19, డిసెంబర్ 2011, సోమవారం

ఆచారాల్లోకి చొరబడుతూ [ఏమార్చే మతం -4]

13-11-2011 andhrajyothy daily

ఆచారాల్లోకి చొరబడుతూ

హైదరాబాద్, నవంబర్ 12 : తాయెత్తులు, మొక్కులు, కొబ్బరి కాయలు, తలనీలాలు... ఇవి హిందువులకే పరిమితమనుకుంటే పొరపాటు పడినట్లే! క్రైస్తవంలోకీ ఈ సంప్రదాయాలు వచ్చాయి. ప్రచారాలు, ప్రలోభాలు, విద్య, వైద్యం పేరిట మత మార్పిడిని ప్రోత్సహిస్తున్న క్రైస్తవ మిషనరీలు.. హిందువులను తమ వైపు ఆకర్షించేందుకు హైందవ సంస్కృతినీ తమలో మిళితం చేసుకుంటున్న తీరిది. హైందవ దేవాలయాల్లో తీర్థ ప్రసాదాలు ఇవ్వడం సరికాదని చెప్పే క్రైస్తవ సంస్థలు.. హిందూ మతంలో అనాదిగా వస్తున్న ఆచారాలైన తలనీలాలు సమర్పించుకోవడం, కొబ్బరి కాయలు కొట్టడం, అగరబత్తులు వెలిగించడం వంటి వాటిని తమ మతంలోనూ ప్రవేశపెట్టాయి.

ఏసు మహిమలను కీర్తిస్తూ.. సంకీర్తనలు రూపొందించడం, పద్యాలను కూర్చడం కూడా చేస్తున్నాయి. త్యాగరాజ కృతులను పోలిన ఏసు సంకీర్తనలను కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో రూపొందించారు. ఇలా భారతీయ సాహిత్య రూపాల్లోనూ క్రైస్తవ సాహిత్యాన్ని తయారు చేస్తున్నారు. తైలాభిషేకాలు, హారతులు వంటి పద్ధతులనూ క్రైస్తవ మిషనరీలు చర్చిలలో ప్రవేశ పెట్టాయి. 'క్రిస్టియన్ యోగా' అనే కొత్త పద్ధతికి కూడా క్రైస్తవ సంస్థలు రూపకల్పన చేశాయి.

అంటే.. క్రైస్తవాన్ని 'భారతీకరణ' (ఇండియనైజేషన్) చేస్తున్నాయన్న మాట. తద్వారా మతం మారాలనుకొనే హిందువులకు.. క్రైస్తవంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా సంప్రదాయబద్ధమైన మార్పులను చేస్తున్నారు. హిందువులకు సాంస్కృతికంగానూ దగ్గరయ్యే ప్రక్రియలో భాగంగానే ఇదంతా జరుగుతోంది.

గతంలో వాటికన్‌లో భరతనాట్య ప్రక్రియలో క్రీస్తు జీవిత విశేషాలను ప్రదర్శించారు. క్రైస్తవంలోనూ తైలాభిషేకాలు జరుగుతాయి. మంత్రించిన కొబ్బరి నూనె చల్లినా, సేవించినా స్వస్థత చేకూరుతుందంటూ ప్రచారం జరుగుతోంది. అనంతపురం జిల్లా గుత్తిలో తరచూ స్వస్థత మహా సభలు జరుగుతాయి. ఈ సభలకు ఇతర జిల్లాల నుంచి కూడా భారీ ఎత్తున జనం వస్తారు. ఇక్కడ ఇచ్చే నూనెను సేవిస్తే 'ఆరోగ్యం గ్యారెంటీ' అనే ప్రచారమే ఇందుకు తార్కాణం.

