24, మార్చి 2014, సోమవారం

నేనూ హిందువునే !! - ఫరూక్ అబ్దుల్లా

నేనూ హిందువునే !! - ఫరూక్ అబ్దుల్లా

ఫరూక్ అబ్దుల్లా
"నేను మహమ్మదీయుడను కాను, నిజం చెప్పాలంటే నేను కాశ్మీరులోని సారస్వత పండిత బ్రాహ్మణ కుటుంబానికి చెందిన హిందువును. కొన్ని తరాల క్రితం మేమంతా ఇస్లాంలోకి మతమార్పిడి చేయబడ్డాం. కాబట్టి మేము మహమ్మదీయులుగా పరిగణించబడుతున్నాం".  
ఈ మాటలు సాక్షాత్తూ కేంద్ర మంత్రిగా ఉన్న ఫరూక్ అబ్దుల్లా స్వయంగా అన్నారు. ఆయన కాశ్మీరీ భాషలో మాట్లాడుతూ ఇంకా ఇలా అన్నారు - "నేను కాశ్మీరు సారస్వత పండితుడను కాబట్టే కాశ్మీరీ భాష మీద ఇంత పట్టు ఉన్నది.  ఆ భాష కూడా చక్కగా మాట్లాడుతున్నాను".  
ఫరూక్ అబ్దుల్లా జమ్మూ-కాశ్మీర్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఈ ఫరూక్ అబ్దుల్లా ఒకప్పటి మాజీ ముఖ్యమంత్రి షేక్ అబ్దుల్లాకు కుమారుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి అయిన ఒమర్ అబ్డుల్లాకు తండ్రి కూడా.  ఫిబ్రవరి 19, 2014న జమ్మూ-కాశ్మీరు రాజధాని శ్రీనగర్ లోని ప్రగతి మైదానంలో కాశ్మీరు బాలబాలికల కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన పుస్తకం విడుదల సందర్భంగా ఫరూక్ అబ్దుల్లా పై విధంగా ప్రకటించాడు.  
ఫరూక్ అబ్దుల్లా ఇంకా మాట్లాడుతూ - "కాశ్మీరు సంస్కృతి, వేష భాషలు, జీవన శైలి అన్నీ కూడా ఈ పుస్తకంలో ఉన్నాయి" అని చెపుతూ ఇటువంటిదే ఇంకొక కార్యక్రమం యువత కోసం కూడా చేపట్టబోతున్నట్లు వాగ్దానం చేశారు. కాశ్మీరు భారతీయ సంస్కృతేనని మనం గమనించాలి. 
దేశంలో మెల్లమెల్లగానైనా ఆహ్వానించదగ్గ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. రాజస్తాన్ లో కూడా ఒక వర్గానికి చెందిన మహమ్మదీయులు తమ పూర్వీకులు హిందూ క్షత్రియులనీ, తామంతా రాణాప్రతాప్ కోసం పోరాడిన వారమని గర్వంగా చెప్పటమే కాక తిరిగి హిందుత్వం ఒడిలోకి రావాలని ఉత్సుకత చూపిస్తున్నారు. మతం మార్చబడినవారు చాలామంది తమ మూలాలను తెలుసుకుని మాతృఒడిలోకి తిరిగి రావాలనుకోవడం దేశానికి శుభసూచకం. 
శుభం భూయాత్ 
- ధర్మపాలుడు

12, మార్చి 2014, బుధవారం

దైవం మానవ రూపంలో...

దైవం మానవ రూపంలో...


దైవం మానవ రూపంలో...
మార్చి 3, సోమవారం శ్రీరామకృష్ణ పరమహంస జయంతి)
స్వామి వివేకానంద లాంటి ఎందరినో తన ఉపదేశాలతో మహామహులుగా తీర్చిదిద్ది మానవాళికి అందించారు రామకృష్ణ పరమహంస. భక్తి, దైవం లాంటి ఎన్నో అంశాల గురించి సామాన్యులకు సైతం అర్థమయ్యేలా శతాబ్దిన్నర క్రితం ఆయన చెప్పిన మాటలు ఇవాళ్టికీ స్మరణీయాలు, ఆచరణీయాలు. వాటిలో కొన్ని...
 
ఉన్నాడు... అతడున్నాడు... అసలు దేవుడనేవాడున్నాడా? ఉంటే మనం చూడలేకపోతున్నామేం? అని చాలామంది అంటూ ఉంటారు. నిజమే. మామూలు చూపుతో దేవుణ్ణి చూడలేకపోతున్నాం. కానీ, అంతమాత్రాన ఆయన లేడని చెప్పవచ్చా? దీనికో చిన్న ఉదాహరణ. రాత్రివేళ మనకు నక్షత్రాలు కనిపిస్తున్నాయి. కానీ, పగటిపూట అవేవీ కనిపించవు. అంతమాత్రాన అసలు అవి లేవని భావమా? అజ్ఞానంతో, సంకుచిత దృష్టితో చూస్తే, మనం దేవుణ్ణి చూడలేం. అంతమాత్రాన దేవుడు లేడనీ, ఆయన అవసరమే లేదనీ అంటే శుద్ధ తప్పు.  
 
పిలిస్తే పలుకుతాడు: ఏకకాలంలో అటు సగుణుడూ, ఇటు నిర్గుణుడూ, అటు నానారూపధారి, ఇటు ఏ విధమైన రంగూ రూపం లేనివాడూ భగవంతుడు. ఏ మతమైతే ఏమిటి? ఏ మార్గమైతే ఏమిటి? అందరూ ఆ ఒకే ఒక్క భగవంతుణ్ణి ప్రార్థిస్తారు. కాబట్టి, ఏ మతాన్నీ, మార్గాన్నీ ద్వేషించకూడదు. కించపరచకూడదు. కులం, మతం ఏదైనా సరే, ఎవరైనా, ఎలాగైనా ఆ దేవదేవుణ్ణి పిలవచ్చు. మనస్ఫూర్తిగా, హృదయాంతరాళంలో నుంచి పిలిస్తే చాలు... ఆయన నిశ్చయంగా పలుకుతాడు. దర్శనమిస్తాడు.
 
మరి, అలాంటప్పుడు తీర్థయాత్రలు చేయడం, మెడలో మాలలు ధరించడం మొదలైన ఆచారాలన్నీ ఎందుకని ఎవరికైనా సందేహం రావచ్చు. ఆధ్యాత్మిక జీవిత ప్రారంభంలో అవన్నీ అవసరం. అయితే, జిజ్ఞాసువులు క్రమంగా బాహ్యాడంబరాలన్నిటినీ దాటుకొని వస్తారు. అప్పుడిక కేవలం భగవన్నామ జపం, స్మరణ, చింతనే మిగులుతాయి.
 
అందరూ ఆయనే ... వయస్సు ఎంత మీద పడ్డా, కుటుంబం మీద, కుటుంబ సభ్యుల మీద మమకారం, ఈ బంధాల పట్ల వ్యామోహం పోనివారు ఎంతోమంది ఉంటారు. తీర్థయాత్రకు వెళ్ళినా వారి ధ్యాస అంతా ఇంట్లో ఉన్న పిల్లల మీదే. అలాంటివాళ్ళు తమ బిడ్డలు, మనుమలు, మనుమరాళ్ళనే సాక్షాత్తూ దైవస్వరూపులని భావించడం మొదలుపెట్టాలి. అప్పుడు మనుమరాలి మీద ప్రేమ అంతా ఆ దేవి మీద భక్తిగా మారుతుంది.
 
పిల్లను ఆడిస్తున్నా, అన్నం పెడుతున్నా, చివరకు నుదుట బొట్టు పెడుతున్నా అంతా ఆ అమ్మవారికే చేస్తున్నానని ఊహించుకోవాలి. దాని వల్ల ఇంట్లోనే ఉన్నప్పటికీ, దైవ సాన్నిధ్యంలో ఉన్న భావన, లాభం కలుగుతాయి. అందుకే, తల్లి, తండ్రి, బిడ్డ, స్నేహితులు - ఇలా ఎవరినీ ప్రేమించినా సరే, ఆ వ్యక్తి సాక్షాత్ భగవత్ స్వరూపమేననీ, దేవుడి అవతారమేననీ అనుకోవడం అలవాటు చేసుకోవాలి. ఎంతో సులభమైన ఈ మార్గం మన మనస్సునూ, జీవితాన్నీ మాలిన్య రహితం చేసుకొనేందుకు ఉపకరిస్తుంది.

srinu byndla

25, ఫిబ్రవరి 2014, మంగళవారం

ఒక సీనియర్ సిటిజన్ ...... నిజమైనకర్తవ్యనిష్ఠ'కొత్త సంవత్సర వేడుకలు - చర్చాగోష్టి  ..  కాలనీ వాసులందరికీ ఆహ్వానం'
- కరపత్రంలోని అంశాన్ని చదివిన మిత్రుడు సర్వేశ్వర్రావ్, "చర్చా గోష్టి ఏమిటో! అగ్గి-నిప్పులాగా పేపర్-కాగితం లాగా, హహ్హహ్హా!" అని నవ్వాడు.   'చర్చ అని గానీ, గోష్టి అని గానీ అంటే సరిపోతుంది కదా అన్నది అతడి భావం'.  అసలు సంగతి వదలి కొసరు సంగతులను పట్టుకోవడం సర్వేశ్వర్రావ్ కి ఇష్టం.

'వెళ్దాం పద! ఏం చర్చిస్తారో విందాం' అన్నాను.

'పనిలేని వాళ్ళు ఏవో చేస్తుంటారు.  మనకెందుకులే, టైం వేస్ట్' అన్నాడు మిత్రుడు.

'చూడు మిత్రమా! ఎదో మంచి ఆశయమని అనుకోక పొతే వాళ్ళు ఆ పని చేయరు.  కాబట్టి, పనిలేని వాళ్ళని అనద్దు.  మోసం చేసే ప్రయత్నమో, ఏదైనా వ్యాపారమో దాగి ఉన్నట్లు అనిపించడం లేదు.  కాబట్టి, ఎవరో అమాయకులని అంటే అను.  మనకీ గౌరవంగా ఉంటుంది.  అంతే తప్ప .....' - మిత్రుడి మాటను సరిచేశాను.

'సర్లే, ఆ మాత్రం లోతుగా వెళ్ళడం నాకూ చేతనవును.  వెళితే అర్థమవుతుంది, అదేదో పనిలేని వ్యవహారమని' సర్వేశ్వరరావు రెట్టించాడు. 'పద! చూద్దాం!' నేనూ కవ్వించాను.

అది కమ్యూనిటీ పార్క్.  క్రికెట్, బ్యాడ్మింటన్ ఆటలతో సందడిగా ఉంది.   ఓ చివర సిమెంటు కుర్చీలు.  వాటిలో అయిదుగురు సీనియర్ సిటిజన్లు కూచుని ఉన్నారు.  వారంతా రెగ్యులర్ గా వచ్చే వారేనట.  వారి ఎదుట కొత్తగా వేసిన పది వరుసల ప్లాస్టిక్ కుర్చీల్లో నలుగురు స్కూలు కుర్రవాళ్ళు, ఇద్దరు స్కూలు అమ్మాయిలూ మాత్రమె కూచుని ఉన్నారు.  వారైనా అక్కడి సీనియర్ సిటిజన్ల ప్రోద్బలంతో వచ్చిన వారేనట.  తోడూ మేమిద్దరం.  ఇదీ అక్కడి సభ.  కరపత్రాన్ని చూసి వచ్చిన వాళ్ళం మేమిద్దరమే. 
నేనడిగాను, కరపత్రాలకు ఏమాత్రం ఖర్చు చేశారని.  వెయ్యి రూపాయలు ఖర్చు చేశారట.

మిత్రుడు నా వంక చూశాడు. 'చూశావా, వీళ్ళెంత వృధా రాయుళ్లో, టైంని కూడా అలాగే వృథా చేస్తార'న్నది అతడి భావం. వారిలో పెద్దాయన వయస్సు 84ట.  ఈ ప్రయత్నమూ, ఖర్చూ అంతా ఆయనదేనట. 
మిత్రుడు నా వంక చూశాడు 'ఈ వయసులో కూడా ఆయనకు ఈ తాపత్రయాలేమితో' అన్నది ఈ సారి అతడి భావం. 

..... కానీ, ఆయన మాటలు ఆయన హృదయం లోతుల నుంచి వస్తున్నాయి.  వాటిని పిల్లలు శ్రద్ధగా వింటున్నారు. 

"ఈ జనవరి ఒకటి మనకు పండుగ కాదు.  అసలు ఎవరికైనా పండుగ ఎలా అయిందో ఎవరైనా చెప్పగలరా? మన సంప్రదాయంలో కొత్త సంవత్సరం ఉగాదితో మొదలవుతుంది.  ఖగోళ శాస్త్రరీత్యా, అంటే తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం, ఆయనాలు, సూర్య చంద్రుల గమనాగమనాలు, ఋతువుల రీత్యా, అన్నింటినీ మించి ఆరోగ్య రీత్యా, ఉగాదికి ఎంతో శాస్త్రీయత, విలువ, పవిత్రత, ప్రయోజనం ఉన్నాయి.  మనం కొత్త బట్టలు, దైవదర్శనాలు, పెద్దల ఆశీర్వచనాలు లాంటి వాటితో దివ్యంగా నూతన సంవత్సర ప్రారంభాన్ని జరుపుకుంటాం.  మరి ఈ జనవరి ఒకటి ఎలా నిర్ణయమయింది? అంతా గాలివాటమే.  పోనీ పవిత్రత ఏమైనా ఉందా? తాగి, మోటార్ సైకిళ్ళ మీద ర్యాష్ గా తిరగడం, అర్థరాత్రి వేళ మత్తులో వెర్రిగా ఊగి పోవడం, మాదక ద్రవ్యాలు, వయసులో ఉన్న ఆడా మగా క్లబ్బుల్లో రాసుకోవడం, పూసుకోవడం.  అన్నింటికీ పోలీసు హెచ్చరికలు, జరిమానాలు, అవమానాలు.  ఇదా పండుగ అంటే? ఇదా మన సంస్కృతీ? మన పండుగలలో ఎక్కడైనా ఇలాంటి అప్రాచ్యం ఉందా?........"

వార్థక్యం ఉట్టి పడుతున్నా పెద్దాయనలో వాగ్ధాటి బాగా ఉంది.

"అవి మీ జీవితాలకు గానీ, భవిష్యత్తుకు గానీ ఏమైనా ఉపయోగపడతాయా? గుర్తు పెట్టుకోండి! అవేవీ మన సంస్కృతీ కాదు.  స్వంత చరిత్రని, సంస్కృతిని మర్చిపోయిన జాతులు మాడి పోయిన బొగ్గుల్లాంటివి.  జయ ఉగాది వస్తుంది.  దానిని మన పద్ధతిలో దివ్యంగా జరుపుకుందాం.  ఈ జనవరి 1 వ్యామోహ ప్రకంపనలు సోకకుండా, మనం ధృడ సంకల్పులం కావాలి.  దీనికి మార్గాలు మీరే చెప్పాలి" .... జనవరి 1కి పది రోజుల ముందు ఆదివారం సాయంత్రం జరిగిన ఆ గోష్టిలో, స్థూలంగా ఆ సీనియర్ సిటిజన్ సందేశమిది. 

మిత్రుడు నా వంక చూశాడు. 'చూశావా! ఇదేదో చిన్న పిల్లల కోసం, మనకు కాదు' అన్నది అతడి భావం.

నేను ఆ పెద్దాయనను అభినందించాను.  "చిన్న పిల్లలకు నాలుగు మంచి మాటలు చెప్పే చిన్న ప్రయత్నం కోసం వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టే ఉదార హృదయం ఎందరి కుంటుంది? మీ సేవ ప్రతి ఒక్కరికీ ఆదర్శం.  ఈ బాలల అసెంబ్లీలతో పరమాద్భుతమైన మార్పు సాధ్యం.  అయితే, ఆ వెయ్యిలో అయిదారు వందలను బాలలకు బహుమతుల రూపంలో ఖర్చు పెడితే ఫలితం ఇంకా బాగుంటుందేమో' - అన్నాను. 

"జాతీయ దినోత్సవాలకు అలాగే చేస్తున్నాం.  సాధారణ సమావేశాలు కూడా అందరికీ తెలియాలని కరపత్రాల మీద ఖర్చు చేశా" అని ఆయన చెప్పారు.

"కరపత్రాలు వేయిస్తే మాత్రం వచ్చేదెవరు? మేం కూడా వేరే పనుంటే వచ్చే వాళ్ళం కాదు" - నా మిత్రుడు వ్యాఖ్యానించాడు.

"నా ప్రయత్నం నాదే.  నాకు అసంతృప్తి లేదు.  ఈ ఆరుగురు పిల్లల్లో కనీసం ఒక్కరు జీవిత కాలంలో, దురలవాట్లకు ఖర్చు చేయకుండా ప్రతి జనవరి 1కీ సగటున వెయ్యి రూపాయలు ఆదా చేశారనుకోండి! నా ఆత్మ పైలోకాల్లో ఎక్కడున్నా సంతోషిస్తుంది.  చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం కాదు.  చేతులు కాలకుండా చూసుకోవడమే అనాదిగా మన భారతీయ సమాజం వివేకం.  అందుకోసం ఇలాంటి చిరు సమావేశాల మీద ఏమైనా ఖర్చు పెట్టినా, దానిని మించిన మంచి పెట్టుబడి లేదని భారతీయ కుటుంబాలు తెలుసుకోవాలి.  ఈ జనవరి 1 కి అమెరికాలో ప్రభుత్వమే చేతులు ఎత్తేసి, గంజాయి విక్రయాలకు పర్మిషన్ ఇచ్చేసిందట.  మనమూ అదే దారిలో నడవాలా? అలాంటి పరిస్థితి రాకూడదనుకుంటే ప్రతి కుటుంబమూ పిల్లలను ఇలాంటి గోష్టులకు పంపాలి.  అప్పుడే అందరమూ అదృష్టవంతులమవుతాం.  లేకపోతె, ఈ జాతినీ, దేశాన్నీ ఎవరూ కాపాడలేరు ......." అన్నారు ఆ సీనియర్ సిటిజన్.  జాతికి శ్రీరామ రక్ష ఏమిటో నా హృదయానికి మరోసారి కళ్ళకు కట్టిన విలువైన క్షణమది.

".... ఈ ఆరుగురు పిల్లలలో కనీసం ఏ ఒక్కరి వల్లనైనా ప్రభావితమై, భవిష్యత్తులో ఎన్ని వేల మంది డిసెంబర్ 31, జనవరి 1 తేదీలను వివేకవంతంగా గడుపుతారో ఎవరు చెప్పగలరు! వీరిలో ఒక వివేకానందుడు లేడని మీరు రాసివ్వగలరా? ఒక సర్వేపల్లి రాధాకృష్ణన్, ఒక చాగంటి కోటేశ్వరరావు, ఒక పరిపూర్ణానంద స్వామీ వీరి నుంచి తయారు కారని మీరు పందెం కాయగాలరా? పిల్లల చేత మాట్లాడించాలే కానీ, ఎంత బాగా మాట్లాడతారో విని చూడండి! మీకే తెలుస్తుంది" - ఆ పెద్దాయన నోటి నుంచి వస్తున్నవి చొల్లు మాటలు కావు.  జాతి మొత్తానికీ విసురుతున్న సవాలు.

