28, మార్చి 2013, గురువారం

ప్రేమ రామాయణం

జై శ్రీరాం,
శ్రీరామదూతం శిరసా నమామి!

పోయిన ఫిబ్రవరి నెలలో వాలెంటైన్స్ డే నాడు నా స్నేహితుడొకడు అందరికి విషెస్ చెప్తూ, నాగురించి ఒక మాటన్నాడు. మనోహరైతే రామాయణానికి ప్రేమకి ఉన్న సంబంధం గురించి పేజీలు పేజీలు రాస్తాడేమో అని. "అసలు నిజంగా ప్రేమగురించి మాట్లాడాలంటే రామాయణమే చెప్పుకోవాలి, ప్రేమ గురించి రామాయణంలో చెప్పింది రాయడం మొదలుపెడితే ఎన్ని రోజులైనా పడుతుంది. ప్రస్తుతానికి వద్దులే" అని సంభాషణని దారి మళ్ళించాను. కానీ అప్పటినుండి ఆ ఆలోచన మాత్రం అలాగే ఉండిపోయింది.  అదే ఈ టపాకి పూర్వరంగం.
----
ప్రేమ ఎక్కడ ఉంటుందో అక్కడ శోకం కూడా ఉంటుంది. సర్వభూతములను తనయందు, తనను అన్ని భూతములయందును చూడగలిగిన స్థితిలో ఉన్న మునిపుంగవుడైన వాల్మీకి మనసుని తపస్వాధ్యాయ నిరతుడు, తపస్వి, వాగ్విదాంవరుడు అయిన నారదుడి వల్ల విన్న రామాయణం తన్మయత్వంలో ముంచేస్తే  ప్రకృతిలో కలిగిన చిన్న అలజడి ఆయన మనసును వికలం చేసింది. ఆయన శోకం వేదం తర్వాత చందస్సులో వచ్చిన మొట్టమొదటి శ్లోకం అయ్యింది. ఏదో పక్షి, ఎవరో కొట్టారు, ఆయనకెందుకు బాధ? రామాయణం నేర్పేది ఇదే. నిన్ను నువ్వు సర్వసత్వమనోహరుడిగా, సాక్షాత్ రాముడిగా మార్చుకోవడం ఎలానో చెప్తుంది. పక్షిశోకం ఆయన శోకం అయ్యింది. ఆ పక్షులం మనమేనేమో? సంసారశరాఘాతం తగిలి విలవిలలాడుతున్న మనని చూసి మనమీద ప్రేమవల్ల కలిగిన శోకంలోనుండి ఆయన మనకి తగిలిన సంసారం అనే బాణం సందించిన ప్రారబ్ధమనే వేటగాడు ఎక్కువకాలం ఉండకూడదు అని కోరారు. అదే రామాయణానికి నాందీవాక్యం, మంగళాశాసనం. రామాయణం చదివినవాడికి జరిగేది,ఒరిగేది అదే. మనమీ సంసారం అనే బంధంలో పడటానికి కారణమైన ప్రారబ్ధం క్షయం అవుతుంది.  

ఇంకా ధృతి,దృష్టి,మతి,దాక్ష్యం మనకు కూడా కలుగుతాయి. 
సాధించాలనే పట్టుదల,సంకల్పం ధృతి. మనమీద ప్రేమతో రామచంద్రస్వామి బాలకాండలో  నేను దిగివచ్చి రావణవధచేస్తాను అని సంకల్పించారు.

సాధించవలసిన దానికోసం దేన్నైనా తోసిరాజనగల మనోబలం దృష్టి- మనకోసం అయోధ్యకాండలో స్వామి రాజ్యాన్ని వదిలి పదునాలుగేళ్ళు అరణ్యవాసానికి సిద్దపడ్డారు.

సాధించవలసినదానికి కావల్సిన తెలివితేటలు, అందుకోవాల్సిన దీవెనలు తెలియడం మతి, అందుకే స్వామి అరణ్యకాండలో పాదచారియై నడుస్తూ మునులు,ఋషుల దీవెనలు తీసుకుని, శాపగ్రస్తులైన వారిని వారిశాపం తీరేలా యుక్తితో అనుగ్రహించారు.

సాధిచవలసిన దానికి అడ్డుపడేదాన్ని నిర్దాక్షిణ్యంగా వదలగలగడం దాక్ష్యం- అందుకే స్వామి కిష్కింధాకాండలో మనస్సమానమైన చంచలత్వం కలిగిన వానరజాతికి రాజుగా ఉన్ననివృత్తిమార్గానికి గుర్తైన వాలిని సంహరించి,ప్రవృత్తి మార్గానికి గుర్తైన సుగ్రీవుని రాజుని చేసాడు. అంటే రామచంద్రస్వామి ఉన్నచోట ఇంద్రియపటాటోపం ఉండదు. అందుకే రామదాసులవారుకూడా "చేరి పంచేంద్రియములన్నీ చేరక పోద్రోలు నామం శ్రీరామనామం" అన్నారు.

రామాయణానికి సుందరకాండకి అభేదం అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి నాకు. పెద్దలు కొంతమంది ఏమన్నారంటే "సుందరకాండలో స్వామి సీతమ్మకి జరిగిన కధ అంతా చెప్తారు, అలాగే జరుగబోయే కధకూడా చెప్తారు అందువల్ల రామాయణం మొత్తం చదువలేనివారు సుందరకాండ ఒకటి చదివినా చాలు" అని. అలాగే సుందరకాండని సరిగా గమనిస్తే ఎక్కడైనా నాలుగు ఉపమానాలు ఒకచోట చెప్తే అది ముందు నాలుగుకాండల్లో సరిగ్గా సరిపోతుంది. పైన నేను చెప్పినది అలాంటి ఒక ఉపమానం. ఇంకొకటి ఉంది. అది "చతుర్నామైవహి గతి" అని లంకలోకి దిగగానే స్వామి అన్నమాట ఇది. 
"యజ్ఞస్వరూపమైన నీలుడు, నామజప స్వరూపమైన అంగదుడు, వేదస్వరూపమైన సుగ్రీవుడు, మంత్రస్వరూపమైన నేను తప్ప ఇంకెవరూ రాలేరే ఈ లంకలోనికి" అని

కానీ చూస్తే బాలకాండ యజ్ఞకాండ
అయోధ్యకాండ అంతా రామునిపేరు తలచుకునేవారే. చెట్టూ పుట్టా,మానూ మాకూ అన్నీ.
అరణ్యకాండ అంతా మంత్రస్వరూపమైన ఆయుధసంపత్తిని, తపస్సంపత్తిని రాముడికి ధారపోయడమే
కిష్కింధకాండ అంతా వేదమార్గాన్ని తిరిగి నిలబెట్టడమే. ఈరకంగా స్వామి సుందరకాండలో రామాయణాన్ని చూపిస్తున్నట్టనిపిస్తుంది.

రామాయణంలో ప్రేమ అనే విషయం పై రాద్దామనుకుని ఎక్కడికో వచ్చేను.అసలు విషయానికి వస్తే,

వాల్మీకిలాంటి సర్వభూతహితాభిలాషుల ప్రేమలోనుండి పుట్టినది రామాయణం. ప్రేమకి ఇప్పుడున్న వక్రభాష్యాలు మాత్రమే నేర్చుకునే వారికి రామాయణంలోని ప్రేమ ఆచరణసాధ్యం కాదు. కానీ ప్రేమ అనేదాన్ని ఎలా అర్ధంచేసుకోవాలో తెలియాలంటే రాముడిపాదాలనే ఆశ్రయించాలి. కొన్ని సంఘటనలు పరిశీలిద్దాం.

రాముడికి తండ్రి అంటే అమితమైన ప్రేమ,గౌరవం. దశరధుడికికూడా అంతే ప్రేమ వాత్సల్యం. అందువల్లనే సత్యాన్ని పక్కనబెట్టి, ప్రజాభిప్రాయం అనే ధర్మాన్ని చూపి రాముని రాజుని చెయ్యాలనుకున్నాడు. కానీ తండ్రిని సత్యమునందు నిలపడానికి రాముడు రాజ్యాన్ని వదిలిపెట్టాడు.తల్లిదండ్రులను వదిలిపెట్టాడు. ధశరధుడు ఉండలేడని తెలిసినా, భవిష్యత్తరాలు తన తండ్రిని అసత్యవాదిగా చూడకూడదని అడవులకు సైతం వెళ్ళిపోయాడు. ప్రేమ అంటే అది. అంతేకానీ తనవారైనంతమాత్రాన వారికోసం సత్యాన్ని, ధర్మాన్ని వదలడు నారాముడు. మనప్రేమ మనలని ప్రేమించేవారిని మంచిమార్గం వైపు నడిపించేలా ఉండాలి. అంతేకాని ప్రేమపేరుతో వారిని మరింత పాడైపోయేలా చెయ్యకూడదు. ఈతరం తల్లిదండ్రులు చేస్తున్న తప్పు ఇదే. నాకు మావాడంటే చాలాప్రేమ,వాడు ఏదడిగినా కాదనలేను అంటూ ఉంటారు. కానీ అది వారిని మరింత పాడైపోయేలా చేస్తుంది. అది గమనించుకోవాలి. మనప్రేమ, లాలన వారిని ఎటువైపు తీసుకెల్తుందో కూడా గమనించుకోవాలి. ఒక్కనాడు పెద్దలను గౌరవించాలని చెప్పకపోతే రేపు పొద్దున్న వారినుండి గౌరవం మనకు కూడా దొరకదు. ఆశించలేము కూడా. అందుకే మానవజాతి అంతా మళ్ళీ రామాయణం చదువుకోవాలి. ప్రేమ అంటే ఏమిటో అది అభ్యున్నతికి దారితీసేలా ఎలా ఉండాలో తెలుసుకోవాలి. 