మతం మారినా మారని కులం
అంతేకాదు.. కుల వ్యవస్థ అన్నది హిందూ మతానికే ప్రత్యేకం. కానీ.. మన దేశంలోని క్రైస్తవంలోనూ కుల వ్యవస్థ ప్రవేశించింది. హిందూ మతాన్ని వీడి.. క్రైస్తవ మతాన్ని తీసుకున్న వివిధ కులాల వారు తమ కుల వ్యవస్థను యథాతథంగా కొనసాగిస్తారు. తమ కులం వారినే పెళ్లి చేసుకుంటారు. కులాచారాలనూ తు.చ. తప్పకుండా పాటిస్తారు. హైందవం నుంచి క్రైస్తవంలోకి చేరిన వారిలో చాలామంది కుల చిహ్నాన్ని సూచించే పదాలను యథాతథంగా కొనసాగిస్తారు.

అగ్ర కులం వారికి.. తక్కువ కులం వారికీ మధ్య అంతరం అలానే కొనసాగుతుంది. కొన్ని చోట్ల.. అగ్రకులాల వారికి వేరుగా, నిమ్న కులం వారికి వేరుగా చర్చిలు వెలవడమే ఇందుకు నిదర్శనం. అంటే... ఒక కులం చర్చికి మరొక కులం వారు వెళ్లరన్న మాట! కాగా.. మతమార్పిడి గురించి 'ఆంధ్రజ్యోతి' ప్రచురిస్తున్న కథనాలకు రాష్ట్ర నలుమూలల నుంచి విపరీతమైన స్పందన వస్తోంది.

'ఆంధ్రజ్యోతి' కేంద్ర కార్యాలయానికి పాఠకులు పెద్ద ఎత్తున ఫోన్లు చేస్తూ.. మత మార్పిడులపై తమకు తారసపడ్డ అనుభవాలను వివరిస్తున్నారు. కొందరైతే.. క్రైస్తవ మిషనరీల ప్రచారాన్ని నమ్మి.. అనారోగ్య కారాణాలు ఇతరత్రా కారణాల వల్ల తాము మతం మారామని అంగీకరిస్తున్నారు. వీరిలో కొందరు క్రైస్తవంలో తాము ఇమడలేక.. తిరిగి హిందూ మతంలోకి వచ్చేశామనీ చెబుతున్నారు.

ధనం మూలం..
మత విస్తరణ కాంక్షతో మార్పిడిని ప్రోత్సహించే వారు కొందరు! కేవలం... ధనకాంక్ష తో టార్గెట్లు పెట్టుకుని మరీ మతం మార్పించే వారు ఇంకొందరు! ఈ వ్యవహారం డబ్బు చుట్టూ తిరుగుతోందని బలమైన ఆరోపణలు ఉన్నాయి. ప్రతి మిషనరీ, దాని అనుబంధ సంస్థలు ఎంతమందిని మతం మార్పించిందీ అంతర్జాతీయ సంస్థలకు ప్రతి నెలా నివేదిక లు పంపుతాయి. వాటి ఆధారంగానే నిధులు అందుతాయి. ఒక్కో మత మార్పిడికి ఇంత సొమ్మని చర్చి ఫాదర్లు, పాస్టర్లకు ఇస్తారని చెబుతారు.

ప్రార్థనా మందిరాల నిర్మాణం పేరిట భారీగా నిధులు సేకరిస్తున్నారు. కొన్నేళ్ల క్రితం సైకిళ్లపై తిరుగుతూ మత ప్రచారం చేసిన కొందరు పాస్టర్లు ఇప్పుడు విలాసవంతమైన కార్లలో తిరుగుతున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో ఒక్క కుటుంబాన్ని మతం మార్పిస్తే రూ.10 వేల వరకు చెల్లిస్తున్నట్లు సమాచారం. పేదల సంక్షేమం నిధులు ఖర్చు చేస్తున్నామని అంతర్జాతీయ క్రైస్తవ మిషనరీలకు తప్పుడు సమాచారం పంపి, డబ్బులు వెనకేసుకునే వారూ ఉన్నారు.

గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో 75 శాతం చర్చిలు విదేశీ నిధులతోనే నడుస్తున్నాయి. అన్యమతస్తులకు బాప్టిజం ఇప్పించినట్లుగా ఫొటోలు, వీడియో క్లిప్పింగ్‌లు పంపిస్తూ నిధులు సేకరిస్తున్నారు. నిజాయితీగా మతం కోసం మాత్రమే పని చేస్తూ, స్థానిక విరాళాలు, చందాలతో జీవించే వారూ ఉన్నారు. 1989లో ఉన్న అధికారిక సమాచారం ప్రకారమే... ప్రపంచ వ్యాప్తంగా చర్చిలు 14,500 కోట్ల డాలర్లు ఖర్చు పెడుతున్నాయి.

లెక్కకు చిక్కరు..
'రాష్ట్రంలో ఎంతమంది మతం మార్చుకుంటున్నారో అధికారిక లెక్కలు లేవు. ఎందుకంటే.. అలాంటివి నమోదు చేయాలన్న నిబంధన లేదుగనుక. కేరళ, తమిళనాడు తదిత ర రాష్ట్రాల్లో బాప్టిజం పొందాలంటే రెవెన్యూ అధికారుల వద్ద రిజిస్ట్రేషన్ తప్పనిసరి. దళితులు క్రైస్తవంలోకి మారితే సామాజిక హోదా ఎస్సీ నుంచి బీసీలుగా మారి, రిజర్వేషన్లపరంగా నష్టపోతారు. దీంతో మతం మారినా వారు ఎస్సీలుగానే కొనసాగుతున్నారు. దీనివల్ల అసలైన ఎస్సీలకు అన్యాయం జరుగుతోందని ఈ వర్గాలు వాపోతున్నాయి.

చావు.. పుట్టుక!
రాజమణికి 80 ఏళ్లు. హైదరాబాద్ సమీపంలోని రామవరం అనే కుగ్రామం. కార్తీక మాసంలో ఆమె శివాలయాల చుట్టూ తిరిగేవారు. రోజంతా పూజలతో గడిచిపోయేది. 9 నెలల క్రితం ఆమె మతం మార్చుకున్నారు. పూజలు మానేసి ప్రతి ఆదివారం చర్చికి వెళ్తున్నారు. 'మతం ఎందుకు మార్చుకున్నారు?' అని అడిగితే... 'చనిపోయాక కర్మ కాం డల అవసరం ఉండదని చర్చి అధికారులు చెప్పారు. కుటుంబానికి ఎలాంటి ఖర్చూ ఉం డదన్నారు. అందుకే మారాను' అని తెలిపారు.

కుటుంబ సభ్యులకు ఇదంతా ఇష్టం లేదు. సుమారు రెండు వారాల క్రితం ఆమె మరణించారు. ఆమెకు క్రైస్తవ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహిస్తామంటూ చర్చి అధికారులు వచ్చారు. దీనిపై కుటుం బసభ్యులు అభ్యంతరం వ్యక్తం చేసినా చివరకు... క్రైస్తవం ప్రకారమే ఆ పని కానిచ్చేశా రు. మత మార్పిడితో కుటుంబ స్థాయిలో సంఘర్షణకు ఇదో ఉదాహరణ!

మళ్లీ మరాం..
'ఆంధ్రజ్యోతి' కథనాలపై పాఠకులు పెద్దసంఖ్యలో ఫోన్లు చేస్తున్నారు. నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం ఐకపాముల గ్రామవాసులు ఐదుగురు శనివారం 'ఆంధ్రజ్యోతి'కి చెప్పిన విషయమిది... "ఏసయ్య ధనం ఇస్తాడు. పాపాలన్నీ రక్తంతో శుద్ధి చేస్తాడు. ఉబ్బసం వంటి మొండి వ్యాధులను కూడా తగ్గిస్తాడు.