ఓ అమ్మాయి చెప్పింది - "ప్రతి డిసెంబరు 31 వ తేదీనా వివేకానందుడి స్పూర్తిని జ్ఞాపకం చేసుకునే సభలను మనం పెట్టుకోవాలి.  ప్రతి జనవరి 1 వ తేదీనా దగ్గరలోని దేవాలయాలకు వెళ్లి, దుష్ట సంప్రదాయాల దాడుల నుంచి మననీ, మన సంస్కృతినీ కాపాడాలంటూ దేవుడికి దణ్ణం పెట్టుకునే విధానాన్ని నెలకొల్పుకోవాలి" - అందరం చప్పట్లు కొట్టాము.  నేను ఆ అమ్మాయికి నా వద్ద ఉన్న కొత్త కలాన్ని బహుమానంగా ఇచ్చాను.

ఎదో ముసలాయన అనుకున్నాం కానీ, ఉక్కు పిండమే.

"నా జీవిత కాలంలో అనేక మంది విద్యార్థినీ విద్యార్థులు నావల్ల ప్రభావితమై, ఇప్పటికే అనేక చోట్ల, దేశం కోసం, జాతి కోసం, ధర్మం కోసం అవసరమైన నాలుగు మంచి మాటలను చెబుతూ ఎన్నో కుటుంబాలకు ప్రయోజనం కలిగిస్తున్నారు.  సత్సంగాలను నడుపుతూ, నీరాజనాలను అందుకుంటున్నారు.  ధర్మపన్నాలు వల్లించడం కాదు.  సశాస్త్రీయమైన రీతిలో వ్యక్తిత్వం, వికాసం, వక్తృత్వం, విజయం, కర్తవ్యమ్, కర్తృత్వం, సంస్కృతీ, జీవితంలో ఎదురయ్యే సవాళ్లు, వాటి పరిష్కారాలు, ఒత్తిడులను ఎదుర్కోవడం, నిరాశా నిస్పృహలను పారద్రోలడం మొదలైన దైనందిన అంశాలలో ముఖాముఖి జరుపుతూ, తమ పరిధిలో తోటి వాళ్ళ జీవితాలకు మంచి పునాది వేస్తున్నారు.  వ్యక్తులతోనే మంచి వ్యవస్థ సాధ్యం.  చూడండి! ప్రభుత్వమే మద్యాన్ని అమ్మిస్తోంది.  అంతమాత్రాన మన పిల్లలు దానిని కొని తాగేయాలా? మనం వంగితేనే మనమీద ఎవరైనా సవారీ చేస్తారు.  జీవితకాలమంతా నా విద్యార్థులకు నేను నూరి పోసింది ఒక్కటే.  వియ్ మస్ట్ లెర్న్ టు కాల్ ఏ స్పేడ్ ఏ స్పేడ్.  నా విద్యార్థులు అనేక మంది సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా అమెరికాకు వెళ్లి కూడా మద్యం ముట్టకుండా జీవిస్తున్నారు.  సగర్వ భారతీయులుగా జీవిస్తున్నారు" - పెద్దాయన గర్వంగా చెప్పారు.

"మీ సంస్థ పేరేమిటి?" - నా మిత్రుడు ప్రశ్నించాడు.

"సంస్థలను పెట్టడం నా పని కాదు.  అధ్యాపకుడుగా వ్యక్తులను తయారు చేయడమే నా పని.  నా వృత్తికి రిటైర్మెంట్ ఉంది కానీ, ఈ నా ప్రవృత్తికి లేదు.  చిన్న చిన్న సమావేశాలలో హృదయానికి హత్తుకునేలా సత్యనిష్టను, కర్తవ్య పరాయణతను బోధించడమే నా విధానం.  నా విద్యార్థులలో సంస్థలను పెట్టుకున్న వారూ ఉన్నారు.  వ్యక్తులుగానే తమ వంతు చేస్తున్న వారూ ఉన్నారు.  వీరు కోరుకునేది ప్రచారం కాదు.  ప్రభావం" - ఆయన జవాబిచ్చారు. 

....... నిశ్శబ్ద విప్లవం అంటే అదేనా?

మిత్రుడు సర్వేశ్వర్రావ్ ఆయనకు దగ్గరగా జరిగి చెప్పాడు "మా బంధువు ఒకమ్మాయి, బొట్టు చేరిపేసుకుంది.  ఈ ధర్మమంతా చాదస్తమని వాదిస్తోంది.  మొదట్లో మా వాళ్ళు ఎదో కుర్ర వాదన అనుకున్నారు.  ఈ మధ్యన ఆమె వేరే మతానికి మారితే తప్పేమిటని అనడం మొదలు పెట్టింది.  ఇంట్లో ఏడుపులు, పెడ బొబ్బలు.  నేనూ చెప్పి చూశాను.  కానీ, వాదనలో ఆ అమ్మాయిని ఎవరూ ఓడించలేరు.  పెంకి ఘటం.  మీరు గానీ, మీ శిష్యులు గానీ ఏమైనా నచ్చ జెప్పగలరా? తనకు సరైన సమాధానం చెప్పగలిగితే మతం మారబోనని ఆమె సవాలు విసరుతోంది"

"మాట్లాడడానికి ఆమె సిద్ధంగా ఉంటే, ఆమె కుటుంబమంతా సగౌరవంగా ఆహ్వానిస్తే, భారతీయ ధర్మం గొప్పదనాన్ని నా శిష్యులు సశాస్త్రీయంగా చెప్పగలరు.  ఆమె ఎక్కడుంటారు?" ప్రశ్నించారు ఆ సీనియర్ సిటిజన్.   మిత్రుడు చెప్పాడు.

"వారు ఆహ్వానిస్తే నా శిష్యుడు ఒకరిని వారి వద్దకే పంపిస్తాను".

సర్వేశ్వరరావు దీనంగా అడిగాడు "ఏమైనా ఆశ ఉందంటారా?"

"ఆమె నిజమైన సత్యాన్వేషి అయిన పక్షంలో, భారతీయ ధర్మానికి ఆమెనే మరొక రాయబారిగా తీర్చి దిద్ద గలిగిన ఉద్దండులు నా శిష్యులు.  ప్రయత్నమే మనవంతు.  తర్వాత ఆమె అదృష్టం, మీ అదృష్టం" - మాస్టారు వినయంగా జవాబిచ్చారు.

"మిమ్మల్ని సిసలైన భారతీయుడు అంటాను" - సర్వేశ్వరరావు చేతులు జోడించాడు.  నేనూ ఏకీభవిస్తాను.  మరి మీరు?
--
ఓం నమో భగవతే వాసుదేవాయ 
సర్వం శ్రీ ఆంజనేయ స్వామి పాదారవిందార్పణమస్తు
కె.బి. నారాయణ శర్మ - నాకు తెలిసింది అల్పం తెలుసుకో వలసినది అనంతం.

12, జనవరి 2014, ఆదివారం

Interesting facts about religion

Interesting facts about religion
.
 CHRISTIANITY:
One Christ, One Bible, One Religion
BUT the Latin Catholic will not enter Syrian Catholic Church.
These two will not enter Marthoma Church.
These three will not enter Pentecost Church.
These four will not enter Salvation Army Church.
These five will not enter Seventh Day Adventist Church.
These six will not enter Orthodox Church.
These seven will not enter Jacobite church.
Like this there are 146 castes in Kerala alone, each will not go to the other's church to pray...!
So much for One Christ, One Bible, One Jehova.....
What a unity!

 ISLAM:
One Allah, One Quran, One Nabi....!
AND ALL MUSLIMS CALL THEMSELVES BROTHERS!
BUT, Shia and Sunni cannot see eye to eye and kill each other anywhere and everywhere.
The Shia will not go to Sunni Mosque.
These two will not go to Ahamadiya Mosque.
These three will not go to Sufi Mosque.
These four will not go to Mujahiddin mosque...
There are 13 castes in Muslims and these brothers can't share their places of worship.
The brothers have been killing/bombing/conquering/murdering/raping each other in the name of Islam for the last 1500 years, since the day Islam existed...!
They have never been or never will be at peace with Jews or Christians in the name of religion, yet all 3 pray to the same God of Abraham.
The American attack on the Muslim land of Iraq and Afghanistan is fully supported by all the Muslim countries around them!
One Allah, One Quran, One Nebi....!
Great unity!
All Muslims are not Terrorists, but all Terrorists are Muslims and 60% of all victims of Muslim terrorism are Muslims.

THEY ARE KILLING THEMSELVES IN THE NAME OF RELIGION.

 HINDUISM:
1,280 Religious Books, 10,000 Commentaries, more than one lakh sub-commentaries for these foundation books,
330 million gods, variety of Aacharyas, thousands of Rishies, hundreds of languages... still everyone goes to  the SAME TEMPLE ...
Hindus never quarreled each other for the last ten thousand years in The name of religion.
Only Politicians had tried to divide and rule.

 BUDDHISM:
Buddhism is the world's first religion
Fourth-largest religion behind Christianity, Islam and Hinduism
Buddhism is both a religion and philosophy largely based on teachings attributed to Siddhartha Gautama
Three concepts, Karma, Rebirth, Samsara. They classify themselves as Theravada or Mahayana
Both accept the Buddha as their teacher. Both accept the Middle way, Dependent origination,
Four Noble Truths, Noble Eightfold Path and Three marks of existence
Both accept that members of the laity and of the sangha can pursue the path toward enlightenment (Bodhi)
Both consider Buddha hood to be the highest attainment
They do not believe that this world is created and ruled by a God
They consider that the purpose of life is to develop compassion for all living beings without discrimination and to work for their good, happiness and peace and to develop wisdom leading to the realization of the Ultimate Truth

 The moral is:

KEEP RELIGION OUT OF POLITICS AND POLITICS OUT OF RELIGION

The killing will stop And there will be peace on earth.

 VERY INTERESTING INFORMATIONS, NEED TO READ HOW THE WORLD IS ?