ఇదే రాముడు లక్ష్మణుడి విషయంలో కూడా చేసి చూపాడు. దశరధుడు చనిపోతే లక్ష్మణుడికి తండ్రి పోయాడు,నాకు లక్ష్మణుడి రూపంలో తండ్రి ఇంకా ఉన్నాడు అన్న వ్యక్తి, కైకేయినికానీ, భరతుడిని కానీ నిందిస్తే అప్పటికప్పుడే ఖండించాడు, మందలించాడు, సరిదిద్దాడు. లక్ష్మణుడికి ప్రాణం మీదకి వస్తే గుండెలవిసేలా విలపించాడు. మరి మనం, చెప్తే ఏమనుకుంటారో అన్న భయంతో తప్పుని తప్పు అనికూడా చెప్పలేని స్థితిలో ఉన్నాం. మనకెందుకులెద్దూ అనే ధోరణి పెరుగుతుంది. అందుకే జాతికి మళ్ళీ రామాయణాన్ని చేతికిచ్చి చదివించాలి.

సీతమ్మ పట్ల రాముని ప్రేమ గురించి రాయాలంటే మాటలు చాలవు. అలాంటి వ్యక్తి ఒకచోట సీతమ్మ "మీకేమీ రాక్షసులతో పగలేదు అలాంటిది మీరెందుకు వారిమీదకి యుధ్ధానికి వెల్తారు" అని అడిగితే స్పష్టంగా "వెళ్ళడం తన ధర్మం"  అని తన  అభిప్రాయాన్ని చెప్పాడు. జింకకోసం పట్టుబడితే సరే అని వెళ్ళాడు. మీ జీవితభాగస్వామితో ఎలా ప్రవర్తించాలో, పట్టువిడుపులంటే ఎలా ఉండాలో చూపించారు స్వామి. ప్రేమ అంటే కొంగుపట్టుకుని తిరగడం కాదు, అడుగులకు మడుగులొత్తడం కాదు, ఒకరినొకరు సరిదిద్దుకుంటూ, ఒకరిబాధలొకరు పంచుకుంటూ, అభ్యున్నతి వైపు కి అడుగులేయడం దాంపత్యం. ముప్ఫై యేళ్ళు హనుమ సేవలో తరించిన మహానుభావుడొకరు నాతో ఒక మాటన్నారు" నీ అనుష్టానం వరకూ వస్తే నీ భార్యాపిల్లలూ కూడా పరాయివారే" అని. 
దేనికి తలఊపాలో , దేనికి కాదనాలో తెలియాలి. ఎలా కాదనాలో తెలియాలి. కట్టెవిరిచినట్టుగా కాకుండా గాయానికి వెన్నపూసినట్టుగా అవతలివారి అభిప్రాయాన్ని ఖండించడం తెలియాలి. అది ప్రేమంటే. అలా మాట్లాడాలంటే రామాయణం చదవాలి. అందుకే గురువుగారు  "పెళ్ళి చేసుకోబోయే ప్రతీ ఒక్కరు రామాయణం చదివి తీరాలి" అని అంటూ ఉంటారు ఎప్పుడూ. అహల్యని సరిదిద్దుకున్న గౌతమ మహర్షి కావాలి జాతికి మళ్ళీ. రాక్షసజాతికి తల్లి అయినా దితిని ప్రేమించిన కశ్యపప్రజాపతులు కావాలి లోకానికి. తను స్వయంగా ఇచ్చిన రక్షణని కాదనుకుని బంధం లో పడ్డ సీతని నానాయాతన పడి కాపాడుకున్న రామచంద్రులు కావాలి జాతికి. భార్య లోపాలు కడుపులో పెట్టుకుని ఆమె గౌరవాన్ని కాపాడే భర్తలు కావాలి. భర్త లోపాలు పెదవి దాటకుండా  కుటుంబాన్ని నడుపుకునే సతీమతల్లులు కావాలి ఇప్పుడు.

ఇంకా రాయాలంటే చాలాఉంది. ఎంత రాసినా రామాయణం నిత్యనూతనం, నవనవోన్మేషం. ఆ రామతత్వాన్ని రాయాలన్నా, చెప్పాలన్నా ఎవరికి సాద్యం? పోతన గారన్నట్టు భాషాపతికి, బృహస్పతికి, ఆదిశేషుడికే సాధ్యం కాదే.అలాంటిది నేనెంత? కూతవేటు దూరంలో రామపట్టాభిషేకం జరుగుతుంటే వెళ్ళలేకపోయిన ధౌర్భాగ్యుడిని. అసలా రాముడిగురించి రాసే అర్హత అయినా లేనివాడిని. 
రామాయణం విన్నా,కన్నా,అన్నా పుణ్యమే. ఆ పుణ్యం సంపాదించుకోవాలని, స్వామికార్యంలో పాల్గొనలేకపోవడానికి కారణమయిన పాపసంచయాన్ని క్షయం చేసుకోవాలని రాస్తున్నాను తప్ప నాకు తెలుసనో, మరోటో కాదు. ఏమైనా తప్పులున్నయెడ పెద్దలు క్షమించి సరిదిద్దగలరు.

విధేయుడు,

22, మార్చి 2013, శుక్రవారం

ఈపూజలు,జపాలు, దీక్షలు ...అసలు ఇవన్నీ అవసరమా ??

ఓ భక్తుని ఆవేదన 
-----------------
అనేక సంవత్సరాలుగా నన్ను ఒక ప్రశ్న బాధిస్తున్నది. దయచేసి నాకు వికుక్తి కలిగించమని వేడుకుంటున్నాను.
ఇట్లా కనకధారా స్తోత్రం హనుమాన్ చాలీసా, సాయి భజన, అయ్యప్ప మాల భజన, ___ పాప పరిహార పూజ, ___ గురు భజన, నవగ్రహ స్తోత్రం, లక్ష కుంకుమార్చన, కోటి ___అర్చన, నాగ పూజ, ఐశ్వర్య మంత్ర పఠన, ___ యంత్రాలు, ___Powerfulతాయిత్తు  .... ఇట్లా ఇవన్నీ అవసరమా?
మనపేర్లమీద పూజలు అవసరమా?
దేవుడికి మొక్కులు / proposals అవసరమా? 
ఎవరో కష్టపడి పూజలు చేసుకుంటుంటే నాపేరు కుడా చెప్పండి... అవసరమా?
మనిషై పుట్టినందుకు 'నా' గురించి పైనంవి తెలియచెయ్యవు కదా.  నా గమ్యము ఏమిటి అది చేరుకోవటానికి నేను ఏమి చెయ్యాలి  అని ఎందుకు ఆలోచించను?
ఆ దేవదేవుని చేరుకోవడానికి కావలసిన వాటిని గురించి నేను ఎందుకు తొందర పడట్లేదు?  పైవన్నీ నా సమయాన్ని, శక్తిని వృధా చేస్తూ, నా గమ్యాన్నించి నన్ను దూరం చేస్తున్నాయి.  ఇది నాకు ఎందుకు స్పురించదు ? 
ఒక్క నిముషము లో గమ్యాన్ని మరిచిపోతున్నానెందుకు?
అమ్మ అయ్య నుంచి దూరం కాకుండా నన్ను ఎవరైనా లాగి చెంప పగలగోట్టరా?
ఇది భగవత్ భక్తి నుంచి దూరం చేసే లేఖ అని deleteచెయ్యకండి.  ఏమి చెయ్యలేక పోతున్నాను. అంత్యకాలం దగ్గర పడుతోంది.  ఎన్నో జన్మల పూజ ఫలితంగా ఈ జన్మ దొరికింది.  ఇది గూడా కరిగి పోతోంది.  వాడి దగ్గరికి ఎట్లా చేరాలో తెలిసేలోపే తెల్లారిపోతే ఇంకా ఎట్లా?  ముందరే goal చేరాలి. ఓడిపోవటానికి వీలు లేదు.  ఆ ఛాన్స్ లేదు.  ఎట్లా?
క్షమించండి.  ఇది ఎవ్వర్నీ బాధ పెట్టాలని కాదు.  ఇది నా బాధ.
దాసుడు
----------------------------------------------------------
మొదటి సభ్యుని సమాధానం

అదే మీ ఉద్దేశ్యం అవుతే ప్రపంచాన్ని మరిచి పోయి ధ్యాన ముద్రలో కి వెళ్లి సో హం
అంటూ ధ్యానం చేస్తే ఆత్మ దర్సనమవుతున్దనీ అదే పరమాత్మను తెలుసుకోవడమనీ విజ్ఞులు సెలవిస్తారు.
నా మటుకు నాకు రెండు నిముషములు కదలిక లేకుండా కూర్చోవడము చాత కాదు.
---------------------------------------------------------------------------------
రెండవ సభ్యులు

అవసరమా అని అడిగితే, ఏమని  సమాధానం ఇవ్వాలి?? సమాధానం  ఇవ్వటానికి ఇంకో రెండు ప్రశ్నలు ఎదురవుతాయి. 

