12, డిసెంబర్ 2011, సోమవారం

తిరుమలలో ఏంజరుగుతోంది ఇప్పుడు?

ఇటీవల "తిరుమలకెళితే పుణ్యక్షేత్రానికి వెళ్ళినట్లు అనిపించడం లేదు. ఏదో క్లబ్బుకెళ్ళిన ఫీలింగ్ కలుగుతోం"దని చినజీయర్ గారు చేసిన వ్యాఖ్యలకి టి.టి.డి. కక్కలేకా, మింగలేకా పిసుక్కుంటోంది. పళ్ళునూఱుతోంది. ఆయనలాంటి ధర్మాచార్యులే ఒక హిందూపుణ్యక్షేత్రం మీద అడ్డగోలు వ్యాఖ్యలు చేయడమేం"టని
మండిపడుతున్నారు తప్ప తమ కింద ఎంత నలుపుందో చూసుకోవడం లేదు. ప్రధానంగా ప్రభుత్వం చేతుల్లో నిరంతర దోపిడికి గుఱవుతూ, వ్యవస్థంతా కుప్పకూలి, సరిగా పనిచేసేవాళ్లూ, నియమ నిబంధనల్ని అమలుజఱిపేవాళ్లూ ఎవఱూ లేక ఈసురోమని కునారిల్లుతోంది.

తిరుమలలో ఉన్నత అధికార స్థానాల నియామకాలన్నీ పార్టీరాజకీయాలు. ముఖ్యంగా అధికార పార్టీ. ఆ పార్టీవాళ్ళకి ఏ నియమనిబంధనలూ వర్తించవు. వాళ్ళు పోలోమని జీపులూ, వ్యాన్లూ ఎక్కి గుంపులు గుంపులుగా కొండెక్కి అక్కడ రాజకీయ వేడుకలు నిర్వహిస్తున్నారు. వాటిల్లో తాగి తందనాలాడుతున్నారు. ఆడుకుంటున్నారు. గోవిందా అని నోరారా భజించాల్సిన చోట. సోనియాకీ జై, రాహుల్ కీ జై అని అఱుస్తున్నారు. వాళ్ళని చూసి ఇతరపార్టీలవాళ్ళు కూడా అలాగే అఱుస్తున్నారు తమ తమ నాయకుల గుఱించి ! మొన్నామధ్య శివసేన గుంపొకటి మహారాష్ట్ర నుంచి వచ్చి క్యూకాంప్లెక్సుల్లో జై శివాజీ అని అఱవడం నేను కళ్ళారా చూశాను. చెవులారా విన్నాను. గోవిందనామం వినపడ్డమే కఱువైపోయింది. ఇదివఱకు దేవస్థానం బస్సు బయల్దేఱేటప్పుడైనా ప్రయాణీకులంతా "గోవిందా
గోవింద" అని నినదించేవారు. ఇప్పుడు అది కూడా మానేశారు.

భక్తుల సంఖ్య పెఱిగినాక కూడా అతికొద్ది లడ్డూ కౌంటర్లతో లాగిస్తున్నారు. వాటిల్లో సగం ఎప్పుడూ మూతపడే ఉంటాయి. ఎందుకో తెలీదు. వాటికోసం క్యూలలో నిలబడ్డ జనం సహనం నశించి ఒకఱినొకఱు తోసుకోవడం, (అదొక పవిత్ర పుణ్యక్షేత్రమని మర్చిపోయి) అమ్మనాబూతులు తిట్టుకోవడం, తన్నుకోవడం జఱుగుతోంది. టి.టి.డి. మాత్రం చిద్విలాసంగా చోద్యం చూస్తోంది.
''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''
హిందు దేవాలయాలు, సెక్యులర్ ప్రభుత్వము (అందునా హిందు వ్యతిరేకతే సెక్యులరిజం అనుకునే పార్టీల ప్రభుత్వాల) చేతుల్లో ఉన్నంత వఱకు ఇలాంటివి భరించాలి.

అసలు సెక్యులర్ ప్రభుత్వము దేవాలయాలను మానేజ్ చేయడము ఏమిటి?. ఇలాంటిది ప్రపంచములొ ఎక్కడా లేదు!.
ఇండియాలొ ఇది "కుల హిందువుల" చేతకాని తనము వల్ల సాధ్యపడింది, మఱి ఇంకేమి కాదు.

ఇప్పటికైనా హిందువులు కళ్ళు తెఱిచి, అన్ని దేవాలయాలను తమ చేతులలోకి తెచ్చుకోవాలి.
--------------------------------------------------------------------------------

నిఱుడు నేను తిరుమల వెళ్లాను /క్యూలైన్లలో గంటలసేపు నిలబెట్టారు. పసిపిల్లలు వృద్దులకు నరకమే. బ్రేక్ దర్శనాలట. "ఏమిటయ్యా ఈ విఐపీ దర్శనాలు ?" అని దగ్గరలో ఉన్న కానిస్టేబుల్ను అడిగితే, "ఎవడు విఐపీనో ఎవడు వీపీనో అర్ధమై చావటంలేదు. ఎప్పుడుపడితే అప్పుడు ఎవడుపడితే వాడు రావటం, బ్రేక్ దర్శనం అనటం, జనం మమ్మల్ని తిట్టడం మాఖర్మ" అంటూ వాపోయాడు . ఇదీ రాజకీయనాయకులు, మద్యం వ్యాపారుల చేతిలో పుణ్యస్థలాల పరిస్థితి.

4 కామెంట్‌లు:

రహ్మానుద్దీన్ షేక్ చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రహ్మానుద్దీన్ షేక్ చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రహ్మానుద్దీన్ షేక్ చెప్పారు...

ధర్మస్థలాల్లో విషయం పక్కన పెడితే, మన ఇంటి వద్ద మనం ధర్మ బద్ధులమై ఉన్నామా?
త్రిసంధ్యలు ఆచరిస్తున్నామా?
ఉదయం మొదలు ముఖ్యంగా తెలుగు వారింట ఆచరించాల్సిన ధర్మాలు చేస్తున్నామా?
స్త్రీలను గౌరవించాలి, పశు-పక్ష్యాదులను దయతో చూడాలి. ఎవరికీ హాని కలుగకుండా పనులు చేసుకోవాలి.
ఉదయ-సాయం సంధ్యలలో అగ్నిహోత్రం సలపాలి.
వేద-పురాణాలు ఇంట సాయించాలి.
ఇవన్నీ జరుగుతూ ఉంటే ఏ సమస్యలు రాకుండా ఆ శ్రీహరియే చూసుకుంటాడు. కనీసం మన మానవ ప్రయత్నం చేయకుండా, మన ముందు వాడు తప్పు చేస్తున్నాడని చూపడం ఖలః సర్షప మాత్రాణి పరచ్ఛిద్రాణి పశ్యతి। ఆత్మనో బిల్వ మాత్రాణి పశ్యన్నపినపశ్యతి॥ అన్న నానుడిని నిజం చేస్తోంది.

అజ్ఞాత చెప్పారు...

5 వ శతాబ్దములొ, అప్పటి రొమన్ల (తెల్లవారి) మతాన్ని భ్రష్టు పట్టించి నాశనము చేయుటకు తత్పూర్వము, ఆనాటి ప్రభుత్వము ఇలానే రొమన్ల (తెల్లవారి) దేవాలయాలను కంట్రొల్ చేసేది. ఆ తరువాత కొద్ది కాలానేకే, రొమన్ల (తెల్లవారి) మతాన్ని పూర్తిగా బాన్ చేసింది.

http://en.wikipedia.org/wiki/Christian_persecution_of_paganism_under_Theodosius_I

తెలుగులో టైప్ చేయండి

కైఫీయతులు

  © బ్లాగర్ టెంప్లేట్ "ప్సై" రూపొందించినవారు Ourblogtemplates.com 2008

ఈ పుట పైభాగానికి వెళ్ళడం కోసం ఇక్కడ నొక్కండి