ఇంగ్లీషువారు ఈరోజు క్రైస్తవులు. కాని ఆ జాతికి ఒక క్రైస్తవేతర గతం (Heathen past) ఉంది. అయితే ఆ గతం ఇప్పటిదాకా నిగూఢంగానే మిగిలిపోయింది. ఈమధ్యకాలంలో దాని గుఱించి చాలా పరిశోధనలు జఱిగాయి. ఇంగ్లీషు మాట్లాడే ఈ తెల్లజనాభా ఎక్కణ్ణుంచి వచ్చారు ? వీరు ఇంగ్లండుకి రాకముందు ఎక్కడుండేవారు ? ఏం చేస్తూండేవారు ? అనే అంశాల మీద బ్రిటిష్ పరిశోధకులు తీవ్రంగా కృషిచేశారు. ఆ కృషిలో నమ్మలేనంత అత్యాశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయి.
ఇంగ్లండ్ అనే ఆ చలిద్వీపంలో ఇంగ్లీషువారు అడుగుపెట్టకముందు కూడా అక్కడ మనుషులుండేవారు. వివిధ సమయాల్లో ఇంగ్లండుకు చేఱుకున్న మూడు మానవజాతులు అక్కడి చలికి తట్టుకోలేక అంతరించాయి. నాలుగో జాతి అయిన Saxons తట్టుకుని నిలబడ్డారు. కాబట్టి ఇంగ్లీషువారు అక్కడ అడుగుపెట్టిన అయిదో జాతి. స్కాట్లెండ్, ఐర్లండ్, వేల్స్ మఱియు ఇతర బ్రిటిష్ ద్వీపాల్లో నివసించిన ప్రాచీన బ్రిటిషర్లకి డ్రూయిడ్స్ అని పేరు. డ్రూయిడిజమ్ అనే ఒక ప్రాచీన బ్రిటిష్ మతధర్మం పేరు మీద వారికి ఆ పేరొచ్చింది. ఇంగ్లీషువారు జెర్మానిక్ జాతివారు కాగా డ్రూయిడ్ లు ఆ జెర్మానిక్ జాతీయుల పూర్వీకుల నుంచి అంతకుముందే విడిపోయిన కెల్టిక్ జాతికి చెందినవారు. అంటే ఇద్దఱికీ మొత్తమ్మీద దగ్గఱి చుట్టఱికం ఉంది. అలా ఇంగ్లీషువారూ, శాగ్సన్ లూ, కెల్టిక్కులూ (డ్రూయిడ్ లు) కాలక్రమంలో ఒకే జాతిగా కలిసిపోయారు. అలా ఆంగ్లో-శాగ్సన్ బ్రిటిషర్లు కూడా అనేక శతాబ్దాల పాటు డ్రూయిడ్ మతాన్నే పాటించారు. సుమారు క్రీ.పూ. 200 ప్రాంతం లో బ్రిటిష్ ద్వీపాలు రోమన్ల పాలనలోకి వచ్చాయి. క్రీ.శ. నాలుగైదు శతాబ్దాల్లో ఇంగ్లీషువారిని బలవంతంగా క్రైస్తవ్యంలోకి మార్చిన ఆనాటి రోమన్ పాలకులూ, వారి పురోహితులూ కలిసి డ్రూయిడ్ మతావశేషాలన్నింటినీ ఉద్దేశపూర్వకంగా ధ్వంసం చేశారు. అయినా ఇప్పటికీ ఆ మతకేంద్రాల శిథిలాలుకొన్ని ఆ దేశంలో మిగిలే ఉన్నాయి.
