4, సెప్టెంబర్ 2012, మంగళవారం

రామనామం కంటేనూ....

జై శ్రీరాం, 
శ్రీరామదూతం శిరసా నమామి! 


నిన్నటి రోజు (24-08-2012) న తట్టిన ఒక లొల్లాయి పాట, స్వామి అనుగ్రహంగా రాస్తున్నాను. తప్పులేవైనా ఉంటే పెద్దలు సరిదిద్దగలరు. 

రుచి ఏదీ లోకాన రామనామం కంటేనూ! 
శుచి ఏదీ లోకాన రామనామం కంటేనూ 
బతుకేదీ లోకాన రామనామం లేకుంటే!! 
 శిశువైనా పశువైనా తలవూచే రామనామం! 
పక్షైనా పామైనా తలమోసే రామనామం!! 
 తల్లెవరు తండ్రెవరు రామనామం కంటేనూ! 
నీ వారెవరీ లోకాన రామనామం కంటేనూ!! 
 రక్కసులూ దిక్కనుచూ కొలిచేటి రామనామం! 
సురగురులూ మొక్కుచునూ పిలిచేటి రామనామం!! 
 నీతేదీ రీతేదీ రామనామం కంటేనూ! 
పాతేదీ కొత్తేదీ రామనామం కంటేనూ!! 
నియమముతో కొలిచామా నీడనిచ్చే రామనామం! 
నీడనిచ్చీ మోక్షమిచ్చే సోపానం రామనామం!! 
 చదువేదీ, విలువేదీ లోకాన రామనామం కంటేనూ! 
విద్యేదీ , వృత్తేదీ లోకాన రామనామం కంటేనూ!! 

విధేయుడు, 
మనోహర్ చెనికల. 

2 కామెంట్‌లు:

anrd చెప్పారు...

చక్కగా వ్రాసారండి.

మనోహర్ చెనికల చెప్పారు...

ధన్యవాదాలు

తెలుగులో టైప్ చేయండి

కైఫీయతులు

  © బ్లాగర్ టెంప్లేట్ "ప్సై" రూపొందించినవారు Ourblogtemplates.com 2008

ఈ పుట పైభాగానికి వెళ్ళడం కోసం ఇక్కడ నొక్కండి