పరలోక ప్రయాణానికి ఆటంకాలు లేకుండా ఆశీర్వదిస్తాడు... అని చర్చిలో చెప్పేవారు. మమ్మల్ని గుడికి వెళ్లొద్దని చెప్పేవారు. బంధువులెవరైనా చనిపోతే ముట్టుకోకూడదనేవారు. మా భార్యలను గాజులు తీసెయ్యమన్నారు. బొట్టుపెట్టుకోద్దన్నారు. దీంతో మేం చర్చికి వెళ్లడం మానేసి, మళ్లీ హిందూ మతంలోకి వచ్చేశాం! ఇలాంటి 20 కుటుంబాలు గ్రామంలో ఉన్నాయి.''

మంత్రం తంత్రం...
తాయెత్తులు, మొక్కులు, కొబ్బరి కాయలు, తలనీలాలు... ఇవి హిందువులకే పరిమితమనుకుంటే పొరపాటు పడినట్లే! క్రైస్తవంలోకీ ఈ సంప్రదాయాలు వచ్చాయి. లేదా... తీసుకొచ్చారు. క్రైస్తవంలో హైందవంలో ఉన్నన్ని పూజలు, పునస్కారాలు లేవు. కానీ, మతం మారిన, మారాలనుకున్న వారికి ఇబ్బంది లేకుండా సంప్రదాయబద్ధమైన మార్పులను చేర్చినట్లు తెలుస్తోంది. గతంలో వాటికన్‌లో భరతనాట్య ప్రక్రియలో క్రీస్తు జీవిత విశేషాలను ప్రదర్శించారు.

ఇటీవలి కాలంలో 'క్రిస్టియన్ యోగా' ప్రచారంలోకి వస్తోంది. క్రైస్తవంలోనూ తైలాభిషేకాలు జరుగుతాయి. మంత్రించిన కొబ్బరి నూనె చల్లినా, సేవించినా స్వస్థత చేకూరుతుందంటూ ప్రచారం జరుగుతోంది. అనంతపురం జిల్లా గుత్తిలో తరచూ స్వస్థత మహా సభలు జరుగుతాయి. ఈ సభలకు ఇతర జిల్లాల నుంచి కూడా భారీ ఎత్తున జనం వస్తారు. ఇక్కడ ఇచ్చే నూనెను సేవిస్తే 'ఆరోగ్యం గ్యారెంటీ' అనే ప్రచారమే దీనికి కారణం.

9 కామెంట్‌లు:

reachrala rudhurudu చెప్పారు...

I don't understand how can social backward status of a hindu mala or Hindu madiga will change when he converted to christian.

అజ్ఞాత చెప్పారు...

"reachrala rudhurudu అన్నారు...
I don't understand how can social backward status of a hindu mala or Hindu madiga will change when he converted to christian."

Then where is the need to convert? To increase missionary numbers to influence elections to rule India by Sonia and her handlers from West by proxy!?

Get the help from numerous programs run by Government to advance socially and economically in life. Don't you see these conversion destroy the national integrity of our country.

Do you think that they allow you to convert them in their countries. Did you ever try to convert a Musalman in any Arab country? Try and you will see the consequences.

It is a pure business for them, you fools fall prey for it.

reachrala rudhurudu చెప్పారు...