ఎవరికి అవరరమా అని అడుగుతున్నారు? ఏ వయస్సులోవారికి? ఏ ఆశ్రమంలోని వారికి? ఏ పక్వతలో, ఏ స్థిలోని  వారికి? ఎట్టి గురువును ఆశ్రయించినవారికి?  
ఎందుకు అవరరమట, (కిమర్థం ఇతి)??

అంటే ఏది సాధించటానికి, ఏది ప్రాప్తమవటానికి  ఉపాయంగా అవసరమా కాదా అని అడుగుతున్నారు? ఏ ప్రురుషార్థం సాధించటానికి ఉపాయంగా అవసరమా కాదా అని అడుగుతున్నారు??

ఇవి అందరికీ ఒకేలాగ కాక -  వ్యక్తిగతంగాను, అవస్థానుగుణంగాను, కాలానుగుణంగాను, స్థిత్యనుగుణంగాను -  నిర్ణయించవలసినది కాబట్టి,  వారి వారికి అవసరమా కాదా అని వారి వారి గురువులు, వారి సమగ్ర  పుగామానికి బాధ్యత వహించినవారు నిర్దేశించాలి అని నా ఉద్దేశ్యం.   


శ్రీరమణార్పణమస్తు
---------------------------------------------
మూడవ సభ్యులు

నమస్తే,

అయ్యా!! శ్రీభరద్వాజ గారు చెప్పినట్లుగా ఈ ప్రశ్న ఒక వ్యక్తి ఉన్న స్థాయిని బట్టి ఉంటుంది. మీరు అడిగిన ప్రశ్నలకి సమాధానం వ్రాసే ముందు పూజ్య గురువు గారు బ్రహ్మశ్రీచాగంటికోటేశ్వర రావు గారు ప్రవచనములలో చెప్పిన రెండు ఉదాహరణలనే ఇక్కడ ఉటంకిస్తున్నాను. నేను వ్రాయడంలో ఏమైనా తప్పులుంటే క్షమించండి.


మొదటి ఉదాహరణ, తిరుమల ఆనంద నిలయంలో కొలువై ఉన్న శ్రీవేంకటేశ్వరస్వామి వారి దర్శనానికి రోజూ కొన్ని వేల మంది/లక్షల మంది ఆర్తితో వెడుతూ ఉంటారు (ము..) కదా. ఒకసారి గురువు గారన్నారు, మనందరికీ లఘు దర్శనము/మహాలఘుదర్శనము అని ఒక్క నిమిషంలో రెక్క పట్టుకుని ఆలయ నిర్వాహకులు బయటికి లాగేస్తున్నారు కాబట్టి పర్వాలేదు కానీ, అదే ఈ రోజు వచ్చినవాళ్ళందరిని ఉదయం స్వామి వారి సుప్రభాత సేవ దగ్గర నుంచి రాత్రి పవళింపు సేవ వరకు ఇక్కడే ఉంచేస్తారు అని చెప్పారు అనుకోండి. ఇక అప్పుడు మొదలవుతుంది అసలు అల్లరి అంతా... "ఏమండీ మధ్యలో ఏమైనా ప్రసాదం పెడతారా? మధ్యలో ఒకసారి కాఫీ గట్రా ఏమైనా ఇస్తారేంటి?............." ఇలా ఎవరెవరికి ఏ ఏ ఇంద్రియ లౌల్యాలు ఉంటే దానికి తగ్గ ప్రశ్నలు, మనసులో ఇబ్బంది మొదలవుతాయి. ఈ మాట వేంకటేశ్వరస్వామి వారి మీద జనాలకి భక్తి లేదని నిరూపించడానికి కాదు. భక్తి ఉన్నా, ఒక త్యాగరాజస్వామి వారిలాగా, ఒక భగవాన్ రమణులలా సర్వము మర్చిపోయి, తండ్రీ నన్ను నీ చెంతనే కూర్చోపెట్టుకున్నావా!! అని సంబరపడిపోయి, నిద్రాహారాలు లేకున్నా ఒక రోజేమిటి ఎన్ని నెలలయినా తపస్సమాధిలో కూర్చోగలిగే ఆధ్యాత్మిక బలం కలిగిన మహాపురుషులు వారు. కానీ నాబోటి గాడికి నిజంగా జన్మానికి ఎప్పుడో ఒకసారి అలాంటి మహత్తర అవకాశం ఇస్తే ఏమో కానీ, ఎప్పుడు తిరుమల వెళ్ళినా, వెళ్ళిన వారిని కనీసం లోపల పన్నెండు గంతలు అంతరాలయంలో ఉంచేస్తారుట అంటే ఎంత మంది ఉత్సాహంతో వెడతారు?
ఇంకొక మాట చెప్తున్నాను, ఎవరైనా లేదు లేదు... నాకు చాలా భక్తి ఉంది నేను వెడతాను అనుకున్నా.. అది కూడా మళ్ళీ బయటకి వచ్చి అలా స్వామి ఇచ్చిన అంతరాలయ దీర్ఘ దర్శనమును కూడా నలుగురు మిత్రులతో చెప్పుకుని ఆనందపడడానికే ప్రథమ ప్రయోజనం అవుతుంది. తప్ప బయటకి వచ్చేసినా ఇంకా ఆ తన్మయం నుంచి బయటపడలేక, భార్యాపిల్లలు పలకరిస్తున్నా మాట్లాడలేని ఉన్మత్తావస్థలోకి మనలో ఎంత మందిమి వెళ్ళగలము? 


ఇక రెండవ ఉదారణ, పూజ్య గురువు గారు చెప్పినదే...."ఒక పెద్దాయన బాగా ఆధ్యాత్మిక ప్రవచనములు చెబుతూ ఉంటారు, సరే ఆ ప్రవచనాలకు ఆయన భార్య యొక్క చిన్న తమ్ముడు, వయసులో బాగా చిన్నవాడు, వాడు కూడా రోజూ బావ గారు చెప్పే ప్రవచనాలు వినడానికి వేళ్తూ ఉంటాడు, ఒక రోజు, ఆ పెద్దాయన భార్య ఆయనకి భోజనం పెడుతూ అంటుంది, "ఏమండీ మీరు చెప్పే ఆధ్యాత్మికోపన్యాసలకు మా తమ్ముడు మరీ భక్తితో పిచ్చి పట్టేట్లా ఉన్నాడు, కాస్త వాడికి ఇవన్నీ చెప్పకండీ... వాడికి చిన్న వయసులోనే మరీ వైరాగ్యం వచ్చేస్తే, పెళ్ళి చేసుకోనని.. మారాం చేస్తాడేమోనని భయంగా ఉంది......" అంటూ ఆ తల్లి తమ్ముడి గురించి చెబుతూ ఉంటుంది. ఇవన్నీ వింటున్న ఆ పెద్దాయన ఒక్కసారి లేచి, ఒంటి మీద ఉత్తరీయం దులుపుకుని, ఉన్నపళంగా లేచి ఇంట్లోంచి బయటకి వెళ్ళిపోయారుట. ఇక ఆయన ఎన్నడూ తిరిగి రాలేదు, ఎందుకంటే ఆయనకి సాంసారిక జీవితం పైన "నిజమైన వైరాగ్యం" కలిగిందిట. 

పై రెండు ఉదాహరణలు చూడగా, ఇంకా పెద్దల నుంచి విన్నది, గ్రంధాలలో చదివినదాని ప్రకారం, నాకు అర్ధం అయ్యింది ఏమిటంటే, 
"వైరాగ్యం అనేది ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది అనేది మన చేతిలో ఉండదు. ధర్మ బద్ధమైన అర్ధము, ధర్మబద్ధమైన కామము పట్టుకుని జీవనం సాగిస్తూ ఉంటే, ఒకనాడు దానంతట అదే వైరాగ్యం కలుగుతుంది.... సుఖము సుఖము అనుకున్నది ఇది సుఖమా... అని. వైరాగ్యం ఎప్పుడూ తెచ్చిపెట్టుకోకూడదు. తెచ్చిపెట్టుకున్న వైరాగ్యం మనల్ని ఆధ్యాత్మికంగా క్రిందకి పడేస్తుంది. వైరాగ్యం కావాలి అని కోరుకోవడం తప్పుకాదు, కానీ బలవంతముగా కాదు. 
ఇక ఇలా ఎప్పుడూ ధర్మబద్ధమైన అర్ధము, ధర్మబద్ధమైన కామము అనుకుంటూ, ఎన్ని జన్మలు ఇలా భోగాలు, సుఖాలు, వాటితో పాటు కొన్ని కష్టాలు అనుభవించాలి? అమ్మ అయ్యలలో ఐక్యం అయ్యేది ఎప్పుడు? అనే విషయానికి వస్తే, మనం పూర్వ జన్మలలో (భగవంతుడిని నుంచి విడివడ్డాక ఎన్ని కోట్ల జన్మలు ఎత్తామో....), అందునా మానవ ఉపాధిలో, ఎవరెవరికి ఏ వాగ్ధానాలు చేశామో, ఎవరెవరికి  మాట ఇచ్చామో, మనం ఏ ఏ కోరికలను అనుభవించాలని ఆశపడ్డామో, ఎవరెవరికి ఎంత ఋణపడ్డామో,..... ఇలా ఎన్నో ఋణానుభంధాలు, కర్మలు విశేషంగా పేరుకున్నాయి. అవన్నీ తీరితే తప్ప (పాప కర్మలయినా + పుణ్య కర్మలయినా) మోక్షం అనే స్థితికి దగ్గరగా కూడా వెళ్లలేము.