4, జనవరి 2014, శనివారం

When Germany is Christian, is India Hindu?

By Maria Wirth
May 11, 2013
(Denying One’s Own Roots)
 
 
Germans are not agitated that Germany is called a Christian country, though I actually would understand if they were. After all, the history of the Church is appalling. The so called success story of Christianity depended greatly on tyranny.  “Convert or die”, were the options given not only to the indigenous population in America some five hundred years ago. In Germany, too, 1200 years ago, the emperor Karl the Great ordered the death sentence for refusal of baptism in his newly conquered realms. It provoked his advisor Alkuin to comment: ‘One can force them to baptism, but how to force them to believe?’
And here comes the second reason why the resistance to associate India with Hinduism by Indians is difficult to understand. Hinduism is in a different category from the Abrahamic religions. Its history, compared to Christianity and Islam was undoubtedly the least violent as it spread in ancient times by convincing arguments and not by force. It is not a belief system that demands blind belief in dogmas and the suspension of one’s intelligence. On the contrary, Hinduism encourages using one’s intelligence to the hilt. It is an enquiry into truth, based on a refined (methods are given) character and intellect. It comprises a huge body of ancient literature, not only regarding Dharma and philosophy, but also regarding music, architecture, dance, science, astronomy, economics, politics, etc.
In my early days in India, I thought that every Indian knew and valued his tradition. Slowly I realized that I was wrong. The British colonial masters had been successful in not only weaning away many of the elite from their ancient tradition but even making them despise it. It helped that the ‘educated’ class could no longer read the original Sanskrit texts and believed what the British told them. This lack of knowledge and the brainwashing by the British education may be the reason why many ‘modern’ Indians are against anything ‘Hindu’. They don’t realize the difference between western religions that have to be believed (or at least professed) blindly, and which discourage if not forbid their adherents to think on their own and the multi-layered Hindu Dharma which gives freedom and encourages using one’s intelligence.
 

If only missionaries denigrated Hindu Dharma, it would not be so bad, as they clearly have an agenda which discerning Indians would detect. But sadly, Indians with Hindu names assist them because they wrongly believe that Hinduism is inferior to western religions. They belittle everything Hindu instead of getting thorough knowledge. As a rule, they know little about their tradition except what the British told them, i.e. that the major features are caste system and idol worship. They don’t realize that India would gain, not lose, if it solidly backed its profound and all inclusive Hindu tradition. The Dalai Lama said some time ago that already as a youth in Lhasa, he had been deeply impressed by the richness of Indian thought. “India has great potential to help the world,” he added. 

When will the westernized Indian elite realize this truth?

31, డిసెంబర్ 2013, మంగళవారం

గుడి ఉన్న ఊళ్ళోనే మనుగడ

ప్రతిష్ఠ చేసిన ప్రదేశాల్లో జీవించే అర్హత ప్రతి మానవునికీ ఉంది.

ఆదియోగి శివుడు అగస్త్య మహామునిని దక్షిణ భారతావనికి పంపించారు.  దక్కను  పీఠభూమికి దక్షిణాన ప్రతి పల్లెనూ, జనావాసాన్నీ ఆ మహాముని ఏదో రకమైన ప్రతిష్ఠలతో పవిత్రం చేశారు.  తద్వారా ఆ ప్రాంతాల్లో ఆథ్యాత్మిక ప్రక్రియ ప్రారంభమై, కొనసాగేలా చూశారు. మానవుడు నివసించే ఏ ఒక్క జనావాసాన్నీ కూడా ఆయన వదిలిపెట్టలేదు. ఇలా చేయడానికి ఆయనకు 4,౦౦౦ సంవత్సరాల కాలం పట్టిందని చెబుతారు.  అయితే అది నాలుగు వేల ఏళ్ళా, నాలుగు వందల ఏళ్ళా, అంత కాకుంటే పోనీ 140 ఏళ్ళా అనేది మనకు తెలియదు.  కానీ, ఆయన చేసిన ఈ బృహత్తర కార్యక్రమం, అందుకోసం ఆయన చేసిన సుదీర్ఘ యాత్ర గమనిస్తే, ఆయన అసాధారణ రీతిలో ఎంతో దీర్ఘకాలం సాధన చేశారన్నది అర్థమవుతుంది.

ప్రతిష్ఠ చేయడమనేది ఓ సజీవ ప్రక్రియ.  మట్టిని ఆహారంగా మార్చామనుకోండి, దాన్ని వ్యవసాయం అంటున్నాం. అదే ఆహారాన్ని మాంసంగా, ఎముకలుగా మార్చేదాన్ని జీర్ణ క్రియగా, మళ్ళీ ఈ మాంస శరీరాన్ని మట్టిగా మార్చడాన్ని దహనం లేదా ఖననం అంటున్నాం.  ఇక్కడ పేర్కొన్న ఈ మాంసాన్ని లేదా ఓ రాయిని, ఇవీ అవీ కాకుంటే ఏ ఖాళీ ప్రదేశాన్నయినా దివ్య భూమికగా మార్చగలిగితే, ఆ ప్రక్రియే ప్రతిష్ఠ.  ఈ ప్రపంచంలో ఉన్నవన్నీ ఒకే శక్తి రూపాలనీ, ఒకే శక్తి కోట్లాది రూపాల్లో, అనేక విధాలుగా వక్తమవుతోందని ఆధునిక విజ్ఞాన శాస్త్రం కూడా చెబుతోంది కదా.  విషయం అదే అయినప్పుడు, దివ్యత్వమని, రాయి అని, మగాడు లేదా ఆడది అని, రాక్షసుడని మనం అంటున్నవన్నీ వివిధ రూపాల్లో గోచరిస్తున్న, పనిచేస్తున్న ఒకే శక్తి మాత్రమె.  ఉదాహరణకు విద్యుత్తు ఒకటే.  కాని అదే దీపంగా వెలుగుతుంది, ధ్వనిగా వినవస్తుంది.  సాంకేతికతను బట్టి విద్యుత్తూ వివిధ రకాలుగా వ్యక్తమవుతుంది.  అలాగే ఈ ప్రతిష్ఠ కూడా ఒక సామ్కేతికతే.  అవసరమైన సాంకేతికత అందుబాటులో ఉంటే, మన చుట్టు ఉన్న ఈ సామాన్యమైన సాధారణమైన ప్రదేశాలను దివ్యంగా మార్చగలుగుతాం.  దారి పక్కనున్న ఓ చిన్న రాయిని తీసుకుని దాన్ని ఓ దేవుడిగానో, దేవత గానో మార్చేయ గలుగుతాం.  అదే ప్రతిష్ఠ అనే అద్భుతం.

మన సంస్కృతిలో ఈ అఖండ విజ్ఞానాన్ని శాశ్వతంగా నిలిచిపోయేలా చేయడం జరిగింది.  మన సంస్కృతిలో ఈ విజ్ఞానాన్ని పరమోత్క్రుష్టమైనదిగా నిర్ధారించారు.  మన సంస్కృతిలో మనమేమి తింటున్నాం, మనమెలా ఉన్నాం, మనమెంత కాలం బతుకుతాం అనేవి అంత ముఖ్యమైనవి కాదు.  మన జీవితంలో ఏదో ఓ తరుణంలో సృష్టిమూలాలను అన్వేషించాలనే వాంఛ ప్రతివారికీ తప్పకుండా వచ్చి తీరుతుంది.  దీన్ని అందుకోవాలనే తపన పడే ప్రతి మానవునకూ ఈ అవకాశం అందివచ్చే విధంగా చేయక పొతే, అతనికి యదార్థమైన సంక్షేమాన్ని అందించడంలో సమాజం విఫలమైనట్లే.

మానవాళి అభ్యున్నతికి అవసరమైన ఈ సంక్షేమ దృష్టి తోనే ప్రతివీధిలో కనీసం ముడేసి దేవాలయాలు ఉండడాన్ని ఈ సంస్కృతిలో భాగం చేశారు.  ఎందుకంటే, పవిత్రమైన వాతావరణం లేని ప్రదేశం, కొన్ని అడుగులైనా సరే, ఉండరాదన్న విజ్ఞతతో  చేసిన గొప్ప ఏర్పాటు ఇది.  ఇదేదో ఓ గుడికి పోటీగా మరో గుడి నిర్మించాలనుకోవడం కానే కాదు.  ఎవరూ కూడా ప్రతిష్ఠ కాని ప్రదేశంలో ఒక్క అడుగు కూడా వేయరాడనే సదుద్దేశంతో చేసినది.  ఎవరు కూడా ప్రతిష్ఠ కాని వాతావరణంలో జీవితం దుర్భరం చేసుకోరాదన్న విశేష ఆదరణ బుద్ధితో చేసిన మహాత్కార్యమిది.  అందుకే ముందుగా గుడిని నిర్మించి ఆ తరువాతే దానిచుట్టూ నివాసాలు నిర్మిస్తూ వచ్చారు.

