11, డిసెంబర్ 2011, ఆదివారం

ఏ వినాశనానికి సూచనలు ఈ అనర్ధాలు !!!!!???

సభ్యుడు  ౧

  శ్రీశైలంలో విరిగిపడిన సహస్ర లింగేశ్వర ఆలయ రాతి శిఖరం
          -ఈనాడు
             ఎందుకిలా జరుగుతున్నాయి? జనాల తొక్కిడివల్లనా? లేక వాతావరణంలో మార్పుల
     వల్లనా?


సభ్యుడు ౨ 
       

      వినాశకాలానికి సూచనగా


సభ్యుడు  ౩  

       ఈ దేశప్రభుత్వానికి కొంతకాలం దాకా దశ బాలేదు. ఇవి శకునాలు మాత్రమే.
ముందుముందు తెలియవచ్చు అసలువిషయం.


సభ్యుడు    ౪

     శ్రీ కాళహస్తి ఆలయం లో, భక్తుల తోపులాటలో  కుమార స్వామి విగ్రహం
విరిగిపోయిందిట.  ఈ రోజు ఈనాడు లో ఒక వార్త.


సభ్యుడు  ౫

      రామ రామ! దేవతానుగ్రహం మెల్లిగా తగ్గుతోంది అని స్పష్టంగా తెలుస్తోంది!

సభ్యుడు  ౬

        సిద్దంగాఉండాలి  మనం రామనామస్మరణతో ,రాబోయే విపత్తులను ఎదుర్కొనేందుకు

సభ్యుడు  ౭

      దేవతలు మళ్లీ శంకరాచార్యుల కాలం ముందు వలె ఉగ్రరూపం దాలుస్తారేమో! మళ్లీ ఆ
శంకరులే జన్మించాల్సి వస్తుందేమో! మనం కూడా ఆయన రాక కోసం భగవద్స్మరణ
నిరంతరాయంగా చేయాల్సిందే, తప్పదు.


సభ్యుడు   ౮


     ఇ సూచనల్ని బట్టి - ప్రాకృతిక విపత్తుల కంటే సామాజిక, రాజకీయ ఉద్రికతలు
పెచ్చుమీఱి భారీయెత్తున రక్తపాతాలూ, తన్మూలకమైన జననష్టం జఱగడానికి అవకాశం
ఉంది. అలాగే కొన్ని ప్రభుత్వాలకీ, రాజ్యాంగాలకీ ఎసఱు రావడానిక్కూడా
అవకాశం ఉంది.

నిజానికి ఈ సూచనలు 2007-2008 నుంచే మొదలయ్యాయి, ఉగాదినాడూ, జనవరి 1 నాడూ
సూర్యగ్రహణాలు చోటుచేసుకోవడంతో ! ఆ తరువాత 2010 జనవరిలో తిరుమలలో
స్వామివారి గజవాహనం కట్టుతెంచుకొని మాడవీథుల్లో వెంటబడితే భక్తజన సందోహం
భయంతో పరుగులు తీశారు. ఆ తరువాత శ్రీకాళహస్తిలో రాజగోపురం కూలిపోయింది. ఆ
తరువాత చాలా గోపురాలు కూలాయి. ఇప్పుడు జఱిగినది తాజాది.

నిన్న వచ్చిన చంద్రగ్రహణం మంచిది కాదు. అది ఘాతదోషం గల గ్రహణం. జనం
జలగండాలకీ, అగ్నిప్రమాదాలకీ, విషాహారాలకీ బలై చనిపోయే అవకాశం ఉంది.
అందువల్లనే అది జఱగబోతూండగా కలకత్తాలో ఆస్పత్రిలో అగ్నిప్రమాదం జఱిగి 90
మంది పోయారు. అంతకుముందు 2008 లో అక్టోబర్ 1 న సూర్యగ్రహణం జఱగడానికి
తక్షణం ముందు, సెప్టెంబరు 30 న అనుకుంటా, వరంగల్ జిల్లా కేసముద్రం దగ్గఱ
ఒక ఎక్స్‌ప్రెస్ ట్రెయిన్‌లో మంటలు చెలరేగి ప్రయాణికులంతా చనిపోయిన సంఘటన
గుర్తుచేసుకోండి. గ్రహణాలు సామాన్యమైనవి కావు.  చాలామందికి వీటి గుఱించిన
అవగాహన లేదు. లేకపోవడంతో, అద్భుతదృశ్యం, celestial event అనుకుంటూ
అజ్ఞానంలో జీవిస్తున్నారు. మానవులు మంత్రపూర్వకమైన అగ్నిహోత్రాలతో
అగ్నిదేవుణ్ణి కనీసం అప్పుడప్పుడైనా తృప్తిపఱచకపోవడం వల్ల కూడా ఆయన ఇలా
తన దారి తాను వెతుక్కుని స్వయంపాకం చేసుకుని ఆకలి చల్లార్చుకుంటూ
ఉంటాడు.

క్షుద్రమాంత్రికులు కొత్తశక్తుల్ని సంపాదించడానికి గ్రహణకాలాన్నే
ఎందుకెంచుకుంటారో అర్థం చేసుకుంటే విషయం తెలుస్తుంది.

1 కామెంట్‌:

ఎందుకో ? ఏమో ! చెప్పారు...

thanks for the info

It will brings us some bhya&bhakthi

?!

తెలుగులో టైప్ చేయండి

కైఫీయతులు

  © బ్లాగర్ టెంప్లేట్ "ప్సై" రూపొందించినవారు Ourblogtemplates.com 2008

ఈ పుట పైభాగానికి వెళ్ళడం కోసం ఇక్కడ నొక్కండి