధక వ్యవస్థ క్షీణత లాంటి ప్రమాదాలు ,అసాధారణ రక్త ,నరాల జబ్బులు బీఫ్ తినడం వాళ్ళ సంభవిస్తాయని పరిశిలన లో అమెరికా లో ఆరోగ్య సంస్థ లు ప్రచురించిన పాత్రా ల ద్వారా తెలుస్తోంది
      • బీఫ్ ను ఉత్పత్తి చేయాలంటే చెట్ల వాడకం పెరిగి అడవులు అంతరీంచే ప్రమాదం ఉంది
      • బీఫ్ ను ఎక్కువగా తినడం వల్ల ప్రక్రుతి సమతౌల్యం దెబ్బతినే ప్రమాదం ఉంది
      • బీఫ్ తినడం వల్ల ఈ కోలి అనే వైరస్ విజ్రుంభించి ప్రజల ను మట్టు బెడుతుందని కనుక్కొన్నారు
      • బీఫ్ ను జీర్ణం చేసుకోవడం మానవ జీర్ణ వ్యవస్థ కు కష్ట మైన విషయం గా పరిశోధ కు లు కనుకొన్నారు ముఖ్యంగా ఉడికించిన బీఫ్ ను తింటే జీర్ణ వ్యవస్థ పైన  శ్రమ  ను కలిగించిన వారవుతారు.
      • బీఫ్ తినడం వల్ల, మానవ శరీరం లో అందుబాటు లో ఉన్న ఎంజైముల ను తక్కువ వయసులో వాడేయాల్సి వస్తుంది ,కొత్త ఎంజైముల ను శరీరం లో సృష్టించడానికి సమయం పడుతుంది కనుక సరిర సమతౌల్యం దెబ్బతింటుంది
      • బీఫ్ వల్ల శరీరం లో అనుసంధాన వ్యవస్థ క్షిణ దశ కి చేరుతుంది ,బీఫ్ తినే వారి కి వొళ్ళు నొప్పు లు ఎక్కువయ్యి సామర్థ్యం తగ్గి పోతుంది
      • శరీరం లో ని మినరల్స్ కుడా బీఫ్ వాడకం తో తగ్గిపోయే ప్రమాదం ఉంది
      • మరణ హార్మోన్లు బీఫ్ లో మిగితా మాంసా లకంటే ఎక్కువగా ఉండడం వల్ల తిన్న వాళ్ళు మత్తు లో స్పృహ కోల్పోయే ప్రమాదా లు ఉంటాయి
      • మాడ్ కౌ అనే వ్యాధి తో వేల మంది చనిపోయిన సంఘటన ,రోజు బీఫ్ తినడతో చిన్న వయసులో నే చనిపోతున్న లక్ష లాది మరణా ల గురించి ప్రాచ్యాత్య దేశాల్లో జరుగుతున్న చర్చ లన్ని బీఫ్ తినడం తో ,ఆ తిన్న వారితో పాటు వారి కి పుట్టే వారికి కలిగే ప్రమాద కర ఆరోగ్య లోపాలు కొన్ని జాతు ల నే అమ్తరింప చేస్తాయని స్పష్టం చేస్తున్నాయి
అనేక రకాలుగా ఆరోగ్యం నాశనం చేసే బీఫ్ ఫెస్టివల్ ను విశ్వవిద్యాలం లో జరుపడం మంచిది కాదు, కులం పేరుతో వేరు చేసి చంపవద్దని  చెప్పాలి ...
క్రిశ్టియన్లు భారత దేశం లో మతమార్పిడి చేయడానికి మేము  హిందు వులమనే స్పృహ ,ఆధ్యాత్మిక ఆలోచన ల తో ఉన్న ఉన్నతమైన సాహిత్యం అద్దంకి గా తోచింది అందుకే సమాజం లో ఉన్న విస్మృతి, విజాతియుల దాడి వల్ల కొన్ని కులా లు హిందు ఆధ్యాత్మిక చింతన కు సాహిత్యాని దూరం గా, భక్తీ మార్గం లో నే, దైవ ప్రార్థ న చేసుకొనే వారిని  సులభం గా మతమార్పిడి చేయవచ్చొని గ్రహించిన మిషనరీ లు దెస వ్యాప్తం గా ఒకే కులం వారు ఉపనిషి త్తు ల కు,వేదాల కు  దూరం గా లేరని, ప్రాంతీయం గా వివిధ కులాలు వారి వారి భావన దృష్ట్యా ,విడి విడి గా చేస్తున్న సాధన తో, ఈ కులా ల వారిని మతం మార్పించడానికి,దెస వ్యాప్తం గా వీరిని కలపి ఒకే సారి మతం మార్పిమ్చావచ్చని అంబేద్కర్ ద్వారా ప్రయత్నా లు చేసారు ..,అంబేద్కర్ క్రైస్తవ కుట్ర ల ను తెలివిగా అర్థం చేసుకొని , బౌద్ద మతం లో కి మారడం తో, ఖంగు తిన్న క్రిష్టియన్ మిషనరీ లు ,దేశవ్యాప్తం గా ఈ కులా ల ను గుర్తింపు గా ఒక పేరు ఉండాలని తద్వారా ఈ కులా ల కు మొదట తాము హిందువు లము అనే స్పృహ నుంచి దూరం చేసి హిందుత్వం ,ఆర్యులు,వైదిక మతం అనే అయోమయపు వాదన లను జత చేసి ఈ కులా లను తమ అసలైన అస్మిత ను గుర్తించకుండా ఒక రకమైన  ద్వేష భావాన్ని పెంచి, తమిళనాడు లో కొన్ని కులాలను క్రైస్తవం లో కి విజయవంతం గా మార్చగలిగారు .
తమిళ నాడు లో జరిగిన ప్రయోగాన్ని దేశవ్యాప్తం గా అమలు చేసే క్రమం లో ఈ కులా ల గుర్తింపు కు  గాంధి వాడి న హరిజన శబ్దం మతం మారినా తాము ఎస్ సి, ఎస్ టి ల మని వాదించెందు కు  అడ్డం గా ఉందా ని "దళిత" అనే పదాన్ని విస్తృతం గా వాడుక లో కి తీసుకువచ్చి మొదట దేశవ్యాప్తం గా ఉన్న ఈ కులాలందరి ని ఐక్యం  చేసి తాము వేరు హిందువు లు వేరు, తమకు ఈ దేశం లో తర తారా లుగా వస్తున్నా వారసత్వానికి సంభంధం లేదనే ఆలోచన ను పెంచి పెద్ద చేసి కొన్ని కులా ల ను దేశవ్యాప్తం గా తమ మత మార్పిడి అనే వల లో సులభం గా చిక్కే లా నిశ్శబ్దం గా తర తారా లుగా ప్రవహిస్తున్న ప్రవాహం లో దళితు లు వేరు హిందువు లు వేరు అనే ఆలోచన ను అబద్దాన్ని అమాయక విశ్వవిద్యాలయ యువకుల మెదళ్ళలో నింపే ప్రయత్నా లు గత యాభై ఏళ్ళు గా కొనసాగుతున్నాయి.
దళిత అనే పేరుతొ వేరు చేసినా కోర్టు లు ప్రజ లు ఇంకా దళితు లు హిందు వు లే అనే ఆలోచనతో నే ఉండడం తో ,యునివార్సి టి ల లో ఉన్న క్రైస్తవ మిషనరీ తోత్తులైన ఐలయ్య లాంటి ఆమాయక ఆచార్యుల ను వాడుకొంటూ మొదలెట్టిన ప్రయత్నమే బీఫ్ ఫెస్టివల్ .ఆహారం తినే స్వేచ్చ ను చెప్పడానికి ఈ ఫెస్టివల్ అని ప్రకటిస్తున్న ఈ ఆచార్యులు పోర్క్ (పంది మాసం ) ఫెస్టివల్ ను ఎందుకు చేయటం లేదో హిందు వు లు గమనిస్తున్నారు .
పాపం మిషనరీ ల కలలు, కుట్ర లు ,ఇక్కడ అందరి లో దేవుడున్నాడు ,అందరు సమానం అనే నిత్య సత్యాలు ఇక్కడ కళ్ళ ముందర కనపడుతుంటే ఎన్నిరోజులు దళితుల మనే గంట లు కట్టి మోసం చేయగలరో చూడాలి,దళిత అనే పదాన్ని వాడుక లో నించి తొలగించి క్రమంగా ఆది హిందువులుగా ఈ కులా లను వ్యవహరించడం మొదలెట్టాలి

3, ఏప్రిల్ 2012, మంగళవారం

కాపురాలు కూలిపోతాయి ... కొత్తవిడాకులచట్టంపై అభిప్రాయాలు


 [ఆంధ్రభూమి దినపత్రికలో జరిగిన చర్చ ఇది]


