19, సెప్టెంబర్ 2012, బుధవారం
భారతీయ జ్యోతిశ్శాస్త్రాన్ని వ్యాపింపజేసే కృషిలో తెల్ల అమెరికన్లు
యోగా లాగానే భారతీయ జ్యోతిష్యమూ, వాస్తూ అమెరికాలో శీఘ్రంగా వ్యాపిస్తున్నాయి. అయితే యోగాని భ్రష్టు పట్టించినట్లుగా లేదా దానికి క్రైస్తవ ట్యాగ్ వేయగలిగినట్లుగా జ్యోతిష్యానికి వేయడం కష్టం. పాశ్చాత్య జ్యోతిశ్శాస్త్రాన్ని వదిలేసి మఱీ, భారతీయ పద్ధతిలోకి వచ్చేసిన తెల్ల అమెరికన్లు కూడా ఉన్నారు. ఈ క్రింది లంకెలు తెఱిచి చూడండి. ఈ లంకెల్లో Vedic astrologers అనే పేరుతో ప్రస్తావించబడ్డవాళ్ళంతా తెల్ల అమెరికన్లే తప్ప భారతీయ సంతతివారు కారని గమనించవలసినది. ఉదాహరణకి Dennis Flaherty అనే తెల్లాయన ఆ దేశంలో భారతీయ జ్యోతిష్యం మీద పెద్ద ఆథారిటీ. ఈయన మొదట పాశ్చాత్య పద్ధతిలో జాతకాలు వేసేవాడు. భారతీయ జ్యోతిష్యాన్ని చదివాక అది వదిలిపెట్టి పూర్తిగా ఈ మార్గపు జ్యోతిష్కుడుగా మారాడు. అయితే ఈ క్రమంలో, యోగా మాదిరే భారతీయ జ్యోతిష్యం కూడా అక్కడ మంచి ధనసంపాదనామార్గంగా, వ్యాసంగ ఎంపిక (career choice) గా మారుతోంది. కానీ శాస్త్రాల్ని నిగూఢంగా ఉంచితే అవి మరణిస్తాయి. వాటికి సామాజిక ప్రయోజనాన్ని కల్పించి నలుగుఱిలోకీ తెస్తే తప్ప అవి బ్రతకవు. ఏ సామాజిక ప్రయోజనాన్నయినా ఉచితంగా అందించడం సాధ్యం కాదు. కనుక ఆ దిశలో శాస్త్రాల్ని వ్యాపారీకరించడం వాటి మనుగడ కోసం ఒక అనివార్య పరిణామమేమో !
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి