శ్రీ గురుభ్యోన్నమః
అందరికీ నమస్కారములు
ఇతః పూర్వము మనము గురువు, ఆచార్యుడు అన్న విషయం పై చర్చ జరిపి ఉన్నాం.
అలానే శిష్యునికు ఉండవలసిన ముఖ్య లక్షణములను గురించి తెలుసుకునే ప్రయత్నం
ఇది.
శాస్త్రంలో శిష్యునకు ఉండవలసిన లక్షణములు ఈ క్రింది విధంగా చెప్పబడింది.
ఈ క్రింది ఐదు లక్షణములు శిష్యునకు ఉండవలసినవి.
1) అనన్యసాధ్యత్వము
2) ఆర్తి
3) అధ్యవసాయము
4) ఆదరము
5) అనసూయ
1) అనన్యసాధ్యత్వము : సాధ్యాసాధ్యాలయందు ఆసక్తి లేకుండా తాను ఆశ్రయించిన
గురువు/ఆచార్యుని ద్వారా ఏది పొందవలెనో దానిమీదనే దృష్టి పెట్టి ఉండే
లక్షణము:
2) ఆర్తి : ఎట్టి పరిస్థితులలోనూ తాను పొందవలసిన దానికి దూరముగా జరుగక,
వ్యతిరిక్త పరిస్థితులలో కూడా తాను పొందవలసిన దానిపైననే ధ్యాస తప్ప ఇంకొక
మార్గముపై ధ్యాసలేకుండుట.
3) అధ్యవసాయము : తాను ఏది పొందవలెనని ఆచార్యుని ఆశ్రయించాడో అదియే తాను
తప్పక పొందవలెనన్న గట్టిపూనిక కలిగి ఆ పూనికను రోజు రోజుకూ గట్టి
పరచుకునేలక్షణము కలిగు ఉండుట.
4) ఆదరము : తాను తెలుసుకోవలసిన విద్య లేదా పొందవలసిన దానిని గూర్చిన విషయ
పరిజ్ఙానము సంపాదించుకొనే పథంలో ఆ విషయములను ఎవరు చెప్పిననూ చెప్పినవాడు
తక్కువ వాడా లేక ఎక్కువ వాడా అన్నది ఆలోచించక ఆదరముతో వినుట. వినయముతో
ఉండుట.
5) అనసూయ : తాను తెలుసుకోవలసినది తెలుసుకోలేకపోయినను, పొందవలసినది
పొందలేకపోయినను, తానది పొందలేకపోయాను కాబట్టి దానియందు దోషములనెంచక దాని
గుణములను కీర్తించుట. ఇతరులు పొందిన గుణములను చూసి సంతోషించి
ప్రోత్సహించుట.
ఈ పై ఐదు లక్షణములు కలవారు ఆచార్యుని పొందటానికి సంపూర్ణ అర్హులు,
యోగ్యులు.
సర్వం శ్రీ ఉమా మహేశ్వరపరబ్రహ్మార్పణమస్తు
26, ఆగస్టు 2011, శుక్రవారం
శిష్యునకు ఉండవలసిన లక్షణములు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి