పూజ్యశ్రీ ఎక్కిరాల భరద్వాజ మాష్టారుగారు ఒకచోట అన్నారు : "ధర్మవిచారణలో ఆత్మవిమర్శకే తప్ప పరవిమర్శకి తావు లేదు" అని ! అంటే ధర్మమంటే ఫలానా అనీ, దాన్ని ఆచరించాలనీ విన్నవారిలో ఎక్కువమంది చేసే పొఱపాటు - అది ఇతరుల్లో ఏమాత్రం ఉందో పరిశీలించి వారిని విమర్శించడం. ఇప్పటిదాకా అలాగే జఱుగుతూ వచ్చింది. ధర్మాలనేవి ఆచరించడానికి కాకుండా మనుషుల్లో అనవసరమైన వాచాలతని, వాగాడంబరాన్ని పెంచడానికీ, వాటి పేరు చెప్పి అవతలివాళ్ళ ముందఱి కాళ్ళకి బందాలెయ్యడానికీ, తద్ద్వారా ఒక విధమైన "ధర్మరాజకీయాలకి" పాల్పడడానికీ మాత్రమే ఉపయోగపడుతున్నాయి. ఇది మిక్కిలి శోచనీయం. మనకి ఒక విషయం తెలిసినంత మాత్రాన దాన్ని ఇతరులకి చెప్పేఅర్హత మనకి స్వయంతంత్రం (automatic) గా సిద్ధించదు. పోనీ, అర్హతల సంగతెలా ఉన్నా, మనం అలా చెప్పగలిగినంత మాత్రాన మనం అవతలివారికి గురువులం గానీ, దేవదూతలం గానీ, దేవుళ్ళం గానీ అయిపోము. చెప్పదగ్గ స్థానంలో ఉన్నా కూడా చెప్పడం పనికిరాదు కొన్నిసార్లు. తెలిసినా/అడిగినా చెప్పడం అనవసరమంటాడు మనువు తన ధర్మశాస్త్రంలో ! అది వేఱే విషయం.
ఇతరులకి చెప్పడం అనే బాధ్యత అత్యంత బాధాకరమైనది. కనుక ఆ బాధ్యతని భగవంతుడు అందఱికీ అప్పగించడు. ఆ బాధని తట్టుకోగలవాళ్ళకే ఆయన దాన్ని అప్పగిస్తాడు. ఎందుకంటే ఈ లోకం ఒక పాత పిచ్చాసుపత్రి. ఇక్కడి రోగుల పిచ్చి బహు పురాతనమైనది. నరనరాలా బహులోతుగా జీర్ణించినటువంటిది. దానికి వైద్యం చేయబోతే మీదపడి కొట్టేవాళ్లే తప్ప "అయ్యో పాపం, నాకు వైద్యం చేయడానికొచ్చాడీయన" అని కృతజ్ఞత వహించి మొక్కేవాళ్ళెవరూ ఇక్కడ లేరు. మీకు వైద్యకట్నం (fees) ఇచ్చేవాళ్ళు కూడా లేరు. ఎలాగూ అదివ్వరు కనుక లాభాపేక్ష లేకుండా వైద్యం చెయ్యాల్సి ఉంటుంది. మీచేత మంచి చెప్పించుకొన్నవారు మిమ్మల్ని హింసించకపోతే అదే వైద్యకట్నంగా, అదే ఒక గొప్ప అదృష్టంగా భావించి "బతుకు జీవుడా" అనుకొని నిమ్మళంగా బయటపడాల్సిన పరిస్థితి ఉంది. మనకేమో వైద్యం రాదు. ఇక్కడ ఉన్నవాళ్ళు వట్టి పిచ్చోళ్ళని గుర్తుపట్టేటంత పరిజ్ఞానం మాత్రమే మనకుంది. ఆ మాత్రం దానికే మనం అమాంతం వైద్యావతారమెత్తడం సమంజసం కాదేమో.