దక్షిణాది యావత్తూ, ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రం యావత్తూ ఇదే తీరున నిర్మితమైంది. తమిళ నాడు లోని చెప్పుకోదగిన ప్రతి పట్టణంలో ఓ బృహత్ దేవాలయం తప్పనిసరిగా ఉంటుంది.  దాని చుట్టూనే పట్టణం.  ఎందుకంటే మనమేలాంటి ఇంటిలో ఉంటున్నాం అన్నది ముఖ్యం కాదు.  ఆ ఇల్లు పదివేల చదరపు అడుగుల్లో నిర్మిమ్చినదా, లేక వెయ్యి చదరపు అడుగుల్లో కట్టినాడా అనేది అంతకన్నా ముఖ్యం కాదు.  దానివల్ల చివరకు మన జీవితంలో తేడా ఏదీ ఉండదు.  కానీ, ప్రతిష్ఠ చేసిన వాతావరణంలో నివాసం వల్ల మన జీవితం ఎంతో ప్రభావితం అవుతుంది.  ఎంతో తేడా కనిపిస్తుంది.  ఈ విజ్ఞానంతోనే, ఈ అనుభవసారంతోనే, వారు మానవ ఆవాసాలను ఈ విధంగా నిర్మించారు.  ఊళ్ళో 25 గడపలు ఉన్నాయంటే, కచ్చితంగా ఓ దేవాలయం ఉండి తీరాలి.  మనం ఆ గుడికి వెళ్ళినా, వెళ్లక పోయినా, మనం అక్కడ ప్రార్థించినా, ప్రార్థించక పోయినా, మనకు ఏదైనా మంత్రం తెలిసినా, తెలియకున్నా పరవాలేదు.  అసలది సమస్యే కాదు.  జీవితంలో ప్రతి క్షణం మనం ప్రతిష్టించిన వాతావరణంలోనే ఉండాలి.  అదే దీని పరమార్థం. 
[kbn sharma]

18, డిసెంబర్ 2013, బుధవారం

కంచి శంకరాచార్యపై ఇంతటి కుట్రకు పాల్పడినవారెవరు?

కంచి శంకరాచార్యపై ఇంతటి కుట్రకు పాల్పడినవారెవరు?


తొమ్మిది సంవత్సరాలపాటు సాగిన కంచి కథకు ఎట్టకేలకు నవంబర్ 26వ తేదీన పుదుచ్చేరి ప్రత్యేక కోర్టు ముగింపు పలికింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శంకర్ రామన్ హత్య కేసులో కంచి స్వామీజీ జయేంద్ర సరస్వతి, విజయేంద్ర సరస్వతి స్వాములు ఇద్దరూ నిర్దోషులని కోర్టు తీర్పు చెప్పింది. మొత్తం 24 మంది నిందితులలో ఒక నిందితుడు 2013 మార్చిలో చెన్నైలో హత్యకు గురవగా మిగిలిన 23 మందిని నిర్దోషులుగా విడుదల చేస్తున్నట్లు జస్టిస్ మురుగన్ ప్రకటిస్తూ తీర్పునిచ్చారు. 

ఈ తీర్పు మరికొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పలేదు. శంకర్ రామన్ ను హత్య చేసింది ఎవరు? 9 సంవత్సరాలు విచారణ చేసిన తరువాత కూడా అసలైన హంతకులను ఎందుకు పట్టుకోలేదు? ఇక రెండవ ప్రశ్న. భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే అందరూ గౌరవించే కంచి పీఠాధిపతులు జయేంద్ర సరస్వతి, విజయేంద్ర సరస్వతి స్వాములను అక్రమంగా నిర్బంధించి, కేసులో ఇరికించి వారి గౌరవ ప్రతిష్ఠలను దిగజార్చటానికి పన్నిన వ్యూహంలో భాగస్వాములు ఎవరు? హిందూ సమాజాన్ని కించపరిచే విధంగా కేసులు నడిపించిన తమిళనాడు ప్రభుత్వానికి కోర్టు ఏమి చెప్పింది? ఏమి చెబితే, ఎంత చెబితే పోయిన స్వామీజీల గౌరవం తిరిగి వస్తుంది? ఈ ప్రశ్నలకు ప్రభుత్వం, కోర్టు, విచారణ యంత్రాంగం, మీడియా ఏమి సమాధానం చెబుతుంది?

శ్రీశ్రీశ్రీ జయేంద్ర సరస్వతి స్వామికి, తమిళనాడు ముఖ్యమంత్రి కుమారి జయలలితకు మధ్య మీడియా కూడా గుర్తించని వైరం ఏదో ఉండి ఉంటుందని ఆ సమయంలో (2004లో) వార్తలు వచ్చాయి. ఆ కక్షసాధింపు చర్యలో భాగంగా ఈ ఘాతుకం జరిగి ఉంటుందా?

2004లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పాలమూరు జిల్లాలో తెల్లవారితే దీపావళి పండుగ అనగా అర్థరాత్రి పూట పోలీసులు స్వామీజీని అదుపులోకి తీసుకొని జైలుకు తరలించారు. ఆ సమయంలో ''అర్థరాత్రి చడీచప్పుడు కాకుండా నిర్బంధించటానికి నేనేమైనా వీరప్పన్ నా?'' అని స్వామీజీ పోలీసులను ప్రశ్నించారు. తెల్లవారితే దీపావళి పండుగ అనగా అభియోగాలపై అభియోగాలు మోపి బెయిల్ పై త్వరగా బైటపడకుండా కూడ చూసారు. చేసిన ఒక తప్పును కప్పిపుచ్చుకోవడానికి ప్రభుత్వం అనేక తప్పులు చేసింది.  ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం వ్యవహరించిన తీరును జ్ఞాపకం చేసుకొంటే ఒక్కసారిగా మనస్సు కలుక్కుమంటుంది. 80 కోట్లకు పైగా జనాభా ఉన్న హిందూ సమాజం, హిందూ సంస్థల నాయకులు దీనిపై వెంటనే ఏమీ చేయలేకపోయారు...!? రాజకీయ అధికారం ముందు ఏమీ తోచనివారయ్యారా? అటువంటి పరిస్థితులు ఎందుకు నిర్మాణమయ్యాయి? ఆలోచించవలసిన అవసరం మనందరకు ఉంది.

నిర్ధారణగా ఇది అని చెప్పలేము గాని, ఒక్కసారి గతంలోకి వెళితే కొన్ని విషయాలు, కొన్ని చేదు నిజాలు మనకు జ్ఞాపకం వస్తాయి. రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో పోప్ జాన్ పాల్-2 భారత్ కు వచ్చారు. ఆ సమయంలో ఢిల్లీలో పోప్ జాన్ పాల్ చేసిన వ్యాఖ్యను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. "ఆసియా ఖండం, అందులో భారతదేశం కోతకు సిద్ధంగా ఉంది" - అంటే భారతదేశాన్ని క్రైస్తవదేశంగా చేయటానికి అనువుగా ఉంది అని ప్రకటించారు. దేశంలో క్రైస్తవ ప్రాబల్యం పెరిగితే దానిని నిరోధించేది, ఎదుర్కొనేది హిందూ సమాజంలోని సాధుసంతులు, సంఘము, విశ్వహిందూ పరిషత్ లాంటి సంస్థలు. వాటి గౌరవ ప్రతిష్ఠలను సమాజంలో దిగజార్చాలని నిర్ణయించారా? అందుకే ఈ పథకం రచించబడిందా?

కేంద్రంలో యుపిఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆ పథకం అమలులో భాగంగా ఈ అరెస్టులు, స్వామీజీల మీద, సంఘం మీద దాడులు, ఆరోపణ పర్వాలు సాగుతున్నాయా? ఇవి ఏవి హిందూ సమాజానికి పట్టవు. ఇక్కడ మీడియా రంగం కూడా వ్యవహరించిన తీరు ఎంతో గర్హించదగినది. ప్రపంచంలో అనేక దేశాలలో అమెరికా అండదండలతో క్రైస్తవం ఎన్నో అరాచకాలు సృష్టించింది. ఎక్కడోదాక అవసరం లేదు - కేరళ, తమిళనాడులలో క్రైస్తవుల అకృత్యాలే అనేకం. వాటిని విచారణ జరిపించి దోషులను శిక్షించారా? కేరళలో నన్స్ పై అత్యాచారాలు, హత్యలు మొదలైనవి పుస్తకాలే వచ్చాయి. అధికారుల అండదండల కారణంగా వేటిపైన సరియైన చర్య తీసుకోలేదు. పెరిగిపోతున్న క్రైస్తవుల అరాచకాల గురించి అనేక మంది పెద్ద మనుషులను వ్యక్తిగతంగా కలిసినప్పుడు తమ బాధను, ఆక్రోశాన్ని వ్యక్తం చేస్తారు. కాని క్రైస్తవానికి వ్యతిరేకంగా గళం మాత్రం విప్పరు. ఇది కాంగ్రెసుకు కలిసి వస్తున్నది. ఇప్పుడున్న కేంద్రప్రభుత్వం చేజారుతున్న తన ఆశలను పెంచుకొనేందుకు ఏమైనా చేసేందుకు సిద్ధం కావచ్చు. మైనార్టీల సంరక్షణ పేరుతో హిందూ సంస్థలను స్వామీజీలను వేధించే ప్రయత్నం చేయవచ్చు. ఇది హిందూ సమాజానికి ఒక హెచ్చరిక.

వైరము లేని హింసను చేయటానికి సిద్ధపడని హిందూసమాజం తన పైన శతృత్వం వహించి పని చేస్తున్న శక్తులను గుర్తించే పరిస్థితులు లేవు. శ్రీశ్రీశ్రీ జయేంద్ర సరస్వతి స్వామీజీ కేవలం ఆధ్యాత్యిక రంగంలోనే కాదు, సామాజిక రంగంలో కూడా గడిచిన రెండు దశాబ్దాలుగా పని చేస్తున్నారు. సమాజంలోని అట్టడుగు వర్గాల సంక్షేమానికి జనకల్యాణ పరిషత్ స్థాపించారు. దేశవ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు వారి మార్గదర్శనంలో నడుస్తున్నాయి. వాటికి అడ్డుకట్ట వేయాలని క్రైస్తవులు అనుకొని ఉండి ఉండవచ్చు. వాళ్లకు ప్రభుత్వాలు సహకరిస్తూ ఉండి ఉండవచ్చు. ఇది ఈ రోజు హిందూ సమాజానికి ఎదురవుతున్న సవాళ్లు. ఈ సవాలును స్వీకరించి ఆ ఎత్తుగడలను వమ్ము చేయగలుగుతామా?

యుపిఎ ప్రభుత్వం 2009లో రెండవసారి అధికారంలోకి వచ్చిన తరువాత నుండి హిందూ సమాజంలోని పెద్దలు, స్వామీజీల సంస్థలను నైతికంగా (తాత్కాలికంగానైనా) దిగజార్చాలనే ప్రయత్నాలు వేగవంతమయ్యాయి. ఇది గమనించదగ్గ పరిణామం.

దేశంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. దూషణల పర్వం ఎప్పుడో ప్రారంభమయింది. ఇక కావలసింది ప్రజలను గందరగోళంలో పడేయటం. దానిద్వారా తిరిగి అధికారం కాపాడుకోగలుగుతామా అన్నది ఇప్పటి కాంగ్రెస్ వ్యూహం. దీనిని జాగ్రత్తగా గమనించి మరిన్ని దాడులు జరగకుండా హిందూసమాజం అప్రమత్తం కావాలి. మీడియా ఎత్తుగడలను కూడా గమనించాలి. అప్పడు మనం మన సమాజాన్ని కాపాడుకోగలుగుతాం.

9 సంవత్సరాల కంచి కథకు ఇప్పుడు ముగింపు లభించింది. భవిష్యత్తులో మరిన్ని కథలు నిర్మాణం కాకుండా చూసుకోవటం ఇప్పుడు హిందూ సమాజం ముందున్న కర్తవ్యం.
- రాము
http://www.lokahitham.net/

10, డిసెంబర్ 2013, మంగళవారం

అప్పులన్నీ తీరిన తరువాత పరిస్థితులన్నీ చక్కబడిన తరువాత, దేవునిగూర్చి తలంచుకొనవచ్చును.

ఒకానొక పట్టణము నందు మధ్యతరగతికి చెందిన ఒక కుటుంబము కలదు. అందు ఇంటి
యజమానికి ఒక చిన్న ఉద్యోగము. భార్య సదాచారవతి. ఆ యిల్లాలు ప్రతిదినము
ఉషఃకాలముననే నిద్రలేచి స్నానాదులను నిర్వర్తించుకొని దైవధ్యానము
చేసికొనుచుండును. ఒక జపమాలను తీసుకుని భక్తితో రామనామమును
నూటెనిమిదిసార్లు జపించుచుండును. తదుపరి ఒక అధ్యాయమును గీతాపారాయణము
చేయుచుండెను. పూర్వ్జజన్మార్జిత సుకృతవశమున ఆమెకు పుట్టుకతోనే చక్కని
దైవసంస్కార మేర్పడెను. ప్రార్థన చేయక ఒక్కనాడైనను గంగపుచ్చు కొనదు.
అసారమగు ఈ సంసారమున సర్వేశరుడొక్కడే సారమను పూర్ణవిశ్వాసము అమె
కలిగియుండుట వలన గృహకృత్యములను యథావిధి జరుపుకొనుచుండినను మనస్సు మాత్రము
భగవంతుని పాదపద్మములందే సంలగ్నమై యుండును.

ఇక ఆ పై భర్త గారి సంస్కారము వేరుగ నుండెను. భగవంతుని అస్తిత్వమును అతడు
కాదనడుకాని 'ఇపుడే ఏమితొందర, నిదానముగా తరువాత ఎపుడైన దైవచింతన
చేసికొనవచ్చును' అను ధోరణిని అతడు ప్రదర్శించుచుండును. ఈ పద్దతి భార్యకు
నచ్చలేదు. ఒకనాడామె భర్త తీరికగ ఉన్న సమయము చూచి అతనితో నిట్లనెను -
"ఏమండీ! ఒక్కసారైనను రామనామము ఉచ్చరించక, భగవంతుని సేవింపక జీవితమును
గడుపుచున్నారే! ఇది ఎంత ప్రమాదము! ఏ సమయమున ఏమి ఆపద సంభవించునో
ఎవరికెరుక! ఈ జీవిత సమయమున ఏమి ఆపద సంభవించునో ఎవరికెరుక! ఈ జీవితములు
ఏమి శాశ్వతము! ఏ క్షణము ఈ ప్రాణవాయువు దేహమును విడిచిపోవునో ఎవరును
చెప్పలేరు. బ్రతికిన నాలుగురోజులు కృష్ణా, రామా యని భగవన్నామము
ఉచ్చరించుచు పుణ్యము కట్టుకొనిన మాత్రమే ఈ జీవితము సార్థక మగునుగాని,
వ్యర్థముగ ప్రాపంచిక కార్యములందే గడిపివైచినచో మహా ప్రమాదము సంభవింపగలదు.
కాబట్టి ప్రతిరోజు కనీసము ఒక్కసారైన భగవంతుని గూర్చి చింతింపుడు.
రామనామమును ఉచ్చరింపుడు. రవ్వంత పుణ్యమైనా ప్రతిదినము సంపాదింపుడు. ఇదిగో
జపమాల తీసికొని భక్తితో జపము ప్రారంభించుడు!

సహధర్మచారిణి యొక్క భావగర్భితములగు ఆ వాక్యములను విని భర్త ఇట్లనెను.
"ఓసీ! నీవు చెప్పినదంతయు సత్యమే. దేవుని గూర్చి తలంచుట మన ధర్మమని నేను
ఒప్పుకొనుచున్నాను. అధి చేయ వలసిన కార్యమే. కాని ఇప్పుడెమి తొందర?
ఇప్పుడు నేను ఉద్యోగము చేయుచున్నాను. అది పూర్తి అయిన పిదప,
'రిటైర్‌మెంట్‌' వచ్చిన తరువాత, పిల్లలు పెండిండ్లు అయిన పిదప,
అప్పులన్నీ తీరిన తరువాత పరిస్థితులన్నీ చక్కబడిన తరువాత, దేవునిగూర్చి
తలంచుకొనవచ్చును. అప్పుడిక ఏ గొడవలు ఉండవు" కాబట్టి శాంతముగా, నిశ్చలముగా
ధ్యానము చేసికొనవచ్చును.

భర్తయొక్క ఆ వాక్యములను వినగానే గృహిణికి గొప్ప హృదయా వేదన కలిగి భర్తకు
తన మనోనిశ్చయమును గూర్చి నచ్చజెప్పుటకై ఎంతయో ప్రయత్నించెను. కాని ఫలితము
లేకపోయెను. భర్త ఈషణ్మాత్రమైనను తన హృదయమును మార్చుకొనలేదు. పాత
పద్దతిలోనే తన కార్యక్రమమును నిర్వహించుకొనుచు పోవుచుండెను. భర్త యొక్క
మనస్సును దైవమార్గమున ఎట్లు మరలించవలెనో ఆమెకు తోచకుండెను.

ఇట్లుండ కొంతకాలమునకు విధివశాత్తు భర్తయొక్క ఆరోగ్యము లోపించెను. అతడు
తీవ్రమగు జ్వరముతో బాధపడుచుండెను. డాక్టరుగారు వచ్చి రోగిని పరిశీలించి
ఒక సీసాలో మందు పోసియిచ్చి ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ఒక్కొక్క
జౌంసు చొప్పున ఇచ్చుచుండుమని భార్యకు చెప్పి, ఆ విషయమును భర్తకు కూడ
తెలియజేసి వెడలి పోయెను. వైద్యుడు గృహమును వీడిన తదుపరి భార్య ఆ మందును
దాచివైచి ఊరకుండెను. భర్తకు ఇవ్వలేదు. ఒకపూట గడచిపోయెను. రెండుపూటలు
గడచిపోయెను. కాని భర్తకు ఏమాత్రము మందు ఒసంగలేదు. ఈ విషయము తెలిసికొని
భర్త వెంటనే భార్యను పిలిపించి "డాక్టరుగారు మందు ఇచ్చినది త్రాగుటకా,
దాచి పెట్టుకొనుటకా?" అని ప్రశ్నింప వెంటనే ఆ గృహిణి సమయోచితముగ
నిట్లుపలికెను.

'మందు విషయమై ఇపుడు ఎమితొందర? నిదానముగా ఇంకొక వారందినములైన పిదప
త్రాగవచ్చును.' ఆ వాక్యములను విని భర్త "నీకు మతి పోయినట్లుగా ఉన్నదే!
రోగము వచ్చినపుడుగదా మందు త్రాగవలె" అని పలుక అంతట ఆ యిల్లాలు భర్తకు ఈ
ప్రకారముగ చక్కతిబోధ సలిపెను -

"మహాశయా! ఇపుడు మీరు దారికి వచ్చినారు. రోగము వచ్చి నపుడు కదా మందు
త్రాగవలె అను మీ వాక్యము చాలా హేతుకమైనది. అయితే పుట్టిన ప్రతిప్రాణి
భవరోగముచే బాధపడుచుండగా ఆ రోగమును బాపుకొనుటకు భగవన్నామామృతమును ఔషధమును
వెంటనే ఏల త్రాగరాదు? ఆలస్యమేల చేయ్యవలెను? శరీరము క్షణికము కదా! రేపునకు
రూపు లేదుకదా! అట్టిచో వార్థక్యము వరకు ఆ భగవచ్చింతనమును పవిత్రకార్యమును
వాయిదావేయుట పాడియా! కాబట్టి సంసార రోగము, పుట్టుక చావు అనురోగము
తగుల్కొనిన ఈ క్షణమందే ఆ రోగమును తొలగించుటకు రామనామమును, కృష్ణనామమును,
భగవన్నామమును స్మరించవలెను. దైవచింతన, భగవద్ధ్యానము చేయవలెను.
వార్ధక్యము, మృత్యువు కాచుకొనియున్నవి. రోగములు జీవుని ఆక్రమించుటకు
సిద్ధము గానున్నవి. ఇట్టి పరిస్థితి యందు మీనమేషములు లెక్క పెట్టుచు
భవరోగ చికిత్సయగు దైవద్ధ్యానామృతమును గ్రోలక ఆలసించుట పాడికాదు. అలసత్వము
ప్రమాదహేతువు. కాబట్టి ఇపుడే రామనామమును ఉచ్చరింపుడు,జపించుడు!"