 భార్యాభర్తల మధ్య వివాదాలు వస్తే పరిష్కరించడానికి పంచాయితీలు, పెద్దమనుషులు ఉండేవారు. సమస్యను పరిష్కరించి కుటుంబాలను బతికించేవారు, అలా వందేళ్లు బతికిన కుటుంబాలు ఉండేవి. దీనిని పరిష్కరించాల్సిన కోర్టు వ్యక్తులనే దూరం చేసేస్తే సమస్య పరిష్కారం అవుతుందా? అవగాహన లోపం వల్ల సమస్యలు తలెత్తుతాయి. ఆ లోపాన్ని తొలగించగలిగితే సమస్య పరిష్కారం అవుతుంది. ఆ సమస్యలను పరిష్కరించే బదులు వ్యక్తుల్నే దూరం కమ్మంటే సమస్య మరింత జఠిలమవుతుంది. దంపతులు విడాకుల కోసం కోర్టుకెళితే వారిద్దరి మధ్య ఉన్న అవగాహనా లోపాన్ని సరిదిద్దాల్సింది పోయి, వారిద్దరినీ విడిపోమంటే, వారు విడిపోతారు. అక్కడితో సమస్య పరిష్కారం అవుతుందా? వారు మళ్లీ పెళ్లి చేసుకుంటే మళ్లీ ఇవే సమస్యలు వస్తే మళ్లీ విడిపోమని చెబుతారా? అలా ఎంత దూరం వెళ్తారు? ఒక జబ్బు వస్తే ఒక డాక్టర్‌కు చూపించాం, ఆయనతో తగ్గలేదని చెప్పి మరో డాక్టర్ దగ్గరకు పోతాం, ఆయనతోనూ తగ్గలేదని ఇంకో డాక్టర్ దగ్గరకు పోతే సమస్య పరిష్కారం అవుతుందా? జబ్బు తగ్గుతుందా? డాక్టర్లను మారిస్తే జబ్బు తగ్గదు, రోగానికి మందువేయాలి అంతేకదా. కోర్టు విధానం ఏమిటి? సమస్యను పరిష్కరించే విధానం ఉండాలి కదా... కాని మనుషులను మార్చే విధానమే కోర్టులో కనిపిస్తోంది. మనుషులను చివరివరకూ వదులుకుంటూ పోతే ఏమవుతుంది? అంతిమంగా మరణమే. సమాజంలో ఇలాంటి చర్యలు వల్ల దారుణమైన పోకడలు వస్తాయి. విదేశీ విధానాలను చొప్పిస్తున్నారు. విడాకులు అడిగితే వెంటనే ఇచ్చేస్తామంటున్నారు. మహమ్మదీయుల్లో అసహనానికి గురైనవారు లేరా? క్రైస్తవుల్లో లేరా వారూ ఇలాగే తీసుకుంటున్నారా? జబ్బు ఏ మతస్థుడికి వచ్చినా, మందు ఒకటే కదా... శరీరానికి వచ్చే రుగ్మతలకు ఒకే మందు ఇస్తున్నాం కదా... ఇది జీవితానికి వచ్చే రుగ్మత, మనసుకు వచ్చే రుగ్మత, అది పోగొట్టగలగడమే చట్టం చేయాల్సిన పని. ఇలాంటి సమస్యలు వచ్చినపుడు ఏ మతం వారికైనా మనసుకు ఒకే మందు ఇవ్వాల్సి ఉంటుంది. అలాకాకుండా జలుబు చేసిందని ముక్కును, చేతికి దెబ్బతగిలిందని చేతిని తొలగిస్తూ పోతే అసలు శరీరమే మిగలదు, అలాగే సమాజంలోని ఇలాంటి పరిస్థితులకు మనుషులను కలపాలే తప్ప విడదీసుకుంటూపోతే సమాజానికే ఇది గొడ్డలిపెట్టు అవుతుంది. రోజురోజుకూ స్ర్తిల సంతతి తగ్గిపోతోంది. స్ర్తి చెప్పుచేతల్లో పురుషుడు బతుకుతున్న సమయంలో మరింతగా స్ర్తిలను రెచ్చగొట్టి ఇంకా ఒప్పుకోకు అన్న రీతిలో వారిని ప్రేరేపించడం సరికాదు. నిజానికి స్ర్తిలు ఎదుర్కొనే అనేక సమస్యలు అత్యాచారాలు, గృహ హింసను పరిష్కరించాల్సిందే, వాటికి ప్రాధాన్యత ఇవ్వాల్సిందే, స్ర్తి బాగుంటేనే కుటుంబ వ్యవస్థ, సామాజిక వ్యవస్థ బాగుంటుంది. దేశం సుభిక్షంగా ఉంటుంది. ఆ స్ర్తిని పరిరక్షించుకునే దిశగా మనం ముందుకు వెళ్లాలి. న్యాయస్థానాలు స్ర్తిలను గౌరవించే విధానం ఇదా? చిన్న అసహనానికి విడిపోవచ్చు అనడం సరికాదు, ఇద్దరు కలిసి విడిపోవాలనే నిర్ణయం తీసుకుంటే అపుడు విడిపోవచ్చు. మానసిక రుగ్మతలను పెంచుకుని ఘర్షణలకుగురికావడం సరికాదు.
- శ్రీ పరిపూర్ణానంద సరస్వతి
శ్రీపీఠం



----------------------------------------------------------------------------------