భగవాన్ శ్రీరామకృష్ణ పరమహంస దీని గుఱించి అనుగ్రహ భాషణం చేస్తూ "ఇతరులకి చెప్పాలంటే భగవంతుడి నుంచి లైసెన్సు తీసుకోవాలి" అని తెలియజేశారు. చాలా గొప్ప లైసెన్సు అది. ఊరికే రాదు. జన్మజన్మల ఉపాసనా, తపస్సూ ఉంటేనే తప్ప ! మనలాంటివాళ్ళు ఎంత చెప్పినా ఎవరి హృదయకవాటాలూ తెఱుచుకోవు. ఎవఱి మేధాకమలమూ వికసించదు. మనం ఎన్ని ఉపన్యాసాలిచ్చినా ఎవఱి జీవితమూ మారదు. మనం ఎంతగా మాట్లాడితే అంతగా సరికొత్త సమస్యలు తలెత్తడమే తప్ప ఏ పాత సమస్యా పరిష్కరించబడదు. కానీ ఆ లైసెన్సున్న వ్యక్తులు మాత్రం ఒక్క వాక్యం ఉచ్చరించగానే జీవితాలే మారిపోతాయి. లోకమే తలకిందులవుతుంది. తమ తపశ్శక్తితో భగవంతుడి దగ్గఱ చనువు సంపాదించిన మహనీయుల వాక్కులలోని రాజముద్ర అది.
శ్రీ బుద్ధభగవానుల జీవితచరిత్రలో తారసిల్లే అంగుళిమాలుడనే హంతకుడి గుఱించి చాలామంది వినే ఉంటారు. అతని అసలు పేరు అహింసకశర్మ. చాలా మేధావి. గురుకులంలో మిగతా అందఱు విద్యార్థులకంటే ముందుండేవాడు. అది సహించలేని అతని సహాధ్యాయులు అతనికీ, గురుపత్నికీ అక్రమసంబంధాన్ని అంటగట్టి అపప్రచారం చెయ్యడంతో అతన్ని గురువుగారు అర్ధాంతరంగా గురుకులంలోంచి వెళ్ళగొట్టారు. అతను ఇల్లు చేఱుకొని, జఱిగినదాన్ని తల్లిదండ్రులు అర్థం చేసుకుంటారనుకొని వారికి వివరించబోతే వాళ్ళు కూడా పూర్తిగా వినకుండా, అతన్ని నమ్మకుండా ఇంట్లోంచి వెళ్ళగొట్టారు. అహింసకశర్మ అందఱి దృష్టిలోను అకారణంగా నేఱస్థుడయ్యాడు. అతనికి జీవితం దుర్భరమైంది. అతను సమాజం మీద కక్ష గట్టాడు. అడవికి చేఱుకొని ఆ దారిన పోయేవాళ్ళందఱినీ చంపి ఉన్నదంతా దోచుకునేవాడు. తన చేతిలో చచ్చిపోయినవాళ్ళ చేతి బొటనవ్రేళ్ళు నఱికి మాలగా మెడలో ధరించేవాడు. అందువల్ల అతనికి అంగుళిమాలుడు అని పేరొచ్చింది. అలా కొన్ని వేలమంది అతని చేతిలో నిహతులయ్యారు. ఆఖరికి ఆ దారిగుండా శ్రీ బుద్ధభగవానులు ప్రయాణించడమూ, ఆయన్ని కూడా చంపి దోచుకుందామని అనుసరించిన అంగుళిమాలుడు ఆయన మహత్త్వానికి దాసోహం అని బౌద్ధభిక్షువుగా మారడమూ చరిత్రప్రసిద్ధమే.