పత్నియొక్క ఈ చక్కటి బోధను ఆలకించి భర్త వెంటనే రామనామమును భక్తితో
జపించసాగెను. వెనువెంటనే భార్య భర్తకు ఔషధమును ఒసంగ అతనిరోగము
ఉపశమించెను. ఈ ప్రకారముగ శారీరక, మానసికములను రెండు రోగములున్ను
తొలిగిపోయి అతడు పరమ శాంతిని బడసెను.

నీతి: సంసారరోగము తగుల్కొని పుట్టుచు, చచ్చుచు నానా బాధలను పొందుచున్న
జీవుడు ఆరోగము తొలగుటకు అవసరమైన ఆత్మజ్ఞానమును ఔషధమును సేవించి శాంతిని
బడయవలెను. ఆలస్యము చేయరాదు.

by  k.radhakrishna

28, నవంబర్ 2013, గురువారం

నువ్వు హిందువువా ? హిందువు ఎలా అయ్యావు? ఏం చేస్తున్నావు !ఒక హిందువుని నువ్వు ఎలా హిందువువు అయ్యావు.  అసలు హిందూ అంటే ఏమిటి అని ప్రశ్నిస్తే, అతడు స్పష్టమైన కారణాన్ని ధైర్యంగా చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడింది.  ఈ వైఫల్యమే గందరగోళానికి, అయోమయానికి దారి తీసింది. 

ఏదో ........ మనం హిందువులం, ఓ గురువు దగ్గర మంత్రం తీసేసుకున్నాం.  రోజూ గంటో, అరగంటో పూజ చేసుకుంటాం, అవకాశం కుదిరితే సాయంత్రం కొంత సేపు దీపం పెట్టుకుని, పారాయణ చేసుకుంటాం, ఖాళీ సమయం దొరికితే ఉపన్యాసాలు వింటాం, టీవీలో ప్రవచనాలు చూస్తాం, పండుగలోస్తే పిండివంటలు చేసుకుని తింటాం, అప్పుడప్పుడు తిరుపతి వెళతాం ............ కాశీ కెళతామ్  .......  దగ్గరున్న దేవాలయాలను దర్శించుకుంటాం, ఇది చాలదా? - అని అనుకునే వాళ్ళు కూడా లేకపోలేదు.  ఇవన్నీ ధర్మంలో భాగమే అయినప్పటికీ, ఇదే ధర్మం అని అనుకోవడం వల్లనే అఖండమైన ధర్మానికి పరిధి ఏర్పడింది.  
ధర్మం అంటే కేవలం పూజలు, పునస్కారాలేనా?
మంత్రాలు, హొమాలేనా?
గుళ్ళూ, గోపురాలేనా?
పండుగలు, తీర్థయాత్రలేనా?
అసలు ఇవన్నీ ఏమిటి?  ఈ ధర్మంలో ఇంకా తెలుసుకోదగ్గ అంశాలున్నాయా? లేవా? 
అసలు హిందుత్వం ధర్మమా? మతమా? మతానికీ, ధర్మానికీ తేడా ఏమిటి?
ధర్మమే అయితే దీనిలోని గొప్పదనమేమిటి? 
ఇదెప్పుడు పుట్టింది?
ఎవరు దీనికి కారకులు?
వీటన్నింటినీ తెలుసుకోవడం ప్రతి హిందువు కనీస ధర్మం, తప్పనిసరి కర్తవ్యం.  
ఓ వస్తువును కొంటే దాని పుట్టుపూర్వోత్తరాలన్నీ అడిగి తెలుసుకొంటాం.  ఓ స్థలం కొనుగోలు చేయాలంటే దానిపై ఆరా తీసి, దస్తావేజులన్నీ సరిగా ఉన్నదీ లేనిదీ న్యాయనిపుణులతో సంప్రదించి, అనేక కోణాలలో పరిశీలన చేస్తాం.  అలాంటిది, మనం ఏ ధర్మంలో పుట్టి జీవిస్తున్నామో, అట్టి ధర్మం గురించి గానీ, దాని పూర్వాపరాల గురించి గానీ ఎవరికైనా జిజ్ఞాస కలిగిందా?  నమ్మకం ముసుగులో ఎవరో ఏదో చెబితే దానిని ఆచరిస్తూ పోవడమేనా?

వెలుగునివ్వడం ఒక్కతే దీపం పరమార్థం కాదు.  మరిన్ని దీపాలను వెలిగించడం కూడా. అలాగే, ధర్మాన్ని తనవరకే పరిమితం  చేసుకుని,ఎవరు ఎలా పోయినా నేను మాత్రం ధార్మికంగా ఉన్నానా! లేనా? అని సరిపెట్టుకుంటే సబబేనా.  ఈ ధోరణి వల్లనే ధార్మికులు క్షీణిస్తున్నారు.  ధర్మం పట్ల కనీస అవగాహన కూడా అంతరించి పోతోంది. 

మనం ఏ దేవుణ్ణి కొలుస్తున్నా, ఏ గురువును ఆశ్రయించి ఉన్నా, ముందుగా మనకు ధర్మం పట్ల అవగాహన కుదిరితే అటుపిమ్మట భావి తరాలకు ఈ అవగాహనను అందించే ప్రయత్నం చెయ్యగలం.  ఇతరులు అడిగే ప్రశ్నలకు  చెప్పగలం.  వీటన్నింటినీ మించి మనం  ఆచరిస్తున్న ధర్మం పట్ల మనక్కూడా అవగాహన కలిగిన నాడే మనకు ఆత్మ స్థైర్యం కలుగుతుంది.  ఈ ధర్మం పట్ల నిష్ఠ కుదురుతుంది.  ఆసక్తీ పెరుగుతుంది. 

గోబెల్స్ ప్రచార ఎత్తుగడలూ, మార్కెటింగ్ తంత్రాలు, డబ్బు బలంతో సత్యం, ధర్మం, మానవత్వాల మీద దురాక్రమణ సాగిస్తుంటే,  నిలువరించే శక్తి ఈ ప్రపంచంలో దేనికీ లేకుండా పోయింది.  టీవీ, ఇంటర్నెట్, కిరాయి ప్రచారకుల సైన్యాల దాడితో వాటిల్లుతున్న ఉప్పెన లాంటి నష్టాన్ని చూస్తే ధర్మానికి గొడ్డలిపెట్టు కానుందని తెలుస్తోంది. 
 
 
ప్రపంచంలోని ఇతర దేశాలు కళ్ళు తెరవక ముందే భారతదేశం సుసంపన్నమై ఉంది.  అందుకు మూలకారణం భగవంతుడు ఈ భూమి పైనే అవతరించి, విశ్వానికి కావలసిన దివ్య సందేశాన్నందించి, మార్గదర్శనం చేయడం.  అలా భగవద్దత్తమయినదే ఈ ధర్మం.
కోట్ల సంవత్సరాలకు పూర్వమే ధర్మం ఇక్కడ పరివ్యాప్తమై ఉంది.  ఇది ఏనాడు పుట్టిందో ఎవ్వరం తెలుపలేం.  అందుకే, దీనిని సనాతన ధర్మమని అన్నారు.  ఇదే ఆర్య ధర్మమని, ఆర్ష ధర్మమని, వేద ధర్మమని అనేక పేర్లతో వ్యవహారంలో నిలచింది.  ఋషుల కాలంలోనే దీనికి హిందూ ధర్మమనే పేరు నిర్ణయమయింది. 
ఇటీవలి కాలంలో పుట్టిన మతాలు ప్రపంచమంతటినీ తమ పరం చేసుకోవాలనే దురాలోచనతో, పవిత్రము, సనాతనము అయిన మన హిందూ ధర్మం మీద బురద చల్ల జూస్తున్నాయి.  మహర్షులు, శంకర, వివేకానందుల వారసులమైన మనం విధర్మీయుల కుయుక్తులను అర్థం చేసుకోవాలి.  వారు మన హిందూ శబ్దం మీద ఎన్నో, ఎన్నెన్నో అపవాదులు అల్లుతున్నారు. 
హిందూ అనే పేరు పరాయి వాళ్ళు పెట్టిందని కొందరు, సింధు శబ్దాన్ని పలకడం చేతకాని పరదేశీయులు 'హిందూ' అని పలకడంతో, అదే మనకు స్థిరపడిపొయిందని మరి కొందరు ప్రచారం చేస్తున్నారు. 
ఇలా ఒకటా .....  రెండా!  చాపకింద నీరులా తప్పుడు ప్రచారాలు ముమ్మరంగా సాగిపోతున్నాయి.
ఈ తప్పుడు ప్రచారాలను విజ్ఞులు కూడా తిప్పికొట్టలేక సతమతముతున్నారు.  మరో పక్క నుండి మన సనాతన సంస్కృతినీ, అది బోధించే ఆచారాలనూ హేళన చేస్తున్నారు.  పదే పదే నోటికొచ్చినట్లు విమర్శిస్తూ, నిజాన్ని అబద్ధంగా, అవాస్తవాలను వాస్తవాలుగా ప్రచారం చేస్తున్నారు.  మన చరిత్రలను వక్రీకరించి, మన చారిత్రిక అంశాలపై మనకే అనుమానాలను రేకెత్తిస్తున్నారు.
ఇలా ఎందుకు చేస్తున్నారో తెలుసా ....... ?
మన మీద మనకే అనుమానాలు పుట్టాలని! హిందువుకు తన చరిత్ర మీద తనకే అసహ్యం కలగాలని! హిందువు అనుకునేందుకు ప్రతి హిందువు సిగ్గుతో తలదించుకోవాలని!
ఇలా జరిగిననాడు ఈ దేశం నుంచి హిందూ ధర్మాన్ని సమూలంగా పీకి పారేయవచ్చుననే దురాలోచనతో కుట్ర పన్నుతున్నారు. 
వంద రాళ్ళు విసిరితే, ఏదో ఒకటైనా లక్ష్యానికి తగిలి, అది రాలి పడుతుందనే వ్యూహంతో, హిందూ వ్యతిరేకులు ముందుకు సాగిపోతున్నారు.  పదే.. పదే.. ఈ హిందూ ధర్మం పై దుమ్మెత్తి పోస్తూ, విమర్శిస్తూంటే ఏదో ఓ రోజు హిందూ ధర్మాన్ని సమూలంగా నాశనం చేయవచ్చుననే ఆశతో ముప్పేట దాడులను ప్రారంభించేశారు. 
ఈ దాడిలో హిందూ సమాజం ఇప్పటికే చాలా దెబ్బతిని తీవ్రంగా నష్ట పోయింది.  దీనిని ఇలాగే కొనసాగిస్తామా! లేక, వాటిని తిప్పి కొట్టి మన ధర్మాన్ని నిలబెట్టుకుంటామా? ఇదే పెద్ద ప్రశ్న!
అసలింతకీ మనపై ఇన్ని దాడులు జరగడానికి మూలకారణం తెలుసా ......? హిందుత్వం అంటే తెలుసా......?  నువ్వెలా హిందువయ్యావు ....? 'హిందూ' శబ్దానికి అర్థమేమిటి?  హిందూ ఆచారాల అంతరార్థమేమిటి? - అని ప్రశ్నిస్తే, సూటిగా సమాధానం చెప్పలేక పోవడం.
ఏదో ....... పెద్దలు చెప్పారు, మేం పాటిస్తున్నాం అనడమే వినబడుతోంది.  పరమ పావనమైన హిందూ ధర్మంలో పుట్టి, దీనిని ఆచరిస్తున్న వారిలో చాలా మందికి దీనిపట్ల ప్రాథమిక అవగాహన లేకుండా ఏదో హిందువుగా బతికేస్తున్న వారి సంఖ్యే చా......లా ఎక్కువ.  అందుకే, ఈ ధర్మానికి తూట్లు పొడవడానికి సిద్ధంగా ప్రణాళికలు రూపుదిద్దుకున్నాయి.......  దీనికి పరిష్కారం ఏమిటి?