 ఆర్థిక పరాధీనత - తత్ఫలితంగా సమాజపరంగా తలెత్తే అనేకానేక ఇతర సమస్యల కారణంగా వైవాహిక బంధంలో జీవితాంతం నిస్సహాయంగా మగ్గిపోయే మహిళలకు ఊరట, వారికి అండగా నిలిచేలా, వీలైనంత ఆర్థిక భరోసా కల్పించేలా విడాకుల ప్రక్రియ ఇకపై మరింత సులభతరం అవుతుందని న్యాయస్థానాలు చెబుతున్నాయి. వాస్తవానికి న్యాయస్థానాలు ఆలోచిస్తున్నట్టు సమాజంలో పరిణామాలు ఉండవు, తీవ్ర పరిణామాలు ఏర్పడతాయి. ఏదైనా అంశం మీద అవగాహన లేకుంటే ఫర్వాలేదు, కాని దురవగాహన వల్ల సమస్యలు జఠిలం అవుతాయి. సమాజం విచ్ఛిన్నమవుతున్న తరుణంలో ఈ వ్యవస్థను ఏకోన్ముఖం చేసేందుకు రుషులు కొన్ని మార్గాలను అందించారు. చిన్న అలకలకు కూడా రోడ్డున పడి విడిపోయేందుకు మార్గాన్ని చూపించడం సరికాదు. స్ర్తిని మహాశక్తి స్వరూపిణిగా చూస్తాం. దానికి బదులు ఆమెను అబలగా మార్చేస్తే భయంకర పరిస్థితులు ఏర్పడతాయి. అనర్థం వేరు, అపార్థం వేరు, వాటికి పరిష్కారాలను చూపించాలి. జీవన విధానంలోని విలక్షణతను ఇరువురూ అర్థం చేసుకుని చిన్న చిన్న సవాళ్లను అధిగమిస్తూ దాంపత్య జీవితాన్ని కొనసాగించాలే తప్ప పాశ్చాత్య ధోరణులను స్వాగతించడం సరికాదు. సంబంధాలు సరిదిద్దలేనంతగా పాడయ్యాయనే కారణంతో ఇకపై భార్య విడాకులు కోరవచ్చని న్యాయస్థానం చెబుతోంది. ఆ మేరకు ఆమె కోర్టు ఎక్కితే వ్యతిరేకించేందుకు కూడా భర్తకు అవకాశం ఉండదు. ఇదే కారణంపై ఒకవేళ భర్త విడాకుల పిటిషన్ దాఖలు చేస్తే మాత్రం దానిని భార్య వ్యతిరేకించవచ్చు. అంతేగాక, వేచి ఉండే కాలం పేరుతో విడాకులు కోసం ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరగాల్సిన అనివార్యత కూడా ఇకపై ఉండదు. పైగా విడిపోయిన భర్త నుండి చాలీచాలని నామమాత్రపు భరణంతోనే సరిపుచ్చుకుంటున్న మహిళలకు వివాహానంతరం అతను సంపాదించిన ఆస్తిలో ఇకపై వాటా కూడా లభించనుంది. అయితే వేచి ఉండే కాలం ఆస్తిలో భార్యకు లభించాల్సిన వాటా ఎంతనేది న్యాయస్థానమే నిర్ణయిస్తుంది. దంపతులు విడిపోతే ఇక నుండి వారి దత్త సంతానానికి కూడా కన్నబిడ్డలతో సమానంగా అన్ని హక్కులూ లభిస్తాయి. వివాహ చట్టానికి చేసిన ఇలాంటి కీలక సవరణలను కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆమోదించింది. ఈ మేరకు పార్లమెంటరీ స్థాయి సంఘం చేసిన సిఫార్సుల ఆధారంగా రూపొందించిన వివాహ చట్టాల సవరణ బిల్లు 2010కు ప్రధాని డాక్టర్ మన్మోహన్‌సింగ్ అధ్యక్షతన ఉన్న కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోద ముద్ర వేసింది. కొత్త బిల్లు ప్రకారం ఇకపై విడిపోయే మహిళకు భర్త ఆస్తిలో వాటా లభించనున్నా ఈ మొత్తాన్ని కేసు ఆధారంగా కోర్టు నిర్ణయిస్తుంది. ఆ విషయంలో స్పష్టమైన నిబంధనలను బిల్లులో పొందుపరచలేదు. అలాగే ఆరు నుండి 18 నెలల పాటు వేచి ఉండే కాలాన్ని కూడా పరిస్థితుల ఆధారంగా కోర్టు తన విచక్షణ మేరకు నిర్ణయించే వీలుంది. వివాహ చట్టాల సవరణ బిల్లు 2010ను రెండేళ్ల క్రితమే రాజ్యసభలో ప్రవేశపెట్టారు. అనంతరం దానిని న్యాయసిబ్బంది విభాగాల పార్లమెంటరీ స్థాయి సంఘానికి పరిశీలనకు పంపించారు.
-ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్
బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి
-----------------------------------------------------------------------------------------------------
 అడిగిన వెంటనే విడాకులు మంజూరు చేసే విధానం మన సమాజానికి ఏ మాత్రం మంచిది కాదు. దీనివల్ల కాపురాలు కూలిపోతాయి. ఇప్పటికే దేశంలో విడాకుల సంఖ్య బాగా పెరిగిపోతోంది. ఇప్పుడు ఆడవారు అడిగిన వెంటనే విడాకులు మంజూరు చేసే విధానం ఉండడం వల్ల విడాకుల సంఖ్య మరింతగా పెరుగుతుంది. కేంద్రం ఒక మంచి ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చు. ఆడవారు ఇబ్బందిపడుతున్నారని, కాపురం చేయలేని పరిస్థితిలో విడాకులు కోరితే తక్షణం మంజూరు చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చు. కానీ ఆచరణలో అలా జరగదు. క్షణికమైన ఆవేశంతో విడాకులు తీసుకోవడానికి నిర్ణయం తీసుకున్నప్పుడు వెనక్కి వెళ్లే అవకాశం ఉండదు. ఇది మహిళలకు ఏ మాత్రం మేలు చేయదు. పైగా నష్టం చేస్తుంది. కాలం ఇప్పుడు చాలా మారిపోయింది. ఆడవారిని వేధించే మగవాళ్లే కాదు, మగవాళ్లను వేధించే భార్యల సంఖ్య కూడా ఇప్పుడు తక్కువేమీ కాదు. గతంలో విడాకులు తీసుకోవాలని అనుకుంటే కోర్టును ఆశ్రయిస్తే ఆరు నుంచి 18 నెలల పాటు వేచి చూడాల్సి వచ్చేది. ఆవేశంలో ఒక నిర్ణయం తీసుకున్నా, ఈ గడువులో వారి ఆలోచనలో మార్పు రావచ్చు, సర్దుకు పోవచ్చును అనే ఉద్దేశంతో ఈ గడువు ఏర్పాటు చేశారు. కానీ ఇప్పుడు ఆడవారు కోరితే వెంటనే విడాకులు మంజూరు చేసే వెసులుబాటు వల్ల నష్టపోయేది ఆడవారే. వరకట్నం వల్ల ఆడవారు ఎంతో నష్టపోయారు. వరకట్నాన్ని నిషేధించి, చట్టం తీసుకు వచ్చినప్పుడు మహిళలకు కొంతవరకు ప్రయోజనం కలిగింది. అదే సమయంలో ఈ చట్టం దుర్వినియోగం కూడా జరిగింది. చిన్నచిన్న కలహాలతో కుటుంబ సభ్యులందరిపైన వరకట్న వేధింపు కేసులు పెట్టారు. దాంతో మొత్తం కుటుంబం జైలు పాలైన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అదే విధంగా అంటరానితనాన్ని నిషేధిస్తూ మంచి ఉద్దేశంతో చట్టం తీసుకువస్తే కొంతమంది రాజకీయ ప్రయోజనాల కోసం తమ ప్రత్యర్థులపై ఈ కేసులు పెట్టారు. నిజమైన బాధితులకు ప్రయోజనం కలిగే విధంగా చట్టం ఉంటే మంచిదే కానీ ఆ చట్టాన్ని కక్షసాధింపు కోసం ఉపయోగించుకుంటేనే చిక్కు వస్తుంది. ఇప్పుడు విడాకుల చట్టంలో తీసుకువచ్చిన మార్పులు ఆడవారికి ఉపయోగపడితే మంచిదే కానీ నష్టం కలిగించే పరిస్థితులే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు చిన్న చిన్న సమస్యలు తలెత్తితే కుటుంబ పెద్దలు సర్దిచెప్పేవారు. దాంతో దంపతులు కలకాలం కలిసి ఉండేవారు.
ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నం అయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆడవారికి కోపం వచ్చిందంటే విడాకుల కోసం ప్రయత్నిస్తే అంతేనా? పెళ్లి చేసుకునేప్పుడే అన్ని కోణాల్లో ఆలోచించాలి. దంపతులు విడాకులు తీసుకుని ఎవరికి వారు సుఖంగా ఉండొచ్చు, కానీ వీరి పిల్లలు మాత్రం బాధితులుగా మిగిలిపోతున్నారు. విడాకులు తీసుకున్న మగవాళ్లు మళ్లీ పెళ్లి చేసుకుంటే పిల్లలపై శ్రద్ధ చూపకపోవచ్చు, ఒకవేళ పిల్లలు తల్లి వద్ద ఉంటే ఆమె మళ్లీ పెళ్లి చేసుకుంటే ఆ పిల్లల బాధ్యత ఎవరిది? తాత్కాలికమైన ఆవేశం వల్ల అటు దంపతులు, పిల్లలు నష్టపోతున్నారు. దేశంలో గతంలో ఎప్పుడూ లేని విధంగా విడాకుల సంఖ్య పెరిగిపోతోంది. దీన్ని నివారించేందుకు ఏం చేయాలో ఆలోచించాలి కానీ అడగ్గానే విడాకులు ఇచ్చేసే నిర్ణయం సమస్యకు పరిష్కారం కాదు.
- నన్నపనేని రాజకుమారి
శాసన మండలి సభ్యురాలు, టిడిపి అధికార ప్రతినిధి




-------------------------------------------------------------------------------------------------
 హిందూ వివాహ చట్టంలో కేంద్ర ప్రభుత్వ ఆలోచనల మేరకు తాజాగా సవరణలు చేయడం వల్ల లాభాల కన్నా నష్టాలే ఎక్కువగా ఉంటాయి. ఈ అంశంపై కేంద్రం తొందరపాటుగా విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడం సముచితం కాదు. వాస్తవాలు మాట్లాడుకుంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఉన్న చట్టాల్లో ఎలాంటి మార్పులు తీసుకువచ్చినా ఇబ్బందులే ఎదురవుతాయి తప్ప, సమస్యల పరిష్కారానికి మార్గాలు సుగమం కావు. ఇప్పటివరకు ఉన్న చట్టాల ప్రకారం భార్యాభర్తల మధ్య గొడవలు జరిగి, ఇద్దరూ పరస్పర ఆమోదంతోనే విడాకులు కావాలంటూ కోర్టుకు వెళ్లినప్పటికీ, సదరు కోర్టు వెంటనే విడాకులు మంజూరు చేయదు. ఆరు నెలల నుండి ఏడాది వరకు ఆగుతుంది. ఈలోగా విడాకులకోసం కోర్టుకు వచ్చిన దంపతుల ఆలోచనల్లో మార్పులు వచ్చి, మళ్లీ కలిసి ఉండాలన్న నిర్ణయానికి వస్తారన్నదే జాప్యంలో పరమార్థం. సాధారణంగా క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలవల్ల సత్ఫలితాల కంటే దుష్ఫలితాలే ఎక్కువగా ఉంటాయి. విడాకుల కోసం కోర్టుకు వచ్చే దంపతులను విడివిడిగానూ, కలిపి కూచోబెట్టి, వారి సమస్యలను విని, వాటికి పరిష్కార మార్గాలు చూపగలిగితే పరిస్థితి చక్కబడే అవకాశాలు లేకపోలేదు. అందుకే విడాకుల కోసం వచ్చే దంపతులకు కౌన్సిలింగ్ ఇచ్చేందుకు ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయి. ఇందుకోసం ఫ్యామిలీ కోర్టులు 1984లో ఏర్పాటయ్యాయి. ఈ కోర్టుల్లో న్యాయమూర్తులకు చేదోడుగా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఫ్యామిలీ కౌన్సిలర్లను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఫ్యామిలీ కౌన్సిలర్లు న్యాయశాస్త్రం అభ్యసించినవారే కానక్కర్లేదు. సమాజం పట్ల, సమస్యల పట్ల అవగాహన ఉండి, కుటుంబ తగాదాలను పరిష్కరించగలిగే ఇంగిత జ్ఞానం ఉంటే సరిపోతుంది. ఫ్యామిలీ కోర్టులు ఏర్పాటు చేసి 27 సంవత్సరాలు పూర్తయినా, ఫ్యామిలీ కౌన్సిలర్లను ప్రభుత్వం ఏర్పాటు చేయకపోవడం గమనార్హం. నేను ‘రక్ష’ అనే సామాజిక న్యాయసేవా సంస్థ ద్వారా హైకోర్టులో ప్రజాహిత వాజ్యాన్ని (పిల్) వేయగా, 2002లోనే కోర్టు తీర్పు చెప్పింది. వెంటనే ఫ్యామిలీ కౌన్సిలర్లను నియమించాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించి, స్వయంగా హైకోర్టు ప్రభుత్వానికి అనేక పర్యాయాలు లేఖలు రాసింది. అయినా ఫలితం లేదు. ఫ్యామిలీ కౌన్సిలర్లు లేకపోవడం వల్ల కోర్టుల్లో విడాకుల కేసుల పరిష్కారానికి తీవ్రమైన జాప్యం జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వంలోని న్యాయవిభాగం ఈ అంశంపై సరైన నిర్ణయాలు తీసుకుంటే సమాజానికి ఉపయోగకరంగా ఉంటుంది. మనది లౌకిక దేశం. ఈ దేశంలో ఫ్యామిలీ కోర్టుల్లో ఏ మతానికి చెందినవారైనా కేసులు నమోదుచేయవచ్చు. అయితే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన సవరణలు కేవలం హిందూ వివాహ చట్టానికి మాత్రమే పరిమితం అవుతున్నాయి. అంటే ముస్లిం, క్రిస్టియన్, సిక్కులు, జోరాష్ట్రియన్ తదితర మతాల వారికి వర్తించదు. ఈ విషయంలో లోతుగా అధ్యయనం చేస్తే, ప్రభుత్వం తాజాగా ప్రతిపాదించిన సవరణల వల్ల హిందూ మతానికి చెందినవారికి ఎక్కువ నష్టం జరుగుతుంది. దంపతులు వేర్వేరు కారణాల వల్ల విడాకుల కోసం కోర్టుకు వెళితే కొత్త సవరణ ప్రకారం వెంటనే కోర్టు విడాకులు మంజూరు చేయాల్సి ఉంటుంది. అంటే దంపతులు తమ నిర్ణయంపై పునరాలోచించుకునేందుకు కూడా అవకాశం లభించదంటే అతిశయోక్తి కాదు.
- సి.వి.ఎల్. నరసింహారావు
అధ్యక్షుడు, ‘రక్ష’, న్యాయ సలహా స్వచ్ఛంద సేవా సంస్థ