సరే ఆ ఋణానుబంధములు, కర్మ శేషం ఎప్పటికి తీరేను అంటే.... భగవాన్ రమణుల తల్లి గారంతటి వారికి, భగవాన్ కొన్ని గంటల పాటు, అమ్మ గుండెలపై చెయ్యి వుంచి, అమ్మకి ఎన్నో జన్మల కర్మశేషం అనుభవింపచేశారు అని చెప్పారు. అలాంటిది, నాలాంటి వాడికి ఎన్ని జన్మలున్నాయో.. 

అందుకనే జగద్గురువులు ఆదిశంకరులు నాలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని, కారుణ్యంతో అంత వాఙ్మయం ఇచ్చారు. "ఒరేయ్ ఎన్ని జన్మలో ఎన్ని జన్మలో అని బెంగపడకురా... ఏ జన్మ ఎత్తినా స్వామీ నాకు నీయందు భక్తి ఉండాలి, నేను ఎప్పుడూ ఏ జన్మలో అయినా నీ నామం చెప్పేలా అనుగ్రహించు అని శివానందలహరిలో ....

నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకతా
పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననమ్
సదా త్వత్పాదాబ్జ స్మరణ పరమానందలహరీ
విహారాసక్తం చేధృదయ మిహ కిం తేన వపుషా II శివానందలహరి 10 వ శ్లోకం II

అని చెప్పారు. 
 
అలాగే అందరూ సాధారణంగా అనుకున్నట్లు కనకధారాస్తోత్రం పఠించడం వల్ల, కేవలం ఎప్పుడూ డబ్బుకట్టలు/బంగారు కాసులు వచ్చి పడిపోవాలని ఒక్కటే కాదు. మన ఋషులు, గురుపరంపరలోని పెద్దలు ఎప్పుడు ఏది చెప్పినా, ఏ స్తోత్రం ఇచ్చినా, ఏ క్రతువు ఇచ్చినా, అది స్థూలముగా ఒక కామ్య కర్మ కోసమే అనిపించినా, అంతర్లీనంగా, ఆ కర్మని నెరవేర్చడంలోనూ, ఆయా స్తోత్రాదులను పఠించడంలోనూ మనం ఈశ్వరుని పాదములను చేరుకునే దిశగానే పయనిస్తాము. అది మన ఋషుల/జగద్గురువుల వైభవం. 

ఉదాహరణకి, శ్రీరుద్ర నమకంలో మంత్రములను, అవి కామ్యము కోసం (యజ్ఞంలో) వాడే మంత్రములు అని భావించేవారున్నారు. కానీ యథార్ధానికి రుద్రం ఒక ఉపనిషత్తు. ఉపనిషత్తులు వేదాంతాన్ని బోధిస్తాయి. అంటే శ్రీరుద్రం వేదాంతమే. కానీ ఒక సాధకుడు ఉన్న స్థితిని బట్టీ, అతను ప్రథమంలో రుద్రాన్ని కామ్య కర్మలకొరకు, యజ్ఞం కొరకు, అనుసంధానం చేసినా, అంతర్లీనముగా ఆ మంత్ర పఠన, శ్రవణ ఫలముగా రాబోవు రోజులలో అతనికి ఆత్మ సాక్షాత్కారం వైపు వెళ్ళేట్లుగా కర్మ క్షయం అవుతూ, వైరాగ్యం కలిగి, ఆఖరికి మోక్షం పొందగలరు. అని పెద్దల వాక్కు.

చివరిగా ఒకే ఒక్క విషయం నేను మననం చేసేది. ఈ విశ్వం అంతా విష్ణువే అయినప్పుడు, నాకు పరమపదం లభించడం,. ఆ పరమపదం పొందినప్పుడు ఒక్కటే ఆనందం కాదు, ఆ చేరుకోవడంలో ఈ దారి అంతా కూడా మన ఆనందముగా మనకి కనబడాలి అంటే, గురువులు/ఋషులు ఇచ్చిన కర్మకాండ ఆచరించడం వల్ల మాత్రమే సాధ్యం.

ఇంతకు పూర్వపు జన్మలలో ఏ పాపాలు చేశానో, ఈ జన్మలోనాకు కొన్ని నవ గ్రహ దోషాలు ఉన్నాయి, కానీ ఋషులు కారుణ్యంతో ఆ పాపకర్మలన్నిటికీ "అనుభవిస్తేనే" తీరతాయి అని నిర్బంధించకుండా, పరిహారాలు, నవగ్రహపూజలు, నాగప్రతిష్టలూ, కనధారాస్తోత్రాలు, కుంకుమార్చనలు, రుద్రాభిషేకాలు, నాగపూజలు, అయ్యప్ప మాల, భజనలు, హనుమాన్ చాలీసా, యంత్రాలు........................................ వగైరా వగైరా ఇచ్చారు. కానీ ఇవన్నీ ఆచరించడం వల్ల ఎప్పుడూ ఆ కామ్యం పొందడం ఒక్కటే మనకి జరిగే ప్రయోజనం కాదు. అంతర్లీనంగా మనం ఆత్మోద్ధరణ వైపుకి కూడా ఈ కర్మలు ఆచరించడం వల్ల పయనిస్తూ ఉంటాము.

ఎక్కువగాగానీ, అసంబద్ధముగానీ, తప్పుగాగానీ వ్రాసి ఉంటే, పెద్దలు క్షమించి, సరిదిద్దగలరు.

సర్వం శ్రీమన్నారాయణార్పణమస్తు.
------------------------------------------------------------------------------------------
నాలుగవ సభ్యుల వివరణ

స్తోత్రాదుల పఠనం, పూజలు వ్రతాలు దీక్షలు అన్నీ కర్మానుష్ఠానం కిందకే వస్తాయి. మన మనసులు కుదురుగా నిలవడానికి చిత్తశుద్ధి కలగడానికే. భక్తితో కూడిన కర్మాచరణం వల్ల జ్ఞానం సిద్ధించి నిశ్చలంగా నిలుస్తుంది. పాలు పోయడానికి శుభ్రమైన పాత్ర ఎంత అవసరమో పరమ జ్ఞానం పొందడానికి చిత్తశుద్ధి అంతే అవసరం. చిత్తశుద్ధికి దోహదపడేవే ఇతర కర్మాచరణములన్నీ... అని గురువుల, పెద్దలైన వారి  వాక్కు.

డాక్టరుగారు చెప్పినట్లు వర్ణ ఆశ్రమ బేధాలతోపాటు, సాధనలో స్థాయీ బేధాల ననుసరించి, ఏ పురుషార్థం గురించి ఎంతవరకు కర్మానుష్ఠానము చేయాలి? ఏది ఎంత వరకు అవసరమనేది స్వగురువులు/ఆచార్యుడు తత్తుల్యులు మాత్రమే సామర్థ్యాన్ని, కాలాన్నీ ఇతర విషయాలను పరిగణనలోకి తీసుకొని లెక్కకట్టి చెప్పగలరు. అవతలి వ్యక్తి యొక్క సాధన గురించి, ఆయన ఎంత అల్పుడుగా బయటికి కనబడ్డా ఆయన యందు ఎంత భగవత్సంబంధ బరువు పెంపొందినది ఉన్నది అలాగే , డాంబికుడుగా కనబడ్డా అది పైపై విషయమా నిజమైన బరువా..అన్న విషయం అందరికీ తెలియదు కేవలం దానిని కూడా కనిపెట్టి సరిదిద్దుకునే అవకాశం ఇంకా కర్మానుష్ఠానం ఎంతమేర చేయాలి వంటివి చెప్పగలిగేది గురువు/ఆచార్యుడు మాత్రమే. కాబట్టి గుర్వాజ్ఞమేర మనం భక్తి పూర్వక కర్మానుష్ఠానం చేస్తూ ఉండాలి అని పెద్దల సాంగత్యం వల్ల బోధపడింది.

11, ఫిబ్రవరి 2013, సోమవారం

ప్రమాదాలు కుంభమేళాలోనే జరుగుతున్నాయా ??????

నమస్కారం.

కొందరు మేధావులుగా భావించి ఇచ్చేతీర్పులు  అర్ధంపర్ధం లేకుండా ఉంటాయనటానికి కొందరు బ్లాగులలో కుంభమేళా ప్రమాదం గూర్చి వ్రాసే విషయాలు తెలుపుతున్నాయి.

వీరికి కుంభమేళా గురించి ఇంతే అర్ధం అయ్యీంది

వీరి బ్లాగులో కామెంట్లు పెట్టడానికి వీలవ్వట్లేదు. అందుకే ఇక్కడ చెప్పాల్సి వస్తుంది.
వీరు చెప్పిన కొన్ని గొప్పవిషయాలు, వాటికి నా సమాధానాలు...

