20, జనవరి 2012, శుక్రవారం

పురాతన ఈజిప్టులో శ్రీకృష్ణుణ్ణి కొలిచేవారా ?

ఆమధ్య పుణ్యభూమి గూగుల్ గుంపులో టపా అయిన ఒక చర్చాహారం (Thread)


ఒక సభ్యుడు :

జగన్నాథరథయాత్రను పోలిన రథయాత్రలను ఈజిప్టులో చూసి శ్రీ....... గారు వ్రాసిన వ్యాసం చదవండి..ఇతడు సదరు మేనేజిమెంట్ ఇన్‌స్టిట్యూట్‌లో నాకన్నా ఒక ఏడాది ముందువాడు..

http://satyameva-jayate.org/2011/10/07/krishna-rathyatra-egypt/?utm_s...|+Satyameva+Jayate+||%29



రెండో సభ్యుడు :

మంచి లింకు ఇచ్చారు. పొష్ట్ బాగుంది. అక్కడ కామెంట్ సెక్షన్లొ http://2ndlook.wordpress.com/ ఈ బ్లాగు వుంది. అందులొ కొన్ని పొష్ట్ లు బాగా ఉన్నాయి.



మూడో సభ్యుడు :


చాలా ఆసక్తికరంగా ఉంది. రచయిత (లేదా అతని స్ఫూర్తిదాయకుడు) కృష్ణుడి రథయాత్రకి మించి చాలా విషయాల్ని స్పృశించారు. ముఖ్యంగా ప్రాచీన ఈజిప్షియన్లు తమ పూర్వీకుల అసలు మాతృభూమి పుంట్ అనీ, అది చాలా పెద్దదేశమనీ, అది హిందూమహాసముద్ర తీరాన ఉందనీ చెప్పుకున్న వైనం దిగ్భ్రాంతి కలిగించింది.



కానీ కొన్ని సందేహాలు మిగిలిపోయాయి.



ఇండియాకి పుంట్ అనే పేరు ఎలా వచ్చింది ?



అంతేకాదు, ఈజిప్షియన్ల పూర్వీకులు భారతీయులైతే మఱి ఇండియాలో విస్తారంగా లేని పాషండ ఆచారాలు - తల్లినీ, చెల్లినీ, కూతురినీ పెళ్ళి చేసుకోవడం లాంటివి ఈజిప్షియన్లకి ఎలా వచ్చాయి ? అంటే అలాంటివి ఇండియాలో కూడా ఉన్నరోజుల్లో వాళ్ళు ఈజిప్టుకి వలసపోయారా ? ఎందుకంటే ఈజిప్షియన్ రాజవంశాల చరిత్ర ఏడెనిమిదివేల సంవత్సరాల నాటిది. అప్పుడు ఇండియా కూడా ఎలా ఉండేదో మనకి తెలీదు.



12,000 సంవత్సరాల నాటివైన ఈజిప్షియన్ గీజా పిరమిడ్స్ కట్టినది ఈజిప్షియన్లు కారనీ, అంతకుముందు అక్కడ నివసించిన రాక్షసజాతి కావచ్చునని వ్యాసరచయిత చేసిన సూచన ఆసక్తికరంగా ఉంది.



అయితే ఆ వ్యాసానికి వచ్చిన వ్యాఖ్యల్లో ఒకదాన్ని గంభీరంగా తీసుకోవాల్సి ఉంది. ఆ వ్యాఖ్యాత ఏమంటాడంటే - చరిత్రపూర్వయుగంలో జాతుల మధ్యా, దేశాల మధ్యా చాలా give and take చోటుచేసుకుంది. ఏ జ్ఞానం ఎక్కణ్ణుంచి ఎక్కడికి ప్రయాణించిందో ఇప్పుడు చెప్పడం కష్టం. ఉదాహరణకి - ప్రపంచంలో సాఫ్టువేరు కంపెనీలన్నీ నశించి ఒక్క Infosys శిథిలాలు మాత్రమే మిగిల్తే సాఫ్టువేరుకు భారతదేశమే మూలమనే పొఱపాటభిప్రాయం భావితరాలకి కలగొచ్చు అంటాడు.