------------------------------------------------------------------------------------------------------------


 మన దేశంలో అనేక మతాలకు చెందినవారు ఉండటం వల్ల అందరికీ వర్తించేలా సమగ్రంగా ఉండే కామన్ సివిల్ కోడ్ తీసుకురావలసిన అవసరం ఉంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన హిందూ వివాహ చట్టం-1955తో పాటు ప్రత్యేక వివాహాల చట్టం-1954లలో సవరణ వల్ల పరిణామాలు తీవ్రంగానే ఉంటాయి. ప్రభుత్వం తీసుకువచ్చే ఎలాంటి చట్టాలయినా ప్రజలందరికీ వర్తించేలా ఉండాలే తప్ప, ఏ ఒక మతానికో పరిమితం కారాదు. హిందూ వివాహ చట్టంలో తలపెట్టిన సవరణల వల్ల భవిష్యత్తులో పరిణామాలు తీవ్రంగా ఉంటాయనడంలో సందేహం లేదు. యువతీ-యువకుల్లో సామాజిక అంశాలు, కుటుంబపరమైన అంశాల్లో పూర్తిగా అవగాహన ఉండదు. సాధారణంగా మన దేశంలో 18-25 సంవత్సరాల వయస్సులో వివాహాలు జరుగుతూ ఉంటాయి. ఎక్కువ శాతం పెద్దలు కుదిర్చిన వివాహాలే ఉంటాయి. పెద్దలు కుదిర్చిన వివాహాలైనా, ప్రేమ వివాహాలైనా సజావుగా ఉంటే బాగానే ఉంటుంది. యుక్త వయస్సులో, క్షణికావేశంలో చిన్న చిన్న విషయాల్లో కూడా కొత్త దంపతుల మధ్య అవగాహన ఉండకపోవడం వల్ల వారి నిర్ణయాలు సుదీర్ఘ ప్రయోజనాలకు అనుగుణంగా ఉండవు. దాంతో చిన్న అంశాలకు కూడా వచ్చే మనస్పర్థలు విడాకులు తీసుకోవాలన్న ఆలోచన వరకు వెళతాయి. విడాకుల మూలంగా తలెత్తే పరిణామాల గురించి యువతీ యువకులు ఆలోచించలేరు. అందువల్ల విడాకుల కోసం దరఖాస్తు చేసే ఇలాంటి వారికి విడాకులు ఇచ్చే గడువు ఇప్పటివరకు ఆరు నెలల నుండి 18 నెలల వరకు ఉండేది. ఈలోగా విడాకుల కోసం దరఖాస్తు చేసేవారి ఆలోచన, ప్రవర్తనలో మార్పులు రావచ్చు. పునరాలోచించుకునేందుకు కొంత వ్యవధి లభించేది. కేంద్ర మంత్రివర్గం తాజాగా తీసుకున్న నిర్ణయం వల్ల ప్రతిపాదిత హిందూ వివాహ చట్టం-1955లో మార్పులు చేయాల్సి వస్తోంది. ప్రభుత్వం రెండేళ్ల క్రితం రాజ్యసభలో ప్రతిపాదించిన వివాహ చట్టం (సవరణ) బిల్లు-2010ని రాజ్యసభ నేరుగా ఆమోదించకుండా, న్యాయవిభాగానికి సంబంధించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పరిశీనలకు పంపించింది. జయంతీ నటరాజన్ నేతృత్వంలోని ఈ కమిటీ చేసిన సిఫార్సుల మేరకే కొత్తప్రతిపాదనలతో రూపొందించిన బిల్లును కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ఈ బిల్లు అమలులోకి వస్తే విడాకుల కోసం కోర్టుకు వచ్చే దంపతులు మరోపర్యాయం పునరాలోచించుకునే అవకాశాన్ని కోల్పోతారనడంలో సందేహం లేదు. విడాకులు మంజూరైన తర్వాత మహిళలు ఎక్కువ బాధలకు, ఇక్కట్లకు గురికావలసి వస్తుంది. ఉద్యోగినిలు అయిన మహిళలు అయితే ఈ బాధలు మరిన్ని ఎక్కువగానే ఉంటాయి. వారికి పిల్లలు కూడా ఉంటే సామాజికంగా అనేక ఇక్కట్లను గురికావలసి వస్తుంది. పిల్లల ఆలనాపాలనా చూసేవారు లేక ఇబ్బందులకు గురికాలసి ఉంటుంది. మగవారు మరో పెళ్లి చేసుకుని సంసార జీవితాన్ని తిరిగి గడుపుతారు. మహిళలు అనేక కారణాల వల్ల పునర్వివాహం చేసుకోలేక మానసికంగా సమస్యలకు లోనయ్యే అవకాశాలున్నాయి. చిన్న చిన్న కుటుంబాల్లో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటుంది. మన సమాజం మహిళలనే విమర్శిస్తుంది. ఈ సమస్యలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని విడాకుల కోసం గడువు ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. విడాకులకోసం వచ్చేవారిని కలిపి ఉంచేందుకు న్యాయమూర్తులు కూడా ప్రయత్నిసుంటారు. విడాకుల కోసం వచ్చే దంపతులను కౌన్సిలింగ్ సెంటర్‌కు న్యాయమూర్తి పంపిస్తారు. కొత్త చట్టం వల్ల ఈ అవకాశాలన్నీ పోతాయి.
- జస్టిస్ కె. రామస్వామి
సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి.





-------------------------------------------------------------------------------------------------------------