1. కుంభమేళాలు గింభమేళాలు అని చెప్పి వెళ్లి అక్కడ చావు కొని తెచ్చుకోవడం ఎంత వరకూ సమంజసం? ఇవాళ్రేపు ‘‘క్రౌడ్ ఎక్కడుంటే, చావు అక్కడ’’.
Ans: అయ్యా, దీనికి కారణం కుంభమేళానా? లేక వచ్చిన ప్రజలను నియంత్రించలేని ప్రభుత్వాధికారుల నిర్లక్ష్యమా

2. అసలు ప్రమాదాలను సృష్టించే ఇలాంటి వాటికి ప్రభుత్వాలు ఎందుకు అనుమతి ఇస్తాయో అర్ధం కాదు. ముఖ్యంగా ఇలాంటి వాటిని బ్యాన్ చెయ్యాలి.
Ans: రోడ్లపైనా, ట్రైనులలోనూ, విమానాలలోనూ, విధ్యుత్తువల్లా, ప్రమాదాలు ప్రతిరోజూ జరుగుతున్నాయి గాబట్టి ప్రభుత్వం వాటిని కూడా బ్యాన్ చేయాలి.

3. 140ఏళ్ల పాటూ అందుకోసం ఎదురు చూసి శరీరాన్ని ప్రక్షాళన చేసుకోవాల్సిన దుస్థితిలో సమాజం లేదు.
Ans: ప్రస్తుతం సమాజం ఇంతకన్నా మంచి స్థితిలో కూడాలేదు.


29, జనవరి 2013, మంగళవారం

మాతంగకన్య అనే పేరు ఎలావచ్చింది అమ్మవారికి

జై శ్రీరాం,
శ్రీరామదూతం శిరసా నమామి!
అమ్మవారికి మాతంగకన్య అని పేరు ఉన్నది. గురువుగారు తమ ప్రార్ధనాశ్లోకాల్లో కూదా మాతంగకన్యాం మనసా స్మరామి అన్న శ్లోకాన్ని చెప్తూ ఉంటారు. దీని అర్ధం, ఈ పేరు ఎలా వచ్చిందో ఎవరైనా తెలుపగలరు.ఈ పేరు కీ రామాయణంలోని మతంగ మహర్షికి ఏమన్నా సంబంధం ఉన్నదా.అదికూడా తెలుపగలరు.
విధేయుడు,
..............





నమస్తే ,

మాణిక్యవీణా ముపలాలయంతీం మదాలసాం మంజుల వాగ్విలాసాం
మాహేంద్రనీలద్యుతి కోమలాంగీం మాతంగ కన్యాం మనసా స్మరామి II
చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగ శోణే
పుండ్రేక్షుపాశాంకుశ పుష్పబాణహస్తే నమస్తే జగదేకమాతః
మాతా మరకతశ్యామా మాతంగీ మధుశాలినీ
కుర్యాత్కటాక్షం కళ్యాణీ కదంబవనవాసినీ
జయ మాతంగ తనయే జయ నీలోత్పలద్యుతే
జయ సంగీత రసికే జయ లీలశుకప్రియే.II


చక్కని ప్రశ్న అడిగారండీ, రోజూ చదువుతూ ఉంటాము కానీ, ఆ పేరు ఎందుకు వచ్చింది అని ఆలోచన రాలేదు.

నేను చదివినదాని ప్రకారం, మాతంగ కన్య అంటే, మతంగ మహర్షికి కూతురిగా పుట్టింది అమ్మవారు ఒకసారి. అందుకే పూజ్య గురువు గారు చెబుతూ ఉంటారు, లోకంలో ఎవరైనా సరే, ఆర్తితో అమ్మని ప్రార్ధిస్తే, ఎంతమందికైనా అమ్మ కూతురిగా వచ్చి ఉద్ధరిస్తుంది, కాత్యాయినీ, జానకి, మాతంగి, హైమవతి ఇలా.. కానీ అన్ని రూపాలలో, అన్ని నామాలలో అమ్మ ప్రక్కన ఉండేది ఒక్క మా శంకరుడు మాత్రమే. అమ్మ "సదాశివపతివ్రత" కదా.

మాతంగ కన్య అనే నామము వెనుక ఉన్న వృత్తాంతము, లలితోపాఖ్యానం నుంచి గణపతి సచ్చిదానంద స్వామి వారు ఇచ్చిన వివరణలోంచి వ్రాస్తున్నది.

మతంగ మహర్షి గొప్ప తపస్వి. వారు హిమవంతునికి స్నేహితుడు. ఒకనాడు హిమవంతుడు, ఆయన గౌరి దేవికి తండ్రిని అని చెప్తూ, అతిశయంతో చెప్తారు. ఈ మాటకి అవమానపడినట్లుగా భావించి, మతంగ మహర్షి తపస్సు చేస్తారు. ఆయన లలితాపరాభట్టారికా స్వరూపమైన శ్యామలాదేవి (ముద్రిణీ దేవి, మంత్రిణీదేవి అని కూడా అంటారు) ని ఉద్దేశించి తపస్సు చేశారు. ఆయన తపస్సుకి మెచ్చిన శ్యామలాదేవి, మతంగ మహర్షి భార్య అయిన సిద్ధమతి దేవికి స్వప్నంలో కనిపించి ఒక పువ్వుని ప్రసాదంగా ఇస్తారు.

అనతి కాలంలోనే మతంగ మహర్షి, సిద్ధమతిదేవి లకి ఒక చక్కని ఆడపిల్ల జన్మించినది. ఆ వచ్చినది అమ్మవారే. ఆమెని లఘుశ్యామ అని పిలిచారు. అంటే చాలా తక్కువ సమయంలో జన్మించింది అని. ఆమెనే మాతంగి, మాతంగ కన్యకా అని పేర్లతో కూడా పిలుస్తారు. ఈ మతంగ కన్యయే, ఆమె యొక్క శక్తితో కోట్ల మంది కన్యలను సృష్టించినది, వారు మంత్రిణీ దేవి యొక్క ప్రాంగణంలో ఉండి అమ్మవారి స్తోత్రం చేస్తూ ఉంటారు.

అయితే ఈ మతంగ మహర్షి, శ్రీరామాయణంలో చెప్పబడిన మతంగ మహర్షి ఒక్కరా కాదా అనే విషయం తెలియదు.

ఈ క్రింది లంకె కూడా చూడండి..

http://www.kamakoti.org/kamakoti/brahmandapurana/bookview.php?chapnum=25


పైన వ్రాసిన వివరణలో ఏమైనా దోషం ఉంటే పెద్దలు మన్నించి సరిచేయగలరు.




నమస్కారం.

దశ మహా విద్యలలో కొలిచే అమ్మవారి ఒకరూపం మాతంగి. గురువు గారి పఠించే ప్రార్ధనా శ్లోకంలో అమ్మవారు ఈమే కావచ్చు. ఈమె రూపం ఇలా ఉంటుంది.




---

మాతంగియే రాజ శ్యామల, లలితా పరాభట్టారికా స్వరూపం కొలువు తీరినప్పుడు మహా మంత్రిగా కుడిపక్కన ఉండే తల్లియే ఆమె. శాక్తేయంలో బుద్ధికి, విద్యకి ఆమెను సేవిస్తారు. ఆమెను సేవించడం ద్వారా అనితర సాధ్యమైన సాహిత్యము, తెలివి, జ్ఞాన సముపార్జన సిద్ధించగలవు.


21, నవంబర్ 2012, బుధవారం

ముందు ఆ సీట్‌లోంచి లే !

పూజ్యశ్రీ ఎక్కిరాల భరద్వాజ మాష్టారుగారు ఒకచోట అన్నారు : "ధర్మవిచారణలో ఆత్మవిమర్శకే తప్ప పరవిమర్శకి తావు లేదు" అని ! అంటే ధర్మమంటే ఫలానా అనీ, దాన్ని ఆచరించాలనీ విన్నవారిలో ఎక్కువమంది చేసే పొఱపాటు - అది ఇతరుల్లో ఏమాత్రం ఉందో పరిశీలించి వారిని విమర్శించడం. ఇప్పటిదాకా అలాగే జఱుగుతూ వచ్చింది. ధర్మాలనేవి ఆచరించడానికి కాకుండా మనుషుల్లో అనవసరమైన వాచాలతని, వాగాడంబరాన్ని పెంచడానికీ, వాటి పేరు చెప్పి అవతలివాళ్ళ ముందఱి కాళ్ళకి బందాలెయ్యడానికీ, తద్ద్వారా ఒక విధమైన "ధర్మరాజకీయాలకి" పాల్పడడానికీ మాత్రమే ఉపయోగపడుతున్నాయి. ఇది మిక్కిలి శోచనీయం. మనకి ఒక విషయం తెలిసినంత మాత్రాన దాన్ని ఇతరులకి చెప్పేఅర్హత మనకి స్వయంతంత్రం (automatic) గా సిద్ధించదు. పోనీ, అర్హతల సంగతెలా ఉన్నా, మనం అలా చెప్పగలిగినంత మాత్రాన మనం అవతలివారికి గురువులం గానీ, దేవదూతలం గానీ, దేవుళ్ళం గానీ అయిపోము. చెప్పదగ్గ స్థానంలో ఉన్నా కూడా చెప్పడం పనికిరాదు కొన్నిసార్లు. తెలిసినా/అడిగినా చెప్పడం అనవసరమంటాడు మనువు తన ధర్మశాస్త్రంలో ! అది వేఱే విషయం.