నేను అతనితో కొంతవఱకు ఏకీభవిస్తాను. ఎందుకంటే మనం హిందూమతం అనుకుంటున్నదాని క్కూడా ఇండియాయే జన్మస్థానం కాకపోవచ్చు. మన ఋషులు మన దేశస్థులు కాకపోవచ్చు. ఇది ఒక ప్రపంచమతంగా విలసిల్లిన యుగం ఒకటున్నది కావచ్చు. అన్నిదేశాలలోనూ నశించి ఇక్కడ మాత్రం మిగలడం చేత ఇదే ఈ మతానికి జన్మస్థానమని మనం భ్రమిస్తూండొచ్చు. దీని అసలు జన్మస్థానం సముద్రగర్భంలో కలిసిపోయి ఉండొచ్చు. లేదా ఇప్పుడు ఎడారిగా మారి ఉండొచ్చు



నాల్గో సభ్యుడు :



నేను .... గారి వ్యాఖ్యలతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను.



చరిత్రలో ఎంతో దూరం వెళ్ళకుండానే
http://ancientindians.files.wordpress.com/2008/12/epicindiacities.jpg

ఫ్ఘనిస్తాన్ మొదలుకొని బర్మా వరకు భారత దేశంగా పేరు ఉన్న విషయం మనకు తెలుసును. అలాంటిది ౫౦౦౦ సంవత్సరాల క్రితం మాట అంటే మనకు అసలు ఏమి తెలియదనే చెప్పాలి.



మరొక విషయం -- ప్రస్తుతం పురావస్తు శాస్త్రం ప్రకారం ౩౦౦౦ bc ముందు పెద్ద కట్టడాలు ఏమి జరగలేదు. ఆ గిజా పిరమిడ్ ౨౫౦౦ bc లో కట్టి ఉంటారని ప్రస్తుతం నమ్ముతున్నారు:



Egyptologistsbelieve that the pyramid was built as a tomb for fourth dynasty



http://en.wikipedia.org/wiki/Egyptologists


http://en.wikipedia.org/wiki/Fourth_dynasty_of_Egypt


Egyptian Pharaoh Khufu (Cheops in Greek) over an approximately 20 year period concluding around 2560 BC.


http://en.wikipedia.org/wiki/Khufu



http://en.wikipedia.org/wiki/Ancient_Egypt



మొదటి సభ్యుడు :



కోటవేంకటాచలం గారి పుస్తకం చదివినమీదట పాశ్చాత్య పురావస్తుశాస్త్రవేత్తలు పిరమిడ్ల ప్రాచీనతను కుదించేశారేమో నని అనుమానం కలుగుతోంది. ....గారు వ్యాఖ్యలనుండి వెలికితీసి పంపిన లంకె పాశ్చాత్యుల దురాగతాల చిట్టా లా ఉంది.



బిభువ్రాసిన కొన్ని వ్యాసాలు పూర్వం చదివాను కానీ పుణ్యభూమి సభ్యులకు పంపలేదేమో. గ్రహమ్ హాన్కాక్ గూడొకటి ఉన్నది - అందలో అతడు వ్రాసిన వ్యాసాలు ఆసక్తకరంగా ఉన్నాయి. వాటిని తన బ్లాగులో సేకరించి ఉంచాడని గమనించాను, ఇది చూడండి.



http://bibhudev.blogspot.com/



అయిదో సభ్యుడు :



.....గారూ ! మీ అభిప్రాయం హిందు తత్వానికి వర్తించదు మన ప్రస్తావనలో (పురాణాలలో )ఉన్న బౌగోళిక నైసర్గిక అంశాలన్నీ ఈ దేశానికే వర్తిస్తాయి పురాణాలలో ఉన్న చాలా దేశాలు రాజ్యాలు అక్కడి మనుషుల వర్ణనలను ఒకసారి అధ్యయనం చేస్తే మనకు ఈ ఇజిప్టు లంకె దొరుకుతుంది మన సమస్య అల్లా మనం మన పురాణాలను ఆధారాలుగా పరిగణలో కి తీసుకోకుండా చరిత్ర గురించి మాట్లాడుతాము..... పురాణాలను ప్రస్తావించని పురాతన చరిత్రపరిశోధనలు నా దృష్టిలో సమగ్రం కాదు.


