15, నవంబర్ 2012, గురువారం

ఐర్లాండ్ వైద్యుల మతవాదం!

ఐర్లాండ్ వైద్యుల మతవాదం!
'ఇది కేథలిక్ దేశ' మంటూ వ్యాఖ్య..
గర్భస్రావానికి తిరస్కృతి
భారతీయురాలి మృతి

లండన్, నవంబర్ 14: గర్భస్రావం చేసేందుకు వైద్యులు తిరస్కరించడంతో భారతీయ దంత వైద్యురాలు సవితా హలప్పనవర్ (31) ఐర్లాండ్‌లో దుర్మరణం పాలయ్యారు. గాల్‌వే యూనివర్సిటీ ఆస్పత్రిలో అక్టోబర్‌లో ఈ మరణం సంభవించిందని 'ఐరిష్ టైమ్స్' పత్రిక బుధవారం వెల్లడించింది.

గాల్‌వేలోని బోస్టన్ సైంటిఫిక్‌లో ఇంజినీర్‌గా పని చేస్తున్న ప్రవీణ్ హలప్పనవర్ భార్య సవిత.. తనకు గర్భస్రావం జరిగిందని, తన గర్భంలోని పిండాన్ని తొలగించాలని వైద్యులను కోరింది. తమది కేథలిక్ దేశం అని చెబుతూ అక్కడి వైద్యులు అబార్షన్ చేసేందుకు తొలుత నిరాకరించారు. తరువాత మృత శిశువును తొలగించారు. అప్పటికే సవిత మర ణించింది. ఈ ఘటన అక్టోబర్ 28న జరిగింది

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

వైద్యులది మతవాదమనే వ్యాఖ్య సరికాదనుకుంటా. ఈరిష్ చట్టాలే గర్భస్రావానికి ఒప్పుకోవు. అటువంటప్పుడు వాళ్ళు మాత్రం ఏం చేస్తారు ? చట్టవిరుద్ధంగా కడుపుతీసి చెరసాలపాలు కాలేరు గదా ? గర్భస్రావాలు మంచివి కావు కానీ "తప్పనిసరైతే" కడుపు తీయొచ్చునని చట్టం మారిస్తే బావుంటుంది.

తెలుగులో టైప్ చేయండి

కైఫీయతులు

  © బ్లాగర్ టెంప్లేట్ "ప్సై" రూపొందించినవారు Ourblogtemplates.com 2008

ఈ పుట పైభాగానికి వెళ్ళడం కోసం ఇక్కడ నొక్కండి