ఇతరులకి చెప్పడం అనే బాధ్యత అత్యంత బాధాకరమైనది. కనుక ఆ బాధ్యతని భగవంతుడు అందఱికీ అప్పగించడు. ఆ బాధని తట్టుకోగలవాళ్ళకే ఆయన దాన్ని అప్పగిస్తాడు. ఎందుకంటే ఈ లోకం ఒక పాత పిచ్చాసుపత్రి. ఇక్కడి రోగుల పిచ్చి బహు పురాతనమైనది. నరనరాలా బహులోతుగా జీర్ణించినటువంటిది. దానికి వైద్యం చేయబోతే మీదపడి కొట్టేవాళ్లే తప్ప "అయ్యో పాపం, నాకు వైద్యం చేయడానికొచ్చాడీయన" అని కృతజ్ఞత వహించి మొక్కేవాళ్ళెవరూ ఇక్కడ లేరు. మీకు వైద్యకట్నం (fees) ఇచ్చేవాళ్ళు కూడా లేరు. ఎలాగూ అదివ్వరు కనుక లాభాపేక్ష లేకుండా వైద్యం చెయ్యాల్సి ఉంటుంది. మీచేత మంచి చెప్పించుకొన్నవారు మిమ్మల్ని హింసించకపోతే అదే వైద్యకట్నంగా, అదే ఒక గొప్ప అదృష్టంగా భావించి "బతుకు జీవుడా" అనుకొని నిమ్మళంగా బయటపడాల్సిన పరిస్థితి ఉంది. మనకేమో వైద్యం రాదు. ఇక్కడ ఉన్నవాళ్ళు వట్టి పిచ్చోళ్ళని గుర్తుపట్టేటంత పరిజ్ఞానం మాత్రమే మనకుంది. ఆ మాత్రం దానికే మనం అమాంతం వైద్యావతారమెత్తడం సమంజసం కాదేమో.

భగవాన్ శ్రీరామకృష్ణ పరమహంస దీని గుఱించి అనుగ్రహ భాషణం చేస్తూ "ఇతరులకి చెప్పాలంటే భగవంతుడి నుంచి లైసెన్సు తీసుకోవాలి" అని తెలియజేశారు. చాలా గొప్ప లైసెన్సు అది. ఊరికే రాదు. జన్మజన్మల ఉపాసనా, తపస్సూ ఉంటేనే తప్ప ! మనలాంటివాళ్ళు ఎంత చెప్పినా ఎవరి హృదయకవాటాలూ తెఱుచుకోవు. ఎవఱి మేధాకమలమూ వికసించదు. మనం ఎన్ని ఉపన్యాసాలిచ్చినా ఎవఱి జీవితమూ మారదు. మనం ఎంతగా మాట్లాడితే అంతగా సరికొత్త సమస్యలు తలెత్తడమే తప్ప ఏ పాత సమస్యా పరిష్కరించబడదు. కానీ ఆ లైసెన్సున్న వ్యక్తులు మాత్రం ఒక్క వాక్యం ఉచ్చరించగానే జీవితాలే మారిపోతాయి. లోకమే తలకిందులవుతుంది. తమ తపశ్శక్తితో భగవంతుడి దగ్గఱ చనువు సంపాదించిన మహనీయుల వాక్కులలోని రాజముద్ర అది.

శ్రీ బుద్ధభగవానుల జీవితచరిత్రలో తారసిల్లే అంగుళిమాలుడనే హంతకుడి గుఱించి చాలామంది వినే ఉంటారు. అతని అసలు పేరు అహింసకశర్మ. చాలా మేధావి. గురుకులంలో మిగతా అందఱు విద్యార్థులకంటే ముందుండేవాడు. అది సహించలేని అతని సహాధ్యాయులు అతనికీ, గురుపత్నికీ అక్రమసంబంధాన్ని అంటగట్టి అపప్రచారం చెయ్యడంతో అతన్ని గురువుగారు అర్ధాంతరంగా గురుకులంలోంచి వెళ్ళగొట్టారు. అతను ఇల్లు చేఱుకొని, జఱిగినదాన్ని తల్లిదండ్రులు అర్థం చేసుకుంటారనుకొని వారికి వివరించబోతే వాళ్ళు కూడా పూర్తిగా వినకుండా, అతన్ని నమ్మకుండా ఇంట్లోంచి వెళ్ళగొట్టారు. అహింసకశర్మ అందఱి దృష్టిలోను అకారణంగా నేఱస్థుడయ్యాడు. అతనికి జీవితం దుర్భరమైంది. అతను సమాజం మీద కక్ష గట్టాడు. అడవికి చేఱుకొని ఆ దారిన పోయేవాళ్ళందఱినీ చంపి ఉన్నదంతా దోచుకునేవాడు. తన చేతిలో చచ్చిపోయినవాళ్ళ చేతి బొటనవ్రేళ్ళు నఱికి మాలగా మెడలో ధరించేవాడు. అందువల్ల అతనికి అంగుళిమాలుడు అని పేరొచ్చింది. అలా కొన్ని వేలమంది అతని చేతిలో నిహతులయ్యారు. ఆఖరికి ఆ దారిగుండా శ్రీ బుద్ధభగవానులు ప్రయాణించడమూ, ఆయన్ని కూడా చంపి దోచుకుందామని అనుసరించిన అంగుళిమాలుడు ఆయన మహత్త్వానికి దాసోహం అని బౌద్ధభిక్షువుగా మారడమూ చరిత్రప్రసిద్ధమే.

ఈ వృత్తాంతంలో తథాగతుల మహత్త్వం కంటే ఎక్కువగా మనం గమనించాల్సింది - అంగుళిమాలుడు నిజంగానే తప్పుచేశాడని భావించిన ఆ కాలపు సామాజికులు తమని తాము ఏ విధంగా గురువు స్థానంలోను, దేవుడి స్థానంలోను కూర్చోబెట్టుకున్నారనేది. గురువుగారి గురుత్వం అతని శిష్యత్వాన్ని చెడగొట్టింది. తల్లిదండ్రుల దైవత్వం అతనిలోని మానవత్వాన్ని చంపేసింది. ఇహ ఆ గురుత్వం దేనికి ? ఆ తల్లిదండ్రుల దైవత్వం దేనికి ? అంతా వృథా. అతను నిజంగానే తప్పు చేసినా, దానిమీద తీర్పులిచ్చే అధికారమూ, ఆ ప్రాతిపదిక మీద అతన్ని వెలేసే అధికారమూ వాళ్ళకు ఉన్నాయా ? అని ! అంగుళిమాలుణ్ణే కాదు, అలా తప్పు చేశారనుకున్న ప్రతివారి విషయంలోను మన పూర్వులు తమకు లేని అధికారాల్ని కట్టబెట్టుకోవడం వల్లనే ఈనాడు మనం దేశంలో కోట్లాదిమంది అస్పృశ్యుల్ని చూస్తున్నామేమో ! తప్పులు తప్పులే. అవి ఎప్పటికీ ఒప్పులు కావు. కానీ ఆ మాట ఇతరులకి చెప్పడానికి మన తపశ్శక్తి సరిపోదు. మనకి లైసెన్సు లేదు.

ఇహ లేద్దాం. ఈ అన్యాయ, అనధికార గురుపీఠాన్ని, మనం అక్రమంగా ఆక్రమించుకున్న దేవుడి సీటుని ఖాళీ చేద్దాం. మన మొహాల్ని మనం ఒకసారి అద్దంలో చూసుకుందాం.

20, నవంబర్ 2012, మంగళవారం

ఆధ్యాత్మికోన్నతి ఎలా కలుగుతుంది ?


Absolute emptiness is the end of all religion. Stuffing mind and life with all sorts of things goes against this. Stuffing this way, you can still be a believer but not a serious practitioner. When we could feel proud of our emptiness in stead of our full-ness, we will have reached the height of all spirituality.

సాధన దంతమంజనం (Tooth paste) లాంటిది. పళ్ళు తోముకున్నాక దాన్ని కూడా పుక్కిలించి ఉమ్మివేయక తప్పదు. అత్యున్నతస్థాయి ఆధ్యాత్మికత నాస్తికత్వాన్ని పోలి ఉంటుంది, "ముదిమి రెండవ బాల్యము" అన్నట్లు. కానీ అది నాస్తికత్వం కాదు. షిరిడీ సాయిబాబా తమ కాళ్ళతో నిప్పుకట్టెల్ని సవరించేవారు. సాధారణ మానవులు అలా చేస్తే అది నాస్తికత్వమే. కనుక సాధకులకు వర్తించే నియమాలూ, విశ్వాసాలూ అంతకంటే పైస్థాయివాళ్ళకి వర్తించవు. కాని వారు కూడా బాహ్యంగా సాధకుల లాగానే మాట్లాడుతూ, ప్రవర్తిస్తూ ఉండాలి. కిందిస్థాయివాళ్ళ దగ్గఱ పైస్థాయి మాటలు మాట్లాడితే వాళ్ళు శూన్యవాదులూ, నాస్తికులూ అవుతారు. చిన్నపిల్లలతో శృంగారం గుఱించి మాట్లాడడం లాంటిది అది. వేమన చేసిన పొఱపాటు ఇదే. అది ఎంతవఱకూ వెళ్ళిందంటే ఆయన్ని కూడా తమలాంటి నాస్తికుడని నాస్తికులు భ్రమపడే దాకా ! 