మూడో సభ్యుడు :



పురాణాల్ని పరిగణనలోకి తీసుకోకుండా చరిత్రరచన సమగ్రం కాదని నేనూ భావిస్తాను. అయితే హిందూమతం ఒకప్పుడు ప్రపంచంలో అన్నిచోట్లా ఉన్నట్లు పురాణాలు వర్ణించాయి. ముఖ్యంగా భాగవతంలోని భూగోళవర్ణనలో కొన్ని ద్వీపాలలో (ఈనాటి పరిభాషలో ఖండాలు లేక continents) శివుణ్ణి, మఱికొన్ని ద్వీపాలలో యజ్ఞేశ్వరరూపుడైన విష్ణువునీ పూజిస్తారని చెప్పబడింది. అంటే హిందూమతం పురాణాల కంటే ప్రాచీనమని అంగీకరించక తప్పదు గదా ! ఆ ప్రాచీన మూలహిందూమతం కేవలం ఇండియాకి మాత్రమే సంబంధించినదని కాకపోవచ్చునని నా ఊహ. కొన్నిఒరిజినల్ అంశాల్ని ఇక్కడివాళ్ళు జోడించారు. మఱికొన్ని బయటినుంచి వచ్చాయి. వెఱసి హిందూమతం అంటున్నాం. మన ఋషుల్లో కొందఱు గ్రీన్ ల్యాండ్ కి, మఱికొందఱు శ్కాండినేవియాకి చెందినవాళ్ళనే అనుమానం ఇప్పటికీ ఉంది, వేదాల్లో కొన్ని మంత్రాల్ని బట్టి ! ఈ అనుమానాన్ని మొదట వ్యక్తం చేసినది లోకమాన్య బాలగంగాధర టిళక్ గారు, The Orion అనే గ్రంథంలో !



రెండో సభ్యుడు :


మంచి చర్చ జరుగుతోంది. ....గారు & ....గారు చెప్పినా విషయాలు ఆసక్తికరంగా ఉన్నాయి. కోట వెంకటచలం గారి గురించి వినడమే కానీ చదివింది లేదు. ఈసారి మన దేశం వచ్చినప్పుడు వెతికి పట్టుకుంటాను.



అయిదో సభ్యుడు :



తిలక్ గారు ఉన్నప్పుడు డి ఎన్ ఏ టెస్టు లు ...,వస్తువుల కాల నిర్ణయం లాంటి పద్దతులు లేవు .. అప్పుడు ఆర్యుల గురించి బయటి నుంచి వచ్చినారనే అభిప్రాయం ఉండేది ,అన్ని పరిశోధనలలో నేటి ఆధారాలతో ఆర్యులు బయటి వారు కాదని సరస్వతి నది ఆధారంతో కల్యాణ రామన్ గారు గుర్రం ఇక్కడదే అని రాజారామన్ నిరూపించారు మొన్నటి డి ఎన్ ఏ టెస్టు ద్వారా ఈ దేశం లో ఉన్న వాళ్ళందరి డి ఎన్ ఏ ఒకటే అని తేల్చేసారు .., అయినా లక్షల సంవత్సరాల క్రిందట జరిగిన చరిత్ర ఎక్కడడైనా కావొచ్చు భూగోళ స్వరూపమే మారిపోయి ఉండవచ్చు



మొన్న ఒక పరిశోధనలో మానవుడు చేప నుంచి వచ్చాడని కనుక్కొన్నారు నాకు మత్స్యావతారం (నీటిలో మొదటి జీవం ),కూర్మ (నీరు-భూమి ఉభయచరం ) , వరాహ (భూమిపై మొదటి జీవం ), నారసింహ (మనిషి+జంతువు ), వామన (పొట్టి మనిషి), పరశురామ (మనుషుల్లో మృగ రూప క్రూరత్వాన్ని ఉన్న వారందరిని నాశనం చేసినవాడు), రామ (పరిపూర్ణ మనిషి), కృష్ణ (మనిషికి సామాజికజీవనంలో ఎలా జీవించాలో మార్గదర్శనం ) ఇలాపరిణామక్రియలన్ని మన వాళ్ళు వివరించారు అని అనిపిస్తోంది.