My question is whether a Hindu mala or Hindu Madiga change of is religion to Christianity will change his or her socia-economic status or not? My feel is it wont change. Then no need of change of his reservation category based on his religion.
Why people adopt anew religion, there will be so many reasons.
(1) They may get better treatment in the new religion. Particularly for lower caste people.
(2) Few higher caste people also will take the new path. Due to their belief in the other God.
(3) some people for their economic benefits they choose the new religion. Example: ippuudu state mothamu Oodarapu OOdarpu ni triguthunnavadu. Even he is not converted in to Christianity in is generation. His forefathers helped him by converting their religion.
Now in all castes including upper castes people are converting in to Christianity.
(4)Before Sonia era itself we have missionaries activities in India. I don't know her era removed hurdles for illegal conversion.
(5) when people are matured to vote they will vote for caste or religion.
(6) Manlani manamu samaskrinchukonuanthavarku we have to face this conversion problem.
(7)When you are economically, intellectually powerful you can follow your religion freely( not 100%) in Gulf countries also. US Military compounds in Saudi Arabia are the example. Don't compare India with autocracy countries. compare with democratic countries for religious freedom.
Reservations is one way to overcome backwardness apart from other Govt policies.
You can ask how many years reservations are needed for this country. I say probably when India become super power by that time we may not need reservations. At least I hope by that time people will equal opportunities. Specifically speaking If you are able to provide equal opportunities( gender, caste,religion, regional, racial discrimination should go) to all citizens India will become super power.
Kanuchupu meeralo SamyavadaSama Samja sthapna India lo jaruguthundha antae konchem nellu namallaisi vasthundi answer cheppataniki.
India is such an intellectual,powerful country shouldn't bend to any external power.
May be conversions in lower castes % ( number of persons)is many folds higher when compared to upper castes.

అజ్ఞాత చెప్పారు...

I was born and brought up in a Hindu family but converted to Christian at some point of my life. No one forced me, nor I got any benefit from any one to become a Christian. I just listened to & read what the Bible says and believed that the Bible is TRUE. There are millions of people like me who came to know the TRUTH and believe in Jesus Christ.

Let us say you come to know about a deal that Walmart/Big Bazaar is giving 25% OFF on your entire bill. Do you keep that news to yourself OR share it with your friends and near & dear? It is the same way. Many Christians who came to know the TRUTH would like to share it with others who do not know about the TRUTH.

I agree that there are people (Indians) who show money to attract in order to convert and get money from foreign countries. These are like those who do not spread the deal information for free but try to get referral bonus for every message they pass.

"Bible summarizes that every mankind is a sinner and will go to hell after their death. God himself (as Jesus Christ) came to this world 2011 years ago and paid the price for mankind's sins. Any one believe in Him will not go to hell but to heaven." Is this not a FREE GOOD news/deal to be shared with those who do not know about it?

Please note that this Good news is widely shared with CHRISTIANS also because many of them does not know about it and heading to hell after their death.

Until you taste it, you will not know. If you NOT are VERY SURE that you are going to heaven with what you believe, then you will need to think about it seriously. If you do not care about it, there may not be another chance.

Praveen Mandangi చెప్పారు...

మతం మార్చుకోవడం పెద్ద సమస్యా? హిందువులలో చాలా మందికి వేదాలలో ఏముందో తెలియదు. వేదాలలో కొన్ని భాగాలు మాత్రమే హిందీ, మరాఠీ, తెలుగు భాషలలోకి అనువాదం అయ్యాయి. మిగితా భాషలలోకి అనువాదం కానే లేదు. ఇప్పటికీ వేదాలు చదవాలంటే మృత ప్రాకృత భాష (సంస్కృతం కంటే ముందు పుట్టిన భాష) నేర్చుకోవలసిందే. హిందువులలో చాలా మందికి హిందూ మతం గురించి తెలియనప్పుడు వాళ్ళు మతం మార్చుకుంటే ఏమిటి, మార్చుకోకపోతే ఏమిటి? క్రైస్తవులకి కనీసం యహోవా, యేసు ప్రభువుల గురించైనా తెలుస్తుంది. చాలా మంది క్రైస్తవులకి మోషే, యూదా లాంటి ప్రవక్తల గురించి తెలియకపోవచ్చు. కానీ హిందువులకి వేదాలలో ప్రస్తావించబడిన ఒక్క దేవుని గురించైనా సమగ్రంగా తెలుసా?
మతం గురించి తెలుసుకోవడానికి మన మతంవాళ్ళకి ఆసక్తి ఉండదు కానీ పరాయి మతంవాళ్ళని తిట్టి అదే దేశభక్తి అనుకోవడానికి మాత్రం ఆసక్తి ఉంటుంది.