"హిందూ ఆధ్యాత్మికత ఎందుకని ఇంత గజిబిజి, సంక్లిష్టం ? మతం ఇంకా సింపుల్ గా ఉండొచ్చు గదా ?" అని అడుగుతారు కొందఱు. కానీ ఇదే తరహా ప్రశ్న ఇతర విషయాల గుఱించి వేయరు. మతమంటేనే ఈ లోకువ. "గణితశాస్త్రం ఎందుకని ఇంత గజిబిజి, సంక్లిష్టం ? కాస్త సింపుల్ గా ఉండొచ్చు గదా ? భౌతికశాస్త్రం ఎందుకింత గజిబిజి, సంక్లిష్టం ? కాస్త సింపుల్ గా ఉండొచ్చు గదా ? సాఫ్టువేర్లు ఎందుకింత గజిబిజి, సంక్లిష్టం ? కాస్త సింపుల్ గా, చిన్నపిల్లవాడు కూడా కార్యక్రమణ (Programming) చేసేలా ఉండొచ్చు గదా ?"

మతపు సంక్లిష్టత (complexity) ఎవఱి సృష్టీ కాదు. ఆ జ్ఞానం సహజంగానే చాలా జటిలమైనది, చాలా గహనమైనది. దాన్ని పూర్వఋషులు మన కోసం చాలా చాలా సరళీకరించారు. అయినా అది ఇప్పటికీ సామాన్యమానవుల అవగాహనకి అందుబాటులో లేదు. బహుశా ఎప్పటికీ ఉండదు. ఉండబోదు. మతం కడుపు నిండినవాళ్ళ కులాసా కాలక్షేపం కాదు. కడుపు నిండకపోవడం చేతనే మనిషిలో జీవితం గుఱించిన అంతర్మథనం మొదలైంది. "అనుకున్నది అనుకున్నట్లుగా ఎందుకు జఱగడం లేదు ?" అని ! 

పరమార్థాన్ని సాధించడం కోసం అవసరమంటూ శాస్త్రాల్లో చెప్పిన నియమాలు - ఉదాహరణకి, ఏకాంతవాసమూ, బ్రహ్మచర్యమూ, ఉపవాసాలూ, శమదమాదులూ, బ్రాహ్మీముహూర్తపు సాధనలూ - వీటిని నిబంధనలు (Rules) గా, నిర్బంధంగా చూడడం పొఱపాటు. ఇవి ఆత్మజ్ఞానం అనే సంఘటన జఱగడానికి దోహదపడే సానుకూలాలు (favorable circumstances) మాత్రమే. ఇవన్నీ వాటంతట సమకూడిన ఒకానొక అఱుదైన క్షణంలో మనిషిలో తటాలున అనుకోకుండా ఆత్మజ్ఞానం మెఱుపులా మెఱుస్తుంది. అంటే, ఉదాహరణకి - ఇంద్రధనుస్సు కనిపించాలంటే, ఎండ పడుతూ ఉండాలి. చిఱుజల్లు కుఱుస్తూ ఉండాలి అన్నట్లు ! కృత్రిమంగా ఎండా, చిఱుజల్లూ ఏర్పాటుచేస్తే అది Lab experiment అవుతుంది తప్ప ఇంద్రధనుస్సు అవ్వదు. అలాగే శాస్త్రంలో చెప్పారు గదా అని పై లక్షణాల్ని బలవంతాన అలవఱచుకుంటే ఆత్మజ్ఞానం కలగదు. 

ఎందుకంటే, వీటిల్లో ఏ లక్షణమూ ఒక్క జన్మలో సిద్ధించేది కాదు. అలాంటిది, అన్ని లక్షణాలూ ఒనగూడాలంటే ఎన్ని జన్మలు పట్టుతుందో ఆలోచించండి. దీని పూర్వాపర ప్రక్రియని సక్రమంగా అర్థం చేసుకోవాలి. మనకున్న ప్రతి లక్షణం వెనుకా ఒక సంస్కారం, మన ప్రతిసంస్కారం వెనుకా ఒక ఆచరణ, ప్రతి ఆచరణ వెనుకా ఒక గుర్తోదయం (Realization) ఉంటాయి. అలాంటి అనేక గుర్తోదయాల యొక్క సమాహార రూపంగా ఒక జన్మలో ఆత్మజ్ఞానం సిద్ధిస్తుంది.


15, నవంబర్ 2012, గురువారం

ఐర్లాండ్ వైద్యుల మతవాదం!

ఐర్లాండ్ వైద్యుల మతవాదం!
'ఇది కేథలిక్ దేశ' మంటూ వ్యాఖ్య..
గర్భస్రావానికి తిరస్కృతి
భారతీయురాలి మృతి

లండన్, నవంబర్ 14: గర్భస్రావం చేసేందుకు వైద్యులు తిరస్కరించడంతో భారతీయ దంత వైద్యురాలు సవితా హలప్పనవర్ (31) ఐర్లాండ్‌లో దుర్మరణం పాలయ్యారు. గాల్‌వే యూనివర్సిటీ ఆస్పత్రిలో అక్టోబర్‌లో ఈ మరణం సంభవించిందని 'ఐరిష్ టైమ్స్' పత్రిక బుధవారం వెల్లడించింది.

గాల్‌వేలోని బోస్టన్ సైంటిఫిక్‌లో ఇంజినీర్‌గా పని చేస్తున్న ప్రవీణ్ హలప్పనవర్ భార్య సవిత.. తనకు గర్భస్రావం జరిగిందని, తన గర్భంలోని పిండాన్ని తొలగించాలని వైద్యులను కోరింది. తమది కేథలిక్ దేశం అని చెబుతూ అక్కడి వైద్యులు అబార్షన్ చేసేందుకు తొలుత నిరాకరించారు. తరువాత మృత శిశువును తొలగించారు. అప్పటికే సవిత మర ణించింది. ఈ ఘటన అక్టోబర్ 28న జరిగింది

7, నవంబర్ 2012, బుధవారం

శ్రద్దాంజలి


GORAKSHA SAMITHI- 7 november 2012 wednesday, Shradhanjali Karyakram (Shaheed Gou bakthowki) at Shree Sanatana dharma sabha, Begum bazar, Hyderabad.A.P.
( 1966 anti-cow slaughter agitation was the agitation in 1966 to demand a ban on the slaughter of cows in India, as enshrined in the Directive Principles of State Policy in the Constitution of India. Among others, the Shankaracharya fasted for the cause. The agitation culminated in a massive demonstration outside Sansad Bhavan in New Delhi on 7 November 1966 (As per Hindu Panchang, Vikram Samvat, Kartik Shukla Ashtami, famously known as Gopashtami among Hindus ).
The Prime Minister did not accept the demand for a ban on cow slaughtering. Instead police fired on the peaceful rally, killing many Sadhus in the firing. The Home minister, Gulzarilal Nanda, resigned, taking responsibility for the administration's failure to maintain law and order.)
G.Hanmanth Rao
President
Goraksha Samithi,

T.Yadhagira Rao
Org Sec.
Govamsha Rakshana Samvardhana Parishad.

Pukraj Joshi, Sridhar Yadav, Bharath and Lodh Divyang Singh Jamedar.others

5, నవంబర్ 2012, సోమవారం

వినోదం పేరుతో ఎంత దిగజాఱడానికైనా రెడీ !

మొదటి సభ్యుడు :

మోహన్ బాబు తన సినిమాలో ఒక సామాజిక వర్గాన్ని (బ్రాహ్మణుల్ని) కించపఱచడాన్ని మనమందఱమూ ఖండించాలి. ఇలాంటి చర్యలు హిందువుల ఐక్యాన్ని దెబ్బతీస్తాయి. మోహన్ బాబు మిషనరీ (YSR) కుటుంబంతో సంబంధం కలుపుకున్నప్పుడే అతను ఒక హిందువుగా, కుల హిందువుగా అర్హత కోల్పోయాడు. ఇలా మత/కుల భ్రష్టులు అయినవారు, తమ పాత కులపు ముసుగులో హిందువుల ఐక్యాన్ని ఛిన్నాభిన్నం చేస్తున్నారు. ఇలాంటి వారికి కులమూ మతమూ అనేవి ఉండవు. డబ్బూ, అధికారమూ కావాలి. దానికోసం ఏమైనా చేస్తారు. తల్లినే తార్చే రకాలు. మతము మారినవారు తమ హిందూ పేర్లను, హిందూకులాన్ని ఒక పావుగా వాడుకుని హిందువుల ఐక్యాన్ని పాడుచేస్తున్నారు. ప్రపంచ వ్వాప్తంగా మిషనరీల వ్యూహంలో, పాత పేగన్ల (కొత్తగా మతం మారినవారి) పాత్ర గణనీయమైనది. పేగన్ల (ఉదా : హిందువుల) సమాజాల్లో, దేశాలలో అల్లర్లూ, ఘర్షణలూ, సామాజిక అసమతూకాన్ని  చొప్పించడానికి, మిషనరీలు ఇలాంటి (మోహన్ బాబులాంటి) వారిని ఉపయోగిస్తారు తమ చేతికి మట్టి అంటకుండా. 