ఆఱో సభ్యుడు :



చాలా బాగా చెప్పారు... ఇది విన్నాక మన సంస్కృతులు వాటిని ముందు తరాల వారికీ అందించాలని మనపూర్వికులు తీసుకున్న జాగ్రత్తలు.. అద్భుతంగా ఉన్నాయి. ఆలోచిస్తుంటే.. చాలా సంతోషంగా అనిపిస్తోంది



మూడో సభ్యుడు :



ఈ వివరణ ఇంతకుముందు విన్నాను. కానీ మన పురాణాలకి అలా భౌతిక భాష్యం చెబితే అవి నిజంగా జఱగలేదనీ, ప్రతీదీ కవితాత్మకంగా కల్పించారనే అభిప్రాయం కలుగుతుంది. ఆ తరువాత మళ్లీ యథాప్రకారం మన వ్యాసుడూ, వాల్మీకీ బోనెక్కాల్సి వస్తుంది. కనుక మన మతవిశ్వాసాలకి భౌతిక భాష్యాలు ఇవ్వడమనే ఇఱవయ్యో శతాబ్దపు పండిత ధోరణిని మనం ఈ శతాబ్దంలో మానేస్తే మావుంటుందని నా ఊహ. అప్పట్లో - అంటే మా చిన్నప్పుడు నాస్తిక దాడుల నుంచి తమని తాము కాపాడుకోవడం కోసం మన పండితులు మన విశ్వాసాల్లోని సైన్సుని వెలికి తీయడం ప్రారంభించారు. ఈ ప్రక్రియలో కొంత "అతి" కూడా తయారైంది. మన మతవిశ్వాసాల్ని విశ్వాసాలుగానే తీసుకుందాం. ఇవి మా విశ్వాసాలని బోఱవిఱుచుకుని ధీమాగా చాటుదాం. తప్పేముంది ? ప్రతీదానికీ మనం నాస్తికుల కోర్టులో ముద్దాయిల్లా బోనెక్కాలా ? అవసరం లేదు కదా ?



ఇహపోతే ఆర్య-ద్రావిడ విషయం కాదు నేనన్నది. మన మతం యొక్క రూపకల్పనలో కేవలం మన చేయి మాత్రమే ఉండి ఉండదు. అసలు "మన మతం" అంటున్నది "పూర్తిగా మనది మాత్రమే" కాకపోవచ్చు అంటున్నాను. ఇతర దేశాల్లో హిందూసంస్కృతి అవశేషాలు కనపడుతున్నాయన్నప్పుడు అవి ఇక్కణ్ణుంచే అక్కడికి వెళ్ళాయని ఖరాఖండిగా చెప్పలేం, ఇది ఒకప్పుడు ప్రపంచమతం అనేది దృష్టిలో పెట్టుకుంటే !



ఏడో సభ్యుడు :



జై శ్రీరాం, శ్రీరామదూతం శిరసా నమామి ! కానీ ఇవి ఇదే వరుసలో ఉన్నాయని అనుకోలేము. ఉదాహరణకి, బలిచక్రవర్తి ప్రహ్లాదునికి మనుమడు, ఆ లెక్కన చూస్తే కూర్మావతారం, నరసింహస్వామి తర్వాత జరిగింది. ఇక భాగవతంలో చూస్తే అటూఇటూగా ఇరవైఒక్క అవతారాలను పేర్కొన్నారు. స్థూలంగా మీరన్నట్టు అనుకున్నా , రేపు పొద్దున ఎవరైనా ఇదే ప్రశ్న అడిగితే ఏం చెబుతాం? ఇలాంటి వాటిగురించి కూడా పరిశోధన జరగాలి. కానీ అలాంటి మంచి ఉద్దేశ్యంతో ఇలాంటి పరిశోధనలు చేసినవారు చాలా అరుదు.



నిన్ననే ఒక పాత నాటకం చదివాను. "అశోకం" అని . రావణుడు గొప్ప ప్రేమికుడనీ, సీతని ఎత్తుకొచ్చినా పెళ్ళి చేసుకోవాలనే సదుద్దేశ్యం కలవాడనీ, రావణుడు చనిపోయాక సీత అతని తల తన ఒళ్ళో పెట్టుకుని రోదించిందనీ, అందుకే రాముడు పరిత్యజించాడనీ. ఇలా సాగుతుంది ఆ నాటకం. చదివిన నాకు నవ్వాలో ఏడవాలో అర్ధం కాలేదు. రాముడిని హీరో చెయ్యాలని రామాయణంలో అతన్ని పని గట్టుకుని పొగిడారని, రావణుడిని రాక్షసుడిని చేసారని , అసలు రాక్షస అనే శబ్దం "రక్షస్" అంటే రక్షించే వాడు అన్న ధాతువు నుండి పుట్టిందనీ. తన వర్గాన్ని ధర్మంగా కాపాడుకునే రావణుడినీ అతని అనుచరులనీ పని గట్టుకుని ఆర్యులైన బ్రాహ్మణులు పురికొల్పగా రాముడు సంహరించాడని...... ఇలా ఆర్యులు అనేది ఒక కట్టుకధ అని ఇప్పుడు నిరుపితం అయ్యింది కదా, మరి ఈ తరహా జనాలంతా తమ ముఖాలెక్కడ దాచుకుంటారో,