ఈ వృత్తాంతంలో తథాగతుల మహత్త్వం కంటే ఎక్కువగా మనం గమనించాల్సింది - అంగుళిమాలుడు నిజంగానే తప్పుచేశాడని భావించిన ఆ కాలపు సామాజికులు తమని తాము ఏ విధంగా గురువు స్థానంలోను, దేవుడి స్థానంలోను కూర్చోబెట్టుకున్నారనేది. గురువుగారి గురుత్వం అతని శిష్యత్వాన్ని చెడగొట్టింది. తల్లిదండ్రుల దైవత్వం అతనిలోని మానవత్వాన్ని చంపేసింది. ఇహ ఆ గురుత్వం దేనికి ? ఆ తల్లిదండ్రుల దైవత్వం దేనికి ? అంతా వృథా. అతను నిజంగానే తప్పు చేసినా, దానిమీద తీర్పులిచ్చే అధికారమూ, ఆ ప్రాతిపదిక మీద అతన్ని వెలేసే అధికారమూ వాళ్ళకు ఉన్నాయా ? అని ! అంగుళిమాలుణ్ణే కాదు, అలా తప్పు చేశారనుకున్న ప్రతివారి విషయంలోను మన పూర్వులు తమకు లేని అధికారాల్ని కట్టబెట్టుకోవడం వల్లనే ఈనాడు మనం దేశంలో కోట్లాదిమంది అస్పృశ్యుల్ని చూస్తున్నామేమో ! తప్పులు తప్పులే. అవి ఎప్పటికీ ఒప్పులు కావు. కానీ ఆ మాట ఇతరులకి చెప్పడానికి మన తపశ్శక్తి సరిపోదు. మనకి లైసెన్సు లేదు.
ఇహ లేద్దాం. ఈ అన్యాయ, అనధికార గురుపీఠాన్ని, మనం అక్రమంగా ఆక్రమించుకున్న దేవుడి సీటుని ఖాళీ చేద్దాం. మన మొహాల్ని మనం ఒకసారి అద్దంలో చూసుకుందాం.
21, నవంబర్ 2012, బుధవారం
ముందు ఆ సీట్‌లోంచి లే !
నామాంకాలు (Labels)
హిందూవేదాంతము
20, నవంబర్ 2012, మంగళవారం
ఆధ్యాత్మికోన్నతి ఎలా కలుగుతుంది ?
Absolute
emptiness is the end of all religion. Stuffing mind and life with all sorts of
things goes against this. Stuffing this way, you can still be a believer but
not a serious practitioner. When we could feel proud of our emptiness in stead
of our full-ness, we will have reached the height of all spirituality.
సాధన దంతమంజనం (Tooth paste) లాంటిది. పళ్ళు తోముకున్నాక దాన్ని కూడా పుక్కిలించి ఉమ్మివేయక తప్పదు. అత్యున్నతస్థాయి ఆధ్యాత్మికత నాస్తికత్వాన్ని పోలి ఉంటుంది, "ముదిమి రెండవ బాల్యము" అన్నట్లు. కానీ అది నాస్తికత్వం కాదు. షిరిడీ సాయిబాబా తమ కాళ్ళతో నిప్పుకట్టెల్ని సవరించేవారు. సాధారణ మానవులు అలా చేస్తే అది నాస్తికత్వమే. కనుక సాధకులకు వర్తించే నియమాలూ, విశ్వాసాలూ అంతకంటే పైస్థాయివాళ్ళకి వర్తించవు. కాని వారు కూడా బాహ్యంగా సాధకుల లాగానే మాట్లాడుతూ, ప్రవర్తిస్తూ ఉండాలి. కిందిస్థాయివాళ్ళ దగ్గఱ పైస్థాయి మాటలు మాట్లాడితే వాళ్ళు శూన్యవాదులూ, నాస్తికులూ అవుతారు. చిన్నపిల్లలతో శృంగారం గుఱించి మాట్లాడడం లాంటిది అది. వేమన చేసిన పొఱపాటు ఇదే. అది ఎంతవఱకూ వెళ్ళిందంటే ఆయన్ని కూడా తమలాంటి నాస్తికుడని నాస్తికులు భ్రమపడే దాకా !
"హిందూ ఆధ్యాత్మికత ఎందుకని ఇంత గజిబిజి, సంక్లిష్టం ? మతం ఇంకా సింపుల్ గా ఉండొచ్చు గదా ?" అని అడుగుతారు కొందఱు. కానీ ఇదే తరహా ప్రశ్న ఇతర విషయాల గుఱించి వేయరు. మతమంటేనే ఈ లోకువ. "గణితశాస్త్రం ఎందుకని ఇంత గజిబిజి, సంక్లిష్టం ? కాస్త సింపుల్ గా ఉండొచ్చు గదా ? భౌతికశాస్త్రం ఎందుకింత గజిబిజి, సంక్లిష్టం ? కాస్త సింపుల్ గా ఉండొచ్చు గదా ? సాఫ్టువేర్లు ఎందుకింత గజిబిజి, సంక్లిష్టం ? కాస్త సింపుల్ గా, చిన్నపిల్లవాడు కూడా కార్యక్రమణ (Programming) చేసేలా ఉండొచ్చు గదా ?"
మతపు సంక్లిష్టత (complexity) ఎవఱి సృష్టీ కాదు. ఆ జ్ఞానం సహజంగానే చాలా జటిలమైనది, చాలా గహనమైనది. దాన్ని పూర్వఋషులు మన కోసం చాలా చాలా సరళీకరించారు. అయినా అది ఇప్పటికీ సామాన్యమానవుల అవగాహనకి అందుబాటులో లేదు. బహుశా ఎప్పటికీ ఉండదు. ఉండబోదు. మతం కడుపు నిండినవాళ్ళ కులాసా కాలక్షేపం కాదు. కడుపు నిండకపోవడం చేతనే మనిషిలో జీవితం గుఱించిన అంతర్మథనం మొదలైంది. "అనుకున్నది అనుకున్నట్లుగా ఎందుకు జఱగడం లేదు ?" అని !
పరమార్థాన్ని సాధించడం కోసం అవసరమంటూ శాస్త్రాల్లో చెప్పిన నియమాలు - ఉదాహరణకి, ఏకాంతవాసమూ, బ్రహ్మచర్యమూ, ఉపవాసాలూ, శమదమాదులూ, బ్రాహ్మీముహూర్తపు సాధనలూ - వీటిని నిబంధనలు (Rules) గా, నిర్బంధంగా చూడడం పొఱపాటు. ఇవి ఆత్మజ్ఞానం అనే సంఘటన జఱగడానికి దోహదపడే సానుకూలాలు (favorable circumstances) మాత్రమే. ఇవన్నీ వాటంతట సమకూడిన ఒకానొక అఱుదైన క్షణంలో మనిషిలో తటాలున అనుకోకుండా ఆత్మజ్ఞానం మెఱుపులా మెఱుస్తుంది. అంటే, ఉదాహరణకి - ఇంద్రధనుస్సు కనిపించాలంటే, ఎండ పడుతూ ఉండాలి. చిఱుజల్లు కుఱుస్తూ ఉండాలి అన్నట్లు ! కృత్రిమంగా ఎండా, చిఱుజల్లూ ఏర్పాటుచేస్తే అది Lab experiment అవుతుంది తప్ప ఇంద్రధనుస్సు అవ్వదు. అలాగే శాస్త్రంలో చెప్పారు గదా అని పై లక్షణాల్ని బలవంతాన అలవఱచుకుంటే ఆత్మజ్ఞానం కలగదు.
