16, ఆగస్టు 2012, గురువారం

దాడుల రూమర్స్: ఈశాన్యవాసులకు ఆర్ఎస్ఎస్ అండ

దాడుల రూమర్స్: ఈశాన్యవాసులకు ఆర్ఎస్ఎస్ అండ

బెంగళూరు: అస్సాం అల్లర్ల నేపథ్యంలో ఈశాన్య రాష్ట్ర వాసులపై పెద్ద ఎత్తున దాడులు జరగబోతున్నాయనే ప్రచారం నేపథ్యంలో వేలాది మంది ఆ రాష్ట్రాల వారు బెంగళూరు, పరిసర ప్రాంతాల నుండి తరలి పోతున్న విషయం తెలిసిందే. కర్నాటక ముఖ్యమంత్రి జగదీష్ షెట్టార్, కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే, రాష్ట్ర హోంమంత్రి, డిజిపి తదితరులు రక్షణ కల్పిస్తామని విజ్ఞప్తులు చేస్తున్నారు. వారితో పాటు మీకు అండగా ఉంటామని, దాడులు జరగకుండా చూస్తామని ఆర్ఎస్ఎస్(రాష్ట్రీయ స్వయంసేవ సంఘ్) కూడా రంగంలోకి దిగింది.
సుమారు 250 మందికి పైగా స్వయం సేవకులు(ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు) బెంగళూరు రైల్వే స్టేషన్‌లలో తరలి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న ఈశాన్య రాష్ట్ర వాసులకు రక్షణపై హామీ ఇస్తున్నారు. దాడుల ప్రచారాన్ని ఆర్ఎస్ఎస్, విహెచ్‌పి, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కొట్టి పారేస్తున్నాయి. ఆర్ఎస్ఎస్ కర్నాటక ప్రాంత శారీరక్ ప్రముఖ్ చంద్రశేఖర్ జాగీదర్, నగర జాయింట్ సెక్రటరీ కరుణాకర్ రాయ్‌ల ఆధ్వర్యంలో స్వయం సేవకులు బెంగళూరులోని మెజిస్టెక్ రైల్వే స్టేషన్‌లో ఈశాన్య రాష్ట్రవాసులతో మాట్లాడుతూ రక్షణపై హామీ ఇస్తున్నారు.
కాగా అస్సాం అల్లర్ల ప్రభావం బెంగళూరులో ఉన్న ఈశాన్య రాష్ట్ర వాసులపై పడింది. అక్కడి అల్లర్ల కారణంతో బెంగళూరు ప్రాంతంలోని ఈశాన్య రాష్ట్రాల వారిపై పెద్ద ఎత్తున దాడులు జరగబోతున్నాయన్న ప్రచారం వారిలో భయాందోళన కలిగించింది. దీంతో వారు పెట్టే బేడా సర్దుకొని బెంగళూరు నుండి తరలి పోతున్నారు. కర్నాటక ముఖ్యమంత్రి జగదీష్ షెట్టార్, కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే, పోలీసులు వారికి నచ్చజెప్పే ప్రకటనలు చేసినప్పటికీ వారు మాత్రం వెళ్లేందుకే సిద్ధపడ్డారు.
సుమారు ఐదు వేల మంది ఈశాన్య రాష్ట్రాల వాళ్లు బెంగళూరు, ఆ పరిసరాల నుండి తరలి వెళ్లారు/వెళుతున్నారు. ఇలా వెళుతున్న వారిలో విద్యార్థులు, ఐటి ఉద్యోగులు, ఇతర వృత్తుల వారు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. దాదాపు మూడు నుండి నాలుగు వేల మంది ఇప్పటికే బుధవారమే వెళ్లారని భావిస్తున్నారు. దాడులు చేస్తామని బాధితులకు పెద్ద ఎత్తున ఎస్సెమ్మెస్‌లు రావడంతో వారు వెళ్లి పోవడం ప్రారంభించారు.
ఇవన్నీ వదంతులేనని భయపడాల్సిన పని లేదని కర్నాటక హోమంత్రి, డిజిపి ప్రకటించారు. ఈ విషయమై ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ముఖ్యమంత్రి షెట్టార్, కేంద్రహోంమంత్రి షిండేతో మాట్లాడారు. వారికి రక్షణపై హామీ ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. ఈశాన్య రాష్ట్రాల వారు వెళుతుండటంతో రైల్వే స్టేషన్‌లు, రైళ్లు కిటకిటలాడుతున్నాయి. అందుబాటులో ఉన్న రైళ్లలో వెళుతున్నారు. ఈ విషయమై షెట్టార్ పిటిఐతో మాట్లాడుతూ... ప్రధాని, హోంమంత్రి ఈశాన్య రాష్ట్రవాసులు ఎలాంటి భయాందోళనకు గురి కావొద్దని చెప్పారన్నారు


ఈనాడులో తాజా వార్త - బెంగుళూరు నుంచి తరలిపోతున్న ఈశాన్య రాష్ట్రాల వాసులు
http://eenadu.net/Homeinner.aspx?item=break36

1 కామెంట్‌:

చెప్పారు...

హౌరా వెళ్ళే ట్రైన్ కాని, గౌగతి వెళ్ళే ట్రైన్ ఎప్పుడయిన చూసారా? బోగికి 72 మందికి వంద కన్నా ఎక్కువ ఉంటారు. మామూలు ట్రైన్ ముడు వేల మందిని తీసుకు వెళితే ఆ ట్రైన్లు 5000+ తీసుకు పోతాయి.

తెలుగులో టైప్ చేయండి

కైఫీయతులు

  © బ్లాగర్ టెంప్లేట్ "ప్సై" రూపొందించినవారు Ourblogtemplates.com 2008

ఈ పుట పైభాగానికి వెళ్ళడం కోసం ఇక్కడ నొక్కండి