డ్రూయిడ్ లు ప్రధానంగా విగ్రహారాధకులు, అగ్ని-ఉపాసకులు, సూర్యోపాసకులు కూడా. ఇళ్ళల్లో హోమాలు బాగా చేసేవారు. కాబట్టి ఇంటికి ఇంగ్లీషులో హోమ్ అని పేరొచ్చింది. (I go to home = అంటే నా హోమం ఉన్నచోటికి వెళుతున్నానని) వారి దేవుడు ఘూతోమ్ (సంస్కృతంలో హుతమ్ – ఎవరికోసం హోమం (హుతం) జఱపబడుతుందో ఆయన ఘూతోమ్) ఇదే తరువాత God అయింది. వారికి ఒక ఆచారకాండ ఉండేది. అది మన మనుధర్మశాస్త్రాన్ని పోలి ఉంటుంది. ఇంగ్లీషులో ఇప్పుడు మనకి తెలిసిన వారాల పేర్లు వాస్తవానికి డ్రూయిడ్ దేవతల పేర్లే. Sun (సూర), Mon (మాస్),Tues, Wednes (బుధ), Thurs (Thor), Fri (భృగు), Saturn (శని) మొ||
నేను మొదట ఈ విషయం చదివినప్పుడు ఒకానొక వైదిక సంహితలో చిన్నప్పుడెప్పుడో చదివిన కథ (కథ అనకూడదేమో) ఒకటి గుర్తుకొచ్చింది. ఆ బ్రాహ్మణం పేరేంటో గుర్తులేదు. జనక మహారాజు తన రాజ్యంలోని భ్రష్ట బ్రాహ్మణులందఱికీ (వ్రాత్యులని రాశారు) దేశ బహిష్కారశిక్ష విధించి వెళ్ళగొట్టాడట. వాళ్ళు వేలాదిమంది రాజ్యాన్ని విడిచి కట్టుబట్టలతో కుటుంబాలతో సహా పశ్చిమదిక్కుగా వెళ్ళిపోయారట. ఆ వెళ్ళిపోయినవాళ్ళు ఏమయ్యారో తెలియదు. దేశవ్యాప్తంగా అన్ని వేలమంది ఒకేసారి భ్రష్టులెలా అవుతారు ? అని సందేహం కలుగుతుంది. బహుశా వాళ్ళు నిజంగా భ్రష్టులు కారనీ, జనకమహారాజూ, ఆయనకి విధేయులైన మతగురువులూ నమ్మిన వేదాంతం/ లేదా భాష్యం కంటే భిన్నమైన వేదాంతాన్ని, తాత్పర్యాన్ని అవలంబించడం చేత వారినలా దూషించి భ్రష్టముద్ర వేసి కుట్రపూరితంగా వెళ్ళగొట్టారని అనిపిస్తుంది. ఆ వెళ్ళిపోయినవాళ్లే ఈ డ్రూయిడ్స్ కావచ్చు. చరిత్ర ఏనాటికైనా కసి తీర్చుకుంటుందని నా నమ్మకం.
9 ఏళ్ళ క్రితం Peter Berresford Ellis అనే ఆంగ్లేయుడు ఈ విషయమై మఱికొన్నివిశేషాలు వ్రాశారు. ఆ మేటర్ ఇక్కడ పెడుతున్నాను. చదవగలరు.
(ముగింపు వచ్చే టపాలో)
14, ఆగస్టు 2012, మంగళవారం
బ్రిటిషర్ల పూర్వీకులు హిందువులట !
నామాంకాలు (Labels)
దేశదేశాల్లో హైందవం,
హిందువుల చరిత్ర - గొప్పతనము
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
3 కామెంట్‌లు:
నిజాలు ఆశ్చర్య జనకంగా ఉంటాయేమో! చిత్రం.
okosari hindu matam lo chala aa videshala nunde vachchyemo anipistundi. Aryula danda yatra nijamaite, vari vaidika neti brahmana paddhatulu akkadi vallave.ade tella vallu nedu kala/kali prabhavam cheta matalu mari okappudu vallu/valla tatalu nerpina patinchina matam (hindu) ippudu tappani danni nana rakalu ga papahasyam chestunnarau. ante vallani valle tappantunnaru. valla devullani valle dushistunnaru.mata marpidi chesukune varu nijam telsukondi.
mari hindumathanni ila thala thoka kathalu cheppi manalni maneme chinna chupu chusukunelaa rayakandu.
HOME anedhi super alochana.. hahha.. joke of the millenium.
Nee lanti vallu kondharu challau. mana hindu mathanni nashanamu cheyyadaaniki. idi edina english vaadu chusthe vaadu inka ila enno relations chepputhaadu.
meeru hindu mathanni uddarinchakunna parvaladhu.. but road na padeyaklandi.
post tholaginchi paruvu kaapadu.. inka andharu chaduvakamundhe.
కామెంట్‌ను పోస్ట్ చేయండి