ఎందుకంటే, వీటిల్లో ఏ లక్షణమూ ఒక్క జన్మలో సిద్ధించేది కాదు. అలాంటిది, అన్ని లక్షణాలూ ఒనగూడాలంటే ఎన్ని జన్మలు పట్టుతుందో ఆలోచించండి. దీని పూర్వాపర ప్రక్రియని సక్రమంగా అర్థం చేసుకోవాలి. మనకున్న ప్రతి లక్షణం వెనుకా ఒక సంస్కారం, మన ప్రతిసంస్కారం వెనుకా ఒక ఆచరణ, ప్రతి ఆచరణ వెనుకా ఒక గుర్తోదయం (Realization) ఉంటాయి. అలాంటి అనేక గుర్తోదయాల యొక్క సమాహార రూపంగా ఒక జన్మలో ఆత్మజ్ఞానం సిద్ధిస్తుంది.

హిందూ అనుష్ఠాన వేదాంతము
15, నవంబర్ 2012, గురువారం
ఐర్లాండ్ వైద్యుల మతవాదం!
ఐర్లాండ్ వైద్యుల మతవాదం!
'ఇది కేథలిక్ దేశ' మంటూ వ్యాఖ్య..
గర్భస్రావానికి తిరస్కృతి
భారతీయురాలి మృతి
గాల్‌వేలోని బోస్టన్ సైంటిఫిక్‌లో ఇంజినీర్‌గా పని చేస్తున్న ప్రవీణ్ హలప్పనవర్ భార్య సవిత.. తనకు గర్భస్రావం జరిగిందని, తన గర్భంలోని పిండాన్ని తొలగించాలని వైద్యులను కోరింది. తమది కేథలిక్ దేశం అని చెబుతూ అక్కడి వైద్యులు అబార్షన్ చేసేందుకు తొలుత నిరాకరించారు. తరువాత మృత శిశువును తొలగించారు. అప్పటికే సవిత మర ణించింది. ఈ ఘటన అక్టోబర్ 28న జరిగింది
7, నవంబర్ 2012, బుధవారం
శ్రద్దాంజలి
GORAKSHA
SAMITHI- 7 november 2012 wednesday, Shradhanjali Karyakram (Shaheed Gou
bakthowki) at Shree Sanatana dharma sabha, Begum bazar, Hyderabad.A.P.
( 1966 anti-cow slaughter agitation was the agitation in 1966 to demand a ban on the slaughter of cows in India, as enshrined in the Directive Principles of State Policy in the Constitution of India. Among others, the Shankaracharya fasted for the cause. The agitation culminated in a massive demonstration outside Sansad Bhavan in New Delhi on 7 November 1966 (As per Hindu Panchang, Vikram Samvat, Kartik Shukla Ashtami, famously known as Gopashtami among Hindus ).
The
Prime Minister did not accept the demand for a ban on cow slaughtering.
Instead police fired on the peaceful rally, killing many Sadhus in the firing. The Home minister, Gulzarilal Nanda, resigned, taking responsibility for the
administration's failure to maintain law and order.)
G.Hanmanth Rao
President
Goraksha Samithi,
T.Yadhagira Rao
Org Sec.
Govamsha Rakshana Samvardhana Parishad.
Pukraj Joshi, Sridhar Yadav, Bharath and Lodh Divyang Singh Jamedar.others
5, నవంబర్ 2012, సోమవారం
వినోదం పేరుతో ఎంత దిగజాఱడానికైనా రెడీ !
