4, నవంబర్ 2012, ఆదివారం

పసిపాపపై పాస్టర్ అత్యాచారం

ఓర్వకల్లు, నవంబర్ 3: మూడేళ్ల చిన్నారిపై ఓ పాస్టర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం హుసేనాపురం గ్రామంలో శనివారం జరిగింది. గ్రామంలోని బైరెడ్డి కాలనీలో ఓ ప్రార్థనా మందిరంలో ప్రసాద్ పాస్టర్‌గా పనిచేస్తున్నాడు. సమీపంలోనే ఉంటున్న 3 ఏళ్ల బాలికను ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు.

చాలా సమయం అయినప్పటికీ పాప తిరిగి రాకపోవడంతో తల్లి పాస్టర్ ఇంట్లోకి వెళ్లి చూసి ఒక్కసారిగా హతాశురాలైంది. గట్టిగా కేకలు వేసేసరికి పరిసరాల్లో ఉన్న వారందరూ అక్కడికి చేరుకున్నారు. ఇది చూసి ప్రసాద్ పారిపోయేందుకు యత్నించాడు. కాలనీ వాసులు అతడిని పట్టుకుని చెట్టుకు కట్టేసి దేహశుద్ధి చేశారు. అనంతరం ఓర్వకల్లు పోలీసుస్టేషన్‌లో అప్పగించారు. బాలికను చికిత్స కోసం ఆస్పత్రి తరలించారు. 

www.andhrajyothy.com       4-11-2012

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

ఇలాంటివి బయటికి రాకుండా ఇంకా ఎన్ని జరుగుతున్నాయో!? ఇలాంటి రాక్షసులనుండి ఇండియన్లు తమ పిల్లలను కాపాడుకోవాలి. వీళ్ళు ఎక్కడికిపోయినా పిల్లలను టార్గేట్ చేస్తారు.

వీరిని కఠినముగా శిక్షించాలి.

తెలుగులో టైప్ చేయండి

కైఫీయతులు

  © బ్లాగర్ టెంప్లేట్ "ప్సై" రూపొందించినవారు Ourblogtemplates.com 2008

ఈ పుట పైభాగానికి వెళ్ళడం కోసం ఇక్కడ నొక్కండి