23, నవంబర్ 2013, శనివారం

సరియైన గురువును గుర్తించడం ఎలా?

సరియైన గురువును గుర్తించడం ఎలా?
ఉత్తమ,  మధ్యమ, తృతీయులుగా గురువులు 3 రకాలు.  అందుకే"సగురుమేవాభిగచ్ఛేత్ శ్రోత్రియం బ్రహ్మనిష్ఠం"  అని కఠోపనిషత్తు అంటుంది.  ఉత్తమ గురువనగా శ్రోత్రీయ బ్రహ్మనిష్ఠుడు.  అట్టి ఉత్తమ గురువును ఆశ్రయించుటచే సాధకుడు సంప్రదాయబద్ధంగా జ్ఞానాన్ని పొంది తరించగలడు.    

ఉత్తమ గురువు లక్షణాలేవి?
"ఛందోఅధీతేసశ్రోత్రియః" సంప్రదాయబద్ధంగా బాల్యంలోనే ఉపనయన సంస్కారం పొంది గురుకులవాసం చేస్తూ వేదాధ్యయనం ద్వారా  కర్మ, ఉపాసనలను యధావిధిగా ఆచరించేవాడే శ్రోత్రియుడు.  
ఇతడే శ్రవణ, మనన, నిధిధ్యాసనల ద్వారా వేదాంత తత్త్వార్ధాన్ని గ్రహించి దాని యందే స్థిరమైన నిష్ఠను కలిగి ఉంటాడు.  "బ్రహ్మణి నిష్ఠా యస్య స బ్రహ్మనిష్ఠః" ఇతడే బ్రహ్మనిష్ఠుడు అనబడతాడు.  ఇతను పరమాత్మ తత్వ చింతనలో స్థిరమైన నిష్ఠను పొంది తనను ఆశ్రయించిన శిష్యులకు సంప్రదాయబద్ధంగా జ్ఞానాన్ని అందజేస్తాడు.  అందుకే ఇతనిని శ్రోత్రీయ బ్రహ్మనిష్ఠుడని, ఉత్తమ గురువని శాస్త్రాలు సూచిస్తున్నాయి.  

మధ్యమ గురువు లక్షణాలేవి?
ఇతను శ్రోత్రీయుడే కాని అధ్యాపకుని వంటివాడు.  ఇతడు గురుకుల వాసం చేసి వేదవేదాంగాలను అధ్యయనం చేసినప్పటికీ బ్రహ్మనిష్ఠుడు కాకపొవుటచే తను నేర్చిన విద్య కేవలం ఇతరులకు బోధించుటకే పరిమితమౌతుంది. 

తృతీయ గురువు లక్షణాలేవి?
ఇతను కేవలం బ్రహ్మనిష్ఠుడు మాత్రమే.  ప్రారబ్దవశం చేత, జన్మాంతర సంస్కారం తోడై, తత్త్వమస్యాది మహా వాక్యార్థాన్ని తత్త్వ విచారణతో గ్రహించి బ్రహ్మచింతనలోనే జీవితాన్ని అంకితం చేసుకొన్న సాధకుడు.  ఇతను సంప్రదాయంగా శాస్త్రాధ్యయనం చేయని కారణం చే ఇతరులకు బోధించుటకు అవకాశముండదు.  కనుక ఇతను కేవలం బ్రహ్మనిష్ఠుడగుటచే స్వస్వరూప ఆత్మజ్ఞానంతో తన ఉద్ధరణకే పరిమిత మగుచున్నాడు. 

అధమాధమ గురువులు   
వీరికి శ్రోత్రియత్వము, బ్రహ్మనిష్ఠ, ఆచరణ, అనుష్ఠానములు ఏవీ వుండవు.  రాగద్వేషాలు, కామక్రోధాలు, కోరికలు, భోగలాలసత్వము, కీర్తికాంక్ష, ధన వ్యామోహం మొదలగు భావనలతో సతమతమవుతుంటారు.  వీరు చెప్పుకోవడానికే గురువు కానీ, అందరికీ బరువే.  చివరకు వారికి వారే బరువనిపిస్తారు.  వీరినే మిథ్యాచారు లంటుంది శాస్త్రం. 

సద్గురువును ఆశ్రయించిన శిష్యుని ప్రవర్తన ఎలా ఉండాలి? 
శిష్యులనగా శిక్షకు, తత్త్వొపదేశము పొందుటకు యోగ్యులైనవారని అర్థం.  అయితే కొందరు లౌకిక ప్రయోజనాలకై తమ కోరికలను నెరవేర్చుకొనేందుకు ప్రాథాన్యతనిచ్చి ఆధ్యాత్మికమార్గాన్ని ఆశ్రయిస్తారు.  వీరు ఎప్పటికీ శిష్యులనబడరు.  శిష్యుడైనవాడు కేవలం ఆత్మజ్ఞాన ప్రాప్తికై పరిశుద్ధమైన భావనతో గురువు నిర్దేశించిన మార్గాన్ని అనుసరిస్తాడు.  ఇలా గురువుపై శిష్యునికి, శిష్యునిపై గురువుకి గల సత్య సంబంధమే గురుశిష్య సంబంధము.

గురువు నాశ్రయించిన భక్తునికి మోక్షం సంప్రాప్తిస్తుందా?
గురువుని ఆశ్రయించిన వాడిని శిష్యుడంటామే కాని, భక్తుడని సంబోధించము.   సంపూర్ణమైన శ్రద్ధ, భక్తితో గురువును ఆశ్రయించేవాడే శిష్యుడు.  అయితే అతని లక్ష్యం ఆథ్యాత్మిక సాధనా? లేక భౌతిక వాంచలను పొందడం కోసమా? అని తనలో తాను ప్రశ్నించుకోవాలి.
ప్రప్రథమంగా కోరికలను పొందాలనే భావనతో గురువును ఆశ్రయించినా క్రమేపీ సంస్కారం చేత గురువు యొక్క సన్నిధిలో మనసు ఆథ్యాత్మిక సాధన వైపు మరలుతుంది.  అట్టి వ్యక్తి క్రమంగా ఆథ్యాత్మిక మార్గం లోని విశిష్టతను, మాధుర్యాన్ని తప్పక గ్రహిస్తాడు.  తద్వారా మోక్షమార్గంలో పయనించే పరిణతి కలిగి, భౌతిక  వాంచలు క్రమేపీ సన్నగిల్లుతాయి.  గురువు అనుగ్రహంతో మోక్షాన్ని పొందుతాడు. 

కొందరు గురువులు భక్తులను ఎంచుకుని మోక్షాన్ని ఇప్పిస్తారని అంటారు నిజమేనా? 
ఎవరో ఇచ్చేది, ఎక్కడికో వెళ్లి తెచ్చుకొనేదీ మోక్షమనబడదు.  పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవడమే మోక్షం.  ఎక్కడికో వెళ్ళడం మొక్షమైతే అక్కడి నుండి ఇంకాస్త మంచి చోటుకు వెళ్తే బాగుంటుందని ఆశలు పుడతాయి. పరమాత్మ ఏదో ఒక లోకంలో ఉన్నాడని, మనం మూటా ముల్లె సర్దుకుని అక్కడకి వెళ్ళాలని అందుకోసం ఒక గురువు టూరిస్ట్ ఏజంటు లా కొందర్నే ఎంచుకుని తీసుకెడతాడనే భావాలను మన శాస్త్రాలు అంగీకరించవు.  మోక్షానికి కారణమైన జ్ఞానాన్ని గురువు బోధించగలడే కానీ, మోక్షాన్నివ్వడం ఎవరితరమూ కాదు.  

  © బ్లాగర్ టెంప్లేట్ "ప్సై" రూపొందించినవారు Ourblogtemplates.com 2008

ఈ పుట పైభాగానికి వెళ్ళడం కోసం ఇక్కడ నొక్కండి