మొదటి
సభ్యుడు :
మోహన్ బాబు తన సినిమాలో ఒక సామాజిక వర్గాన్ని (బ్రాహ్మణుల్ని) కించపఱచడాన్ని మనమందఱమూ ఖండించాలి. ఇలాంటి చర్యలు హిందువుల ఐక్యాన్ని దెబ్బతీస్తాయి. మోహన్ బాబు మిషనరీ (YSR) కుటుంబంతో సంబంధం కలుపుకున్నప్పుడే అతను ఒక హిందువుగా, కుల హిందువుగా అర్హత కోల్పోయాడు. ఇలా మత/కుల భ్రష్టులు అయినవారు, తమ పాత కులపు ముసుగులో హిందువుల ఐక్యాన్ని ఛిన్నాభిన్నం చేస్తున్నారు. ఇలాంటి వారికి కులమూ మతమూ అనేవి ఉండవు. డబ్బూ, అధికారమూ కావాలి. దానికోసం ఏమైనా చేస్తారు. తల్లినే తార్చే రకాలు. మతము మారినవారు తమ హిందూ పేర్లను, హిందూకులాన్ని ఒక పావుగా వాడుకుని హిందువుల ఐక్యాన్ని పాడుచేస్తున్నారు. ప్రపంచ వ్వాప్తంగా మిషనరీల వ్యూహంలో, పాత పేగన్ల (కొత్తగా మతం మారినవారి) పాత్ర గణనీయమైనది. పేగన్ల (ఉదా : హిందువుల) సమాజాల్లో, దేశాలలో అల్లర్లూ, ఘర్షణలూ, సామాజిక అసమతూకాన్ని చొప్పించడానికి, మిషనరీలు ఇలాంటి (మోహన్ బాబులాంటి) వారిని ఉపయోగిస్తారు తమ చేతికి మట్టి అంటకుండా.

ఇది జగన్ వ్యూహంలో కూడా ఒక భాగమైతే ఆశ్చర్యపోనక్కఱలేదు. హిందువులను కులాలవారీగా ఇంకా విడగొట్టాలి అంటే, వారి మధ్య గొడవలు సృష్టించాలి. మోహన్ బాబు సినిమా అలాంటి ఒక
ప్రయత్నం అని తెలుస్తోంది. మోహన్ బాబు జగన్ తొత్తు అని చెప్పకనే తెలుస్తోంది. ఒక
బలమైన సామాజిక వర్గంవారు ఇప్పటికే జగన్ చేతిలో ఉన్నారు. మిగిలిన "ఇంకో బలమైన
సామాజిక వర్గాన్ని" కూడా ఇతర కులాలనుండి విడగొడితే, TDP పతనమవుతుంది. కాంగ్రెస్
anti-incumbency వల్ల పతనమవుతుంది. జగన్ మఱియు మిషనరీలు అధికారాన్ని చేజిక్కించుకోవచ్చు.
ఆ తరువాత మతమార్పిడులు త్వరితగతిన చేసి కిరస్తానీల సంఖ్య పెంచుకోవచ్చు. మిషనరీల యొక్క ఇలాంటి నీచమైన ఎత్తుగడలను హిందువులు గ్రహించి
తమ ఐక్యాన్ని కాపాడుకోవాలి. ఇంత కంటే ఎక్కువ పరీక్షా సమయాలు రావచ్చు. వాటిన్నింటినీ
తట్టుకున్నప్పుడే హిందువులు తమ మనుగడను కొనసాగించగలరు. లేకపోతే హిందువుల మనుగడ కష్టసాధ్యమే.
రెండో సభ్యుడు :
మోహన్ బాబు ఇలా చేయటం ఇదే మొదటిసారి కాదు
మాష్టారూ !ఇంతకు ముందు అనేకమార్లు ఇలాగే చేశాడు. ఏవైనా కులాలను కించపఱుస్తూ
సినిమాలు తీయటం హేయం. ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
మొదటి సభ్యుడు :
ఎవఱైనా హిందువుల మనోభావాలను కించపఱుస్తూ ఉంటే, వారిపై న్యాయపరంగా చర్యలు తీసుకోవడానికి హిందువులకు ఒక
సంస్ఠ కావాలి. అలాంటివి ఇప్పటికే ఉంటే అవి సరిగా పనిచేస్తున్నట్లు లేదు. ఈ
ప్రక్రియను క్రియాశీలకం చేయాలి. "All India Hindu Human
and Legal Rights Protection Authority" అని ఒకదానిని ఏర్పఱచి, తగు ఆర్థిక సంపత్తినీ, పూర్తికాలిక
ఉద్యోగుల్నీ మఱియు ఇతర వనర్లనీ దానికి ఇవ్వాలి. విడివిడిగా చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు.
