11, ఫిబ్రవరి 2013, సోమవారం

ప్రమాదాలు కుంభమేళాలోనే జరుగుతున్నాయా ??????

నమస్కారం.

కొందరు మేధావులుగా భావించి ఇచ్చేతీర్పులు  అర్ధంపర్ధం లేకుండా ఉంటాయనటానికి కొందరు బ్లాగులలో కుంభమేళా ప్రమాదం గూర్చి వ్రాసే విషయాలు తెలుపుతున్నాయి.

వీరికి కుంభమేళా గురించి ఇంతే అర్ధం అయ్యీంది

వీరి బ్లాగులో కామెంట్లు పెట్టడానికి వీలవ్వట్లేదు. అందుకే ఇక్కడ చెప్పాల్సి వస్తుంది.
వీరు చెప్పిన కొన్ని గొప్పవిషయాలు, వాటికి నా సమాధానాలు...

1. కుంభమేళాలు గింభమేళాలు అని చెప్పి వెళ్లి అక్కడ చావు కొని తెచ్చుకోవడం ఎంత వరకూ సమంజసం? ఇవాళ్రేపు ‘‘క్రౌడ్ ఎక్కడుంటే, చావు అక్కడ’’.
Ans: అయ్యా, దీనికి కారణం కుంభమేళానా? లేక వచ్చిన ప్రజలను నియంత్రించలేని ప్రభుత్వాధికారుల నిర్లక్ష్యమా

2. అసలు ప్రమాదాలను సృష్టించే ఇలాంటి వాటికి ప్రభుత్వాలు ఎందుకు అనుమతి ఇస్తాయో అర్ధం కాదు. ముఖ్యంగా ఇలాంటి వాటిని బ్యాన్ చెయ్యాలి.
Ans: రోడ్లపైనా, ట్రైనులలోనూ, విమానాలలోనూ, విధ్యుత్తువల్లా, ప్రమాదాలు ప్రతిరోజూ జరుగుతున్నాయి గాబట్టి ప్రభుత్వం వాటిని కూడా బ్యాన్ చేయాలి.

3. 140ఏళ్ల పాటూ అందుకోసం ఎదురు చూసి శరీరాన్ని ప్రక్షాళన చేసుకోవాల్సిన దుస్థితిలో సమాజం లేదు.
Ans: ప్రస్తుతం సమాజం ఇంతకన్నా మంచి స్థితిలో కూడాలేదు.


1 కామెంట్‌:

BHAARATIYAVAASI చెప్పారు...

బాగా వ్రాశారు. ఈ మేధావులమని చెప్పుకునే వారికి కేవలం హిందువుల పండగలూ, మేళాలు మాత్రమే కనపడతాయి. మిగిలిన వాటి విషయాల్లో గుడ్డివారిలా వ్యవహరిస్తారు. ఎంతమాట పడితే అంతమాట హిందువుల పైన అనేస్తారు. ఇలా హిందువుల మనోభావాలని కించపరిచే ఈ మూర్ఖులకి సరైన సమాధానం చెప్పటం మొదలవుతే అప్పుడు దారిలోనికి వస్తారు. ఒకప్పుడు సిక్కుల మీద, ముస్లింస్ మీదా బహిరంగంగానే అవాకులూ చవాకులూ పేలే వారు, జోకులు వేసుకునే వారు. ఎప్పుడైతే వారు "తీవ్రంగా స్పందించటం" మొదలు పెట్టారో అప్పటి నుండీ తోకలు ముడిచారు. ఇప్పుడు సాధు మస్థత్వంతో ఉన్న హిందువులని కూడా తీవ్రంగా స్పందించే ప్రక్కకే తోస్తున్నారు. అలాంటి తీవ్ర మనస్థత్వం హిందువులకి రాకుండా ఉండాలంతే ఈ కుహనా మేధావుల నోరు కట్టడి చెయ్యాలి.

ఈ సందర్భంగా ఓ విషయం, మొన్న అఫ్జల్ గురు ఉరితీత మీద ప్రపంచ మానవ హక్కుల సంఘం స్పందిస్తో ఉరి శిక్షలు ఆపాలని భారత ప్రభుత్వాన్ని కోరిందిట. కానీ, అదే నోటితో తీవ్ర వాదులకి కూడా వారి తీవ్ర వాదం ఆపమని కోరితే బాగుండేదేమో. వీరి లాంటి వారే మన కుహనా మేధావులు కూడా.

తెలుగులో టైప్ చేయండి

కైఫీయతులు

  © బ్లాగర్ టెంప్లేట్ "ప్సై" రూపొందించినవారు Ourblogtemplates.com 2008

ఈ పుట పైభాగానికి వెళ్ళడం కోసం ఇక్కడ నొక్కండి