విడాకుల చట్టాన్ని మరింత సులభతరం చేస్తూ కేంద్ర మంత్రివర్గం రూపొందించిన ముసాయిదాలోని ఉద్దేశాలు మంచివే అయినా ఆచరణలో మాత్రం కష్టసాధ్యంగానే ఉన్నాయి. అసలు వివాహ చట్టాలు, విడాకుల చట్టాలపై 95 శాతం మహిళలకు అవగాహనే లేదు. అలాంటప్పుడు ఎన్ని మంచి చట్టాలున్నా, ఏమిటి ప్రయోజనం అనిపిస్తోంది. కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన వివాహ చట్టాల సవరణ బిల్లు-2010లో ప్రధానంగా మూడు అంశాలపై స్పష్టత లేదు. ఇలాంటి అస్పష్ట చట్టాలను ప్రతివాదులు తమకు అనుకూలంగా మలుచుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ముఖ్యంగా భార్యాభర్తలు ఇద్దరు తమ వివాహం రద్దు కోసం దరఖాస్తు చేసుకుంటే, గతంలో స్థాయి సంఘం చేసిన సూచన మేరకు వేచిచూసే సమయాన్ని 18 నెలల నుంచి ఆరు నెలలకు కుదించాలని ప్రతిపాదించింది. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనను తిరస్కరిస్తూ, ఆ వ్యవధిని నిర్ణయించే అధికారాన్ని న్యాయస్థానానికి వదిలేసింది. భార్యభర్తలు ఇద్దరూ విడాకులు తీసుకునేందుకు ముందుకు వచ్చాక కూడా గడువు ఇచ్చే విచక్షణను కోర్టులకు అప్పగించడం వల్ల బాధిత మహిళకు అన్యాయం జరిగే అవకాశం ఉంది. భర్తకానీ, వారి తరఫు కుటుంబ సభ్యులు పెట్టే వేధింపులను తట్టుకోలేక విడాకులకు సిద్ధమైన బాధితురాలికి సత్వరం న్యాయం జరగకుండా చట్టంలోని లొసుగులను ఆసరా చేసుకునే అవకాశం ప్రతివాదులకు ఈ చట్టం కల్పించినట్టు అవుతుంది. కొన్ని సందర్భాల్లో విడాకుల కోసం ముందుకు వచ్చిన భార్యకు అవి లభించకుండా చట్టంలోని లొసుగులతో భర్త కోర్టును ప్రభావితం చేసే అవకాశం కూడా లేకపోలేదు. విడాకుల కోసం దరఖాస్తు చేసుకునే బాధితురాలికి సత్వర న్యాయం లభించకుండా నిబంధనలు పెట్టడం సరికాదని మా అభిప్రాయం. అలాగే ఈ చట్టంలో మరో లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. విడాకులు తీసుకునే భార్యకు భర్త ఆస్తిలో వాటా ఉంటుందని ఒకవైపు పేర్కొంటూనే, మరోవైపు పెళ్లి తర్వాత వచ్చిన సంపదపైన మాత్రమే వాటా ఉంటుందని మెలిక పెట్టడం వల్ల బాధితురాలికి న్యాయం జరగదు. పెళ్లి చేసేటప్పుడే తమ కూతురు సుఖంగా ఉండగలదా? ఆ మేరకు వారికి ఆస్తి పాస్తులు ఉన్నాయా? లేదా అని చూస్తారు. కానీ పెళ్లి తర్వాత వారి ఆస్తి పాస్తులపై ఎలాంటి హక్కులు ఉండవని పరోక్షంగా ఈ చట్టం ద్వారా అమలులోకి రానుంది. పెళ్లి తర్వాత కేవలం భార్య జీతంపైనా, ఆమె తెచ్చే కట్నంపై ఆధారపడి వేధింపులకు గురి చేసేవారి బారినపడే భార్యకు ఈ కొత్త చట్టం ద్వారా న్యాయం లభించే అవకాశాలు లేకుండా పోతాయి. అలాగే పెళ్లి తర్వాత తనకు ఎలాంటి ఆదాయం లేనట్టుగా చూపించి విడాకులు తీసుకున్న భార్యకు మనోవర్తిని ఎగ్గొట్టే ప్రమాదం కూడా ఉంటుంది. దత్తత పిల్లలకు విడాకులు పొందాక కూడా ఆస్తిపై హక్కు ఉండటం గతంలో ఉన్నదే. అసలు స్థూలంగా చూస్తే విడాకుల చట్టంపై ఎంత మందికి అవగాహన ఉందనేది ముఖ్యం. గ్రామీణ ప్రాంత మహిళలకు అయితే ఈ చట్టంపై ప్రాథమిక అవగాహన ఏమాత్రం ఉండదు. గ్రామ న్యాయస్థానాల వ్యవస్థ అమలోకి వస్తే, వారికి దీనిపై అవగాహన ఏర్పడే అవకాశం ఉంటుంది. వీటిపై అవగాహన కల్పించేందుకు డ్వాక్రా సంఘాలను భాగస్వామ్యం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ఇప్పటికే ఇలాంటి ప్రయత్నాన్ని గుజరాత్, హర్యానా రాష్ట్రాలు చేసి సత్ఫలితాన్ని పొందాయి.
- డాక్టర్ అచంట మమతా రఘువీర్
తరుణి స్వచ్ఛంద సేవా సంస్థ

2, మార్చి 2012, శుక్రవారం

శృంగారమే చావుకు మూలం !

శృంగారం లేకుంటే.. చావేరాదు!
అలైంగిక ప్రాణుల్లో అపరిమిత పునరుత్పత్తి
మరణంలేని ఫ్లాట్‌వార్మ్ జీవులపై అధ్యయనం
అంతులేని కణవిభజనతో కొత్త కణాల సృష్టి

క్రోమోజోముల్లోని టెలోమెర్ పొడవులోనే కిటుకు
టెలోమెర్‌ను పరిరక్షించే ఎంజైమ్ గుర్తింపు
విసృతంగా సాగుతున్న పరిశోధనలు
మనుషుల్లోనూ ఆయుష్షు పెంచడమే లక్ష్యం!
చేపలు తింటే మెదడు పెరుగుతుంది..
వయసు తగ్గుతుందంటున్న అమెరికన్ పరిశోధకులు

లండన్, ఫిబ్రవరి 29: వయసు పెరుగుదలను అరికట్టవచ్చా? జీవితకాలాన్ని పెంచడం సాధ్యమేనా? మరణాన్ని కూడా జయించవచ్చా?.. సెక్సుకు దూరమైతేనే అది సాధ్యమా? అవును, లింగ భేదంలేని ఒక జాతి జీవులు ఆ మార్గాన్ని చూపిస్తున్నాయంటున్నారు లండన్ శాస్త్రవేత్తలు! ఫ్లాట్ వార్మ్ వర్గానికి చెందిన ప్రాణులపై నాటింగ్‌హామ్ యూనివర్సిటీ పరిశోధకులు చేస్తున్న అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వెలుగుచూస్తున్నాయి. వయసు పెరుగుదలను అరికట్టి ఎప్పటికీ యవ్వనంగా ఉండగలిగే శక్తి వాటిలో ఉందని గుర్తించారు. ఈ జీవుల్లో జరిగే ప్రక్రియ మనిషి ఆయుష్షు పెంచడానికి కూడా మార్గం చూపుతుందని భావిస్తున్నారు.

ఫ్లాట్ వార్మ్ జీవుల అపరిమితమైన పునరుత్పత్తి సామర్థ్యం ఆశ్చర్యపరుస్తోందని శాస్త్రవేత్తలు అంటున్నారు. వయసు మీద పడిన, చెడిపోయిన కణాలను, కణజాలాన్ని ఈ క్రిములు ఎప్పటికప్పుడు కొత్తవాటితో మార్చేసుకుంటాయట! దాంతో అవి ఎప్పుడూ యవ్వనంగా ఉంటాయని పరిశోధకులు తెలిపారు. ప్రస్తుతం ఫ్లాట్ వార్మ్ జాతికి చెందిన రెండు రకాల (లైంగిక చర్యతో పునరుత్పత్తి జరిపేవి, రెండుగా విడిపోయి తమ సంఖ్య పెంచుకునేవి) జీవులపై అధ్యయనం జరుగుతోంది.

'సాధారణంగా కొత్త కణాల అభివృద్ధికి మూలకణాలు (స్టెమ్ సెల్స్) ఉపయోగపడతాయి. కణాల పునరుత్పత్తి ప్రక్రియలో పాల్గొనే మూలకణాలు కూడా క్రమంగా శక్తిని కోల్పోయి చివరకు నశిస్తాయి. అయితే ఫ్లాట్‌వార్మ్ జీవుల్లో మాత్రం అలా జరగడం లేదు. అవి అపరిమితంగా అన్ని రకాల కణాలను పునరుత్పత్తి చేస్తున్నాయి. మెదడును కూడా ఎన్నిసార్లయినా కొత్తగా సృష్టించగలుగుతున్నాయి' అని పరిశోధకులు వివరించారు. 'కణ విభజన జరిగినపుడు మాతృ కణంలోని డీ ఎన్ఏ కొత్త కణానికి అందుతుంది. వాటిలోని క్రోమోజోముల జతలను ముడిపెట్టి ఉంచే టెలోమెర్ చాలా కీలకమైనది. గొలుసుకట్టుగా ఉండే క్రోమోజోమ్‌ల చివరన ఇది రక్షణ తొడుగులా ఉంటుంది. ప్రతిసారీ కణవిభజన జరిగినపుడు ఈ టెలోమెర్ పొడవు తగ్గిపోతుంది.

దీంతో కణాల్లోని జన్యు సమాచారం క్రమంగా నశించి.. వాటికి కొత్త కణాలను సృష్టించే శక్తి క్షీణిస్తుంది. అయితే మరణంలేని ఫ్లాట్‌వార్మ్ వంటి అలైంగిక జీవుల్లో మాత్రం టెలోమెర్ పొడవు ఎన్నటికీ మారడం లేదని భావిస్తున్నాం' అని ఈ అధ్యయన బృందానికి నేతృత్వం వహిస్తున్న డాక్టర్ థామస్ టాన్ తెలిపారు. ఈ జీవుల్లో టెలోమెర్ నశించకపోవడానికి 'టెలోమెరాస్' అనే ఎంజైమ్ కారణమని ఆయన గతంలోనే కనుగొన్నారు. ఇందుకుగాను 2009లో ఆయనకు వైద్య రంగంలో నోబెల్ బహుమతి లభించింది.

మనుషుల్లో ఈ ఎంజైమ్ తొలినాళ్లలో మాత్రమే ప్రభావవంతంగా ఉంటుందని, అలైంగిక జీవుల్లో మాత్రం పునరుత్పత్తి జరిగిన ప్రతిసారీ ఇది పనిచేస్తుందని థామస్ గుర్తించారు. లైంగిక చర్య జరుపుకొనే జీవుల్లో మాత్రం ఈ ఎంజైమ్ ఎందుకు ఎక్కువ కాలం పనిచేయడం లేదన్నది శాస్త్రవేత్తలకు అంతుచిక్కడం లేదు. సెక్స్‌కు దూరంగా ఉండటం వల్లే 'టెలోమెరాస్' శక్తివంతంగా పనిచేస్తోందా? అన్న విషయాన్నీ వారు పరిశీలిస్తున్నారు. ఈ రహస్యాన్ని ఛేదించి మనుషుల్లోనూ టెలోమెర్ పొడవు తగ్గకుండా చేస్తే ఇక మరణం అనేదే ఉండకపోవచ్చు! లేదా జీవితకాలం అసాధారణంగా పెరగవచ్చు!

మరోవైపు.. వయసుకు సంబంధించే అమెరికన్ పరిశోధకులు మరో కొత్త విషయం బయటపెట్టారు. 'మీ మెదడు చురుగ్గా ఉండాలంటే చేపలు బాగా తినండి' అని కాలిఫోర్నియా యూనిర్సిటీ నిపుణులు సూచిస్తున్నారు. దీన్ని పాటిస్తే మన మెదడుకు ముసలితనం రాదట! మనం తీసుకునే ఆహారంలో ఒమెగా-3 వంటి ఆమ్లాలు తగ్గడం వల్ల మెదడు కణాలు క్షీణిస్తున్నాయని, మానసిక ఆరోగ్యం దెబ్బతింటోందని పరిశోధకులు గుర్తించారు. చేపలు అధికంగా తినే వారిలో గుండెపోటు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుందని, చేపనూనె వల్ల మెదడు చురుగ్గా మారుతుందని చెబుతున్నారు. 



1, మార్చి 2012, గురువారం

హిందువులలో అనైక్యం, ఇతరులలో సమైక్యం : కారణాలూ, పరిణామాలూ

ఒక గూగుల్ గుంపులో ఇటీవల జఱిగిన చర్చ

ఒక సభ్యుడు : 

మిషనరీలు ఇండియాలో రోజూ హిందూ దేవుళ్ళను/ దేవతలను/ పవిత్ర గ్రంథాలను బహిరంగంగా దూషిస్తుంటారు. హిందువులనుండి  రియాక్షన్ ఎందుకు రావడం లేదు? చిన్న పామునైనా, పెద్ద కఱ్ఱతో కొట్టటం అబ్రహామిక్ కల్ట్స్ యొక్క విధానం. దీనితో ఎవఱినైనా ఎలా భయభ్రాంతులకు గుఱిచేయాలో వారికి తెలుసు. హిందువులు మనగల్గాలంటే వారినుంచి కొన్ని ఉపాయాలను తప్పకుండా నేర్చుకోవాలి. ఒక పాతకాలం నాటి మసీదును కూలకొడితే, దానికి రియాక్షన్ గా 10,000 - 20,000 గుడులను పగలగొట్టారు పాకిస్తాన్‌లో, బంగ్లాదేశ్ లో, మలేషియాలో, ఇండొనేషియాలో, ఇతర మహ్మదీయ దేశాలలో ! ఇవే కుతంత్రాలను కమ్యునిష్టులు కూడా వాడుతుంటారు. 

రెండో సభ్యుడు :

మన గుళ్ళవద్ద కిరస్తానీ మిషనరీలు కరపత్రాలను పంచుతుంటే ఒక్కఱూ కిమ్మనరు. ఇక దూషిస్తే మటుకు ఏం చేస్తారూ? మనం చర్చిలవద్దకు వెళ్ళి అలాంటి కరపత్రాలిస్తే జఱగగల పరిణామాలు అనూహ్యం. అదీ మన ఐక్యత. అదీ మన సమాజపు "బలం". 

మొదటి సభ్యుడు : 

మాస్టారూ, (౧) హిందువులు ఐక్యంగా లేకపోవడానికి కారణాలను వెతకవలసి ఉంది. What is preventing Hindus unification ?  

(౨) హిందువులలో ఐక్యత రావడానికి కావలసిన అవకాశాలను (మార్గాలను) వెతకవలసి ఉంది. How can we achieve Hindu unity ? 

గమనిక (౧) : హిందువులు అందరు కులాల కతీతం ఏకంగా కావాలి, తమ ఆర్థిక, సామాజిక, మత, సాంస్కృతిక, భాషా ప్రయోజనాలను సాధించడానికి ! ఇది సాధ్యం కాని పక్షంలో గమనిక (౩), మఱియు గమనిక (౨) చూడండి. 

౩) కుల హిందువుల మధ్య ఐక్యత సాధ్యం కాని పక్షంలో (లేక ఎక్కువ కాలం పట్టుతుంది అనిపించినప్పుడు), *హీనపక్షంగా* (minimum) ఏ కులానికి ఆ కులంలో ఐక్యత తీసుకు రావడానికి కావలసిన అవకాశాలను వెతకవలసి ఉంది. ముందు ఏ కులానికి ఆ కులంలో ఐక్యత వస్తే, ఆ తరువాత ఇతర హిందూ కులాలతో కలసి పరస్పర సహకారం (హిందూ విషయాలమీద) ఎలా చేసుకోవాలో చూడవలసి వుంది. 

గమనిక (౨) : ఏ కులానికి ఆ కులం, "మొత్తము హిందువులకు హానికరమైన పనులు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయము" అని ఒట్టు పెట్టుకోవాలి. ఏ కులానికి ఆ కులం తమ *ఆర్థిక ప్రయోజనాలను* కాపాడుకోవడంలో తప్పులేదు. కాని ఎట్టి పరిస్థితుల్లోనూ మొత్తం హిందువులకు హానికరమైన పనులు చేయరాదు. నీవు (నీ కులం) మైనారిటీల పార్టీ అయిన కాంగ్రేస్ తో జట్టు కట్టు, లేక కమ్యునిష్టులతో జట్టు కట్టు, కాని కాంగ్రేస్ గాని, కమ్యూనిష్టులు గాని హిందువుల ప్రయోజనాలకు హాని చేస్తుంటే వారికి మద్దతివ్వకు. వారిచేత హిందువులకు అవసరమైన పనులు చేయించు. ఒక ఎడారిమతస్థులు తాము మైనారిటీలుగా ఉన్న దేశాలలో ఈ విధానాన్ని పాటిస్తుంటారు. తాము మెజారిటీలుగా ఉన్న దగ్గఱ, ఆ దేశాన్ని తమ మతదేశంగా ఆధికారికంగా ప్రకటించి, ఇతరులను దోచుకుంటూ ఉంటారు. అందుకే ఆ దేశాలలో 95 - 99.99% ఆ మతస్థులే ఉంటారు. ఆ దేశాల్లో నివసించే ఇతరులు షరియా వ్యవస్థలో నీళ్ళ బైట ఉన్న చేపల్లాగా గిలగిలా కొట్టుకుంటారు. 

గమనిక (౩) : ఇండియాలో ఇప్పుడు ప్రచారంలో ఉన్న "సామాజిక న్యాయం" అనేదాన్ని, కులకోణంలోంచి నిర్వచించి హిందువులను ఇంకో పార్శ్వం నుంచి విడగొడుతున్నారు. భవిష్యత్తులో దీని బదులు "సామాజిక న్యాయం" అనే దాన్ని మతస్థాయిలో నిర్వచించాలి. అంటే హిందూ సామాజికన్యాయం, మహ్మదీయ సామాజికన్యాయం, కిరస్తానీ సామాజికన్యాయం మొదలైనవి. అప్పుడు కులాల మధ్య ఉన్న ఈ వీథిపోరాటాలు తగ్గి, వాటి మధ్య ఐక్యత వస్తుంది. 

గమనిక (౪) ఈ రోజున సైంటిఫిక్ గా ఆలోచించగల హిందూ తత్త్వవేత్తలు (community leaders) ఎవఱూ లేకుండా పోయారు. ఈ శూన్యాన్ని (vaccum) హిందువులు త్వరగా భర్తీ చేసుకోవాలి. 

మూడో సభ్యుడు :

నేనిక్కడ చెబుతున్నది  పైకి చిన్నవిషయంలా కనిపిస్తుంది. కానీ ఇది చాలా పెద్ద విషయం. అబ్రహామిక మతాలవారు ఐక్యంగా ఉండడాని క్కారణాలు కొన్ని ఉన్నాయి. 

౧. ఏ జాతికైనా తన గుఱించి తనకు కొంత సామూహిక స్మృతి (collective memory) ఉంటుంది. మీరు జాగ్రత్తగా గమనిస్తే అబ్రాహామిక మతాలు నిజానికి మతాలు కావు. అవి వాళ్ళ కమ్యూనిటీల యొక్క చరిత్రపుస్తకాలు. వాటిల్లో మతం/ ఉపాసన ఎలిమెంట్ చాలా తక్కువ. వాటినుంచి వారు స్ఫూర్తి పొందుతారు. చరిత్రని మర్చిపోని/ మఱియు దాన్నుంచి గుణపాఠాలు నేర్చుకునే జాతిని ఎవడూ ఓడించలేడు. హిందువుల పరిస్థితి ఇందుకు పూర్తిగా విరుద్ధం. ఇక్కడ హిందువుల స్మృతిపథంలో తమందఱి యొక్క సామూహిక చరిత్ర లేకపోవడమే కాక తప్పుడుచరిత్ర ఒకటి, తమది కాని చరిత్ర ఒకటి  వాళ్ళల్లో విద్యావిధానం ద్వారా చొప్పించబడుతున్నది. 