ఉదాహరణకు, డా. సుబ్రమణ్య స్వామి, ఇంకా ఇతరులు. కాని
అవి అంత సమర్దవంతంగా పనిచేయవు. అదేదో సామెత చెప్పినట్లు, ప్రతిసారి, మొదలుపెట్టాలి
అంటే, అది అంత సమర్థవంత ప్రక్రియ అవ్వదు. ప్రతి హిందువూ (లేక
గుంపు) తాను సమస్యలలో ఉన్నప్పుడు వ్యక్తిగత హోదాలో పరిష్కరించుకోవాలి అంటే, అది అయ్యేపని కాదు. Each Hindu
doesn't have to invent the wheel every time. This is very inefficient
process.
అతి ముఖ్యమైనది ఏమంటే, ఈ సెలబ్రిటీలలో
ఎక్కువమంది, హిందూ పుట్టుక పుట్టినా, వారికి హిందూమతం, కులం, సంప్రదాయాలు, భాషలపై అభిమానం ఉండదు. వీరు కమ్యునిష్ట్ లుగానో, కిరస్తానీలు గానో, సెక్యులర్ లు
గానో, ప్రాంతీయవాదులుగానో రూపాంతరం చెంది ఉంటారు (హిందూ పేరు, హిందూ కుల ముసుగులో). వీరు చేసే వెధవ పనులను, అదే సామాజిక వర్గానికి చెందిన హిందూ సామాన్యులపైకి project చేయరాదు (ఇలా జఱగాలనేదే హిందూ శత్రువుల అసలు ఉద్దేశ్యము). ఇలాంటివారికి
డబ్బూ, అధికారమూ, పేరూ మాత్రమే
కావాలి. హిందువుల మధ్య చీలికలు తీసుకు రావడానికి ఇలాంటి వారు మిషనరీలకు తొత్తులుగా
పనిచేస్తారు. ఇలాంటి సంఘటనలు ముందుముందు ఎక్కువగా జఱగవచ్చు మిషనరీల ప్రోద్బలముతో !
I think we should collect some funds
to support legal action against మోహన్ బాబు. This kind
of nonsense against Hindus should not go unanswered. In all this, where is the
Hindu leadership hiding? Did it exist at all ?
మూడో సభ్యుడు :
బాధ్యత లేనివాళ్ళు చిన్నపిల్లల కిందే జమ, వాళ్లు వ్యక్తులైనా, సామాజిక వర్గాలైనా ! మోహన్ బాబు
పిచ్చివేషాల వెనక అతను లేడు. చాలా పెద్ద యెత్తున వ్యాపించిన సామాజిక బాధ్యతారాహిత్యం
ఉంది. తెఱమీదా, తెఱ వెనకా అది భారీస్థాయిలో ఉత్పత్తి చేస్తున్న వెకిలి క్యారెక్టర్లు ఉన్నాయి. శరీరంలో ఒక వేలు నొప్పిపెడుతున్నా సరే, మొత్తం శరీరమంతా మూలపడుతుంది, ఏ పనీ చేసుకోలేని విధంగా !
అలాగే ఒక చిన్న
సామాజిక వర్గాన్ని బాధించినా సరే, అది కాలక్రమంలో పెద్ద
క్యాన్సరుగా మారుతుంది. దీనికి ఉదాహరణగా అస్పృశ్యవర్గాలనే తీసుకోవచ్చు. దీని మూలాలు
సంస్కృతిలో ఉన్నాయి. ఎంత డబ్బున్నా
Mentally retarded గా మారిన సామాజిక వర్గాల్ని పెద్దవాళ్ళని చేయాలి. బాధ్యత
తెలుసుకునేటట్లు
చేయాలి. అందుకే హిందువులందఱికీ ఉపనయనమూ,
బ్రహ్మోపదేశమూ, నిత్యానుష్ఠానమూ సర్వసామాన్యం
చేయాలనుకుంటున్నాను.