ఇది జగన్ వ్యూహంలో కూడా ఒక భాగమైతే ఆశ్చర్యపోనక్కఱలేదు.  హిందువులను కులాలవారీగా ఇంకా విడగొట్టాలి అంటే, వారి మధ్య గొడవలు సృష్టించాలి. మోహన్ బాబు సినిమా అలాంటి ఒక ప్రయత్నం అని తెలుస్తోంది. మోహన్ బాబు జగన్ తొత్తు అని చెప్పకనే తెలుస్తోంది. ఒక బలమైన సామాజిక వర్గంవారు ఇప్పటికే జగన్ చేతిలో ఉన్నారు. మిగిలిన "ఇంకో బలమైన సామాజిక వర్గాన్ని" కూడా ఇతర కులాలనుండి విడగొడితే, TDP పతనమవుతుంది. కాంగ్రెస్  anti-incumbency వల్ల పతనమవుతుంది. జగన్ మఱియు మిషనరీలు అధికారాన్ని చేజిక్కించుకోవచ్చు. ఆ తరువాత మతమార్పిడులు త్వరితగతిన చేసి కిరస్తానీల సంఖ్య పెంచుకోవచ్చు. మిషనరీల యొక్క ఇలాంటి నీచమైన ఎత్తుగడలను హిందువులు గ్రహించి తమ ఐక్యాన్ని కాపాడుకోవాలి. ఇంత కంటే ఎక్కువ పరీక్షా సమయాలు రావచ్చు. వాటిన్నింటినీ తట్టుకున్నప్పుడే హిందువులు తమ మనుగడను కొనసాగించగలరు. లేకపోతే హిందువుల మనుగడ కష్టసాధ్యమే. 

రెండో సభ్యుడు :
మోహన్ బాబు ఇలా చేయటం ఇదే మొదటిసారి కాదు మాష్టారూ !ఇంతకు ముందు అనేకమార్లు ఇలాగే చేశాడు. ఏవైనా కులాలను కించపఱుస్తూ సినిమాలు తీయటం హేయం. ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

మొదటి సభ్యుడు :

ఎవఱైనా హిందువుల మనోభావాలను కించపఱుస్తూ ఉంటే, వారిపై న్యాయపరంగా చర్యలు తీసుకోవడానికి హిందువులకు ఒక సంస్ఠ కావాలి. అలాంటివి ఇప్పటికే ఉంటే అవి సరిగా పనిచేస్తున్నట్లు లేదు. ఈ ప్రక్రియను క్రియాశీలకం చేయాలి. "All India Hindu Human and Legal Rights Protection Authority" అని ఒకదానిని ఏర్పఱచి, తగు ఆర్థిక సంపత్తినీ, పూర్తికాలిక ఉద్యోగుల్నీ మఱియు ఇతర వనర్లనీ దానికి ఇవ్వాలి. విడివిడిగా చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు. ఉదాహరణకు, డా. సుబ్రమణ్య స్వామి, ఇంకా ఇతరులు. కాని అవి అంత సమర్దవంతంగా పనిచేయవు. అదేదో సామెత చెప్పినట్లు, ప్రతిసారి, మొదలుపెట్టాలి అంటే, అది అంత సమర్థవంత ప్రక్రియ అవ్వదు. ప్రతి హిందువూ (లేక గుంపు) తాను సమస్యలలో ఉన్నప్పుడు వ్యక్తిగత హోదాలో పరిష్కరించుకోవాలి అంటే, అది అయ్యేపని కాదు. Each Hindu doesn't have to invent the wheel every time. This is very inefficient process. 

అతి ముఖ్యమైనది ఏమంటే, ఈ సెలబ్రిటీలలో ఎక్కువమంది, హిందూ పుట్టుక పుట్టినా, వారికి హిందూమతం, కులం, సంప్రదాయాలు, భాషలపై అభిమానం ఉండదు. వీరు కమ్యునిష్ట్ లుగానో, కిరస్తానీలు గానో, సెక్యులర్ లు గానో, ప్రాంతీయవాదులుగానో రూపాంతరం చెంది ఉంటారు (హిందూ పేరు, హిందూ కుల ముసుగులో). వీరు చేసే వెధవ పనులను, అదే సామాజిక వర్గానికి చెందిన హిందూ సామాన్యులపైకి project చేయరాదు (ఇలా జఱగాలనేదే హిందూ శత్రువుల అసలు ఉద్దేశ్యము). ఇలాంటివారికి డబ్బూ, అధికారమూ, పేరూ మాత్రమే కావాలి. హిందువుల మధ్య చీలికలు తీసుకు రావడానికి ఇలాంటి వారు మిషనరీలకు తొత్తులుగా పనిచేస్తారు. ఇలాంటి సంఘటనలు ముందుముందు ఎక్కువగా జఱగవచ్చు మిషనరీల ప్రోద్బలముతో !
I think we should collect some funds to support legal action against మోహన్ బాబు. This kind of nonsense against Hindus should not go unanswered. In all this, where is the Hindu leadership hiding? Did it exist at all ?

మూడో సభ్యుడు :

బాధ్యత లేనివాళ్ళు చిన్నపిల్లల కిందే జమ, వాళ్లు వ్యక్తులైనా, సామాజిక వర్గాలైనా ! మోహన్ బాబు పిచ్చివేషాల వెనక అతను లేడు. చాలా పెద్ద యెత్తున వ్యాపించిన సామాజిక బాధ్యతారాహిత్యం ఉంది. తెఱమీదా, తెఱ వెనకా అది భారీస్థాయిలో ఉత్పత్తి చేస్తున్న వెకిలి క్యారెక్టర్లు ఉన్నాయి. శరీరంలో ఒక వేలు నొప్పిపెడుతున్నా సరే, మొత్తం శరీరమంతా మూలపడుతుంది, ఏ పనీ చేసుకోలేని విధంగా ! అలాగే ఒక చిన్న సామాజిక వర్గాన్ని బాధించినా సరే, అది కాలక్రమంలో పెద్ద క్యాన్సరుగా మారుతుంది. దీనికి ఉదాహరణగా అస్పృశ్యవర్గాలనే తీసుకోవచ్చు. దీని మూలాలు సంస్కృతిలో ఉన్నాయి. ఎంత డబ్బున్నా Mentally retarded గా మారిన సామాజిక వర్గాల్ని పెద్దవాళ్ళని చేయాలి. బాధ్యత తెలుసుకునేటట్లు చేయాలి. అందుకే హిందువులందఱికీ ఉపనయనమూ, బ్రహ్మోపదేశమూ, నిత్యానుష్ఠానమూ సర్వసామాన్యం చేయాలనుకుంటున్నాను.

నాలుగో సభ్యుడు :

రజనీకాంతూ, మోహన్ బాబూ వేషాలకోసం వెతుక్కునే రోజుల్లో తప్ప తాగి పాండీబజారు రోడ్ల మీద కొట్టుకునేవాళ్ళు ..ఇందులో రజనికి తొందఱగా జ్ఞానోదయం అయ్యింది. కాని ....చవకబారు మోహన్ బాబుకి .....కిందకి అఱవై వస్తున్నా ....పొగరు తగ్గలేదు మఱి !

మూడో సభ్యుడు :

మోహన్ బాబు సినిమాల్లోనే కాదు, నిజజీవితంలో కూడా విలనే అని పేరు. ఇష్టం లేనివాడినల్లా అక్కడికక్కడే భౌతికంగా చావచితక కొట్టడం అతని నైజం. చాలా సంవత్సరాల క్రితం తెలుగుదేశం ఎమ్మెల్యే శంకర్ రెడ్డిని చావగొట్టడంతో ఆగ్రహించిన చంద్రబాబునాయుడు మోహన్ బాబుని పార్టీకి దూరంగా ఉంచడం మొదలుపెట్టాడు. అప్పట్నుంచీ నాయుడుమీద కక్షగట్టిన మోహన్ బాబు కాంగ్రెస్ కీ, YSR కుటుంబానికీ దగ్గఱ కావడం మొదలుపెట్టాడు వియ్యం కూడ కలుపుకున్నాడు. కనుక ఈ వ్యక్తి వేస్తున్న వెఱ్ఱిమొఱ్ఱివేషాలకి ఒక కులాన్ని నిందించడం సరికాదు.

అతను మొదట ఒక స్కూల్ లో ఉపాధ్యాయుడుగా పని చేసే రోజుల్లో అతనిలో ఉన్న "ఈ తత్త్వాన్ని" గమనించి అప్పట్లో ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడైన బ్రాహ్మణుడొకాయన అతన్ని డిస్మిస్ చేశాడు. "అది తన కులం వల్లనే చేశా" డని ఇతను గోలపెడతాడు తప్ప తాను అక్కడ ఏం చేశాడో చెప్పడు.

తెలుగులో టైప్ చేయండి

కైఫీయతులు

  © బ్లాగర్ టెంప్లేట్ "ప్సై" రూపొందించినవారు Ourblogtemplates.com 2008

ఈ పుట పైభాగానికి వెళ్ళడం కోసం ఇక్కడ నొక్కండి