అజ్ఞాత చెప్పారు...

బైబిల్ is written by Human beings. It was edited many many times to suite the sinister designs of తెల్ల వాడు.

It has some జ్యూవిష్ history in it, but most of the details are false. To this day they dig in జెరుసలెమ్ to find a proof.

But no such proof was found so far.

It is true that people sidelined in Indian society may try to convert to gain monetary benefits from తెల్ల వాడు. It is also true that some (few) people may convert for a change.

There is nothing new that can be found in క్రిష్టియానిటి, that is not found in Hinduism, except brain washing, mind control, propaganda, luring for money.

If క్రిష్టియానిటి is ultimate TRUTH, why 60% తెల్ల వాడు is not practicing* it in Europe and Americas.

* They are born into, but lost the faith and don't practice it on a daily basis.

Praveen Mandangi చెప్పారు...

అమెరికాలో 15% మంది క్రైస్తవ మతాన్ని నమ్మకపోవడానికి వేరే కారణం ఉంది. క్రైస్తవ మతం ప్రకారం హోమోసెక్స్ నిషిద్ధం, అబార్షన్‌లు నిషిద్ధం. పద్నాలుగేళ్ళ బాలికకి అబార్షన్ చెయ్యించుకునే హక్కు ఉండాలనే ఫ్రీ సెక్స్‌వాదులు & హోమోసెక్సువల్స్ క్రైస్తవ మతాన్ని అంగీకరించరు. వాళ్ళు మనిషి స్వేచ్ఛాజీవి అనీ, మనిషి యొక్క స్వేచ్ఛని మతం నిర్ణయించదనీ వాదిస్తారు. I didn't justify Christianity. స్త్రీలని కించపరిచే వ్రాతలు ఉన్న మనుస్మృతిలో ఏముందో బయట పెడితే హిందువులకి ఎలా కోపం వస్తుందో, బైబిల్ నుంచి తొలిగించబడిన బర్నబాస్ సువార్తలో ఏముందో బయటపెడితే అలాగే క్రైస్తవులకి కూడా కోపం వస్తుంది. బర్నబాస్ సువార్తలో ఏసు క్రీస్తు దేవుడు కాదు, ఒక ప్రవక్త మాత్రమే అని వ్రాసి ఉంది. ఆ సువార్తని క్రైస్తవులు నమ్మరు కానీ ముస్లింలు నమ్ముతారు. ఖురాన్‌లో పేర్కొన్న 25 మంది ప్రవక్తలలో ఏసు క్రీస్తు (ఈసా మసీహ్) ఒకడు. అందుకే బర్నబాస్ సువార్తని ముస్లింలు నమ్ముతారు. ఏ మత గ్రంథాలైనా మనిషులు వ్రాసినవే. అటువంటప్పుడు మనుషులు తమకి నచ్చిన మతంలోకి మారడం ఒక పెద్ద సమస్యా?

Praveen Mandangi చెప్పారు...

Remember that I am neither a born christian nor I did convert into christianity. మనిషి యొక్క దైనందిన జీవితంతో సంబంధం లేని మతం కోసం కొట్టుకుంటోంటే అలా కొట్టుకోకూడదు అని చెప్పడానికి వ్రాసాను కానీ నాకు క్రైస్తవ మతం మీద ఎలాంటి విశ్వాసం లేదు.

Praveen Mandangi చెప్పారు...

అయినా క్రైస్తవ మతాన్ని విమర్శించడానికి అజ్ఞాత పేర్లు అవసరం లేదులే. అదేమీ రేషనల్ జడ్జ్‌మెంట్ ముందు నిలబడగలిగే మతం కాదు.

తెలుగులో టైప్ చేయండి

కైఫీయతులు

  © బ్లాగర్ టెంప్లేట్ "ప్సై" రూపొందించినవారు Ourblogtemplates.com 2008

ఈ పుట పైభాగానికి వెళ్ళడం కోసం ఇక్కడ నొక్కండి