౨. అబ్రహామిక మతాలు గత 1500 సంవత్సరాల్లో ఇతర సంస్కృతులపై ఆధిపత్యం కోసం ప్రపంచవ్యాప్తమైన యుద్ధాలు చేశాయి భౌతికంగానూ, సాంస్కృతికంగానూ ! ఈ యుద్ధవ్యూహాలన్నీ వాళ్ళకి కొట్టిన పిండి. ఎలా ఆర్గనైజ్ అవ్వాలో వాళ్ళు నేర్చుకున్నారు. దాన్నొక సైన్సుగా రూపొందించారు. అందుచేత (మతపరంగా) లోకజ్ఞానం లేని పసిబిడ్డల్లాంటి హిందువుల్ని చుట్టబెట్టడం వాళ్ళకో లెక్కలోది కాదు. ఇక్కడ కూడా వాళ్ళ సామూహికస్మృతి, ఉమ్మడి అనుభవం వారికి అక్కఱకొస్తోంది. ఈ విషయంలో మన హిందువులు వాళ్ళతో పోలిస్తే నిన్నమొన్న కళ్ళు తెఱిచిన పసిబిడ్డల్లాంటివాళ్ళు. యుద్ధం చేయాల్సివస్తే కంగారుపడిపోవడమే తప్ప మనకి గుఱి చూసి ఎక్కడ బాణం సంధించాలో తెలీదు. ఉదాహరణకి - ఈ మధ్య భగవద్గీత గుఱించి ఒక రష్యన్ కోర్టులో చెలరేగిన రభస. ఒకవేళ నిజంగానే రష్యాలో భగవద్గీతని నిషేధిస్తే మనం కూడా పోటీగా ఎదురుచర్యలకి దిగుతామని హెచ్చఱించే పాటి వృషణాలు లేని జాతి ఇది. ఊరికే ఉచ్చపోసుకుంటూంటారు ప్రతీవాణ్ణీ చూసి ! 

అయితే ఇంత మొనగాళ్ళయిన అబ్రహామిక మతాలు కూడా హిందూమతం దగ్గఱికొచ్చేసరికి ఘోరపరాభవాన్ని ఎదుర్కుంటున్న మాట వాస్తవం. వేఱే దేశాల్లో సాధించినంత సులభంగా వాళ్ళిక్కడ హిందూమతాన్ని సాధించలేకపోతున్నారు. ఈ అవమానభారం మూలాన్నే యావత్తు క్రైస్తవలోకమూ, మహ్మదీయలోకమూ మనల్ని ద్వేషిస్తుంది. నిజానికి వాళ్ళ దేశాల్లో హిందువులు ఆట్టే లేరు.వాళ్ళ చరిత్రల్లో వాళ్ళకి మనం చేసిన అపకారమూ ఏమీ లేదు. అయినా ఊరికే ద్వేషిస్తారు, వాళ్ళ మతాల్లో ఇండియా చేఱలేదనే అక్కసుతో ! మన మతం ప్రపంచం కంటే వేఱైనది కావడం వల్లనే మనకి నమ్మదగ్గ మిత్రులు గానీ సానుభూతిపరులు గానీ ఎవఱూ లేరు ప్రపంచ దేశాల మధ్య ! మహా అయితే మన సైజు చూసి కాస్త భయపడతారంతే ! సింగపూరు, శ్రీలంకలాంటి చిన్నచిన్న దేశాలక్కూడా ఇండియా అంటే ద్వేషమే. 

౩. హిందువులకి మతం కంటే కులమే పెద్దవిషయం. ఇప్పటికీ హిందువుల్లో ఉన్న ఇంప్రెషన్ ఏంటంటే మతం తమకి సంబంధం లేదనీ, అది బ్రాహ్మలకి సంబంధించిన టాపిక్ అనీ, దాని బాగోగులు బ్రాహ్మలే చూసుకోవాలనీ ! దానికి తోడు ఈ మతం గుఱించి ఎక్కువగా పట్టించుకునేదీ, ఆందోళన చెందేదీ కూడా బ్రాహ్మణులే కావడం ఈ దురభిప్రాయానికి మఱింత ఆజ్యం పోసింది. 

ఇండియాలో నాన్-హిందూవర్గాలు తమంతట తాము సహజంగా ఆర్గనైజ్ అయిలేవు. వాటిని మొదట్నుంచీ ప్రభుత్వమే మెజారిటీకి వ్యతిరేకంగా ఆర్గనైజ్ చేస్తూ వచ్చింది. ఈ పని మొదట బ్రిటీషువారు, తరువాత నెహ్రూ, ఆ తరువాత ఇందిరాగాంధీ etc etc. చేస్తూ వచ్చారు. హిందూ వోట్ ని చీల్చి అందులో తమ కనుకూలమైన వోట్లకి మైనారిటీ వోట్లని కలుపుకుని అధికారంలోకి రావడం కోసం ఉద్దేశపూర్వకంగా ఇలా చేస్తూ వచ్చారు. వీళ్ళ స్కీములో హిందువుల్ని కులాల వారీగా (రిజర్వేషన్ల ద్వారా ) విడగొట్టాలి. కులాభిమానాల్ని పెంపొందించాలి. ఈ రకంగా వ్యవస్థాగతమైన ఏర్పాట్లన్నీ మతపరంగా కాక కులపరంగా ఉండడంతో హిందువులు కూడా మతపరంగా కాక కులపరంగా ఆలోచించడం అలవాటు చేసుకున్నారు. ముందేమో ఇలా ఎస్సీ ఎస్టీల విషయంలో ప్రయోగించారు. ఇహ ఇప్పుడా అవసరం తీఱిపోయింది. కనుక ఆ తరువాత - అంటే ఇప్పుడు బీసీల్నీ, ఓబీసీల్ని రెచ్చగొడుతున్నారు. 

దీనికి పరిష్కారమేంటంటే హిందూ-అనుకూల పార్టీ ఏదైనా అధికారంలోకి వచ్చినప్పుడు, నేనిదివఱకు మనవి చేసినట్లుగా హిందువులందఱినీ (పోప్ లాంటి) ఒకే ధర్మపీఠం కిందికి తీసుకొచ్చి ఆ పీఠానికి ఆధికారిక, ప్రభుత్వ గుర్తింపునివ్వడం, అలా ఒక హిందూ వోట్‍బ్యాంకుని కృత్రిమంగా సృష్టించడం. కాంగ్రెస్ ఇలాంటిదాన్ని ఇమామ్ బుఖారీ, దేవబంద్ ముస్లిమ్ సెమినరీల ద్వారా ముస్లిముల కోసం చేస్తోంది.

మొదటి సభ్యుడు :

దీనిని బట్టి మనకు ఏమి తెలుస్తుంది. Abrahamic "ideology driven cults" లో *మనుషుల జీవితాలకు విలువ లేదు* అని. వారికి - మనుషులు పనిముట్టులు (సాధనాలు) మాత్రమే. అబ్రహామిక్ cults లో (కిరస్తానీలు, ఎడారిమతస్థులు, కమ్యునిష్ట్ లు) ఎవఱు ఎక్కువ హింస (యుద్దాలు) చేయగలిగితే వారు విజేతలు. అందుకే వారు హింసను ఒక ఆయుధంగా వాడతారు. ఇండియాలో 1000 సంవత్సరాల ఎడారిమతపు రక్తమయ హింసాచరిత్రను మసిపూసి మన (హిందువుల) పిల్లలచేత చదివిస్తున్నారు. అసలు చరిత్రను రాస్తే/ చదివితే, కుల హిందువులు సిగ్గుతో చచ్చిపోతారు. మన సమాజము గత 1000 సంవత్సరాలుగా ఇంత దయనీయంగా ఉన్నా కూడా, కులహిందువులు దాన్నుంచి పాఠాలేమీ నేర్చుకోవడం లేదు, మనలాంటి చాలా కొద్ది మంది తప్ప ! ఈనాడు మన కళ్ళ ముందు జఱుగుతున్న ఇలాంటి సంఘటనలు చూసిన తరువాత కూడా వారి యొక్క అసలుఉద్దేశాల నగ్నస్వరూపాన్నికుల హిందువులు గ్రహించలేకపోతున్నారు. 

ఉదాహరణకు (ఇది ఒక ఊహ మాత్రమే, నిజంగా జఱుగుతుందని కాదు ), హిందువుల పవిత్రవస్తువులకి ఏదైనా అపచారం జఱిగితే, హిందువుల రియాక్షన్ ఎలా ఉంటుంది? ఏమీ ఉండదు. ఎప్పటిలానే కుల హిందువులు తమ జీవితాలను వెళ్ళదీస్తారు. అదే ఇండియాలో ఒక అబ్రహామిక్ cult కి అపచారం జఱిగితే, ఇండియా మొత్తం అల్లకల్లోలం అవుతుంది. దీని బట్టి అర్దమయ్యేది ఏమంటే, అల్లకల్లోలాల మీద కూడా వారికి గుత్తాధిపత్యం (monopoly) ఉంది. అవి వారు మాత్రమే చేయాలి.

వాస్తవం ఇలా ఉన్నప్పటికీ, నా అభిప్రాయంలో We, the Hindus must always follow the Gandhian method of Ahimsa. We should reach wider audiences and educate other people. ఎంత మంది హిందువులు ఎంత త్వరగా చైతన్యవంతులయితే, అంత త్వరగా హిందువుల ఐక్యత సాధ్యమవుతుంది. చిన్న చిన్న అవరోధాలు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి.

29, ఫిబ్రవరి 2012, బుధవారం

మహాత్ముడికే మత మార్పిడి ; మరణానంతరం బాపూజీకి బాప్టిజం ; లేటర్ డే సెయింట్స్ చర్చ్ నిర్వాకం?

మహాత్ముడికే మత మార్పిడి ;
మరణానంతరం బాపూజీకి బాప్టిజం ;
లేటర్ డే సెయింట్స్ చర్చ్ నిర్వాకం?