చాలా కొద్దిమంది తప్ప అందరూ ఇలాంటి పరిశోధకులే మన ఖర్మకొద్దీ.. ఎక్కడో నూటికీ కోటికీ వెంకటాచలం, అప్పలాచార్యస్వామి వంటి మహానుభావులు ప్రయత్నించినా అది సఫలం కావడంలేదు. తామరతంపరలా వచ్చిపడుతున్న ఈ విమర్శల్లో వారు చేసిన అద్భుతమైన పరిశోధనలు మరుగున పడిపోతున్నాయి.



మూడో సభ్యుడు :



నేను ఇందాక చెప్పినదే మఱికాస్త ! లలితాసహస్రనామాల్లో ఓఢ్యాణ పీఠనిలయా అనే నామం ఉంది. ఈ ఓఢ్యాణపీఠం వాస్తవానికి ఆఫ్ఘనిస్తాన్‌లో ఉంది. లలితోపాసన మొదట ప్రారంభమైంది అక్కడేనట. కానీ ఈరోజు ఆఫ్ఘనిస్తాన్ అంటే అంతా తుఱకదేశం. కానీ లలితా ఉపాసన ఇక్కడ ఇండియాలో బట్టకట్టింది. ఇలాగే ఎన్నో హిందూ సంప్రదాయాలు విదేశాల్లో జన్మించి ఇక్కడ ఆశ్రయం పొంది ఉంటాయని నేననుకుంటున్నాను.


అయిదో సభ్యుడు :

కూర్మానికీ, బలికీ ఏమిటి సంబంధం ? వామనుడికీ, బలికీ కదా సంబంధం ?


ఏడో సభ్యుడు :

సాగరమధనం జరిగింది బలిచక్రవర్తి సమయంలోనే కదా ?

అయిదో సభ్యుడు :

లేదండి !

ఎనిమిదో సభ్యుడు :

ఆఫ్ఘనిస్తాన్ కూడా గాంధార దేశమనే పేరుతో భరతవర్షంలో భాగంగానే వర్ణించబడి ఉంది కదా ?

అయిదో సభ్యుడు :

అవును. ఒకప్పటి భారతం ఇప్పటి ఇరాక్ నుంచి ఇండోనేషియా వరకు వ్యాపించింది.

రెండో సభ్యుడు :


http://2ndlook.wordpress.com/


http://bibhudev.blogspot.com/



మిత్రులు అందరు ఇస్తున్న వివిద లింకులు అన్ని అందుబాటులొ ఉండేవిదంగా ఒక పట్టిక (బ్లాగు పేజి) ప్రచురిస్తే బాగుంటుంది. ఎవరికి వారు Google లొ వెతుక్కొవచ్చు కాని, సమయము వృదా అవుతుంది. అన్ని ఒక ప్లేస్ లొ ఉంటే బాగుంటుంది.


అయిదో సభ్యుడు :


లంకెలో చాలా విషయాలు ఉన్నాయి -కృతజ్ఞతలు


మూడో సభ్యుడు :


పూర్వం ఎక్కడెక్కడైతే హిందూమతం ఉండేదో అదల్లా భారతదేశం అనుకోవడం సరైన కోణం కాదనుకుంటా. నిజానికి ఈ విషయంలో చాలా confusion ప్రచారంలో ఉంది. మనమంతా ఆ confusion లోనే పుట్టి పెఱిగాం. భారతదేశం అనేది ఒక ఆధునిక రాజకీయ పరిభావన. ఇది ఇటీవలి British ideological construct. ఇది ప్రాచీనం కాదు. ప్రాచీనకాలంలో తెలిసినవి భారతవర్షం, భారతఖండం మాత్రమే. అయితే ఇవిరాజకీయ స్వరూపాలూ కావు. సాంస్కృతిక స్వరూపాలూ కావు. భౌగోళికాలు మాత్రమే. జంబూద్వీపం (Asia) లో ఉన్న ఇలావృతవర్షం, రమ్యకవర్షం, కిన్నరవర్షం, కింపురుషవర్షం లాంటి అనేక వర్షాలలో ఒకటి భారతవర్షం. మళ్లీ ఇదీ, భరతఖండమూ ఒకటి కావు. బ్రహ్మాండ పురాణంలో వీటన్నింటి గుఱించిన వర్ణనా విపులంగా ఇచ్చారు. ఒకసారి చూడండి.

అయిదో సభ్యుడు :


ఋగ్వేదంలో ప్రస్తావన ఉంది. ఇక్కడ మూలాలు సాంస్కృతిక ఐక్యతతో ఉన్నాయి బ్రిటిషువాడు అసలు మనం ఒక దేశం అని ఎప్పుడూ ఒప్పుకోలే. వాడి అవసరం దృష్ట్యా ! గంగ అనాది. గోవు, రాముడు, కృష్ణుడు, ఇతర ఆచారాలు, వ్యవహారాలూ ప్రకృతిపూజ - అన్నీ కూడా ఒక వివిధరకాల పూలతో చేసిన పూలమాలలో దారంలా ఇక్కడ ఒకే జాతి తరతరాలుగా నివసిస్తున్నది.


శ్లో|| ఉత్తరం యత్ సముద్రస్య హిమాద్రేశ్చైవ దక్షిణమ్ |


వర్షం తద్ భారతం నామ భారతీ యత్ర సంతతిః |


(ఇంకా ఉంది)

5 కామెంట్‌లు:

PALERU చెప్పారు...

అల్లాహ్ ఎవరు ? మక్కా అంటే ఏమిటి ?... y don't you allowed comments there?? it seems you given a wrong info..LOVE your religion but not by throwing stones on other religions...we can have a discussion on this topic..and if you don't know truth don't depend on false to prove your stupidity...

ధర్మస్థలమ్ చెప్పారు...

ముందు stupidity etc అని ఉపయోగించిన మీ దూషణలని ఉపసంహరించుకుంటూ ఇక్కడొక వ్యాఖ్య వ్రాయండి. లేకపోతే మీ వ్యాఖ్యని తొలగించవలసి వస్తుంది.

మహ్మదీయమతాన్ని ఈ బ్లాగులో ఎప్పుడూ కించపఱచడం జఱగలేదు. ఆ మతం హిందూమతం నుంచి వచ్చిందని మాత్రమే చెబుతున్నాము. ఆ టపా అక్కడ పెట్టేనాటికి వ్యాఖ్యాసౌకర్యానికి సంబంధించి సైటులో ఇబ్బందులొచ్చాయి. అందుచేత దానికే కాక అంతకుముందున్న టపాలక్కూడా వ్యాఖ్యలు లేవని గమనించవలసినది.

"అలనాటి హిందూ అరేబియా" అనే శిర్షికతో మా వద్ద వ్యాసాల పరంపర ఒకటి సిద్ధంగా ఉంది. త్వరలో ప్రకటిస్తాము.

PALERU చెప్పారు...

క్షమించాలి..ఆ పదం వాడటం నా తప్పే.....హృదయపూర్వక క్షమాపణలు...మీరు చెప్పిన అబద్దాల వలన వచ్చిన కోపం తో ఆ పదం మస్తిష్కం లో జనించి చేతివ్రాతగా బయటకు వచ్చింది తప్పితే ఉద్దేశ్యపూర్వకం గా కాదు అని గమనించ మనవి...

"ఇది హిందూతత్త్వ ప్రచారక బ్లాగు. దీని మౌలిక లక్ష్యాలకి విరుద్ధమైన వ్యాఖ్యలు అంగీకరించబడవు. ఇతరులను అవమానించని శైలిలో ఉండే వ్యాఖ్యలకు స్వాగతము"

నేను మీ కామెంటు రూలు చూడక పొరపాటున వేసిన వాఖ్య అది...మీరు ప్రచారం చేసుకుంటే నాకేమి అభ్యంతరం లేదు, కాని మీ కొన్ని పోస్టులు అభ్యంతరకరం గా ఉన్నవి...నేను మీకు చెప్పెంతటి వాడిని కాను ఆ సంగతి నాకు మీకు తెలుసు...

నేను చెప్పేది ఒకటే...ప్రచారం చేసుకోండి...కాని ఇతరులను కించపరిచి, అబద్దాలు నిజాలుగా నమ్మించే ప్రయత్నమూ తోటి, కాకుండా..సహృదయ వాతావరణం లో చేసుకుంటే దేశానికి చాలా మంచిది...లేక పొతే ద్వేషాలు పెరిగి దేశ ప్రగతి కి అడ్డంకి గా మారతాయి...

""ఆ మతం హిందూమతం నుంచి వచ్చిందని మాత్రమే చెబుతున్నాము"" మంచి ఈ విషయాన్నీ మీరు నిర్దారించలేరు...అతివాదులు రాసిన లేదా కుట్రల మస్తిష్కం గల ఆంగ్ల నాస్తికులు రాసిన పుస్తకాలతో మీరు ఏకీభవిస్తూ...అబద్ద నిరూపణ చేయ ప్రయత్నమూ చేస్తే...ఎవరుఎమి చేయలేరు..

ఏదేమైనా మీరు రాసిన ఆ టపా సత్యానికి ఆమడ దూరం లో ఉంది....

ధన్యవాదాలు

ధర్మస్థలమ్ చెప్పారు...

ఒక మతం మీద పరిశోధన ఏ విధంగా అభ్యంతరకరం ? అంటే ఎవఱూ మతాల మీద తులనాత్మక పరిశోధన (comparative investigation) చేయకూడదా ?

ఇతరమతాల మీద దుష్ప్రచారాలకి హిందువులు ఎల్లప్పుడూ ఆమడదూరం. నిజానికి ఆ పనిలో చుఱుగ్గా ఉన్నవారు ఇతరులే. ధార్మిక, తాత్త్విక విషయాల్లో తమను తాము ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించుకోని నిర్దాక్షిణ్యమైన నిజాయితీ, సత్యశోధనా, ఆలోచనాస్వేచ్ఛా (free thinking) హిందూమతానికి సొంతం. మేము ఆ ఉజ్జ్వలమైన, మహోన్నతమైన హిందూసంప్రదాయంలోనే నడుస్తున్నాం. ఇతరుల్ని నమ్మించడానిగ్గానీ, ఒప్పించడానిగ్గానీ, ఎవఱిమీదైనా బుఱద జల్లడానిగ్గానీ మేమీ బ్లాగు నడపడం లేదు. ముందు మేము కన్విన్స్ అయితే తప్ప ఇక్కడేఈ ప్రచురించం. ఇస్లామ్ హిందూమతానికి వారసత్వరూపమని అనేక కారణాల వల్ల మేము కన్విన్స్ అయ్యాం. అందుకే ఆ వ్యాసపరంపరని ప్రచురించాలని భావిస్తున్నాం. మీ దగ్గఱ ఈ వాదాన్ని ఖండించడానికి తగిన సహేతుకమైన తర్కం, పక్కా సమాచారమూ, భోగట్టా ఉన్న పక్షంలో punyabhumy@gmail.com అనే వేగుచిరునామాకు పంపండి. ఇదే బ్లాగులో మీ పేరుతో ప్రచురిస్తాం.

అజ్ఞాత చెప్పారు...

రాఫ్సన్ గారూ.. వాదవివాదాల సంగతి ఎలా ఉన్నా ప్రపంచములో ప్రకృతి-పురుషుల (పార్వతీ పరమేశ్వరులని హిందుత్వ నమ్మిక) ఆరాధన అన్నిటికన్నా పురాతనమైన మానవ ఆరాధనా పద్ధతి అని నిరూపితమైనదే. ఆలాంటి ప్రకృత్యారాధన హిందూమతములో విడదీయరాని భాగం. అలాగే నమ్మకాలను పక్కనబెట్టి కేవలం భౌతిక ఆధారాల ప్రకారం చూసినా హిందూ విగ్రహారాధనకు మహమ్మదీయ నిరాకార ఆరాధనకు మధ్య శతాబ్దాల వ్యత్యాసం ఉన్నది. మీ అభ్యంతరాలు తెలిపితే తెలుసుకోవాలని ఉన్నది.

@ధర్మస్థలం:
తగు ఆధారాలతో కూడిన మీ టపాలకోసం ఎదురు చూస్తాను.

తెలుగులో టైప్ చేయండి

కైఫీయతులు

  © బ్లాగర్ టెంప్లేట్ "ప్సై" రూపొందించినవారు Ourblogtemplates.com 2008

ఈ పుట పైభాగానికి వెళ్ళడం కోసం ఇక్కడ నొక్కండి