ఈనాడు
రామోజీరావుగారి చిన్న కుమారుడు,
ఉషోదయా ఎంటర్ ప్రైజెస్ మేనేజింగ్ డైరెక్టరు, బహుముఖ
ప్రజ్ఞాశాలి అయిన శ్రీ
చెఱుకూరి సుమన్ గారు 7-9-2012 రాత్రి హైదరాబాదు యశోదా హాస్పిటల్ లో మరణించారు. ఆయనకి చాలా కాలంగా అస్వస్థతగా ఉందని తెలుస్తోంది. ఆయన వయస్సు 46 సంవత్సరాలు
మాత్రమే. ఆయనకు భార్యా, ఒక కుమార్తే,
ఒక కుమారుడూ ఉన్నారు. కీ.శే. సుమన్
సమాజంలో అత్యున్నత వర్గానికి చెందినప్పటికీ ఆ భేషజాలేమీ పెట్టుకోకుండా
తెలుగు భాషాభిమానిగా, తెలుగుతల్లి ఆరాధకుడుగా కొనసాగారు. తండ్రికున్న
అనేక సంకుచిత భావాలతో ఆయన ఎప్పుడూ ఏకీభవించలేదు. వ్యాపార కుటుంబంలో
జన్మించినప్పటికీ ఒక కవిగా, పండితుడుగా,
సంగీతవేత్తగా, నటుడుగా, చిత్రకారుడుగా మాత్రమే ఆలోచించేవారు. ఈనాడుగ్రూప్
మీడియాలో వీలైనంత ఎక్కువగా తెలుగుపదాలూ, వీలైనంత తక్కువగా విదేశీ పదాలూ
ఉపయోగించడానికి ఆయన స్ఫూర్తి నిచ్చారు. అనేకమంది కళాకారులకూ, రచయితలకూ
ఆశ్రయమయ్యారు. ఆయనలాంటి
బహుముఖ ప్రజ్ఞాశాలిని మళ్లీ చూడడం కష్టం. వేంకటేశ్వరస్వామిపై
వేయి సంకీర్తనలు మొదలైన తన ఆధ్యాత్మిక రచనల ద్వారా సుదీర్ఘకాలం దైవచింతనలో గడిపిన ఆ అక్షర తపస్వి అకాల మరణం
తెలుగుభాషా ప్రేమికులకూ, హిందూ మతాభిమానులకూ శరాఘాతం లాంటిది. ఆయన
పవిత్రాత్మకు ఆ పరాత్పరుడు సద్గతులను ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాము.
10, సెప్టెంబర్ 2012, సోమవారం
పవిత్ర హృదయునికి శ్రద్ధాంజలి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
1 కామెంట్:
వారి ఆత్మకు శాంతికలగాలని ప్రార్థిస్తున్నాము
కామెంట్‌ను పోస్ట్ చేయండి