నాలుగో సభ్యుడు :
రజనీకాంతూ, మోహన్ బాబూ వేషాలకోసం వెతుక్కునే రోజుల్లో
తప్ప తాగి పాండీబజారు రోడ్ల మీద కొట్టుకునేవాళ్ళు ..ఇందులో రజనికి తొందఱగా జ్ఞానోదయం అయ్యింది. కాని ....చవకబారు మోహన్
బాబుకి .....కిందకి అఱవై వస్తున్నా ....పొగరు తగ్గలేదు మఱి !
మూడో సభ్యుడు :
మోహన్ బాబు సినిమాల్లోనే కాదు, నిజజీవితంలో కూడా విలనే అని
పేరు. ఇష్టం లేనివాడినల్లా అక్కడికక్కడే
భౌతికంగా చావచితక కొట్టడం అతని నైజం. చాలా సంవత్సరాల
క్రితం తెలుగుదేశం ఎమ్మెల్యే శంకర్ రెడ్డిని చావగొట్టడంతో ఆగ్రహించిన
చంద్రబాబునాయుడు మోహన్ బాబుని పార్టీకి దూరంగా ఉంచడం మొదలుపెట్టాడు. అప్పట్నుంచీ నాయుడుమీద కక్షగట్టిన మోహన్ బాబు కాంగ్రెస్ కీ, YSR కుటుంబానికీ దగ్గఱ కావడం మొదలుపెట్టాడు
వియ్యం కూడ కలుపుకున్నాడు. కనుక ఈ వ్యక్తి వేస్తున్న వెఱ్ఱిమొఱ్ఱివేషాలకి
ఒక కులాన్ని నిందించడం సరికాదు.
అతను మొదట ఒక స్కూల్ లో ఉపాధ్యాయుడుగా పని చేసే రోజుల్లో
అతనిలో ఉన్న "ఈ తత్త్వాన్ని" గమనించి అప్పట్లో ఆ పాఠశాల
ప్రధానోపాధ్యాయుడైన బ్రాహ్మణుడొకాయన
అతన్ని డిస్మిస్ చేశాడు. "అది తన కులం వల్లనే చేశా" డని ఇతను గోలపెడతాడు
తప్ప తాను అక్కడ ఏం చేశాడో చెప్పడు.
నామాంకాలు (Labels)
అన్యాయాలూ అవమానాలూ,
భావిప్రణాళికలూ ప్రతిపాదనలూ
4, నవంబర్ 2012, ఆదివారం
పసిపాపపై పాస్టర్ అత్యాచారం
ఓర్వకల్లు, నవంబర్ 3: మూడేళ్ల చిన్నారిపై ఓ పాస్టర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం హుసేనాపురం గ్రామంలో శనివారం జరిగింది. గ్రామంలోని బైరెడ్డి కాలనీలో ఓ ప్రార్థనా మందిరంలో ప్రసాద్ పాస్టర్‌గా పనిచేస్తున్నాడు. సమీపంలోనే ఉంటున్న 3 ఏళ్ల బాలికను ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు.
చాలా సమయం అయినప్పటికీ పాప తిరిగి రాకపోవడంతో తల్లి పాస్టర్ ఇంట్లోకి
వెళ్లి చూసి ఒక్కసారిగా హతాశురాలైంది. గట్టిగా కేకలు వేసేసరికి పరిసరాల్లో
ఉన్న వారందరూ అక్కడికి చేరుకున్నారు. ఇది చూసి ప్రసాద్ పారిపోయేందుకు
యత్నించాడు. కాలనీ వాసులు అతడిని పట్టుకుని చెట్టుకు కట్టేసి దేహశుద్ధి
చేశారు. అనంతరం ఓర్వకల్లు పోలీసుస్టేషన్‌లో అప్పగించారు. బాలికను చికిత్స
కోసం ఆస్పత్రి తరలించారు.
www.andhrajyothy.com 4-11-2012
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)