బయటపెట్టిన పరిశోధకురాలు రాడ్ కీ
రికార్డులు మాయమయ్యాయని వెల్లడి
మహాత్ముడి మనవడి విస్మయం
మండిపడ్డ హిందూ అమెరికా ఫౌండేషన్
చర్చి అధ్యక్షుడి క్షమాపణకు డిమాండ్

"ప్రపంచంలో అన్ని మతాలూ నిజమే, అన్నిట్లోనూ ఏవో కొన్ని లోపాలున్నాయి. అయినప్పటికీ నా మతం నాకు గొప్పది. ఒక మతం వ్యక్తి మరొక మతంలోకి మారాల్సిన అవసరం లేదు. అయితే, ఒక హిందువు మరింత ఉత్తమమైన హిందువుగా మారాలి. ఒక క్రైస్తవుడు మరింత ఉత్తమమైన క్రైస్తవుడుగా, ఒక ముసల్మాన్ మరింత ఉత్తమమైన ముసల్మాన్‌గా మారాలి.'' - మహాత్మా గాంధీ (యంగ్ ఇండియా 28.01.1928)

వాషింగ్టన్, ఫిబ్రవరి 28: వ్యక్తుల బలహీనతలను ఆసరాగా చేసుకుని మతమార్పిడులకు పాల్పడుతున్నాయనే ఆరోపణలు ఎదుర్కొంటున్న క్రైస్తవ మత సంస్థలు... మరణానంతరం మహాత్ములకూ మతాన్ని అంటగడుతున్నాయా? హిందూమత సిద్ధాంతాల్నీ.. గీతాసారాన్నీ బలంగా విశ్వసించిన మహాత్ముడికి ఒక అమెరికన్ చర్చ్ బలవంతంగా క్రైస్తవం ఇచ్చిందా? మరణానంతరం ఆయన పేరు మీద బాప్టిజం 'ప్రసాదించిందా'? ..ఈ ప్రశ్నలన్నిటికీ హెలెన్ రాడ్ కీ అనే పరిశోధకురాలు అవుననే సమాధానమిస్తున్నారు.

1996 మార్చి 27న అమెరికాలోని ఉటాహ్ రాష్ట్రంలోని సాల్ట్‌లేక్ నగరంలో ఉన్న చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ లేటర్ డే సెయింట్స్ (ఎల్డీఎస్) గాంధీజీ పేరిట బాప్టిజం ఇచ్చిందని, సావోపాలో బ్రెజిల్ టెంపుల్‌లో 2007 నవంబరు 17న ఈ ప్రక్రియ పూర్తయిందని చెబుతున్నారు. ఈ ఎల్డీఎస్ చర్చ్ మోర్మన్ చర్చ్‌గా బహుళప్రాచుర్యం పొందింది. గతంలో అమెరికన్ అధ్యక్ష పదవికి పోటీపడిన జాన్‌కెర్రీ, 2012 అధ్యక్ష పదవి రేసులో ఉన్న మిట్ రోమ్నీ వంటివారు ప్రముఖ మోర్మన్లు. గాంధీజీ పేరు మీదబాప్టిజం ఇచ్చినట్టు వెల్లడించిన హెలెన్ రాడ్‌కీ సైతం ఒకప్పుడు మోర్మనే. అనంతరకాలంలో ఆమె చర్చ్ నుంచి వెలికి గురయ్యారు.

'ది డైరీ ఆఫ్ ఏన్ ప్రాంక్' రాసిన యూదు చిన్నారి ఏన్‌ఫ్రాంక్ కు కూడా ఎల్డీఎస్ ఇలాగే మరణానంతరం బాప్టిజం ఇచ్చినట్టు గతంలో వెల్లడించి సంచలనం సృష్టించిన చరిత్ర రాడ్‌కీకి ఉంది. ఇదే కోవలో.. గాంధీజీకి కూడా లేటర్‌డే సెయింట్స్ చర్చ్ బాప్టిజం ఇచ్చినట్టు నెవడాలోని హిందూ కార్యకర్త రాజన్ జెడ్‌కు ఆమె ఒక ఈమెయిల్ పంపారు. గాంధీజీ పేరు మీద బాప్టిజం ఇచ్చినట్టుగా ఉన్న రికార్డును తాను ఫిబ్రవరి 16న చూసినట్టు అందులో పేర్కొన్నారు. అయితే... తాను చూసిన కొద్దిరోజులకే ఆ రికార్డును మాయం చేశారని, అదిప్పుడు దొరికే అవకాశం లేదని వెల్లడించారు. ఇలా ఒక రికార్డు మాయమవడం అసాధారణమైన విషయమని తన మెయిల్‌లో పేర్కొన్నారు.

ఈ విషయం ఇతరులకు తెలియకూడదన్నది మోర్మన్ల ఉద్దేశంగా భావిస్తున్నానన్నారు. కాగా.. ఈ విషయం తెలిసి మహాత్ముడి మనుమడు అరుణ్‌గాంధీ తీవ్ర విస్మయం వ్యక్తం చేశారు. ఇలా ఒక వ్యక్తి మరణించాక, అతని పేరు మీద ఇష్టం వచ్చినట్టు చేయడం సరికాదని ఆయన అభిప్రాయపడినట్లు సమాచారం. హిందువులుగానీ, ఇతర మతస్థులెవరైనాగానీ... మతమార్పిడికి పాల్పడటాన్ని తన తాతయ్య పూర్తిగా వ్యతిరేకించేవారని అరుణ్ అన్నారు. గాంధీజీ అన్ని మతాలనూ గౌరవించేవారని, ఏ మతాన్ని అనుసరించాలన్నది వ్యక్తులు స్వయంగా నిర్ణయించుకోవాలని, ఇతరులు వారిని బలవంతం చేయకూడదని భావించేవారని అరుణ్‌గాంధీ వివరించారు.

ఇక... హిందూ మతం పట్ల ప్రగాఢ విశ్వాసం గల గాంధీజీ పేరు మీద ఆయన మరణానంతరం బాప్టిజం ఇవ్వడమంటే.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీయడమేనని వాషింగ్టన్‌లోని హిందూ అమెరికా ఫౌండేషన్ (హెచ్ఏఎఫ్)కు చెందిన సుహాగ్ శుక్లా మండిపడ్డారు. ఈ విషయమై రాడ్‌కీ నుంచి లేఖ అందుకున్న రాజన్ జెడ్... దీనిపై తాను ఎల్‌డీఎస్ చర్చ్ అధ్యక్షుడు థామస్ ఎస్ మాన్సన్‌కు ఫిబ్రవరి 24న లేఖ రాశానని తెలిపారు. అయితే ఇప్పటికీ ఆయన వద్ద నుంచి జవాబు రాలేదన్నారు. "మాన్సన్ దీనికి క్షమాపణ చెప్పాలి. ఇదెలా జరిగిందో ఆయన చెప్పాల్సిందే'' అన్నారు. 

andhrajyothy  news 

24, ఫిబ్రవరి 2012, శుక్రవారం

తమవేమో పవిత్రనమ్మకాలు, ఇతరులవేమో మూఢవిశ్వాసాలు !

౧) ఒక  తెల్ల  మిషనరి, ఇతర సమాజాలను (Societies) స్టడి చేస్తే దానిని "Anthropology" అంటాడు. తన సమాజాన్ని స్టడి చేస్తే దానిని "Sociology" అంటాడు.

౨) తెల్ల మిషనరి, ఇతర మత నమ్మకాలను Myth (Mythology) అంటాడు. తన మత నమ్మకాలను "Sacred Beliefs" అంటాడు 

౩) తెల్ల మిషనరి, ఇతరుల చరిత్రను "కల్పితము, మతవిశ్వాసము" అంటాడు. తన మతగ్రంథం మాత్రం "నిజమైన, నిఖార్సైన చరిత్ర" అని బుకాయిస్తాడు.

౪) తెల్ల మిషనరి, "ఇతరులు సైతానును కొలుస్తారు" అంటాడు "తాను ఒక్కడే నిజమైన దేవుడిని కొలుస్తున్నాను" అంటాడు 

౫) తాను 1st World అంటాడు. ఇతరులు 3rd World అంటాడు 

౬) "తాను ప్రపంచవ్యాప్తంగా ఇతర సమాజాలలోకి చొచ్చుకుపోయి మత మార్పిడి చేసి ఆ సమాజాన్ని నాశనం చేయవచ్చు" అంటాడు అక్కడి స్థానిక ప్రజలు దానికి అభ్యంతరం చెబితే (ప్రతిఘటిస్తే) , వారిని "తీవ్రవాదులు" అంటాడు 

 ౭) "తన పుస్తకమే నిజమైనది" అంటాడు. "ఇతరుల పవిత్ర గ్రంధాలు సైతాను ప్రేరేపించినవి" అంటాడు. అవి మూడు వేల సంవత్సరాలకు ముందునుంచి ఉన్నా, తమ మతం వయసు కేవలం 2 వేల సంవత్సరాలే అయినా !

తెలుగులో టైప్ చేయండి

కైఫీయతులు

  © బ్లాగర్ టెంప్లేట్ "ప్సై" రూపొందించినవారు Ourblogtemplates.com 2008

ఈ పుట పైభాగానికి వెళ్ళడం కోసం ఇక్కడ నొక్కండి